పెద్దమ్మ Part 18

Exam రూమ్ నుండి ఏమిటీ కేకలు అంటూ హెడ్ మాస్టర్ లోపలికివచ్చారు – ఓహ్ ……. అవంతికా మేడం ఇక్కడే ఉన్నారన్నమాట అంటూ దేవతవైపుకు రాబోతే , దేవత మరొకవైపుకు వెళుతున్నారు .
నాకైతే పిచ్చ కోపం వచ్చేసి పైకిలేచాను .
దేవత : బుజ్జిహీరో …… నేను మ్యానేజ్ చేస్తాను కదా కూల్ కూల్ కూర్చో
అని కళ్ళతోనే సైగచెయ్యడంతో కూర్చున్నాను . దేవత దూరం దూరం నడవడం చూసి హెడ్ గాడికి కోపం వచ్చేస్తోంది .

అదే సమయానికి may i come in మేడం అంటూ జాహ్నవి వచ్చింది .
దేవత : please come in జాహ్నవి …… , ఎందుకు ఆలస్యం …… ok ok ముందు exam పూర్తిచేయ్యి …….
హెడ్ : నో స్టాప్ ……. , రావడమే ఆలస్యం అందులోనూ కలర్ డ్రెస్ లో వచ్చావు – exam కు ఆలో చెయ్యనే చెయ్యను – go to home …….
క్లాస్మేట్ జాహ్నవి కళ్ళల్లో కన్నీళ్లు ……. , సర్ అదీ కాలేజ్ కు వస్తుంటే వేగంగా వెళుతున్న కార్ వలన రోడ్డుపై నిలబడిన నీళ్లు వెదజల్లి కాలేజ్ డ్రెస్ మొత్తం తడిచిపోయింది – కిందకు కూడా పడిపోయాను . ఇంటికి వెళ్లి చేంజ్ చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయ్యింది .
అవును సర్ నేను జాహ్నవి father , అందుకే ఆలస్యం అయ్యింది .
ఫ్రెండ్ …… దెబ్బలేమీ తగులలేదు కదా అని నేను – జాహ్నవీ …… అంటూ అడగబోయి గుడ్ అంటూ నావైపు చూసారు మేడం ……..
జాహ్నవి : లేదు ఫ్రెండ్ …… , దెబ్బలేమీ తగులలేదు .
దేవత : జాహ్నవీ ……. లోపలికి వచ్చి exam …….
హెడ్ గాడు : నో నెవర్ ……. , కాలేజ్ డ్రెస్ లేకుండా exam కు ఆలో చెయ్యను , మీ father తోపాటు ఇంటికి వెళ్లిపో , ఇలాంటి కథలు నేను వినను .
జాహ్నవి : సర్ సర్ ……
హెడ్ గాడు : గెట్ ఔట్ …… , కాలేజ్ డ్రెస్ ఉంటేనే …….
జాహ్నవి మరియు తన father కళ్ళల్లో కన్నీళ్లు ……..
దేవత : సర్ , ఎస్క్యూస్ చేసి ఆలో చెయ్యండి ప్లీజ్ ……
హెడ్ గాడు : నిన్న నువ్వు నా మాట విన్నావా బ్యూటీ ……..
దేవత కళ్ళు అగ్ని గోళాలుగా మారిపోయాయి – నావైపు చూసారు .
క్లాస్మేట్ జాహ్నవి ఏడుపు చూసి క్లాస్మేట్స్ అందరూ exam రాయడం ఆపేసి ఫీల్ అవుతున్నారు .
ప్లీజ్ ప్లీజ్ సర్ అంటున్న జాహ్నవి కన్నీళ్లు – దేవత కళ్ళల్లో చెమ్మ చూసి హృదయం చలించిపోయింది . వెంటనే లేచి అందరూ చూస్తుండగానేకాలేజ్ డ్రెస్ విప్పేసి , నేనూ …… కాలేజ్ డ్రెస్సులో లేను నన్నూ బయటకు పంపించేయ్యండి అని ఓన్లీ షార్ట్ తో బయటకువెళ్లి జాహ్నవి వెనుక నిలబడ్డాను – జాహ్నవి i am with my ఫ్రెండ్ ……
వెనుకనే వినయ్ – గోవర్ధన్ – మా ఏరియా ఫ్రెండ్స్ except మురళి ఒక్కొక్కరుగా లేచి కాలేజ్ డ్రెస్సెస్ విప్పేసి , మేమూ కాలేజ్ డ్రెస్ లో రాలేదు మమ్మల్నీ గెట్ ఔట్ చెయ్యండి అని నావెనుకే వచ్చి నిలబడ్డారు – జాహ్నవి we are with my ఫ్రెండ్ , గుడ్ డెసిషన్ మహేష్ …….
మా క్లాస్మేట్ ఏడుపు చూసి మేమూ exam రాయలేము అంటూ క్లాస్మేట్స్ బాయ్స్ అంతా కాలేజ్ డ్రెస్సెస్ విప్పేసి బయటకువచ్చి మా వెనుకే నిలబడ్డారు – జాహ్నవీ we too with my ఫ్రెండ్ ……..
మేమేమి తక్కువనా అన్నట్లు గర్ల్స్ అందరూ పైకి లేచారు . అంతే మురళి లేచి షర్ట్ విప్పేసి పరుగునవచ్చి మా వెనుక నిలబడ్డాడు .
గర్ల్స్ : సర్ …… , ఇకనుండీ సర్ అని పిలవము – మా ఫ్రెండ్ జాహ్నవిని ఆలో చేస్తేనే మేమూ exam రాసేది . నో అని మరొకసారి ఆనండి మేమూ …… కాలేజ్ డ్రెస్ విప్పేసి ……..

