దేవత : గర్ల్స్ …….
థాంక్స్ మేడం ……..
దేవత : గర్ల్స్ …… ఎందుకు ఆగారు కంటిన్యూ , ఇది చెప్పడానికే పిలిచాను .
అమ్మో అయిపోయాను మేడం ….. ? అంతే బెంచ్ పైకి లేచి జంప్ చేస్తూ ఎవ్వరికీ దొరకకుండా అక్కడక్కడే తిరుగుతున్నాను . మేడం మేడం హెల్ప్ హెల్ప్ …….
దేవత : బుజ్జిహీరో మహేష్ ……. బెంచస్ జాగ్రత్త జాగ్రత్త …… , గర్ల్స్ ……
గర్ల్స్ : మహేష్ స్టాప్ స్టాప్ పడిపోతావు ఆగిపోతున్నాము అంటూ మేడం దగ్గరికి చేరారు .
హమ్మయ్యా …… అంటూ చివరి బెంచ్ లో కూర్చుని దేవత స్పృశించిన బుగ్గను తడుముకుంటూ ఫీల్ చెందుతున్నాను .
దేవత : గర్ల్స్ ……. మీ క్లాసుకు వెళ్ళండి .
గర్ల్స్ : yes మేడం …….
దేవత : హలో బుజ్జిహీరో గారూ ……. , నేను వీటిని సబ్మిట్ చెయ్యడానికి ఆఫీస్ రూమ్ కు వెళుతున్నాను , అలానే డ్రీమ్స్ లోనే ఉండు అంటూ నవ్వుకుంటూ బయటకు నడిచారు .
కమింగ్ కమింగ్ మేడం అంటూ వెనుకే ఫాలో అయ్యి ఆఫీస్ రూమ్ బయట వేచిచూస్తున్నాను .
మేడమ్స్ అందరూ తమ తమ ఇన్విజిలేషన్ నుండి ఆఫీస్ రూమ్ లోకి వెళుతూ …… , మహేష్ మహేష్ ……. హెడ్ మాస్టర్ కు తగిన గుణపాఠం చెప్పావు – మా తరుపున థాంక్యు థాంక్యూ అనిచెప్పారు .
అంటే ప్రతీ మేడం దగ్గరా మిస్ బిహేవ్ చేశాడన్నమాట , అంటే వాడికి కోటింగ్ మరింత ఇవ్వాల్సిందే ……..
అంతలో దేవత బయటకువచ్చి , బుజ్జిహీరో ……. ఇంకా హాఫ్ ఆన్ hour ఉండగానే లంచ్ బెల్ కొట్టబోతున్నారు , నాకేమో ఆఫీస్ రూంలో చాలా పని ఉంది , ఇక్కడే ఉంటావా …… ? లేక 3 గంటలుగా చూడని నీ అక్కయ్య దగ్గరికి వెళతావా …… ? .
అక్కడ అక్కయ్య – ఇక్కడ దేవత , అక్కడ అక్కయ్య – ఇక్కడ దేవత …….
ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు దేవత ……. , ఇద్దరమూ రెండు కళ్ళు కదూ బుజ్జిహీరో …….
అవును మేడం ……..
దేవత : ఇద్దరితో ఉండాలని ఉంది కదూ …….
అవును అవును …….
దేవత : ఎలా కుదురుతుంది అదిగో బెల్ కొట్టడానికి వెళుతున్నాడు ప్యూన్ …….
బయటకు – దేవతవైపు , బయటకు – దేవతవైపు …….. ఆశతో చూస్తున్నాను . ప్చ్ …….. ఇప్పుడెలా మేడం , నాకు ఇద్దరి దగ్గరా ఉండాలని ఉంది , ఏమిచెయ్యాలో అర్థం కావడం లేదు అని తలదించుకున్నాను .
లంచ్ బెల్ కాదు ఏకంగా లాంగ్ బెల్ …….. , మైకులో ……. exams కాబట్టి హాఫ్ డే – ఇంటికివెళ్లి రేపటి exam కు చదువుకోండి అని అనౌన్స్మెంట్ జరిగింది .
