మేడం …… , అలాచెయ్యడం తప్పే దానికి తిట్టండి కొట్టండి కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేను .
దేవత : ఇదే ఇదే నేను చేసిన తప్పు …… , చెల్లీ …… ఉంటే మహేష్ అయినా ఉండాలి లేక నేనైనా ఉండాలి . చెల్లీ …… ఈ అక్కయ్య కంటే నీకు నీ తమ్ముడే ఎక్కువ ఇష్టం అని నాకు తెలుసు – నువ్వు చెప్పు నన్ను వెళ్లమంటావా …… ? .
నా వైపు ప్రాణంలా చూస్తున్న అక్కయ్యవైపు నో అంటూ సైగచేసాను కన్నీళ్ళతో …….
అక్కయ్య కళ్ళల్లోనుండి నాకంటే ఎక్కువ కన్నీళ్లు ……. , అంతులేని బాధతో అక్కయ్యా …… నాకు నా తమ్ముడి కంటే మా అక్కయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ వెళ్లి దేవత గుండెలపైకి చేరారు .
నో నో నో అంతమాట అనకండి మేడం …… , నేనే వెళతాను .
అక్కయ్యకు ఏమి మాట్లాడాలో తెలియక అక్కయ్య కౌగిలిలోనుండే నా కళ్ళల్లోకి ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు కన్నీళ్ళతో …….
కన్నీళ్ళతో దేవతవైపు చూస్తూనే వెనక్కు అడుగువేశాను .
బామ్మ : అప్పటివరకూ కన్నీళ్ల షాక్ లో ఉన్నట్లు తేరుకుని బుజ్జితల్లీ ……. నేనే ……
బామ్మా …….. ఊహూ అంటూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే భారమైన బుజ్జి హృదయంతో బయటకు వెళ్ళాను …………