నో నో నో అంటూ విషయం తెలిసి కొంతమంది టీచర్స్ వచ్చి , హెడ్ మాస్టర్ గారూ ……. విషయం తెలిసింది – ఇప్పటికే చాలాదూరం వెళ్ళింది మరింత దూరం తీసుకెళ్లకండి – ఇంత చిన్న విషయానికి ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు – బయటకు తెలిస్తే అంత మంచిది కాదు – మీరు మీ రూమ్ కు వెళ్లిపోండి .
సైలెంట్ గా వెళ్లిపోతుంటే అడ్డుపడ్డాను . టీచర్స్ …… మా ఫ్రెండ్ జాహ్నవికి – మేడం గారికి తలదించుకుని sorry చెబితేనేనే పంపించేది లేకపోతే అడుగు కూడా వెయ్యనియ్యము – what do you say ఫ్రెండ్స్ …….
Yes yes అంటూ కాలేజ్ దద్దరిల్లేలా గట్టిగా చెప్పారు . ఆ కేకలకు మిగతా స్టాఫ్ – రెండువైపులా ఉన్న స్టూడెంట్స్ బయటకువచ్చి గుసగుసలాడుకుంటున్నారు .
టీచర్స్ : హెడ్ మాస్టర్ …… please స్టూడెంట్స్ చెప్పినట్లుగా చేస్తే మీకే మంచిది లేకపోతే కాలేజ్ మొత్తం వచ్చేస్తారు .
హెడ్ గాడికి చెమటలు పట్టేసాయి . చుట్టూ చూసి వేరే మార్గం లేనట్లు sorry చెప్పాడు .
వినయ్ : నో నో నో ఇలాకాదు , మహేష్ చెప్పినది మోకాళ్లపై కూర్చుని తలదించుకుని మా ఫ్రెండ్ మరియు మేడం గారికి sorry చెప్పాలి .
సూపర్ వినయ్ అంటూ హైఫై కొట్టుకున్నాము .
హెడ్ గాడు : నో నెవర్ …….
అది మా క్లాస్మేట్ ను ఏడిపించకముందు ఆలోచించి ఉండాల్సింది – sorry చెబుతారా లేక స్టూడెంట్స్ అందరినీ పిలవమంటారా …… ?
గర్ల్ క్లాస్మేట్ : మహేష్ …… మా డాడీ మీడియాలో పనిచేస్తారు , కాల్ చెయ్యనా ….. ? .
టీచర్ : స్టూడెంట్ ప్లీజ్ ప్లీజ్ …… , హెడ్ మాస్టర్ ……. మీడియా వరకూ వెళ్లకుండా త్వరగా వారు కోరినట్లుగా sorry చెప్పేయ్యండి .
హెడ్ గాడు అందరివైపు – ముఖ్యన్గా నావైపు కోపంతో చూస్తున్నాడు .
గోవర్ధన్ : మనవైపు కోపంతో చూస్తున్నాడు , ఇక మీడియాకు కాల్ చేయాల్సిందే ……..
టీచర్స్ : హెడ్ మాస్టర్ …… మన కాలేజ్ పరువు మీ చేతుల్లో ఉంది ఇక మీ ఇష్టం ……..
హెడ్ గాడికి ముచ్చెమటలు పడ్డాయి . ఇక మార్గం లేక మోకాళ్లపై కూర్చుని స్టూడెంట్ జాహ్నవి sorry – మేడం …….
రెస్పెక్ట్ …….
హెడ్ గాడు : మేడం గారూ …… sorry .
తెలుగులో ……. , ఏవైపు చూసినా లాభం లేదు చెప్పాల్సిందే ……
హెడ్ గాడు : తల దించుకుని స్టూడెంట్ జాహ్నవి క్షమించు – మేడం గారూ క్షమించండి అనిచెప్పి , కోపంతో వెళ్లిపోబోయాడు .
మళ్లీ ఆపాను …….
టీచర్స్ : స్టూడెంట్స్ – మహేష్ ……. sorry చెప్పారు కదా ……..
ఇతడి మూర్ఖత్వం వలన విలువైన exam సమయం అర గంట కోల్పోయాము టీచర్స్ – మాకు ఎక్స్ట్రా టైం కావాలి …….
టీచర్స్ : డన్ డన్ ……. , ఇక వదలండి .
థాంక్స్ టీచర్స్ అంటూ దారి వదిలాము . వెనక్కు తిరిగిచూడకుండా వాడి గదిలోకి కాకుండా బయటకు వెళ్ళిపోయాడు .
వినయ్ : హెడ్డూ ……. మా ఫ్రెండ్ కాదు గెట్ ఔట్ , నువ్వు గెట్ ఔట్ అంటూ నవ్వుకున్నాము .

