పార్వతి ఆఫీస్ లో ఎవరు లేరు, కావాలనే కాల్ కట్ చేసింది. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి
“హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావ్? మొన్న చెప్పిన దాని గురించి మాట్లాడాలి?” అని మెసేజ్ పెట్టింది పార్వతి.
“ఈ గురువారం వస్తాను” అని రిప్లై వచ్చింది.
“సరే ఆ రోజు మొత్తం ఇంకేం పనులు పెట్టుకోకు” అని మెసేజ్ పెట్టింది పార్వతి.
వెంటనే మళ్ళీ శ్యామల కి ఫోన్ చేసి
“సారీ శ్యామల, మా మేనేజర్ వచ్చాడు” అంది పార్వతి
“అయ్యో పర్లేదు ఆంటీ” అంది శ్యామల
“ఈ రోజు కష్టం శ్యామల కలవటం, గురువారం ఫ్రీ గా ఉంటాను అప్పుడు కలుద్దాం” అంది పార్వతి
“గురువారమా?” అంది శ్యామల, తనకి ఉద్యోగం గురించి మాట్లాడాలని ఎంతో ఆతృత గా ఉంది.
“నీకు కుదరదా?” అంది పార్వతి
“అదేం లేదు ఆంటీ తప్పకుండా కలుద్దాం, మా అడ్రెస్స్ పంపుతాను అప్పుడు, మీరు వచ్చేయండి” అంది శ్యామల.
“ఏం అనుకోకు శ్యామల, నేను రావాలి అంటే అసలు కుదరదు, నువ్వే వచ్చేయ్ మా హోటల్ కి” అంది పార్వతి
“అయ్యో సరే ఆంటీ నేనే వస్తాను” అంది శ్యామల
“హా సరే శ్యామల, రిసెప్షన్ లో నా పేరు చెప్పు వచ్చి” అంది పార్వతి.
“సరే ఆంటీ” అంది శ్యామల
“సరే ఉంటాను ఇంక” అని పార్వతి ఫోన్ కట్ చేసింది.
శ్యామల కి చాలా ఆనందం గా ఉంది మళ్ళీ ఈ సారి కూడా మంచి ఫుడ్ తినొచ్చు అని, అలానే పార్వతి కూడా శ్యామల కోసం కొన్ని అరెంజ్మెంట్స్ చేయటం మొదలుపెట్టింది.
*******************************************
గురువారం ఉదయం శ్యామల 10 గంటలకల్లా రిసెప్షన్ కౌంటర్ లో ఉంది. తనకి ఎదురుగా ఒక ఫారిన్ జంట ఉంది, వాళ్ళేదో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. శ్యామల వెనుక ఇద్దరు మగాళ్లు సూటు బూటు వేసుకుని ఉన్నారు.
పోయినసారి వచ్చినప్పుడు ఏదో సాదాసీదా గా వచ్చింది శ్యామల, ఇంత పెద్ద హోటల్ కి అలా వస్తే పార్వతి ఆంటీ ప్రెస్టేజ్ కి ఇబ్బంది అని ఈసారి ఉదయాన్నే లేచి తల స్నానం చేసి, తనకి ఉన్న చీరలలో కాస్ట్లీ ఆకుపచ్చ పట్టు చీరని తీసుకుని కట్టుకుంది, తన పొడవాటి జుట్టు ఆరాకపోవటం తో దువ్వి మధ్యలో క్లిప్ పెట్టి తన కురులను అలానే వదిలేసింది. పెదాలకి లైట్ గా లిప్స్టిక్, మేకప్ వేసుకుంది.
ఆ కొంచెం మేకప్ కే శ్యామల అందం రెండు రరెట్లు పెరిగింది. ఈ సారి అందరూ తనని చూడటం గమనించింది శ్యామల.
“ఐ లవ్ యువర్ సారీ” అంది ముందు ఉన్న ఫారిన్ అమ్మాయ్ వెనక్కి తిరిగి.
“థాంక్యూ” అంది శ్యామల కొంచెం సిగ్గు పడుతూ
“వేర్ కెన్ ఐ గెట్ సంథింగ్ లైక్ దట్?” అంది ఆ అమ్మాయి
Waiting for next episode ra Swami
Next part
Next part twaraga upload cheyandi