“ఏం చేయాలి కింద పడి ఏడుస్తూ గొడవ చేస్తుంది షాప్ లో” అంది శ్యామల.
“ఎంత అవి?” అన్నాడు
“అంత రేట్ ఏమి కాదులే” అంది
“అదే ఎంతో చెప్పు?” అన్నాడు
“500” అని అబద్దం చెప్పింది శ్యామల. పార్వతి ఆంటీ గురించి చెప్తే ఆమె దగ్గర ఎందుకు తీసుకున్నావ్ అది ఇది అని గొడవ చేస్తాడు.
“అయినా ఎందుకు కొన్నావ్ వద్దు అని చెప్పాల్సింది” అన్నాడు.
శ్యామల ఇంకేం మాట్లాడకుండా పక్కకి తిరిగి పడుకుంది. అమర్ కి కూడా తెలుసు పింకీ ని కంట్రోల్ చేయటం చాలా కష్టం అని. తనని ఏం అనలేక అన్నీ శ్యామల మీద చూపిస్తాడు.
“నేనేమి డైమండ్ నెక్లెస్లు, ఫారిన్ ట్రిప్స్ కావాలని అడగట్లేదు ఆంటీ, మన పరిస్థితి ఏంటో ఆలోచించు అనే కదా అడుగుతుంది ఎందుకు అలా బెహేవ్ చేస్తాడో అర్ధం కాదు” అంది శ్యామల
“అవును అది కరెక్ట్ కాదు” అంది పార్వతి
“ఆయన చాలా మంచోడు కాదు అనను, వచ్చేదే తక్కువ జీతం, దాంట్లో కూడా ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి అవగొడుతుంటే ఎలా చెప్పండి” అంది శ్యామల కొంచెం ఆవేదనగా.
“మేడం డిసర్ట్ తింటారా?” అన్నాడు వెయిటర్ మధ్యలో వచ్చి
“వద్దు, ఇప్పటికే నా కడుపు నిండిపోయింది” అంది శ్యామల
“లేదు ట్రై చెయ్ చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది” అంది పార్వతి.
“అమ్మో వల్ల కాదు ఆంటీ” అంది శ్యామల.
“తను అలానే అంటుంది నువ్వు తీసుకుని రా” అంది పార్వతి, వెయిటర్ తో. అతను నవ్వుకుంటూ సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు.
“ఆంటీ నిజం గానే ఫుల్ గా ఉంది, నా వల్ల కాదు” అంది శ్యామల. మంచి కాస్ట్లి ఫుడ్ పెట్టేసరికి కడుపు నిండా తింది.
“కొంచెం తిను ఏం కాదు” అంది పార్వతి.
ఎందుకో తెలియదు పార్వతి మీద శ్యామల కి చాలా అభిమానం ఏర్పడింది. సోమవారం ఉదయాన్నే పార్వతి కాల్ చేసి వీలు ఉంటే తన హోటల్ కి వచ్చి కలవమని చెప్పటం తో శ్యామల వెళ్ళింది. బంజారాహిల్స్ లోనే ఫేమస్ 4 స్టార్ హోటల్ అది. ఒక మిడిల్ క్లాస్ గృహిణి అయిన శ్యామల ఎప్పుడు అలాంటి రిచ్ హోటల్ లో అడుగు పెట్టలేదు, ఇదే తనకి మొదటిసారి. ఇంట్లో పనులు పూర్తి చేసుకొని వెళ్లేసరికి మధ్యాహ్నం అయింది. అందుకే పార్వతి అదే హోటల్ లో ఉన్న రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళింది శ్యామల ని.
ఎందుకు చెప్పాలి అనిపించిందో ఏమో తన బాధలు మొత్తం పార్వతి కి చెప్పుకుంటూ వెల్లింది. చెప్పాలి అంటే అసలు శ్యామల కి క్లోస్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. తెలిసిన వాళ్ళు అంటే అమర్ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు, లేదా పింకీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు తప్ప క్లోస్ గా ఉన్న ఫ్రెండ్స్ అయితే లేరు. తనకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ అందరు అమలాపురం లోనే ఉన్నారు. ఎప్పుడైతే పెళ్లి అయిందో అప్పుడే అందరూ పోయారు.
పార్వతి తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు శ్యామల ని తన చిన్ననాటి వయసు కి తీసుకుని వెళ్లాయి. తన బాధలు మొత్తం చెప్పినా కూడా ప్రతిదీ వింది పార్వతి ఆంటీ ఎంతో ఓపికగా.
“శ్యామల నేను ఒకటి అడగొచ్చా?” అంది పార్వతి.
“అడగండి ఆంటీ” అంది శ్యామల.
“నువ్వు జాబ్ చేయొచ్చు కదా” అంది పార్వతి.
“హాహా నాకెవరు జాబ్ ఇస్తారు” అంది శ్యామల.
“ఎందుకు ఇవ్వరు?” అంది పార్వతి.
“నాకేమి స్కిల్స్ లేవు, సరైన క్వాలిఫికేషన్ కూడా లేదు. అమలాపురం లో ఉన్నప్పుడు మీరు కూడా విని ఉండరు నేను BA చేశాను అంటే” అంది శ్యామల.
“నీ గురించి నువ్వే ఎందుకు అలా అనుకుంటావ్ చెప్పు” అంది పార్వతి.
Upload next part please