బామ్మ : పడిపోకుండా నీ బుజ్జిహీరోను పట్టుకో ఎవరు కాదన్నారు అని మళ్ళీ తోసారు .
దేవత : ఆఅహ్హ్ …… అంటూ నా చేతిని పట్టుకున్నారు .
నా నోటి నుండి కూడా ఆటోమేటిక్ గా ఆఅహ్హ్ …… మూలుగు ఎగదన్నింది .
బామ్మ : అంతే అలా పట్టుకో ……. అంటూ దేవత చూడకుండా నా బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : బుజ్జిహీరో …… పర్లేదు కదా ……
సో సో soooo హ్యాపీ మేడం , దివి నుండి దిగివచ్చిన దేవత పట్టుకుంటే అంతకంటే అదృష్టం …….
దేవత : చాలు చాలు బుజ్జిహీరో చాలు …… , కొద్దిగా గ్యాప్ ఇస్తే పొగిడేస్తావు ….. అంటూనే ఎంజాయ్ చేస్తున్నారు .
మీ నవ్వు చూస్తుంటే , మీకు ఇష్టమే అనిపిస్తోంది మేడం ……..
దేవత : లేదు లేదు లేదు ……. లేదు అంతే అని మళ్ళీ గిల్లేసారు .
బామ్మ ఐదు అని ఐదు వేళ్ళు చూయించారు . మేడం మేడం ……. గిళ్లేముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించుకోండి ప్లీజ్ ప్లీజ్ ……
దేవత : నోవే నాఇష్టం అని మళ్ళీ గిల్లారు .
స్స్స్ అయ్యో ……. బామ్మా బామ్మా ప్లీజ్ ప్లీజ్ …….
బామ్మ : తల అడ్డంగా ఊపుతున్నారు .
దేవత : అవును బుజ్జిహీరో …… ఉదయమే అడగాలని ఈ హడావిడిలో మరిచిపోయాను . ఉదయం మా ఏరియా మెయిన్ గేట్ నుండి బయటకు వచ్చావేమిటి ? .
అదీ అదీ …… నా దే ….. మా మేడం ను రాత్రంతా చూడలేదు కదా అని ఏకంగా లోపలికే వెళ్ళిపోయాను .
దేవత : సెక్యూరిటీ వదిలారా …… ? .
వాళ్ళు వదలడం ఏమిటి , గోడ దూకి వచ్చేసాను .
బామ్మ : అంత పెద్ద గోడను ……..
మా మేడం ను చూడటం కోసం ఎవరెస్టు అయినా ఎక్కి దూకేస్తాను బామ్మా – ఆఫ్ట్రాల్ ఆ చిన్న గోడ ఎంత ……..
దేవత : నిన్నూ ……. దెబ్బలు తగిలి ఉంటే , ఇంకెప్పుడూ అలా చెయ్యకు , ఎనీవే థాంక్స్ అంటూ మురిసిపోతున్నారు , అమ్మో …… నవ్వానని తెలిస్తే మళ్లీ దూకుతావేమో ఎప్పుడూ ఎప్పుడూ అలాచెయ్యకు అని బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ …….
దేవత : ఎక్కేటప్పుడు గుర్తుకురావాలి అందుకు …….
బామ్మా ……. దీనిని కూడా కౌంట్ చేశారా ? .
బామ్మ : లేదు లేదు బంగారూ …… , నా బుజ్జిహీరో కోసం గిల్లింది కాబట్టి కౌంట్ లోకి రాదు . లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ నన్ను దేవతవైపు తోస్తూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
ఏరియా మెయిన్ గేట్ చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది . మేడం …… మీరు ఆటోలో లోపలికి వెళ్ళండి – నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోతాను .
దేవత : నో నో నో ఇప్పటికే …….
మేడం …… నాకు అలవాటే , చలి ఎక్కువగా ఉంది మీరు నేరుగా ఇంటిదగ్గర దిగండి అంటూ ఆటో దిగి రైట్ రైట్ అంటూ తోసాను .
ఆటో లోపలికి వెళ్ళాక వెనుకే లోపలికివెళ్ళాను .
బామ్మ …… దేవత వెనుకే ఇంట్లోకి వెళుతూ తొందరగా వచ్చెయ్యి అని సైగ చేశారు .
బ్యాగు ఉంచేసి – మేడమ్స్ , మురళి కోప బాణాలను స్వీకరించి , ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బామ్మా …… అని చెప్పి – మనసులో అనుకుని మురళి ఇంటికి చేరాను .
మెయిన్ గేట్ ఎంటర్ అవ్వగానే లోపల ఫ్రెండ్స్ అందరూ గుమికూడి డిస్కస్ చేసుకుంటున్నట్లు – ఒక ప్రాబ్లమ్ పై మల్లగుల్లాలు పడుతున్నట్లు అనిపించి గుంపులోకి వెళ్ళిచూసాను .
సేమ్ ప్రాబ్లమ్ ……. నేనుకూడా ఇలానే కంగారుపడుతుంటే అక్కయ్య చిటికెలో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ ……..
ఫ్రెండ్స్ : రేయ్ రేపు తప్పకుండా ఇదే వస్తుందిరా 8 మార్క్స్ కు …… , ఎవ్వరికీ సాల్వ్ చెయ్యడం రావడం లేదు చివరికి మన పేరెంట్స్ కు కూడానూ …… ఇక అంతే 8 మార్క్స్ పోయినట్లే ……..
ఫ్రెండ్స్ నాకొచ్చుకదా ఎందుకు టెన్షన్ అన్నాను .
అంతే అందరూ …… వచ్చా వచ్చా వచ్చా అంటూ షాకింగ్ గా చూస్తున్నారు .
వినయ్ : మహేష్ ఎప్పుడొచ్చావు ? , అది తరువాత విషయం …… గంట నుండీ ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం అందరి పేరెంట్స్ దగ్గరికీ వెళ్ళాము కానీ నో use ……. పేరెంట్స్ అందరూ లోపలే ఉన్నారు .
ఫ్రెండ్స్ మాట్లాడుతుండగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాను .
గోవర్ధన్ : ఆన్సర్ కరెక్టే రా ….. , మహేష్ సాల్వ్ చేసేసాడు , 8 మార్క్స్ మనచేతిలో ఉన్నట్లే …… థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు .
మురళి అందుకుని చూసి , నెమ్మదిగా థాంక్స్ చెప్పాడు .
మహేష్ అని వినిపించినట్లు ఫ్రెండ్స్ పేరెంట్స్ కోపంతో బయటకువచ్చారు .
ఫ్రెండ్స్ : మమ్మీ – డాడీ ……. మహేష్ వలన exam స్టార్ట్ కాకముందే 8 మార్క్స్ వచ్చినట్లే అంటూ అందరూ కలిసి అమాంతం పైకెత్తడం చూసి …….
సర్స్ – మేడమ్స్ కూల్ అయినట్లు ……. , మహేష్ ……. ఇంకెప్పుడూ మా పిల్లలను వదిలి ఎక్కడికీ వెల్లకు – అది ఎంత ముఖ్యమైనా సరే – ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ …… అనిచెప్పి వెళ్లిపోయారు .
ఫ్రెండ్స్ : మహేష్ ……. ఇప్పటివరకూ మా పేరెంట్స్ ఎంత కోపంగా ఉన్నారో తెలుసా ……. ? , నిన్ను తిడతారు – కొడతారేమో అనుకున్నాము , ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ మాత్రమే నిన్ను కాపాడింది థాంక్యూ థాంక్యూ మహేష్ …… , ఇదే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని మన క్లాస్మేట్స్ కూడా కాల్ చేశారు – వెంటనే వాళ్లకు కూడా కాల్ చెయ్యాలి పాపం …… , ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యాలి .
నన్ను కాపాడినది ప్రాబ్లమ్ కాదు మా అక్కయ్య ……. , ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యివస్తాను అని ఔట్ హౌస్లోకి పరుగుపెట్టాను – బ్యాగుని బెడ్ పైకి చేర్చి అక్కయ్యకు కాల్ చెయ్యడానికి మొబైల్ తీస్తే స్విచ్ ఆఫ్ ……. , ఛార్జింగ్ పెట్టాను .
కాల్స్ వచ్చినట్లు నోటిఫికేషన్ మెసేజెస్ వచ్చాయి – కాల్స్ అన్నీ అక్కయ్య నుండే …… , వెంటనే కాల్ చేసాను .
అక్కయ్య : తమ్ముడూ ……. క్షేమంగా చేరావన్నమాట – ఇప్పటివరకూ అక్కయ్యతో మాట్లాడాను .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ……. , మీవల్లనే ఒక పెద్ద గండం నుండి బయటపడ్డాను అని వివరించాను .
అక్కయ్య : అంతటి ప్రమాదం నుండి సేవ్ చేసినాకూడా కేవలం లవ్ యు మాత్రమేనా తమ్ముడూ ……..
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. మా అక్కయ్యకు బోలెడన్ని ముద్దులు ……
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …… , ఇవే ముద్దులు రేపు ఉదయం వచ్చినప్పుడు కూడా ఇవ్వాలి .
లవ్ టు లవ్ టు అక్కయ్యా ……. ఈ ముద్దులకు డబల్ ముద్దులు ఇస్తాను మా అక్కయ్యకు ……
అక్కయ్య : యాహూ ……
నవ్వుకుని , అక్కయ్యా ……. స్నానం చేయాలి .
అక్కయ్య : అవునవును నాకోసం మా బుజ్జిహీరో ఉదయం నుండీ రాత్రివరకూ నాతోనే ఉన్నాడు . వెళ్లి ఫ్రెష్ అవ్వు తమ్ముడూ ……
అక్కయ్యా …… బామ్మ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను .
అక్కయ్య : నీ దేవత ఇంటికి కాదా ……. ? , బామ్మ అంతా చెప్పారులే , soooo బ్యూటిఫుల్ ……. ఇంకా వింటూనే ఉండాలనిపించింది తమ్ముడూ …….
ఎందుకో తెలియదు అక్కయ్యా ……. , దేవతను చూస్తూనే దేవతతోనే ఉండిపోవాలని ఆశ ……
అక్కయ్య : తథాస్తు తమ్ముడూ …….
లవ్ యు అక్కయ్యా ……. , మా అక్కయ్య – మీ అక్కయ్య ……. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అదొక్కటే నా కోరిక …….
అక్కయ్య : టచ్ చేసావు తమ్ముడూ ……. , ఇలానే మాట్లాడుతుంటే మరింత ఆలస్యం అవుతుంది వెళ్లు వెళ్లు …….
ఉమ్మా అక్కయ్యా …… అని కట్ చేసి స్నానానికి వెళ్ళాను .
ఫ్రెష్ అయ్యి దేవత దగ్గరికి వెళ్ళడానికి ఉత్సాహంగా బయటకువస్తే …….
మాథ్స్ కదా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు . మహేష్ మహేష్ ….. మరొక ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా రావడం లేదు అని లాక్కునివెళ్లారు . మహేష్ ……. మన క్లాస్మేట్స్ అంతా నిన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు తెలుసా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ తో …….
ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తూ నేనూ ప్రాక్టీస్ చేస్తూ 11 గంటలు అయిపోయింది . ప్రాక్టీస్ satisfy అయినట్లు నిద్రకూడా రావడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు .
11 గంటలు అయ్యింది , దేవత – బామ్మ నిద్రపోయి ఉంటారేమోనన్న అనుమానంతోనే ఇంటికి వెళ్ళాను .
ఇంటి బయట లోపల లైట్స్ వెలుగుతుబడటం – బామ్మ ….. నాకోసం గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుండటం దూరం నుండే చూసి పరుగునవెళ్లి గుండెలపైకి చేరాను – sorry బామ్మా ….. ఫ్రెండ్స్ తోపాటు ప్రాక్టీస్ చేస్తూ ఆలస్యం అయ్యింది .
బామ్మ : నా బంగారుకొండ కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తాను – రేపు exam ఉందికదా నిద్రపోవాలి పదా అంటూ లోపల గొళ్ళెం పెట్టి దేవత గదిలోకి తీసుకెళ్లారు .
బామ్మా …… మళ్లీ బెడ్స్ కలిపేసి ఉన్నాయి ఏంటి ? .
బామ్మ : నిన్న నువ్వేనా దూరం జరిపినది , ఎందుకు జరిపావు ? .