మహేష్ మహేష్ మహేష్ ……. అంటూ బాయ్స్ అందరూ కలిసి నన్ను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……. మేడం గారు మరియు మన క్లాస్ గర్ల్స్ చూస్తున్నారు సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది .
దేవత మరియు గర్ల్స్ అందరూ చిలిపినవ్వులు నవ్వుకుంటున్నారు – మహేష్ …… 10th క్లాస్ లోనే సిక్స్ ప్యాక్స్ సూపర్ …… జిమ్ వల్లనా ? అని గట్టిగా నవ్వుతున్నారు .
అవునవును అంటూ కిందకు దింపి సిగ్గుపడుతున్నారు బాయ్స్ …….
నో నో నో గర్ల్స్ …… చిన్నప్పటి నుండీ కష్టపడటం వల్లన – ప్లీజ్ ప్లీజ్ అలా చూడకండి సిగ్గేస్తోంది అంటూ చేతులతో కప్పుకుని లోపలికివెళ్లి అందరమూ డ్రెస్సెస్ వేసుకున్నాము .
నవ్వులు మాత్రం ఆగడం లేదు .

దేవత : జాహ్నవి డార్లింగ్ …… మహేష్ – నీ ఫ్రెండ్స్ అందరూ ఇంత చేసినది నీకోసమే , నువ్వెంటీ ఇంకా అక్కడే ఉండిపోయావు , ప్లీజ్ come in …….
జాహ్నవి కన్నీళ్లను తుడుచుకుని థాంక్స్ మేడం అంటూ సంతోషంతో లోపలికి వచ్చి మహేష్ …… థాంక్స్ రా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది .
క్లాస్ : మహేష్ మహేష్ మహేష్ ……. అంటూ దద్దరిల్లిపోయింది .
ఫ్రెండ్స్ మధ్యన థాంక్స్ ఏంటి జాహ్నవీ …… కూర్చో , నిన్న కష్టమైన ప్రాబ్లమ్ నేర్చుకున్నావు కదా వచ్చింది .
జాహ్నవి : అవునా …… , అయితే 8 మార్క్స్ పర్సులో ఉన్నట్లే , దానికి కూడా థాంక్స్ రా …….
అదిగో మళ్లీ థాంక్స్ …….
క్లాస్మేట్స్ నవ్వుకున్నారు .

జాహ్నవి పేరెంట్ : మేడం గారూ …… మీరు అనుమతిస్తే ఒక్కనిమిషం లోపలికివచ్చి మహేష్ ను అభినందించాలని ఉంది ప్లీజ్ ప్లీజ్ మేడం ……
దేవత : నో అనగలనా డియర్ స్టూడెంట్స్ …….
అందరూ లేచి సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
పేరెంట్ : థాంక్స్ మేడం గారూ అంటూ లోపలికివచ్చి , మా బుజ్జితల్లి …….
బుజ్జితల్లినా అంటూ దేవతవైపు చూస్తే నవ్వుతున్నారు .
పేరెంట్ : ఏమైంది మహేష్ ……..
అధికాదు అంకుల్ ఇంత ఉన్నా అంత ఉన్నా జాబ్ చేస్తున్నా పేరెంట్స్ ….. వాళ్ళ పిల్లలను బుజ్జితల్లినే అని పిలుస్తున్నారు .
దేవత : ష్ ష్ ….. అంటూ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
అంకుల్ ……. మీరు కంటిన్యూ చెయ్యండి .
పేరెంట్ : నా బుజ్జితల్లి – మీ ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందం వచ్చిందంటే నీవల్లనే , థాంక్స్ బాబూ ……. అంటూ సంతోషపు ఉద్వేగంతో కౌగిలించుకున్నారు .
కొన్ని క్షణాలైనా వదలకపోవడంతో ……. అంకుల్ exam – చుట్టూ చూడండి ఇదేదీ పట్టించుకోకుండా ఫస్ట్ ఆ 8 మార్క్స్ ప్రాబ్లమ్ చేసేస్తుంటారు …….
వినయ్ – గోవర్ధన్ : అప్పుడే సగం పూర్తయ్యింది మహేష్ …… అనడంతో మళ్లీ నవ్వులు విరిసాయి .
పేరెంట్ : sorry sorry బాబూ …… , All the best అందరికీ All the best అనిచెప్పి సంతోషంతో బయటకువెళ్లారు .

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …… ధగా ధగా …… మోసం మోసం ……
బాయ్స్ : సంతోషంలో 8 మార్క్స్ ప్రాబ్లమ్ మరిచిపోయేలా ఉన్నాము అని మాట్లాడుతూనే సాల్వ్ చేసేస్తున్నారు .
అమ్మో …… ఆగేలా లేరు అని కూర్చున్నాను .
గర్ల్స్ అందరూ నవ్వుకున్నారు .

Where is that 8 మార్క్స్ క్వశ్చన్ …….
దేవత : నా దగ్గరికివచ్చి సూపర్ బుజ్జిహీరో అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
అంతే గుండెలపై చేతినివేసుకుని వెనక్కు వాలిపోయి దేవతనే చూస్తున్నాను .
దేవత నవ్వుకుని , బుజ్జిహీరో బుజ్జిహీరో ……. అంటూ భుజం కదిపారు .
నా దేవత దేవత ముద్దుపెట్టింది అంటూ స్వీట్ షాక్ లో కలవరిస్తూ బుగ్గపై స్పృశిస్తున్నాను .
నిమిషం అయినా తేరుకోకపోవడంతో చెంప చెళ్లుమనిపించారు .
మేడం మేడం మేడం అంటూ సడెన్ గా లేచి కూర్చున్నాను .
దేవత నవ్వుకుని , exam రాయి …….
Exam …… 2 గంటల్లో ఎప్పుడైనా ఫినిష్ చెయ్యవచ్చు – నా దేవత ముద్దు ఫీల్ ఆఅహ్హ్హ్ …… అంటూ మళ్లీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను .
అంతే తియ్యనైన కోపంతో చేతుల్లోని మందమైన ఆన్సర్ షీట్స్ తో నెత్తిపై కొట్టి ఆలస్యం అవుతోంది స్టార్ట్ చెయ్యి , లేకపోతే ముద్దుపెట్టిన చేతితోనే దెబ్బలు పడతాయి .
గంట చాలు మేడం , ప్లీజ్ ప్లీజ్ కాసేపు ఫీల్ అవ్వనివ్వండి అంటూ మళ్లీ డ్రీమ్స్ లోకివెళ్లి బుగ్గపై స్పృశించుకుంటూ మురిసిపోతున్నాను .
దేవత : ప్లీజ్ ప్లీజ్ బుజ్జిహీరో …… exam తరువాత ఎంతసేపైనా ఫీల్ అవ్వవచ్చు , స్టార్ట్ చెయ్యి …….
ఊహూ ……. కిస్ ఫీల్ కిస్ ఫీల్ …….
దేవత : మా బుజ్జిహీరోవి కదూ …… , ఇప్పుడెలా …… ఆ exam క్లీన్ గా పూర్తిచేయ్యి మరొక ముద్దు ఇస్తాను .
అంతే క్వశ్చన్ పేపర్ ఎడమచేతితో అందుకుని , చకచకా వన్ బై వన్ సాల్వ్ చేసేస్తున్నాను .
దేవత : బుజ్జిహీరో కాస్త స్లోగా …… , అక్కడ మీ అక్కయ్య కృతి శెట్టి …… నువ్వు exam బాగా రాయాలని పూజలు చేస్తుంటోంది పాపం – నువ్వేమో ఇక్కడ కిస్ కిస్ అంటూ ……

