శ్యామల ఆటో ఎక్కి నాంపల్లికి వెళ్ళాలి అని ఆటో డ్రైవర్ తో చెప్పి పార్వతి ఆంటీ చూపించిన ప్రేమని, తను పెట్టించిన కాస్ట్లీ భోజనాన్ని గుర్తు చేసుకోసాగింది.
ఆ మెనూ కార్డు లో చైనీస్, ఇటాలియన్ ఇలా చాలా రకాల వంటలు ఉన్నాయి. శ్యామల కి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక జీరా రైస్ ఆర్డర్ పెడితే పార్వతి మెనూ కార్డు తీసుకుని చికెన్ ఐటమ్స్ చెప్పింది. ముఖ్యం గా ఆ చాక్లెట్ కేక్ అబ్బా ఎంత రుచిగా ఉందొ అనుకుంది.
కొంతసేపటికి తను దిగాల్సిన చోటు రావటం తో ఆటో అతనికి డబ్బులు ఇచ్చి మెల్లగా తన ఇంటి వైపు అడుగులు పెట్టింది. పక్కనే ఉన్న చిన్న కూరగాయల కొట్టు చూసి రాత్రికి చేయాల్సిన వంట గుర్తు వచ్చి కొన్ని కూరగాయలు, ఉల్లిపాయలు కొనుక్కుని తన ఇంటికి చేరుకుంది.
ఆ రోజు రాత్రి అందరూ తినేసారు. శ్యామల తిన్నవి మొత్తం క్లీన్ చేసుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి పింకీ నిద్రపోతూ కనిపించింది. పింకీ పక్కనే అమర్ చోళ సామ్రాజ్యం అనే బుక్ చదువుతూ కనిపించాడు.
“అమర్?”
“హ్మ్మ్” అన్నాడు
“నేను కూడా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను” అంది శ్యామల
అమర్ తన తల పైకి ఎత్తి శ్యామల ని చూసి
“ఏంటి నువ్వా?” అన్నాడు ఆశ్చర్యం గా
“నేను చేయకూడదా ఏంటి?” అంది శ్యామల
“అలా అని కాదులే, ఇంతకీ ఏం ఉద్యోగం?” అన్నాడు అమర్.
“ఇంకా ఏం అనుకోలేదు, ఒకపక్క పింకీ కూడా పెద్దది అవుతుంది ఇంక నేను చూసుకునే అవసరం లేదు. ఫ్రీ గా ఉన్న టైమ్ లో ఏదైనా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు కదా ఇంట్లో” అంది శ్యామల.
“ఇప్పుడు డబ్బు ఉంటే ప్రాబ్లెమ్ ఉండదు అంటావా?” అన్నాడు అమర్.
“ఏంటి?” అంది శ్యామల
“అదే చెప్తున్నావ్ గా సంపాదించాలి అని, నువ్వు సంపాదిస్తే ఇంట్లో ఇంక ఇబ్బంది ఉండదా?” అన్నాడు అమర్
ఆ మాటకి శ్యామల ఆశ్చర్యపోయి అమర్ ని అలానే చూస్తూ ఉండిపోయింది. అమర్ చాలా ఆదర్సాలు కలిగిన మనిషి కానీ ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. అమర్ మీద చాలా కోపం వచ్చింది.
“ఇక్కడ కాదు బయటకు రా మాట్లాడాలి” అంది శ్యామల పక్కనే నిద్రపోతున్న పింకీ ని చూసి
“ఇక్కడ ఏమైంది?” అన్నాడు అమర్
“మన మాటలకి పింకీ లేస్తుంది రా” అంది శ్యామల
అమర్ నిదానంగా పైకి లేచి కోపం గా బయటకు వెళ్లిన శ్యామల వెనుక వెళ్ళాడు.
“ఇందాక ఏంటి అంటున్నావు?” అంది శ్యామల
“నేనేమన్నాను?” అన్నాడు అమర్
“చూడు అమర్, నీ పద్ధతులు, ప్రిసిపల్స్ అన్నీ తెలుసు, అయినా కానీ నువ్వు తెచ్చే డబ్బుతో ఇల్లు గడవటం ఎంత కష్టం గా ఉందొ నాకు తెలుసు. అదిగాక మధ్యలో మీ ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తావ్. అప్పుడు నేను పస్తులు ఉండాల్సి వస్తుంది. యే రోజు అయినా ఆలోచించావా అసలు” అంది శ్యామల కొంచెం కోపం గా.
“అది కాదు శ్యామల” అంటూ అమర్ ఏదో చెప్పబోతుంటే
“ఆ సామెతలు వినటం నా వల్ల కాదు అమర్, నేను ఉద్యోగం చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఒక్కోసారి పింకీ అడిగినవి కూడా ఇప్పించలేకపోతున్నా డబ్బులు సరిపోక. నువ్వేమన్నా అనుకో నా సంపాదన కూడా తోడైతే ఇంట్లో ఇంత ఇబ్బంది ఉండదు” అంది శ్యామల కొంచెం గట్టిగా
Waiting for next episode ra Swami
Next part
Next part twaraga upload cheyandi