“సరే ఉద్యోగం చెయ్యి, నేనేమి ఆపలేదు కదా నిన్ను” అన్నాడు అమర్
“మరి ఇందాక నీ సంపాదన అది ఇది అన్నావ్ గా?” అంది శ్యామల
“నేను నా ఒపీనియన్ చెప్పాను అంతే” అన్నాడు అమర్
“మరి నేను ఉద్యోగం చేస్తున్నాను అయితే” అంది శ్యామల
“నీ ఇష్టం నేనేమి అనను” అన్నాడు అమర్.
ఏంటో ఈ మనిషి ఎప్పుడు అర్ధం కాడు, రెండు విధాలుగా మాట్లాడతాడు అనుకుంది శ్యామల.
“హ్మ్” అంది
“కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, యే ఉద్యోగం అయినా చెయ్యి కానీ మనసుకి నచ్చితేనే చెయ్, డబ్బు కోసం కాకుండా” అన్నాడు అమర్
“మనసుకి నచ్చాల?” అంది శ్యామల
“హా అవును మనసుకి నచ్చితేనే తృప్తి పడతావ్” అన్నాడు అమర్
“సరే సరే” అంటూ నవ్వుతూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
*******************************************
మరుసటి రోజు పార్వతి ఆంటీ కి కాల్ చేద్దాం అనుకుంది శ్యామల. కానీ ఎలా అడగాలి మొన్ననే పింకీ కి షూ కొనిపించింది. నిన్న హోటల్ లో మంచి ఫుడ్ పెట్టించింది. కొంచెం పరిచయానికే అంత చేసింది పార్వతి ఆంటీ, అలాంటిది ఇప్పుడే హడావిడిగా జాబ్ గురించి అడిగితే ఏమనుకుంటుందో కొన్ని రోజులు ఆగుదాం అనుకుంది శ్యామల.
ఇటు పక్క పార్వతి కూడా శ్యామల గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. తన అందం తో డబ్బు సంపాదించొచ్చు, దాని వల్ల శ్యామల కి డబ్బు వస్తుంది తనకి డబ్బు వస్తుంది. కానీ ఈ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళని కదిలించాలి అంటే కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిద్దాం అనుకుంది. శ్యామల కాల్ చేసే వరకు చేయకూడదు అనుకుంది పార్వతి.
ఇలానే రెండు వరాలు గడిచిపోయాయి. చివరిగా ఒకరోజు శ్యామల కాల్ చేసింది.
“హాయ్ ఆంటీ నేను శ్యామల ని” అంది శ్యామల
“హాయ్ శ్యామల, ఎలా ఉన్నావ్? పింకీ, మీ ఆయన ఎలా ఉన్నారు?” అంది పార్వతి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఫోన్ రావటం తో ఆనందం గా.
“అందరు బాగున్నారు ఆంటీ, మీరు ఎలా ఉన్నారు?” అంది శ్యామల
“బాగున్నాను” అంది పార్వతి, శ్యామల ని ఎలా తన ఉచ్చులోకి లాగాలా అని ఆలోచిస్తూ
ఇటుపక్క శ్యామల కూడా తన జాబ్ గురించి ఎలా అడగాలా అని ఆలోచించసాగింది.
“ఆంటీ ఈ రోజు మీరేమన్నా ఖాళీగా ఉంటే కలుద్దామా, వీలు చూసుకుని మా ఇంటికి రండి నేనే వంట చేస్తాను” అంది శ్యామల, మళ్ళీ ఎక్కడ రెస్టారెంట్ ఫుడ్ కోసం కలుస్తున్నాను అనుకుంటుందేమో అని
“అవునా, కానీ ఈ రోజు కొంచెం బిజీ గా ఉన్నాను శ్యామల…, ఒక్క నిమిషం ఆగు మళ్ళీ కాల్ చేస్తాను, ఎవరో వస్తున్నారు” అంది పార్వతి.
“సరే ఆంటీ” అని శ్యామల కాల్ కట్ చేసింది.
Waiting for next episode ra Swami
Next part
Next part twaraga upload cheyandi