పెద్దమ్మ Part 18 3

కొద్దిసేపటికే దెయ్యం కల కన్నట్లు గోవర్ధన్ మమ్మీ అంటూ సడెన్ గా లేచాడు . ప్రక్కనే పడుకుని ఉండటంతో రేయ్ మహేష్ రేయ్ మహేష్ ఉచ్చ ఫాస్ట్ గా వస్తోంది అంటూ లేపాడు .
ప్రక్కనే కదరా బాత్రూం ……
గోవర్ధన్ : 12 గంటలు అయ్యిందిరా నాకు మహా భయం అందులోనూ దెయ్యం కల వచ్చింది తోడుగా రారా మహేష్ అంటూ కదిల్చి పైకిలేచాడు .
ఏంట్రా గోవర్ధన్ …… మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు అంటూ కళ్ళు తిక్కుకుంటూ లేచి కూర్చున్నాను .
లేచి నిలబడిన వాడి ముఖమంతా చెమట మరియు సగం షర్ట్ చెమటతో తడిచిపోయి ఉండటం – విండో వైపు ఏదో భయాంకరమైనది చూస్తున్నట్లు పెద్ద పెద్ద కళ్ళతో వణికిపోతున్నాడు .
రేయ్ గోవర్ధన్ ఏమైందిరా అలా వణుకుతున్నావు అని టచ్ చేసాను అంతే …..
గోవర్ధన్ మరింత భయంతో నిలబడే ప్యాంటులో ఉచ్చ పోసేసుకున్నాడు .
రేయ్ గోవర్ధన్ ఏంట్రా ఒక్క నిమిషం ఆపుకోలేవా అంటూ పైకిలేచాను .
గోవర్ధన్ : కిటికీలోచూడు నువ్వు కూడా కార్చుకుంటావు అనిచెప్పి , భయంతో వణుకుతూ తడిచిన ప్యాంటుతోనే దుప్పటి ఫుల్ గా కప్పుకుని ముడుచుకున్నాడు దెయ్యం దెయ్యం దెయ్యం అని కలవరిస్తూ …….

కిటికీలో ఏముందిరా ఇంత భయపడిపోతున్నావు అంటూ చూసాను . భూత్ బంగ్లా లోపల టార్చ్ వెలుగులు కదులుతుండటం చూసి భయంతో కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి . ఉచ్చపడిపోయినంత పని సయ్యింది . భయానికి మరొక కారణం వెలుగులు అటూ ఇటూ కదులుతుండటం …….
భయంతో కింద కూర్చుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …… దెయ్యం దెయ్యం తొందరగా లేవండి – భూత్ బంగ్లాలో లైట్స్ వెలుగుతున్నాయి – చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి .
గోవర్ధన్ : దుప్పటి కప్పుకునే చెబితే వినలేదు ఇప్పుడు భయమేస్తుందా …….
అవును గోవర్ధన్ …… ఫ్రెండ్స్ అందరినీ లేపుదాము లెగు …….
గోవర్ధన్ : ఇంకా ఉచ్చ ఆగడం లేదు , నువ్వేమో మన ఫ్రెండ్స్ ను లేపమంటున్నావు , వాళ్ళు మన మాటలు వింటూనే ఉన్నారు అందుకే భయంతో ఒక్కడూ ముసుగు తియ్యడం లేదు , గప్ చుప్ గా పడుకో …… దెయ్యం దెయ్యం అంటూ దుప్పటిలోనే వణుకుతున్నాడు .
చుట్టూ చూస్తే గోవర్ధన్ చెప్పింది నిజమే …… ఫ్రెండ్స్ అందరూ దుప్పటిని గట్టిగా పట్టుకుని ముడుచుకుని పడుకున్నారు .

