తప్పకుండా ఆంటీ 543

“మరి అంతేమి కాదు ఆంటీ, పర్లేదు ప్రస్తుతానికి అలా గడిచిపోతుంది. కానీ అప్పుడప్పుడు పింకీ అడిగే వాటికే డబ్బు అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నాం.” అంది శ్యామల

“హ్మ్” అంది పార్వతి

“కానీ ఆంటీ తప్పకుండా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను, మీ ఫోన్ నెంబర్, అడ్రెస్స్ ఇవ్వండి ఆంటీ” అని అడిగింది శ్యామల.

“డబ్బులు అక్కర్లేదు లే కానీ నువ్వే నీ నెంబర్ చెప్పు, టచ్ లో ఉందాం” అంది పార్వతి.

శ్యామల తన నెంబర్ చెప్పగానే, పార్వతి తన ఫోన్ తీసుకుని నెంబర్ టైపు చేసి మిస్డ్ కాల్ ఇచ్చింది. శ్యామల కూడ పార్వతి నెంబర్ సేవ్ చేసుకుంది.

“అంకుల్ ఎలా ఉన్నారు?” అంది శ్యామల

“ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. లంగ్ కాన్సర్ వల్ల” అంది పార్వతి.

“అయ్యో సారీ ఆంటీ” అంది శ్యామల

“పర్లేదు శ్యామల” అంది పార్వతి.

“మరి మీ అబ్బాయి?” అంది శ్యామల తన పేరు గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ.

“నరేష్? బాగానే ఉన్నాడు” అంది పార్వతి.

“ఇక్కడే ఉంటున్నాడా?” అంది శ్యామల.

“లేదు పూణే లో ఉంటున్నాడు” అంది పార్వతి.

ఇంతలో శ్యామల ఏదో అడగబోతుంటే పార్వతి కి ఫోన్ వచ్చింది. పార్వతి తన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే, శ్యామల లేచి పింకీ దగ్గరికి వెళ్ళింది తీసుకుని రావటానికి. అక్కడ అందరు పిల్లలు చాలా సంతోషం గా ఎంజాయ్ చేస్తుంటే పింకీ మాత్రం పాపం వాళ్ళని చూస్తూ అలానే ఉండిపోయింది. అది చూసి శ్యామల కి బాధ అనిపించింది డబ్బు ఉండి ఉంటే తను కూడా అలానే హ్యాపీ గా ఉండేది అని. తనని తీసుకుని పార్వతి ఆంటీ దగ్గరికి వచ్చింది.

“శ్యామల సారీ, నేను అర్జెంట్ గా వెళ్ళాలి.” అంది పార్వతి.

“పర్లేదు ఆంటీ, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు?” అంది శ్యామల.

“దగ్గర్లోనే హోటల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను, సోమవారం వీలు చూసుకుని కలుద్దాం” అంది పార్వతి.

“తప్పకుండా ఆంటీ” అంది శ్యామల.

“అలా అని తన షూస్ రిటర్న్ ఇచ్చి డబ్బులు తెచ్చావో నీ పని చెప్తాను, ఇంకెప్పుడు నీతో మాట్లాడను కూడా” అంది పార్వతి.

“అబ్బా, సరే ఆంటీ” అంది శ్యామల.

*********************************************
ఆటో లో ఇళ్ళు చేరుకున్నారు శ్యామల, పింకీ.
మూడో ఫ్లోర్ లో ఉన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోకి వెళ్లేసరికి డోర్ ఓపెన్ చేసే ఉంది. లోపల నుండి తెలిసిన గొంతులే వినిపిస్తున్నాయి.

పింకీ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి

“నాన్న నాన్న నా కొత్త షూస్ చూడు” అంటూ ఎగిరింది పింకీ

“చాలా బాగున్నాయి రా పింకీ” అన్నాడు అమర్.

“నమస్తే వదిన” అన్నాడు అమర్ వాళ్ళ ఫ్రెండ్.

1 Comment

Comments are closed.