“కీ కార్డ్ ఎందుకు?” అంది శ్యామల
“మేడం మిమ్మల్ని తన సూట్ లో కలవమని చెప్పారు” అంది ఆ అమ్మాయి
“ఆమె ఇక్కడే ఉంటారా?” అంది శ్యామల ఆశ్చర్యం గా
“హా అవును మేడం, 35th ఫ్లోర్ లో VIP సూట్స్ ఉన్నాయి, అక్కడ ఉంటారు మేడం, సూట్ నెంబర్ 35032” అంది ఆ అమ్మాయి
అది విని శ్యామల ఆశ్చర్యపోయింది. పార్వతి ఆంటీ ఇక్కడ వర్క్ చేస్తుంది అని తెలుసు కానీ ఇదే హోటల్ లో అది కూడా VIP సూట్ లో ఉంటుందా అనుకుంది. ఇప్పటివరకు ఇలాంటి హోటల్ లోనే ఉండలేదు శ్యామల, అలాంటిది ఇప్పుడు VIP సూట్ అంటే ఎలా ఉంటుందో అని సంబరపడింది చూడటానికి.
లిఫ్ట్ 35th ఫ్లోర్ చేరే వరకు అసలు నమ్మబుద్ది కాలేదు శ్యామల కి, లిఫ్ట్ నుండి బయటకు వచ్చి మెల్లగా సూట్ వైపు నడవటం మొదలుపెట్టింది. 35032 అన్న నెంబర్ కనపడగానే ఆగి, అదురుతున్న చేత్తో కాలింగ్ బెల్ కొట్టింది.
Waiting for next episode ra Swami
Next part
Next part twaraga upload cheyandi