“నేను నిజమే చెప్తున్నాను ఆంటీ, ఈ రోజుల్లో అందరూ MBA లు లేదా ఇంజనీరింగ్ లు చేస్తున్నారు, వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. ఇంక నాలాంటి చెత్త డిగ్రీ ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారు” అంది శ్యామల.
“డిగ్రీ లేకపోయినా ఎంతో మంది జాబ్ చేస్తున్నారు కూడా” అంది పార్వతి
“అలా అని కాదు ఆంటీ, జాబ్ సంగతి పక్కన పెడితే పింకీ ని కూడా చూసుకోవాలి కదా. పనిమనిషి ని కూడా పెట్టుకునే స్థోమత అయితే లేదు. ఇంట్లో పనులు, పింకీ సరిపోతున్నాయి.” అంది శ్యామల.
“సరే నేనే నీకు జాబ్ ఇస్తాను” అంది పార్వతి.
“థాంక్స్ ఆంటీ, కానీ చెప్పాను కదా ఇంట్లో పనులు ఉంటాయి అని” అంది శ్యామల.
“జాబ్ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు” అంది పార్వతి.
“ఇదే హోటల్ లో ఇప్పిస్తున్నారా?” అంది శ్యామల.
“ఇంచుమించు అలాంటిదే” అంది పార్వతి.
ఇంతలో వెయిటర్ పొగలు కక్కుతున్న చాక్లెట్ లావా కేక్ తీసుకుని వచ్చాడు. శ్యామల ఆశ్చర్యం గా కళ్ళు పెద్దవి చేసి చూసింది. మహా అయితే ఎప్పుడన్నా చిన్న చిన్న రెస్టారెంట్ లలో తిందేమో కానీ ఇంత పెద్ద లక్సరీ హోటల్ లో మాత్రం తినలేదు.
“తిను” అంటూ పార్వతి స్పూన్ ఇచ్చింది.
కడుపు అంత ఫుల్ గా ఉన్నా కూడా ఆ కేక్ చూడగానే నోరు ఊరిపోయింది. 10 నిముషాల తరువాత కేక్ మొత్తాన్ని తినేసింది. పార్వతి బిల్ పే చేసింది. ఇద్దరు బయటకు వచ్చి రెసప్షన్ ఏరియా లో నిలబడ్డారు.
“థాంక్స్ ఆంటీ లంచ్ చాలా బాగుంది” అంది శ్యామల.
“పర్లేదు లే శ్యామల, నిన్ను చూడగానే అలా అనిపించింది నాకు” అంది పార్వతి.
“అర్ధం కాలేదు ఆంటీ” అంది శ్యామల
“అంతా బాగున్నా నీ మొహం లో కళ తగ్గింది, అందుకే మంచి భోజనం తినిపించాను. అలానే నీ జీవితం లో కూడా చేంజ్ రావాల్సిన అవసరం ఉంది” అంది పార్వతి.
“అలా రావాలి అంటే నా జీవితం లోకి ముందు డబ్బు రావాలి ఆంటీ” అంది శ్యామల
“అంటే నీకు జాబ్ చేయాలని ఇంటరెస్ట్ ఉందన్నమాట” అంది పార్వతి.
“ఈ హోటల్ లోనా? రిసెప్షన్ ఆ?” అంది శ్యామల
“కావాలంటే రెసప్షన్ లో పని చేయొచ్చు కాకపోతే 8 గంటలు చేయాలి” అంది పార్వతి నవ్వుతు.
“అబ్బో నాకు అంత టైం సెట్ అవ్వదు” అంది శ్యామల
“హ్మ్ సరే నేను ఏదోకటి ఆలోచించి చెప్తాను, టీ ఏమన్నా తాగుతావా” అంది పార్వతి.
“అమ్మో ఇంకేం వద్దు ఆంటీ ఇప్పటికే కడుపు ఫుల్ అయింది, ఆ చాక్లెట్ కేక్ వల్ల” అంది శ్యామల.
“బాగుంది కదా? నేను అది వారానికి ఒకటి తింటాను” అంది పార్వతి.
“అవును ఆంటీ, నా బడ్జెట్ లో ఉంటే నేను తినేదాన్ని కానీ అది చాలా రేట్ ఉంది ఇందాక మెనూ కార్డు చూసాను. చాలా థాంక్స్ ఆంటీ, రోజు రోజుకి మీకు రుణపడిపోతున్నాను. ఏదోక విధంగా మీ రుణాన్ని తీర్చుకోవాలి.” అంది శ్యామల.
“ఇంక ఆపుతావా? అయినా ఫ్రెండ్స్ మధ్యలో ఇలా రుణాలు ఏంటి?” అంది పార్వతి.
పార్వతి దగ్గర నుండి ఫ్రెండ్ అనే మాట వినగానే అనిపించింది చిన్నప్పుడు ఒకే ప్లేస్ లో ఉన్నా కూడా అంత పరిచయం లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ప్రేమ చూపిస్తుంది. ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి అనుకుంది శ్యామల.
“హాహా సరే ఆంటీ” అంది శ్యామల
“నీది అరెంజ్ మ్యారేజ్ యే కదా?” అంది పార్వతి
Upload next part please