వెలుగులు బయటకు రావడం చూసి వెంటనే మోకాళ్లపైకి చేరాను . భయం వేస్తున్నా క్యూరియాసిటీ వలన మోకాళ్లపైననే కిటికీ దగ్గరకువెళ్లి తొంగి చూసాను .
వన్ టూ త్రీ ఫోర్ …… నలుగురు వ్యక్తులు బయటకు గోడ దూకారు . నాకు ఆసక్తి గలిగించినది ఏమిటంటే …… నలుగురూ తమ షర్ట్స్ వెనుక గన్స్ పెట్టుకోవడం …… , అలా చూడగానే దెయ్యం భయం వెళ్ళిపోయి భూత్ బంగ్లా ప్రక్కనే ఉంటున్న నా ప్రాణమైన బామ్మ – దేవత గుర్తుకువచ్చారు . ఊహించుకుంటేనే గుండె ఆగినంత పని అయ్యింది – లోపల ఏమిచేసి గన్స్ తో వస్తున్నారో వెంటనే తెలుసుకుని డేంజర్ అయితే వెంటనే ఉదయమే నా ప్రాణామైన ఇద్దరినీ వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యేలా చూడాలి – అయినా లోపల ఏముందో ఎలా తెలుసుకోవడం …….
నలుగురు వ్యక్తులూ చుట్టూ చూస్తున్నారు .
అంతే వెంటనే కిందకు వొంగాను . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……. దెయ్యాలు కాదు నలుగురు వ్యక్తులు బయటకువచ్చారు .
గోవర్ధన్ : రేయ్ మహేష్ …… , వాళ్లే దెయ్యాలు మగ దెయ్యాలు , దెయ్యాలను చూసేసావా …. ? , అవి నిన్ను చూడలేదు కదూ ……
లేదు …….
గోవర్ధన్ : హమ్మయ్యా …… , రేయ్ ఊరికే పడుకో , ఎప్పుడు తెల్లవారుతుందో ఏమిటో …….
కిటికీలోనుండి తొంగిచూస్తే నలుగురూ మాయమైపోయారు – ఎక్కడా కనిపించడం లేదు . వేరే ఫ్రెండ్స్ ను లేపబోతే , నా మాటలు విన్నట్లు వింటున్నట్లు భయంతో ఉలకడం లేదు పలకడం లేదు ……. – బామ్మ దేవతకు ఏమైనా అవుతుందేమోనని భయం అంతకంతకూ పెరుగుతోంది . వాళ్ళ క్షేమం ముఖ్యం కాబట్టి ఫ్రెండ్స్ ఎవ్వరూ రాకపోయినా మొబైల్ అందుకుని దైర్యంగా కిందకువెళ్లి మెయిన్ డోర్ – మెయిన్ గేట్ తెరుచుకుని స్లిప్పర్స్ వేసుకున్నాను .
ఉదయం వెళ్లడానికే భయపడతారు అలాంటిది అర్ధరాత్రి 12 గంటల సమయంలో భూత్ బంగ్లా మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను . తాయెత్తులు కట్టిన మెయిన్ గేట్ – చుట్టూ నిశ్శబ్దం – వేగంగా వీస్తున్న చల్లని గాలులకు – గాలి శబ్దాలకు ఒక్కసారిగా భయం వచ్చేసింది – గజగజా వణికిపోతున్నాను .
గన్స్ గుర్తుకురాగానే , నో నో నో నా దేవత – బామ్మకు ఏ హానీ కలుగకూడదు , పెద్దమ్మను తలుచుకుని భయం – ధైర్యం రెండింటితో వాళ్ళు ఎక్కి దూకిన గోడ ఎక్కి అటువైపుకు దిగాను . చుట్టూ చిమ్మ చీకటి – పొదల్లోనుండి శబ్దాలు …… ఉచ్చపడిపోయింది అంతే వెనక్కుతిరిగి గోడ ఎక్కబోయి , గన్స్ కళ్ళముందు మెదలగానే …… నాకేమైనా పర్లేదు నా వాళ్లకు ఏ హానీ కలుగకూడదు – అయినా పెద్దమ్మ ఉండగా నాకేంటి భయం అంటూ మొబైల్ తీసి టార్చ్ వేసాను .
వెలుగుకు సర్రున పెద్ద పాము ప్రక్కకు వెళ్ళిపోయింది . ఆ భయానికి గుండె చప్పుడు నా చెవులకు వినిపిస్తోంది – కొన్ని క్షణాలు కదలకుండా ఉండిపోయాను .
మెసేజ్ సౌండ్ : నేనెప్పుడూ మా బుజ్జిహీరో వెంటనే ఉంటాను . నేనుండగా భయమా ……. బుజ్జిహీరో …….
లేదు పెద్దమ్మా లేదు భయం లేనే లేదు అంటూ దైర్యంగా అడుగులు ముందుకువేశాను . ఏపుగా పెరిగి దారిని మూసేసిన తీగలను ప్రక్కకు తీసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరకు చేరుకున్నాను . నేలపై దుమ్ములో ఇప్పుడే ఆ నలుగురు వ్యక్తులు నడిచిన ఫ్రెష్ అడుగుజాడలు కనిపిస్తున్నాయి టార్చ్ వెలుగులో ……..

లోపలికి దైర్యంగా ఎవరు వస్తారలే అన్నట్లు గొళ్ళెం కు కేవలం తీగను మాత్రమే చుట్టారు . మందమైన తీగను తియ్యడానికి కాస్తకష్టపడాల్సివచ్చింది . డోర్స్ తెరవగానే గాలి ఫోర్స్ గా కొట్టింది …….
కూల్ కూల్ రా ….. , పెద్దమ్మ తోడు ఉండగా ఎందుకు భయం అంటూ లోపల టార్చ్ వేసి చూసాను – బూజు తప్ప ఏమీ కనిపించడం లేదు – కానీ అడుగుజాడలు ఎటువైపు వెళ్ళాయో అటువైపు మాత్రం కొన్నిరోజులుగా వస్తూ పోతున్నట్లు క్లీన్ గా ఉంది – ఈ నలుగురి అడుగుల చప్పుళ్ళు వినిపించేనేమో బామ్మ – దేవత మొదటిరోజు భయపడినది .
అడుగుజాడలవైపు టార్చ్ వేసుకుంటూ మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ అటునుండి ఒక తలుపు దగ్గరికి చేరాను . అన్నీ అడుగుజాడలు లోపలికి – బయటకు చూయిస్తుండటం చూసి ఇక్కడే ఈ గదిలోనుండే గోవర్ధన్ – తరువాత టార్చ్ వెలుగులు చూసాము అనుకుని తెరవబోతే పెద్ద తాళం వేసి ఉంది . మెయిన్ డోర్ కు వెయ్యకుండా ఇక్కడ వేశారు అంటే విషయం ఈ గదిలోనే ఉంది అనుకుని తాళం పగలగొట్టడానికి ఏమైనా దొరుకుంతుందేమోనని చుట్టూ చూస్తే లావుపాటి రాడ్ దొరికింది .
వెలుతురు పడేలా మొబైల్ ను షర్ట్ జేబులో ఉంచుకుని , సౌండ్ చెయ్యకుండా పగలగొట్టబోతే పెద్ద తాళం అయినందువలన ఎంతకీ ఉపయోగం లేకపోయింది . లాభం లేక బలం అంతా కూడదీసుకుని పెద్దమ్మా …… అంటూ బలంగా కొట్టాను – తాళం ముక్కలు ముక్కలై కిందపడటం చూసి నాకే ఆశ్చర్యం వేసింది – పెద్దమ్మను తలుచుకోవడం వలన ఇలా జరిగి ఉంటుంది లేకపోతే మనకు ఇంత బలం ఎక్కడుంది – ఈ సౌండ్ కానీ గోవర్ధన్ కు వినిపించి ఉంటే మళ్లీ ఉచ్ఛపోసుకుని ఉంటాడు అని నవ్వుకున్నాను .
మెసేజ్ : జేబులోనుండి అందుకుని చూస్తే , పెద్దమ్మ : హ హ హ ……
థాంక్స్ పెద్దమ్మా …… , ఒకచేతితో మొబైల్ టార్చ్ వేసి – మరొకచేతితో గొళ్ళెం తీసి డోర్ తోసి లోపలికివెళ్ళాను . కాలికి ఏదో తగిలి పడిపోబోయి మరేదో చేతితో పట్టుకుని నిలబడ్డాను . నన్ను పడెయ్యబోయింది ఏంటబ్బా అని అందుకుని టార్చ్ వెలుగులో చూస్తే AK – 47 గన్ …… భయంతో దూరంగా విసిరేసాను . విసిరిన ప్లేస్ నుండి పెద్దపెద్దగా మెటల్ సౌండ్స్ రావడంతో అటువైపు టార్చ్ వేసాను .
షాక్ షాక్ షాక్ ……. నా అంత ఎత్తులో గన్స్ – రివాల్వర్ మొదలుకుని AK – 47 మరియు పెద్ద పెద్ద గన్స్ ఉండటం చూసి మరింత భయమేసింది , దగ్గరకు వెళ్లాడానికే భయమేస్తోంది . వణుకుతూ టార్చ్ ప్రక్కనే పడింది అక్కడ బాక్సస్ బాక్సస్ బాంబులు – వైర్స్ – జాకెట్ వెస్ట్ బాంబ్స్ …… చెమటలు పట్టేస్తున్నాయి . ప్రక్కన ఇంకా ఎమున్నాయో అని తిరుగుతూ టార్చ్ వేసాను – గోడలపై పెద్ద పెద్ద టెర్రరిస్టుల ఫోటోలు – మ్యాప్స్ , మ్యాప్స్ పై గుర్తులు …… పెద్ద హాల్ నిండా ఎటుచూసినా గన్స్ బాంబులు – కంప్యూటర్స్ ….. కంప్యూటర్స్ కు పెద్ద పెద్ద బ్యాటరీలు – ఫైల్స్ , ఫైల్స్ లో ప్లాన్స్ …… వైజాగ్ మ్యాప్స్ అంటే నెక్స్ట్ అటాక్ వైజాగ్ లోనే అన్నమాట – స్థావరంగా ఈ భూత్ బంగ్లాను ఎంచుకున్నారు – ఎదురుగా రెండు డోర్స్ ఉన్నాయి , డోర్స్ ముందు డబ్బులు చిందరవందరగా పడి ఉండటం చూసి తెరిచాను – నా మోకాళ్ళవరకూ కట్టలు కట్టలు మీదపడ్డాయి – డబ్బుతోపాటు పెద్ద ఫైల్ పడటంతో అందుకుని చూస్తే స్లీపింగ్ సెల్స్ అని రాసి ఉంది – లోపల ఫోటోలు వారికి ఇవ్వాల్సిన అమౌంట్ లిస్ట్ ఉంది – నాకైతే తుపాకీ మూవీ గుర్తుకువచ్చింది .

భయంలో మెదడు పనిచేయడం లేదు . వణుకుతూనే మొబైల్లో 100 కు డయల్ చేసాను .
Yes ……
సర్ సర్ పోలీ….స్ పో…..లీస్ …… గన్స్ – బాంబ్స్ – మనీ – టెర్రరిస్ట్స్ – టెర్రరిస్ట్ అటాక్స్ …… సర్ సర్ వెంటనే ***** ఏరియా కు రావాలి . నాకు చాలా భయమేస్తోంది – ఒక ఇంటి మొత్తం గన్స్ – బాంబ్స్ – అదేదో అదేదో బార్స్ బార్స్ ….. ఆ ఆ మూవీస్ లో చూయించినట్లు పెద్దమొత్తంలో RDX ఉంది సర్ వెంటనే రావాలి.
సెక్యూరిటీ అధికారి : బాబూ …… నీ మాటలను బట్టి పిల్లాడివని తెలుస్తోంది – సాయంత్రం టీవీలో న్యూస్ చూసి ఆటపట్టించడానికి చేశావని తెలుస్తోంది – బాగా నిద్రవస్తోంది డిస్టర్బ్ చెయ్యకుండా పెట్టేయ్యి ……. – పిల్లలు ఎప్పుడూ ఇంతే గది మొత్తం గన్స్ బాంబ్స్ ఏంటి నమ్మేలా ఉండాలికదా సాయంత్రం నుండీ ఇవే కాల్స్ అని కట్ చేసేసాడు .
సర్ సర్ …… , మళ్లీ డయల్ చేసాను .
సెక్యూరిటీ అధికారి : అర్ధరాత్రి దాటింది పడుకుంటావా లేక ….. అంటూ మళ్లీ కట్ చేసాడు .
మళ్లీ చేసాను – ఈ సారి ఎత్తి కట్ చేసేసాడు .

Shit shit …… ఇప్పుడెలా , ఈ సమయంలో ఒక పిల్లాడు చేస్తే ఏ సెక్యూరిటీ అధికారి నమ్ముతారులే ……. , కూల్ కూల్ రా ఆ టెర్రరిస్ట్ లు లేరు కదా కూల్ గా ఆలోచించు – ఆ ఆ హాస్పిటల్లో SI సర్ ….. నెంబర్ ఇచ్చారుకదా అని స్క్రోల్ చేసి డయల్ చెయ్యబోయి ఇలాకాదు అంటూ రెండు మూడు పిక్స్ తీసి పంపించి కాల్ చేసాను .