స్టడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేస్తూ ఏకంగా బ్యాగ్స్ తో బయటకు పరుగులుతీస్తున్నారు .
దేవతవైపు ఆశతో చూసాను .
దేవత : yes yes బుజ్జిహీరో ……. , నీవల్లనే నీ హీరోయిజం వల్లనే – ప్రతీ క్లాస్ లో స్టూడెంట్స్ ఆ ఇన్సిడెంట్ గురించే చర్చించుకుంటున్నారని తెలిసి మేనేజ్మెంట్ కు విషయం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు – హాఫ్ డే లీవ్ ఇచ్చేసారు – ఇద్దరమూ కలిసే కృతి శెట్టి దగ్గరకు వెళుతున్నాము .
Really యాహూ యాహూ …….
దేవత : చాలు చాలు బుజ్జిహీరో ……. , ఆ ఇన్సిడెంట్ తో నువ్వు లేకుండా నేనైతే ఒంటరిగా ఉండలేను , లోపల 5 మినిట్స్ పని ఉంది వచ్చేస్తాను వెళదాము .
అంతలోపు నా ఫ్రెండ్స్ ను పంపించి వస్తాను మేడం …….
దేవత : ఓ బాడీగార్డ్ కదా ok ok 5 మినిట్స్ అంతే ……..
దేవత లోపలికి వెళ్లగానే బయటకు పరుగుతీసాను .
వినయ్ : మహేష్ వచ్చావా ….. ? ఎక్కు కారులో వెళదాము .
ధడా అంది ……. , ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను .
గోవర్ధన్ : లేదు లేదు ఈరోజుతో మనం ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము , రేయ్ మురళీ చెప్పురా …….
మురళి : రేయ్ మహేష్ ఎక్కు ……..
ఏంటి కథ అడ్డం తిరిగింది . పెద్దమ్మను తలుచుకోవాల్సిందే ……. లేకపోతే దేవత – అక్కయ్యను వదిలి నేను వెల్లనంటే వెళ్లను .
మహేష్ మహేష్ …….
వెనక్కు చూస్తే జాహ్నవి ……. , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …… చూశారుకదా మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను కదా …….
వినయ్ : Ok ok డ్రైవర్ పోనివ్వు …….
అన్నా …… జాగ్రత్తగా తీసుకెళ్లండి రైట్ రైట్ అంటూ పంపించి , పరుగున జాహ్నవి దగ్గరకు వెళ్లి పిలిచినందుకు థాంక్యూ థాంక్యూ అనిచెప్పాను . అంకుల్ ……. మీరింకా వెళ్లలేదా ….. ? .
అంకుల్ : నేనే స్వయంగా ఆహ్వానిద్దామని సగం దూరం వెళ్లి వెనక్కువచ్చాను బాబోయ్ …….
ఆహ్వానమా …… ? .
జాహ్నవి : రేయ్ డిన్నర్ గురించి చెప్పానుకదా ……
పర్లేదు పర్లేదు అంకుల్ , వచ్చినదే మంచిది అయ్యింది జాహ్నవిని పిలుచుకుని వెళ్ళవచ్చు …….
అంకుల్ : ప్లీజ్ బాబూ …… , నువ్వు రాకపోతే నీ ఫ్రెండ్ ఇంట్లో రచ్చ చేసేస్తుంది .
అదికాదు అంకుల్ exams ఉన్నాయి కదా ……
అంకుల్ : exams తరువాత రా బాబూ …… , ఇల్లు ఎక్కడో చెప్పు నేనే వచ్చి తీసుకెళతాను .
నో నో నో exams కూడా కాదు అంకుల్ , నాకిష్టమైన వారిని వదిలి ఎక్కడికీ రాలేను .
అంకుల్ : ఇల్లు ఎక్కడో చెప్పు బాబూ …… , నీకిష్టమైన వారందరినీ సంతోషంగా ఆహ్వానిస్తాను .
అయితే ok అంకుల్ …… exams తరువాత అడ్రస్ చెబుతాను . దగ్గరలోనే అదిగో ఆ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లోనే ఇల్లు ……
అంకుల్ : థాంక్స్ బాబూ – బుజ్జితల్లీ హ్యాపీ కదా అంటూ మళ్లీ కౌగిలించుకున్నారు .
అంకుల్ …… ఇప్పుడుకూడా చాలాసేపు కౌగిలించుకుంటారా ….. ?
జాహ్నవి : నా నడుముపై గిల్లేసింది .
స్స్స్ …… అంటూ అధిరిపడ్డాను .
అంకుల్ : బాబూ ఏమైంది ? .
స్స్స్ …… ఏమీలేదు ఏమీలేదు అంకుల్ మీరు వెళ్ళండి .
జాహ్నవి : బై మహేష్ అంటూ నవ్వుకుంటూ బైక్ ఎక్కి వెళ్లిపోయారు .
స్స్స్ స్స్స్ …… గట్టిగా గిల్లేసింది అని రుద్దుకుంటూ దేవత దగ్గరికి వెళ్లబోతే …….
దేవతే వచ్చేసినట్లు , నొప్పివేస్తోందా బుజ్జిహీరో అంటూ నవ్వుకుంటున్నారు . అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ దేవతతోపాటు వచ్చినట్లు విక్రమ్ – చెల్లెళ్లు చుట్టూ చేరారు . విక్రమ్ చెప్పాడు …… బట్టలన్నీ విప్పేసి మంచిపని చేశారట – ఫ్రెండ్స్ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు , తెలుసుకునేలోపు లాంగ్ బెల్ కొట్టేశారు .
దేవత : మీ అన్నయ్య హీరోయిజం చూయించి బిల్డప్ ఇచ్చాడు పిల్లలూ ….. , రండి వెళుతూ చెబుతాను .
బిల్డప్ …… ? అనుకుని వెనుకే నడిచాను .
ఇంటికి చేరుకుని అక్కయ్యా …… 8 మార్క్స్ ప్రాబ్లమ్ వచ్చింది అంటూ సంతోషంతో పైకెత్తబోయి వీలుకాక ఆగిపోయాను .
అక్కయ్య నవ్వుకుని , అయితే ముద్దుపెట్టు తమ్ముడూ …….
పిల్లలు నవ్వుకుని , అక్కయ్యా …… అన్నయ్య ఏమిచేశాడో తెలిస్తే మీరే పైకెత్తేస్తారేమో ……..
Wow ……. మసాలా ఘుమఘుమలు అధిరిపోతున్నాయి , ఎవరికోసమో ఏమిటో …….. అంటూ పెదాలను తడుముకున్నాను .
ఇంకెవరి కోసం నా చిట్టితల్లి – బుజ్జిహీరో – బుజ్జితల్లి – పిల్లలకోసం బిరియానీ అంటూ చేతిలో గరిటె తో బామ్మలిద్దరూ బయటకువచ్చారు .
బామ్మా …….
దేవత : బామ్మా …… ఎప్పుడొచ్చావు ? – ఇందుకేనా లంచ్ రెడీ చెయ్యలేదు , wow బిరియానీ …….
పిల్లలు : మాకోసం కూడా అన్నమాట థాంక్స్ బామ్మా …….
బామ్మ : మీ మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు పిల్లలూ – అందరమూ కలిసి తిందాము .
అక్కయ్య : తమ్ముడూ – పిల్లలూ …… exam ఎలా రాశారు అంటూ సోఫాలో కూర్చోబెట్టుకుంది .
సూపర్ – సూపర్ అంటూ అందరమూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : హ హ హ లవ్ యు పిల్లలూ – లవ్ యు తమ్ముడూ …… అంటూ ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
దేవత : పో చెల్లీ …… , ముద్దులన్నీ బుజ్జిహీరోకే అంటూ వంట గదివైపు నడిచారు .
అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా …… అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి లేచివెళ్లి దేవతచేతిని చుట్టేసి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు . మా అక్కయ్య ఇన్విజిలేషన్ చేస్తేనే All the best చెబితేనే కదా వీరంతా exam బాగా రాయగలిగింది …….
అవునవును మేడం – అక్కయ్య All the best చెప్పడం వల్లనే బాగా రాసాము .
అక్కయ్య : కాబట్టి మా అక్కయ్యకే ఎక్కువ ముద్దులు అంటూ ముద్దులవర్షం కురిపించారు .
దేవత : లవ్ యు చెల్లీ …… , చూశావా బుజ్జిహీరో నాకే ఎక్కువ ముద్దులు ……
ఆఅహ్హ్ …… చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది .
అక్కయ్యా ……. ఫస్ట్ టైం మేడం గారు ఈరోజు నాకు రెండు ముద్దులుపెట్టారు అంటూ బుగ్గలను స్పృశిస్తున్నాను ఫీల్ అవుతూ …….
అక్కయ్య : నిజమా అక్కయ్యా ……. ? .
దేవత : మన బుజ్జిహీరో చేసినదానికి రెండు ముద్దులేమిటి 100 ముద్దులైనా పెట్టొచ్చు .
వందనా …… అంటూ సోఫా నుండి జారి కిందకుపడిపోయాను .
నవ్వులే నవ్వులు ……..
అక్కయ్య : ఏమిచేశాడు అక్కయ్యా – పిల్లలూ …… ఏదో చెప్పబోతున్నారు అదేనా …… ? .
పిల్లలు : అవును అక్కయ్యా …… అంటూ వివరించారు .
అంతే దేవత బుగ్గపై ముద్దుపెట్టి వచ్చి నా ప్రక్కన చేరి , మా అక్కయ్యకు sorry చెప్పించావన్నమాట మంచి పనిచేశావు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……..
దేవత : చాలు చాలు చెల్లీ …… నా ముద్దులు దాటిపోయాయి , ఆపవులే నాకు తెలుసు , నేను వెళ్లి బిరియానీ వండుతానులే అని బుంగమూతితో వెళ్లారు .
అందరమూ నవ్వుకున్నాము .
1:30 కు బిరియానీ రెడీ అంటూ బామ్మలు – దేవత చెప్పారు .
యాహూ అంటూ అందరమూ కేకలువేశాము .
బామ్మ : బుజ్జితల్లీ ….. వెళ్లి మేడం వాళ్లను పిలుచుకురా …….
పిల్లలు : మమ్మీ దగ్గరికా మేమూ వస్తాము మేడం ……
దేవత : బుజ్జిహీరో …… ఇప్పుడు చెప్పు , మాతోపాటు వస్తావా ? , మీ అక్కయ్య దగ్గరే ఉంటావా …… ? .
అటూ ఇటూ ఇద్దరివైపూ ప్రాణంలా చూస్తున్నాను .
బామ్మ : అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఏమిచెబుతాడు పాపం బుజ్జిహీరో ……..
అక్కయ్య : తమ్ముడూ …… అక్కయ్య వెంట తొడుగావెళ్లు .
దేవత : లవ్ యు చెల్లీ …… , వద్దులే బుజ్జిహీరో …… మూడు గంటలపాటు అక్కయ్యకు దూరంగా ఉన్నావు కదా ఇక్కడే ఉండు , ప్రక్కనే కదా ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము .
చెల్లెళ్ళూ …… జాగ్రత్త .
దేవత : హలో బుజ్జిహీరోగారూ …… ఇది సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ అని నవ్వుకుంటూ వెళ్లారు .
మొదట వైష్ణవి ఇంటికివెళ్లి అప్పుడే డ్యూటీ నుండి వచ్చిన లేడీ సెక్యూరిటీ అధికారి ను మరియు SI సర్ మేడం ఇంటికివెళ్లి ఏకంగా మేడమ్స్ ను పిలుచుకునివచ్చారు .
తమ్ముడూ క్వశ్చన్ పేపర్ ఏదీ అంటూ అందుకుని 2మార్క్స్ – 4 మార్క్స్ చివరికి 8 మార్క్స్ questions కూడా గాల్లో సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పేస్తున్నారు .
నేను షాక్ లో నోరుతెరిచి అలా చూస్తుండటం , గుమ్మం దగ్గరే చూసి నవ్వుకున్నారు అందరూ ……..
అన్నయ్యా అన్నయ్యా …… ఏమైంది ఏమైంది ? .
చెల్లెళ్ళూ …… నేను గంటన్నర కష్టపడి రాసిన exam ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరు అలా వెళ్లి ఇలా వచ్చేసరికి ఆన్సర్స్ చెప్పేసారు – మా అక్కయ్య toooo టాలెంటెడ్ అన్నమాట …….
పిల్లలు : wow …….
డబల్ wow చెల్లెళ్ళూ ……. , ఈ షాక్ నుండి కోలుకోవాలి అంటే వెంటనే బిరియానీ తినాల్సిందే అంటూ అక్కయ్య – చెల్లి చేతులను అందుకుని డైనింగ్ టేబుల్ మీదకు చేరాము .
బామ్మలు : మేడమ్స్ రండి కూర్చోండి .
మేడమ్స్ : అందరమూ కూర్చుందాము కలిసి తిందాము అని బిరియానీ పాత్రను డైనింగ్ టేబుల్ మధ్యలోకి చేర్చి వడ్డించారు .
పిల్లలతోపాటు తిని ఒకేసారి మ్మ్మ్ మ్మ్మ్….. సూపర్ సూపర్ లవ్ యు బామ్మలూ ……..
బామ్మలు : సగం వంట మీ మేడం …….
మేడమ్స్ : అవంతికా …… సూపర్ .
అందుకేనా ఇంత రుచిగా ఉంది సూపర్ సూపర్ మేడం …… అంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా తింటున్నాను .
అక్కయ్య – దేవత : నవ్వుతూనే నెమ్మది నెమ్మది , బుజ్జిహీరో ……. మొత్తం బామ్మలే చేశారు .
ఎవరు వండితే వారికి బోలెడన్ని లవ్ యు లు ……. అంటూ లెగ్ పీసస్ లాగేస్తూ నవ్వుకుంటూ తిన్నాము .
ఫుల్ గా తిన్నాము అంటూ సంతృప్తిగా సోఫాలోకి చేరాను . అక్కయ్యా ……. ఆఫ్టర్నూన్ కాలేజ్ లేదు నెక్స్ట్ exam సైన్స్ మా అక్కయ్యతోపాటే కూర్చుని చదువుకుంటాను .
అక్కయ్య : కాలేజ్ లేదా …. ? , ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… తినగానే వెళ్లిపోతారని అనుకున్నాను .
దేవత : అందుకేనా ఈ తియ్యనైన బాధ అంటూ అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టారు .
పిల్లలు : మమ్మీ మమ్మీ …… మీరు వెళ్లాలనుకుంటే వెళ్ళండి , మేము అన్నయ్య – అక్కయ్యతోపాటే చదువుకుంటాము .
SI సర్ మేడం : మీ డాడీ ఇంకా రాలేదు – ఒంటరిగా బోర్ …… నేనూ ఇక్కడే ఉంటాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : నాకు డ్యూటీ ఉంది మీ ఇష్టం ఇక్కడే చదువుకోండి అని ముద్దులుపెట్టి వెళ్లారు .
దేవత : మేము మాట్లాడుకుంటూ – టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాము , మీ అక్కయ్యతోపాటు గదిలోకివెళ్లి చదువుకోండి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకండి .
అర్థం కానట్లు చూసాము అందరమూ …….
దేవత – మేడం నవ్వుకున్నారు . నీ గదిలోకి తీసుకెళ్లు చెల్లీ …….
అక్కయ్యతోపాటు వెళ్లి బెడ్ పై చుట్టూ కూర్చుని అక్కయ్య ముద్దులు ఆస్వాదిస్తూ సాయంత్రం వరకూ చదువుకున్నాము .
