పెద్దమ్మ Part 18

అంతలో బస్ హార్న్ వినిపించడంతో , బామ్మా …… లంచ్ అని అడిగారు దేవత .
బామ్మ : exam కదా ఆకలికాదులే బుజ్జితల్లీ …… వెళ్ళండి వెళ్ళండి అని నావైపు కన్ను కొట్టారు .
నాకు కూడా ఏమీ అర్థం కాలేదు . బస్సు ….. బస్టాప్ వైపుకు వస్తున్నట్లు సౌండ్ పెరుగుతూ రావడం – నెక్స్ట్ బస్ మళ్లీ అర గంటకు కానీ రాదని తెలిసి బామ్మకు బై బై చెప్పేసి వడివడిగా బయటకువచ్చాము . బస్టాప్ దాటి వెళ్లిపోతున్న బస్సు దగ్గరికి పరుగుతీసి స్టాప్ స్టాప్ అంటూ కొట్టిమరీ ఆపి , చిరునవ్వులు చిందిస్తున్న దేవతతోపాటు ఎక్కాను . దేవత ఖాళీ సీట్లోని విండో ప్రక్కన కూర్చోగానే , కూర్చోకుండా నిలబడ్డాను .
దేవత : బుజ్జిహీరో ……. కష్టపడి నాకోసం బస్సు ఆపావు కూర్చో …….
ప్చ్ …… ఎందుకో తెలియదు మేడం , మీరు ఇష్టం చూయిస్తుంటే నాకు నచ్చడం లేదు , కొప్పుడుతుంటేనే బాగుండేది …….
దేవత : నిన్నూ …… అంటూ కొట్టిమరీ సీట్లోకి లాగేసారు . Exam ఉంది కాబట్టి వద్దు తరువాత కోప్పడతానులే అని నవ్వుతూనే ఉన్నారు . అంత చివరన కూర్చున్నావు పడతావు నావైపుకు రా బుజ్జిహీరో …….
నిన్నటివరకూ జరుగు జరుగు అని కొట్టారు – ఇప్పుడేమో రా రా అంటూ కొడుతున్నారు నాకేమీ అర్థం కావడం లేదు ……..
దేవత : ఒక్కరోజులో బుజ్జిహీరో అయిపోయారు కదా అందుకే …….. , బాగా ప్రిపేర్ అయ్యావా …… ? .
అక్కయ్య మాథ్స్ లో క్వీన్ మేడం ……. , డౌట్స్ అన్నీ అలా అలా క్లియర్ చేసేసారు ఔట్ ఆఫ్ ఔట్ తెచ్చుకుని అక్కయ్యకు బోలెడన్ని ముద్దులు ఇవ్వాలి .
దేవత : ఈరోజు మాత్రం నీకంటే నేనే ఎక్కువ ముద్దులు పెడతాను – స్వీకరిస్తాను నా చెల్లి నుండి బెట్ వేసుకుందామా ……. ? .
నాకు కూడా అలా జరగడమే ఇష్టం మేడం …… , అక్కయ్య – దేవత సంతోషంతో చిరునవ్వులు చిందించడం చూడటం కంటే నాకు సంతోషం ఏముంటుంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
దేవత : మేమంటే ఇంత ఇష్టం ఎందుకు బుజ్జిహీరో …… , నిన్ను చూస్తే నాకే అసూయ వేస్తోంది , మరీ ఇంత మంచివాడివి ఏమిటి , మరి ఇలా చేస్తే కోపం జన్మలో రాదు …….
అవునుకదా అయితే మారాలి , నాకు కావాల్సినది మా మేడం కోపం – దెబ్బలు – గిల్లుళ్లు ……..
దేవత : బుజ్జిహీరో బుజ్జిహీరో స్టాప్ స్టాప్ ఇక నవ్వే ఓపిక నాకు లేదు అంటూనే నవ్వుతూనే ఉన్నారు .
దేవతను చూస్తూనే మాథ్స్ టెక్స్ట్ బుక్ తీసి పైపైన చూసుకుంటున్నాను .
దేవత : నో డిస్టర్బ్ నో డిస్టర్బ్ అంటూనే అటువైపుకు తిరిగి సంతోషంతో నవ్వుతూనే ఉన్నారు .