మేడం …… అడిషనల్ …… అని గోవర్ధన్ అడిగాడు .
దేవత నవ్వుతూ వెళ్లి అందించారు .
మేడం అడిషనల్ …….
దేవత : అప్పుడేనా బుజ్జిహీరో ……. అంటూ అందించి , పూర్తిచేసిన ఆన్సర్ షీట్ అందుకున్నారు . Wow ……. ఇంత నీటి గానా ……. ? , నేనే ఫుల్ మార్క్స్ ఇచ్చేలా ఉన్నాను .
మరి అక్కడేమో అక్కయ్య పూజలు చేస్తున్నారు – ఇక్కడేమో దేవత ముద్ధిస్తాను అన్నారు .
దేవత : ఇడియట్ అంటూ పేపర్స్ తో కొట్టి , అడిగిన ఫ్రెండ్స్ కు ఆడిషనల్స్ ఇస్తున్నారు . అందరూ ఆడిషనల్స్ తీసుకుంటున్నారు బాగా ప్రిపేర్ అయ్యారన్నమాట గుడ్ వెరీ గుడ్ …….
Yes yes మేడం అండ్ థాంక్యూ ……..
దేవత – జాహ్నవికి ఒకేసారి దాహం వేసినట్లు వెక్కిళ్ళు రావడంతో , పరుగున డోర్ దగ్గరికివెళ్లి ప్యూన్ ప్యూన్ …… డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ to 10th క్లాస్ రూమ్ అని బిల్డింగ్ మొత్తం వినిపించేలా కేకవేశాను .
మహే…ష్ ……. తీసు….కొస్తా….డులే ను…వ్వు వచ్చి exam రా….యి ……
వచ్చేన్తవరకూ అక్కడే ఉండి రెండు గ్లాసులు తీసుకొచ్చి అందించాను . మీ వెక్కిళ్ళు ఆగేంతవరకూ ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు మేడం అంటూ కంటిన్యూ చేసాను.
దేవత : మా బంగారు బుజ్జిహీరో అంటూ ముద్దుపెట్టబోయి , నా కళ్ళను చూసి లేదు లేదు లేదు ఇప్పటికే ఒక ముద్దువలన చాలా సమయం వృధా అయ్యింది ష్ ష్ ష్ అంటూ వెనుకకు వెళ్లిపోయారు .
నవ్వుకుని నెక్స్ట్ ప్రాబ్లమ్ చేస్తున్నాను .

అర గంట ముందుగానే exam పూర్తిచేసి థ్రెడ్ తో ఆన్సర్ షీట్స్ కట్టేసి finished అంటూ మేడం వైపు ఆశతో చూస్తున్నాను .
నా చూపులకు అర్థం తెలిసినా కూడా , ఏమీ తెలియనట్లు what what బుజ్జిహీరో అంటూ కళ్ళతోనే సైగలు చేస్తూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
నెక్స్ట్ జాహ్నవి కూడా finished అంటూ థ్రెడ్ కట్టేసి , మహేష్ …… మా డాడీకి నేనంటే ప్రాణం అందుకే నిన్ను అంతసేపు కౌగిలించుకున్నారు , నాకు తెలిసి నిన్ను డిన్నర్ కు ఆహ్వానించడానికి బయటే ఉంటారు .
అయినా నేనేమి చేసాను , ఫ్రెండ్ కోసం చేసాను , సరే సరే చికెన్ – మటన్ అయితేనే వస్తాను జాహ్నవీ …….
జాహ్నవి : soooo స్వీట్ రా ……
స్వీట్ …… ? , నో నో నో స్వీట్ వద్దు జాహ్నవీ ….. ? అంటూ దేవతను చూస్తూనే బదులిచ్చాను .
జాహ్నవి : స్వీట్ కాదు మై ఫ్రెండ్ – సో స్వీట్ అంటున్నాను అని నవ్వుతోంది.
అయితే ok …… వస్తానులే కుమ్మేద్దాము . మీ డాడీ ఇంకా ఉంటారా …… ? , అవసరం లేదు ఫ్రెండ్ పాపం డ్యూటీకి వెళ్లాలేమో కదా కాల్ చేసి పంపించెయ్యి .
జాహ్నవి : సో సో సో స్వీట్ అంటూ పర్సులోనుండి మొబైల్ తీసి కాల్ చేసి విషయం చెప్పింది .
అంకుల్ : ఆహ్వానించావా …… ? అయితే ok లవ్ యు బుజ్జితల్లీ …….
జాహ్నవి : డాడీ వెళ్లిపోయారు .
గుడ్ మై ఫ్రెండ్ ……..

మేడం వైపు మరింత ఆశతో దీనంగా చూస్తున్నాను .
Extraa half an hour కూడా పూర్తవ్వడంతో , దేవత ముసిముసినవ్వులు నవ్వుతూనే మొదటి స్టూడెంట్ దగ్గర నుండి మొదలెట్టి ఆన్సర్ షీట్స్ ను తీసుకుంటూ నాదగ్గరికివచ్చారు . ఇక బాధపెట్టడం ఇష్టం లేనట్లు , నాకోసం – నీ ఫ్రెండ్ కోసం ఏదైతో చేశావో హీరోయిజం లో పీక్స్ అంతే , లవ్ యు బుజ్జిహీరో …….. అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
దేవత చేతిస్పర్శకే బుజ్జి హృదయం ఆనందంతో పులకించిపోతోంది – దేవత నా దేవత నన్ను …… లవ్ లవ్ యు బుజ్జిహీరో అన్నారు సంతోషం పట్టలేక యాహూ అంటూ కేకవేశాను .
క్లాస్మేట్స్ అందరూ హడలిపోయి వెంటనే నావైపు చూస్తూ నవ్వుకున్నారు .
దేవత …… ష్ ష్ అంటూ నా బుగ్గపై గిల్లేసి మిగతా స్టూడెంట్స్ దగ్గరికివెళ్లి కలెక్ట్ చేసుకుంటున్నారు నవ్వుతూనే ……., బాయ్స్ ….. ఎప్పుడెప్పుడా అన్నట్లు బయటకువెళ్లిపోతున్నారు .

గర్ల్స్ అందరూ మా బెంచ్ చుట్టేసి , జాహ్నవీ జాహ్నవీ …… దెబ్బలేమీ తగల్లేదు కదా …….
జాహ్నవి : లేదు ఫ్రెండ్స్ , నీళ్లు మీదకు రాగానే భయమేసి ప్రక్కనే ఉన్న మట్టిపైపడ్డాను .
అంత వేగంగా నీళ్లపై పోనిచ్చినవాడు దొరకాలి అంటూ గర్ల్స్ అందరూ పిడికిళ్ళు బిగిస్తున్నారు .
అంతే అంతే ఫ్రెండ్స్ తగ్గేదే లే …… అంటూ నేనూ పిడికిలి బిగించడంతో …….
జాహ్నవితోపాటు గర్ల్స్ అందరూ నవ్వుకున్నారు .
గర్ల్స్ : రేయ్ మహేష్ …… ఇక ఇది exam రాయదు అనుకున్నాము , మ్యాజిక్ చేసేసావు తెలుసా సూపర్ సూపర్ ……..
మ్యాజిక్ ఏమిటి నా శీలం పోయింది తెలుసా …… ? , చూడొద్దు అని వేడుకున్నాను బ్రతిమాలుకున్నాను ప్రాధేయపడ్డాను ……. ఒక్కరు ఒక్కరైనా తలదించుకున్నారా ……. ? అంటూ షర్ట్ పై చేతులు చుట్టుకుని నవ్వుతున్నాను .
దేవత విన్నట్లు నవ్వుతున్నారు .
గర్ల్స్ : మరి సిక్స్ ప్యాక్స్ ను చూడకుండా ఉండలేకపోయామురా …… , మళ్లీ చూడాలని ఉంది చూయించు రా అంటూ ఏకంగా షర్ట్ బటన్స్ విప్పబోయి గిలిగింతలుపెట్టారు .
గిలిగింతలు గిలిగింతలు …… మేడం మేడం హెల్ప్ హెల్ప్ ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *