తప్పకుండా ఆంటీ 549

పింకీ తన స్కూల్ షూస్ వేసుకుని అద్దం లో చూసుకుంటూ చేత్తో డిజైనర్ షూస్ ని పట్టుకుని ఉంది.

“సరిపోయాయా?” అంది శ్యామల

పింకీ సరిపోయాయి అంటూ తల ఆడించి

“నాకు ఇవి కూడా కావాలి?” అంది.

“సరే కొంటాను లే” అంది శ్యామల.

సేల్స్ మాన్ కి రెండిటిని ప్యాక్ చేయమని చెప్పింది. బిల్ పే చేయటానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళబోతుంటే వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది.

“శ్యామల నువ్వేనా?”

పిలిచిన వ్యక్తి ని ఎక్కడో చూసినట్టు అనిపించింది శ్యామల కి. వయసు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి, కళ్ళకి కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని, జీన్స్ షర్ట్ వేసుకుని ఉంది.

“నువ్వేనా?” అని మళ్ళీ అడిగింది ఆమె.

“హా కానీ మీరు?” అంది శ్యామల గుర్తు పట్టటానికి ట్రై చేస్తూ

“ఏంటి నన్ను గుర్తు పట్టలేదా?” అంది చిరుకోపం తో.

“క్షమించండి, తెలిసినవాళ్లే అనిపిస్తుంది కానీ గుర్తు రావట్లేదు” అంది శ్యామల.

“నేను పార్వతి ఆంటీ ని, రెయిన్బో కాలనీ” అంది ఆమె.

“హా ఆంటీ ఎలా ఉన్నారు?” అంది శ్యామల ఆమెని గుర్తు పట్టి. పార్వతి వాళ్ళ ఆయన ఆర్మీ లో పని చేసేవాడు. శ్యామల చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఉండేవాళ్ళు.

“నేను చాలా బాగున్నాను. టైం చాలా వేగంగా గడిచిపోయింది. దాదాపు 12 సంవత్సరాలవుతుంది అనుకుంట?” అంది పార్వతి.

“అవును ఆంటీ” అంది శ్యామల.

“ఎప్పుడో నీకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసాను, ఇప్పుడు చాలా మారిపోయాయి. పరిపూర్ణమైన స్త్రీ లా” అంది పార్వతి.

కిందకి వొంగి పింకీ బుగ్గని పట్టుకుని

“నీ పేరేంటి?” అంది పార్వతి.

“పింకీ” అంది పింకీ కొంచెం భయపడుతూ..

“మేడం మీ షూస్” అంది కౌంటర్ లో ఉన్న అమ్మాయి.

“ఎంత అయింది?” అంది శ్యామల.

“అయిదు వేల అయిదు వందల ముప్పై రూపాయలు మేడం” అంది ఆ అమ్మాయి.

“ఏంటి?” అంది శ్యామల షాక్ అవుతూ. “నేనింకా అవి 500 యే అనుకున్నాను.” అంది శ్యామల.

1 Comment

Comments are closed.