7:30 కు కాలేజ్ బస్టాప్ దగ్గర ఆగి , దగ్గరలోనే కాబట్టి నడుచుకుంటూ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకున్నాము .
అన్నయ్యా – మేడం …… అంటూ కేకలువేస్తూ విక్రమ్ – హాసిని కాలేజ్ డ్రెస్ – కాలేజ్ బ్యాగ్స్ తో పరుగునవచ్చారు . మా చేతులను పట్టుకుని అక్కయ్య ఇంటికి పిలుచుకునివెళ్లారు .
మేడం …… డోర్ తెరిచే ఉంది .
హాసిని : మా తమ్ముడు – అక్కయ్య ఏ క్షణమైనా రావచ్చునని ఎప్పటి నుండో అక్కయ్య డోర్ విశాలంగా తెరిచి ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు .
అవునూ మీకెలా తెలుసు ? .
ఎందుకంటే విక్రమ్ – హాసిని రాత్రి ఇక్కడే నాతోనే పడుకున్నారు కాబట్టి తమ్ముడూ అంటూ పరుగునవచ్చి దేవతను హత్తుకుని ముద్దుపెట్టారు అక్కయ్య …….
దేవత : యాహూ …… ఫస్ట్ నన్నే హత్తుకుని , నన్నే ముద్దుపెట్టింది చెల్లి …….
లవ్ యు అక్కయ్యా ……. ఉమ్మా ఉమ్మా , దేవత కోప్పడాలంటే బుంగమూతిపెట్టుకోవాలి కదా ……..
దేవత : బుజ్జిహీరో ……. నువ్వు మారవన్నమాట , చూడు చెల్లీ …… నేను ఇష్టపడుతుంటే కోపమే కావాలంటాడు .
అక్కయ్య : తమ్ముడు ఏది అడిగితే అది ఇచ్చేద్దాము అక్కయ్యా ……. , ముందు లోపలికి రండి టిఫిన్ చేద్దాము .
దేవత : అమ్మో ఫుల్ గా తిన్నాము exam అని …….

తమ్ముడూ – చెల్లీ ……. రాత్రి ఇక్కడే పడుకున్నారా ? , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
హాసిని : మేమే కాదు అన్నయ్యా …… , మమ్మీ కూడా ఇక్కడే పడుకున్నారు .
అక్కయ్య : చదువుతూ చదువుతూనే నా ఓడిలోనే పడుకున్నారు తమ్ముడూ ……. , అందుకే ఇక మేడం కూడా ఇక్కడే పడుకోవాల్సి వచ్చింది . అవునూ ……. రాత్రి మళ్లీ కాల్ చేస్తానని చెయ్యలేదేమిటి తమ్ముడూ ……. అంటూ నా ప్రక్కనే వచ్చి కూర్చుని చేతిని గుండెలపై హత్తుకున్నారు .
Sorry లవ్ యు అక్కయ్యా …… , ఫ్రెండ్స్ తోపాటు చదువుకునేసరికి 11 గంటలు అయ్యింది – ఆ సమయంలో హాయిగా నిద్రపోతున్న మా అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక చెయ్యలేదు అంతే …….
నువ్వు కాల్ చేస్తావని అర్ధరాత్రివరకూ మేల్కొనే ఉంది బుజ్జిహీరో అంటూ బామ్మ చెప్పారు .
అవునా బామ్మా …… , నాకు బుద్ధే లేదు అంటూ లెంపలేసుకుని మొట్టికాయ వేసుకోబోతే , అక్కయ్య ఆపి మా మంచి తమ్ముడు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : కమాన్ అన్నయ్యా కమాన్ , ఫోనులో మొత్తం 15 ముద్దులుపెట్టారు – మనం కలిసాక నాకు పెడతారని చెప్పారుకదా …….
మేడం విన్నారుకదా 15 15 15 అంటూ అక్కయ్య బుగ్గలపై 15 ముద్దులుపెట్టాను .
అంతే బుంగమూతిపెట్టుకుని రుసరుసలాడుతూ చూస్తున్నారు మేడం …. , yes yes yes నాకు కావాల్సింది అదే కోపం అదే కోపం …….
దేవత : కోపంతో నా తొడపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ …… అంటూ అంతెత్తుకు ఎగిరిపడి రుద్దుకోవటం చూసి , అందరూ నవ్వుకున్నారు .
అక్కయ్య పరుగునవెళ్లి , ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి గిల్లినచోట ఉంచారు .
అప్పుడు దేవతను చూడాలి నాకైతే నవ్వు ఆగడం లేదు .
దేవత : పో చెల్లీ …… , బెట్ కూడా వేసాను , నన్ను క్లీన్ బౌల్డ్ చేసేసావు అంటూ లాక్కునివెళ్లి దూరంగా కూర్చోబెట్టుకున్నారు . ఇక నీ తమ్ముడి దగ్గరకు వదలనే వదలను అటూ గట్టిగా చుట్టేశారు . చెల్లీ …… చెప్పనేలేదు కదూ ఈ డ్రెస్ లో అచ్చు కృతి శెట్టి లానే ఉన్నారు .
నేనూ బస్సు ఎక్కే హడావిడిలో చెప్పనేలేదు మేడం ఈ సారిలో …….
దేవత : తమన్నాలా ఉన్నారు అంటావు అంతేకదా అని నవ్వుకున్నారు .
మా మాటలకు చెల్లి – తమ్ముడు నవ్వుకుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు , అంతలో వైష్ణవి – వర్షిని వచ్చి మాకు గుడ్ మార్నింగ్ చెప్పి హాసిని ప్రక్కన కూర్చున్నారు .
బామ్మ టీ తీసుకురావడంతో తాగాము .

8:30 అవ్వడంతో దేవత క్షణక్షణానికీ టైం చూస్తూనే అక్కయ్యను మరింతలా చుట్టేస్తున్నారు .
విషయం అర్థమై , మేడం గారూ ……. మీరు వెళ్ళాలి కాబట్టి మీరు వెళితే అక్కయ్య వచ్చి నా ప్రక్కన చేరతారని ఎంత అసూయ పడుతున్నారు , సరే సరే ……నేనూ వస్తాను పదండి తప్పుతుందా …… ? .
అక్కయ్య గట్టిగా – దేవత ముసిముసినవ్వులు నవ్వుతున్నారు . అంతే మరి పదా వెళదాము అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
పిల్లలు : అన్నయ్యా …… మేమూ వస్తాము .
చెల్లెళ్ళూ ……. ఇంకా గంట సమయం ఉంది .
హాసిని : అయినా పర్లేదు , మేమూ వస్తాము , అక్కడే చదువుకుంటాము , మమ్మీలకు చెప్పేసాము .
దేవత : ఇంకా కూర్చున్నావే బుజ్జిహీరో బయటకు నడు ……. , నువ్వు బయటకు వెళ్లాకనే నేను , చెల్లిని వదిలి వచ్చేది ……
అక్కయ్యవైపు ఆశతో చూస్తూ పిల్లలతోపాటు బయటకు వెళ్ళాక , దేవత వచ్చారు . అంతే పరుగున అక్కయ్యదగ్గరికివెళ్లి ముద్దులుపెట్టి , అక్కయ్యా …… డోర్స్ జాగ్రత్తగా వేసుకోండి .
అక్కయ్య : All the best తమ్ముడూ అంటూ ముద్దుపెట్టారు .
మా అక్కయ్య ముద్దుపెట్టింది కదా ఇక దూసుకుపోతాను అని ముద్దుపెట్టి , కోపంగా చూస్తున్న దేవత దగ్గరికి చేరుకున్నాను .
ఒక దెబ్బ – ఒక గిల్లింత ……..
స్స్స్ స్స్స్ …..
నవ్వుతున్న అక్కయ్య డోర్ వేసుకునేంతవరకూ అక్కడే ఉన్నాను .

లేడీ సెక్యూరిటీ అధికారి : రండి అందరినీ డ్రాప్ చేస్తాను .
యూనిఫార్మ్ లో ఉన్నారు అంటే మీకూ ఆలస్యమయ్యిందని అర్థం – పర్లేదు మేడం దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్లిపోతాము – what do you say చెల్లెళ్ళూ …….
పిల్లలు : yes yes అన్నయ్యా …….
లేడీ సెక్యూరిటీ అధికారి : ok బై బై exam బాగా రాయండి .
పిల్లలు : లవ్ యు మమ్మీ – అంటీ …… అంటూ మా చేతులను పట్టుకుని మాతోపాటు నడిచారు .

