“లేదు మేడం, అవి 5000 రూపాయలు” అంది ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతు.
“నా దగ్గర ఇప్పుడు అంత క్యాష్ లేదు” అంది శ్యామల.
“పర్లేదు కార్డ్స్ అయినా యాక్సెప్ట్ చేస్తాం” అంది ఆ అమ్మాయి.
“నా కార్డు ని ఇంట్లో మర్చిపోయి వచ్చాను” అంటూ అబద్దం చెప్పింది శ్యామల. ఎందుకంటే తన దగ్గర డబ్బు లేదు అని ఎవరికీ తెలియకూడదు అని. “అవి పక్కన పెట్టండి తరువాత వచ్చి తీసుకుంటాను, ప్రస్తుతానికి స్కూల్ షూస్ వరకు ఇవ్వండి” అంది
“లేదు, నాకు ఆ షూస్ కావాలి” అంటూ ఏడుపు మొదలుపెట్టింది పింకీ.
“పింకీ గొడవ చేయకు” అంది శ్యామల.
పింకీ ఆపకుండా కింద పడి ఏడుస్తూ దొర్లటం మొదలుపెట్టింది. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్లనే చూడసాగారు.
“పర్లేదు నేను ఇస్తాను లే” అంటూ పార్వతి తన కార్డు తీసి ఆ అమ్మాయికి ఇచ్చింది.
“ఏంటి? ఆంటీ ఏం వద్దు ఆంటీ ప్లీజ్” అంది శ్యామల. అప్పుడెప్పుడో కలిసి ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఇలా హెల్ప్ తీసుకోవటం కరెక్ట్ కాదు అనుకుంది.
“ఇంకేమి మాట్లాడకు” అంటూ పార్వతి, శ్యామల భుజం మీద చేయి వేసింది.
ఆ అమ్మాయి కార్డు స్వయిప్ చేసి, కవర్ చేతుకి ఇచ్చింది. పింకీ వెంటనే పైకి లేచి పార్వతి కాలుని గట్టిగా వాటేసుకుంది సంతోషం గా.
********************************************
పది నిముషాల తరువాత ముగ్గురు దగ్గర లో ఉన్న మాల్ లోకి వెళ్లి పింకీ కి ఐస్క్రీమ్, వాళ్ళకి కాఫీ ఆర్డర్ చేసారు. శ్యామల చాలా ఉప్పొంగిపోయింది, పార్వతి ఆంటీ తన మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే.
“అమ్మా నేను అక్కడ ఆడుకుంటాను” అంది పింకీ తన ఐస్క్రీమ్ తినటం కంప్లీట్ చేసి, ఎదురుగా ఉన్న టాయ్ కార్ వైపు వెళ్తు.
“సరే నా కళ్ళ ముందరే ఉండు, ఈ రోజు చాలా అల్లరి పిల్లవి అయిపోయావు.” అంది శ్యామల.
పింకీ అవేమి పట్టించుకోకుండా అటు వైపు వెళ్ళిపోయింది. శ్యామల, పార్వతి ఆంటీ వైపు తిరిగి
“ఆంటీ మీరు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది కానీ, ఎందుకు నేను ఒప్పుకున్నానో అర్ధం కావట్లేదు” అంది.
“ఇంక ఆపుతావా” అంది పార్వతి.
“పింకీ ఎప్పుడు ఇంతే ఆంటీ చాలా గొడవ చేస్తుంది నచ్చినవి ఇప్పించకపోతే, రేపు సోమవారం తను స్కూల్ కి వెళ్ళగానే ఆ షూస్ రిటర్న్ ఇచ్చి మీ మనీ మీకు ఇస్తాను” అంది శ్యామల.
“శ్యామల అదేం అక్కర్లేదు కానీ, నేను పింకీ కి గిఫ్ట్ గా కొనిచ్చాను అనుకో” అంది పార్వతి.
“థాంక్స్ ఆంటీ, తనని ఇలా బయటకి తీసుకుని రావాలి అంటేనే భయం గా ఉంది, నచ్చినవి అన్నీ కావాలి అంటుంది. తనకి అన్నీ ఇప్పించే స్థోమత కూడా లేదు” అంది శ్యామల.
“హ్మ్, ఏం చేస్తున్నావ్ శ్యామల” అంది పార్వతి
“ఇంట్లోనే ఆంటీ” అంది శ్యామల
“మీ ఆయన ఏం చేస్తారు?” అంది పార్వతి
“హిస్టరీ టీచర్ ఆంటీ” అంది శ్యామల
“పాపం టీచర్ అంటే చాలా తక్కువ జీతం వస్తుంది గా” అంది పార్వతి జాలిగా.
Upload next part please