తప్పకుండా ఆంటీ 543

“నమస్తే” అని శ్యామల తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది.

బయటకు వచ్చేసరికి బెడ్ రూమ్ లో అమర్ ఉన్నాడు.

“కొంచెం టీ పెట్టు” అన్నాడు.

“సరే” అంది శ్యామల

“అలానే ఉల్లిపాయ పకోడీ కూడా చెయ్యి” అన్నాడు అమర్

“కానీ అమర్ ఉల్లిపాయల….” అంటూ శ్యామల చెప్పబోతుంటే

“తెలుసు, రేట్ ఎక్కవగా ఉంది.. అలా అని నా ఫ్రెండ్ ముందు పరువు తియ్యకు ప్లీజ్ చెయ్యి” అంటూ బయటకి వెళ్ళిపోయి మళ్ళీ మీటింగ్ మొదలుపెట్టాడు.

చేసేది లేక శ్యామల కిచెన్ లోకి వెళ్లి పకోడీ చేయటం మొదలుపెట్టింది. ఆ మీటింగ్స్ ఎప్పుడు అవుతాయా అని దణ్ణం పెట్టుకోసాగింది మనసులో. కానీ వాళ్ళ మీటింగ్ అవ్వలేదు. డిన్నర్ కూడా వండాల్సి వచ్చింది.

అతను వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది. పింకీ బెడ్ మీద నిద్రపోతుంటే శ్యామల కూడా వెళ్లి పింకీ పక్కన పడుకుంది. కాసేపటికి అమర్ కూడా లోపలికి వచ్చాడు. శ్యామల పక్కన పడుకుంటూ

“డిన్నర్ చాలా బాగుంది” అన్నాడు

కానీ శ్యామల మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది

“శ్యామల నువ్వెందుకు కోపం గా ఉన్నావో నాకు తెలుసు. ఉల్లిపాయల గురించే కదా” అన్నాడు.

“అదొక్కటే నా, మనకి వస్తున్న దాంట్లో పద్దాక మీ ఫ్రెండ్స్ కి కూడా భోజనాలు పెట్టాలి అంటే అవ్వదు. నువ్వేమో మీటింగ్స్ పెడుతూ ఉన్న సరుకులు మొత్తాన్ని కాళీ చేస్తున్నావ్” అంది కొంచెం కోపం గా.

“నీ చేతి వంట అంటే వాళ్ళకి చాలా ఇష్టం శ్యామల అందుకే వస్తున్నారు” అన్నాడు అమర్.

“నాకు వండటానికి ఇబ్బంది కాదు అమర్, కానీ మన పరిస్థితి కూడా నువ్వు అర్ధం చేసుకోవాలి కదా, చూడు ఆ పకోడీ చేయకపోతే ఉల్లిపాయలు మనకి వారం వచ్చేవి” అంది శ్యామల.

“రేపు వచ్చేటప్పుడు ఉల్లిపాయలు తెస్తాలే” అన్నాడు అమర్.

“వాటికి ఇప్పుడు ఇంకొక వంద ఎక్సట్రా అవుతుంది” అంది శ్యామల.

“అలా అయితే వారం వరకు వంటలో ఉల్లిపాయలు వాడకు” అన్నాడు అమర్ కొంచెం చిరాకుగా.

“అంతా చేసి నా మీద చిరాకు పడతావ్ ఏంటి?” అంది శ్యామల.

వాళ్ళ గొడవకి పింకీ కొంచెం కదిలింది. దాంతో కాసేపు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు

“రేపు ఇంకొక రెండు వేలు విత్ డ్రా చేయాలి పింకీ బుక్స్ కోసం” అంది శ్యామల.

“ఏంటి పద్దాక, బుక్స్, పెన్సిల్స్ అని” అన్నాడు అమర్

“నువ్వేగా ఆ స్కూల్ లో చేర్చింది” అంది శ్యామల

“చదువు గురించి అలానే ఆలోచించాలి, మంచి స్కూల్ లో చదివితేనే లైఫ్ ఉంటుంది తనకి.. అయినా ఆ డిజైనర్ షూస్ ఏంటి అదొక అనవసరపు ఖర్చు” అన్నాడు అమర్.

1 Comment

Comments are closed.