కాలేజ్ చేరుకున్నాము . హలో బుజ్జిహీరో ……. రోజూ క్లాస్సెస్ కాబట్టి ఇంగ్లీష్ వంక చెప్పి ఫస్ట్ పీరియడ్ నుండి లాంగ్ బెల్ కొట్టేంతవరకూ నాకు బాడీగార్డ్ గా సేఫ్ గా చూసుకున్నావు , ఇప్పుడు exam కాబట్టి నువ్వు ఒక రూంలో exam రాయబోతున్నావు – నేను మరొక రూంలో ఇన్విజిలేటర్ గా ……
కోరిక స్వఛ్చమైనది అయితే భూతాలు భూతాలు ఆ ఆ పంచభూతాలు ఏకమై మనల్ని ఒకే రూమ్ కు చేర్చవచ్చు మేడం …….
దేవత : ఆ ఆ ……. ఇలాంటివి చెప్పమంటే రోజంతా చెబుతూనే ఉంటావు అని బుగ్గపై గిల్లేసారు .
హాసిని : ఎందుకు మేడం , మా అన్నయ్యపై ఎప్పుడూ కోప్పడతారు – కొడతారు – గిల్లుతారు ……..
ష్ ష్ ష్ చెల్లీ …… , అలానే నాకు మహా ఇష్టం …….
దేవత : అందరికీ మీ అన్నయ్య అంటేనే ఇష్టం అని తియ్యనికోపంతో టీచర్స్ అందరితోపాటు ఆఫీస్ రూంలోకి వెళ్లారు . హలో …… బుజ్జిహీరో ఓన్లీ స్టాఫ్ ……
Ok ok మేము ఇక్కడే చదువుకుంటాము అని బయటున్న బెంచ్ పై కూర్చున్నాము.
దేవత నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .

కొద్దిసేపటి తరువాత బయటకువచ్చి బుజ్జిహీరో …… చెప్పానా ? , నాకు …… మీ క్లాస్ ప్రక్కనున్న రూంలో ఇన్విజిలేషన్ , ఏదో స్వచ్ఛమైన కోరిక అన్నావు అనిచెప్పి టీజ్ చేస్తూ మళ్లీ లోపలికివెళ్లారు .
ప్చ్ …… ఇక పెద్దమ్మను ప్రార్థించాల్సిందే , ముందే ప్రార్థించకుండా ఏమి చేస్తున్నావురా …… ? , కొవ్వు పట్టింది నీకు అని లెంపలేసుకున్నాను .
వైష్ణవి : అన్నయ్యా …… ఏమైంది , మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు .
వరాలిచ్చే దైవాన్ని మరిచిపోయాను చెల్లీ …… , కాస్త గట్టి దెబ్బలు తగలాలి నాకు ……
మెసేజ్ : హ హ హ …….
పెద్దమ్మా …… ప్లీజ్ ప్లీజ్ , మీకు తెలుసుకదా …… 2:30 గంటలపాటు దేవతను చూడకుండా ఉండటం నావల్లకాదు …. అంటూ ప్రార్థిస్తున్నాను .
పిల్లలు : మా అన్నయ్య కోరిక తీరాలి అని నలుగురూ మొక్కుకున్నారు .
థాంక్యూ థాంక్యూ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టాను .

ప్రేయర్ బెల్ మ్రోగడంతో దేవతతోపాటు వెళ్లి దేవత ముందు నిలబడ్డాము . పూర్తయ్యాక బుజ్జిహీరో …… పిల్లలను వాళ్ళ క్లాస్సెస్ లో వదిలి నువ్వు నీ క్లాస్ కు వెళ్లు – నేను ఆఫీస్ రూమ్ కు వెళ్లి క్వశ్చన్ పేపర్స్ తోపాటు నా డ్యూటీ రూమ్ కు వెళతాను బై బై ……..
ఏమిచేస్తాం ఈ exams వరకూ తప్పదు అని చెల్లెళ్లు – తమ్ముడిని వాళ్ళ క్లాస్సెస్ లో వదిలి All the best చెప్పి నా క్లాస్ చేరుకున్నాను – ప్చ్ ……. ప్రక్క గదిలో exam అయి ఉంటే ఎంత బాగుండేది .