అమ్మో ……. నిద్రలో నేను ప్రక్కనున్న వారిపై కాళ్ళు వేస్తాను బామ్మా – దేవతపైన వేస్తే ఇంకేమైనా ఉందా …… ? .
బామ్మ : నీ దేవతపై కాళ్ళు వేసి హాయిగా పడుకునే అర్హత మా బుజ్జిహీరోకు కాకుండా ఎవరికి ఉంది , రా నా ఒడిలో హాయిగా పడుకుందువు …….
లేదంటే లేదు ……. , రెండు రాత్రులూ ….. మీరు పడుకోనేలేదు , నేను …… ఇక్కడ – మీరు దేవత ప్రక్కన ఇది ఫైనల్ అంతే ……. , నేను విననంటే వినను – ఉదయమే చాలాకోపం వచ్చింది .
బామ్మ : నా బంగారం సరే అంటూ గుడ్ నైట్ కిస్ పెట్టి వెళ్లి దేవత ప్రక్కన పడుకున్నారు .
బామ్మ నో అన్నా – తియ్యదనంతో కోప్పడినా …… సింగల్ బెడ్ ను నెమ్మదిగా దూరంగా జరిపి , అమ్మో …… నాకు భయం అంటూ ముసిముసినవ్వులతో లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను . అక్కయ్యకు కాల్ చేస్తాను అనిచెప్పాను కదా , వద్దులే ఇప్పటికే ఆలస్యం అయ్యింది డిస్టర్బ్ చెయ్యకూడదు అని దేవతను చూస్తూ పడుకున్నాను .
అలారం చప్పుడుకు దేవత లేచారు . బామ్మా …… త్వరగా టిఫిన్ రెడీ చెయ్యి చెల్లి దగ్గరకువెళ్లి కాలేజ్ కు వెళ్లాలికదా ……. , నాకు తెలిసి తన అక్కయ్య దగ్గరికి వెళ్లడం కోసం ఈ పాటికే రెడీ అయిపోయి ఉంటాడు బుజ్జిహీరో అంటూ నిద్రమత్తుతోనే బాత్రూం లోకి వెళ్లారు .
అలారం చప్పుడు దేవతకు ఇరువైపులా పడుకున్న ఇద్దరమూ లేచి భయంభయంగా నవ్వుకున్నాము .
లేచి , ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బామ్మా అని ముద్దుపెట్టి పరుగుతీసాను . కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి కాలేజ్ డ్రెస్ లోకి మారే లోపు డోర్ బయట టిఫిన్ రెడీగా ఉంది – తినేసి బయటకువచ్చాను – మురళి ఇంకా అప్పుడు బ్రష్ చేస్తుండటం చూసి , మురళి సర్ కాలేజ్ కు వెళ్లి ప్రాక్టీస్ చెయ్యాలి అనిచెప్పేసి , వెనుతిరిగిచూడకుండా నవ్వుకుంటూ అంతే పరుగుతో దేవత ఇంటికి చేరుకున్నాను . దేవత కూడా రెడీ అయ్యి బయటకు రావడం చూసి మెయిన్ గేట్ నుండి వస్తున్నట్లు అటువైపుకు చేరి వచ్చాను .
దేవత : బామ్మా …… మన కాదు కాదు మా బుజ్జిహీరో వచ్చేశాడు . మీ బుజ్జిహీరో గురించి చెబుతావు కానీ చూయించనేలేదు అంటూ బుగ్గలను రుద్దుకుంటున్నారు .
ఏంటి మేడం బుగ్గలు రుద్దుకుంటున్నారు అని తెలిసే అడిగాను .
దేవత : బామ్మనే కందిపోయేలా గిల్లేసింది – బాగా నొప్పివేస్తుంది స్స్స్ స్స్స్ ……
ఇప్పుడు తెలిసిందా మేడం గారూ …… ఎంత నొప్పివేస్తుందో కానీ మా మేడం గిల్లితే నాకైతే హాయిగా ఉంది .
దేవత : అవునా అవునా అంటూ మళ్లీ గిల్లేసారు .
స్స్స్ ……. మొదలెట్టేశారా ….. ? , మీకు కూడా మళ్లీ రేపు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది లేండి అని నవ్వుకున్నాను .