ఎత్తగానే SI సర్ SI సర్ …… బాంబ్స్ RDX గన్స్ మనీ కంప్యూటర్స్ స్లీపింగ్ సెల్స్ …… అంటూ ఆతృతతో చెప్పాను .
SI సర్ : పిల్లాడివే కదా ….. , రెండు రోజులుగా దేశంలోని సెక్యూరిటీ ఆఫీసర్లంతా నిద్రాహారాలు మానుకుని రోడ్లపై తిరుగుతున్నాము , వెళ్లి పడుకో…….
తెలుసు తెలుసు సర్ …… మీరు నమ్మరని , 100 కు డయల్ చేసినా ఇదే చెప్పారు . అందుకే మీకు వాట్సాప్ చేసాను , చూస్తే మీరే కాల్ చేస్తారు అని కట్ చేసాను . 1 2 3 4 5 6 7 8 9 …… 10 అనేంతలో సర్ నుండి కాల్ వచ్చింది .
SI సర్ : కంగారుపడుతూ …… బాబూ ఎక్కడ ? , నీ పేరేమిటి ? .
నేను సర్ – మనం నిన్ననే కలిసాము – నా పేరు …… ( వద్దులే exams ఉన్నాయి , ఫేమస్ అవ్వడం వలన అందరి వలన డిస్టర్బ్ అవ్వవచ్చు మరియు ఇక్కడ నా పరిస్థితులు వేరు ) కొన్ని situations వలన నా పేరు చెప్పడం ఇష్టం లేదు సర్ , అయినా నా పేరుతో అవసరమే లేదు , లొకేషన్ షేర్ చేస్తాను వెంటనే వచ్చెయ్యండి అని కట్ చేసి లొకేషన్ షేర్ చేసాను .
సాయంత్రం న్యూస్ లో విన్న యాంటీ టెర్రరిస్ట్ ఆఫీసర్ మాటలు గుర్తుకువచ్చి వెంటనే సర్ కు కాల్ చేసాను .
నమ్మకం వలన ఒక్క రింగుకే ఎత్తి చెప్పు బాబూ అన్నారు .
సర్ …… సాయంత్రం ఒక ఆఫీసర్ చెప్పారు – వీటిని పట్టుకోవడం కంటే వీటిని రెడీ చేస్తున్న టెర్రరిస్టులను పట్టుకున్నప్పుడే టెర్రరిజం ను అంతం చెయ్యగలము అని – ఇక్కడ కేవలం స్లీపింగ్ సెల్స్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి – వారిని డబ్బులతో టెర్రరిజంలోకి దింపుతున్న నలుగురు వ్యక్తులు నా కళ్ళముందే చీకటిలో మాయమైపోయారు – ఇప్పుడు గనుక మీరు మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్ బందోబస్తుతో వస్తే మీడియాలో టెలిక్యాస్ట్ అయ్యి ఆ నలుగురూ తప్పించుకునివెళ్లి మళ్లీ అటాక్స్ కు ప్లాన్ చేస్తారేమో , కాబట్టి మీరు కొద్దిమందితో మాత్రమే వచ్చి వీటన్నింటినీ మూడో కంటికి తెలియకుండా తీసుకెళితే , రేపు ఇదేసమయానికి ఇక్కడకు రాబోతున్న ఆ నలుగురినీ పెట్టుకోవచ్చు , హైద్రాబాద్ లో అటాక్స్ జరిగాయి కాబట్టి వైజాగ్ లో కూడా అటాక్స్ చెయ్యడం కోసం ఖచ్చితంగా వస్తారు . ఏదో పిల్లాడు వాగుతున్నాడు అనుకుంటే మీ ఇష్టం ఏదో నా బుజ్జి తెలివితో చెప్పాను .
SI సర్ : బుజ్జి తెలివి కాదు బాబూ …… సూపర్ పవర్ నాలెడ్జ్ ప్రక్కన లేవు కానీ ఉండి ఉంటే కౌగిలించుకునేవాడిని – నాకు రాని అత్యద్భుతమైన ఐడియా ఇచ్చావు – నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము బుజ్జి సర్ ……. ప్రౌడ్ గా సెల్యూట్ చేస్తున్నాను – గుట్టుచప్పుడు కాకుండా వచ్చి పని పూర్తిచేసుకుని వెళతాము .

1 Comment

  1. orey aapara enti ee sodi. psc*yo na kodaka

Comments are closed.