రేయ్ మహేష్ ……. ఎక్కడికి వెళుతున్నావు ? , మన exam ప్రక్కగదిలో బెంచ్ కు ఇద్దరే అంటూ కోరుకున్న గదిలోకే లాక్కునివెళ్లాడు గోవర్ధన్ …….
థాంక్యూ థాంక్యూ మై ఫ్రెండ్ అంటూ సంతోషం పట్టలేక అక్కడికక్కడే డాన్స్ చేసాను .

మహేష్ మహేష్ ……. అంటూ క్లాస్మేట్స్ బాయ్స్ & గర్ల్స్ నవ్వుకున్నారు .
ఇంగ్లీష్ మేడం వస్తున్నారు అంటూ ఇద్దరు క్లాస్మేట్స్ బయటనుండి కేకలువేస్తూ వచ్చి వారి వారి places లో కూర్చున్నారు .
థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా …… అంటూ డాన్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్లి నా ప్లేస్ లో కూర్చున్నాను .
దేవత లోపలికి రాగానే , అందరమూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచాము . దేవతకు కనిపించకుండా ముందున్న మురళి వెనుక దాక్కుని నవ్వుకుంటున్నాను .
దేవత : గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ , సిట్ డౌన్ …… , బాగా ప్రిపేర్ అయ్యారా ….. ? .
Yes మేడం …….
దేవత : good then , All the best …….
థాంక్యూ మేడం ……..

Exam బెల్ మ్రోగడంతో ……. , స్టూడెంట్స్ …… బుక్స్ అన్నింటినీ బయట ఉంచండి అన్నారు దేవత …….
Yes మేడం yes మేడం …… అంటూ సగం మంది వెళ్లి బుక్స్ బయట ఉంచి వచ్చారు – నా ప్రక్కన సీట్ మాత్రం ఖాళీగా ఉంది .
దేవత : వన్స్ అగైన్ All the best స్టూడెంట్స్ అంటూ మొదట స్టూడెంట్ తో మొదలుపెట్టి వరుసగా క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ ఇస్తూ వెనుకకు వెళ్లి టర్న్ అయ్యి వెనుక నుండి నాదగ్గరకు వచ్చారు .
బెంచ్ పై వాలి చిన్నగా బీట్ వేస్తున్నాను .
దేవత : బుజ్జిహీరో …… నువ్వు ఇక్కడ ? అంటూ ఆశ్చర్యంతో చూస్తున్నారు .
స్వచ్ఛమైన కోరిక మేడం – ఇది exam మేడం బెంచ్ కు ఇద్దరు మాత్రమే – అంతా పెద్దమ్మ దయ అంటూ గుండెలపై చేతినివేసుకుని నవ్వుతున్నాను .
దేవత : బుగ్గను గట్టిగా గిల్లేసారు .
స్స్స్ …….
క్లాస్మేట్స్ అందరూ నావైపు చూసారు .
దేవత : నవ్వుకుని , టైం అయ్యింది నీ ప్రక్కన ఎవరు రాలేదు …….
వెనకున్న గర్ల్ : జాహ్నవి మేడం ఇంకా రాలేదు .
దేవత : వస్తుందిలే మీరు స్టార్ట్ చెయ్యండి అని నవ్వుతూనే అందరికీ క్వశ్చన్ పేపర్స్ – వైట్ పేపర్స్ అందించారు .

అందరూ క్వశ్చన్ పేపర్స్ చూసి థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో కేకలువేశారు .
దేవత : why why బాయ్స్ గర్ల్స్ ……. , ఎందుకు అందరూ మహేష్ కు థాంక్స్ చెబుతున్నారు అంటూ నాదగ్గరికి వచ్చి చిరుకోపంతో చూస్తున్నారు .
క్లాస్మేట్స్ : ఎందుకంటే మహేష్ వల్లనే కష్టమైన 8 మార్క్స్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చెయ్యబోతున్నాము మేడం ……. థాంక్యూ మహేష్ …….
మళ్ళీనా అంటూ రుసరుసలాడుతూ చూస్తున్నారు .
ఈ థాంక్స్ లన్నీ అక్కయ్యకు చెందుతాయి మేడం , లవ్ యు అక్కయ్యా అంటూ తలుచుకున్నాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *