పెద్దమ్మ Part 24

అక్కయ్యా – దేవతా …… భక్తితో తొలి టెంకాయ – చివరి టెంకాయలను మీరు కొడితే చాలు మొక్కు తీరినట్లే అంటూ అందించాను .
అక్కయ్య : అమ్మా …… వీలైనంత తొందరగా ” అక్కయ్య దేవతను – తమ్ముడు బుజ్జిదేవుడిని ” కలిసేలా చెయ్యండి అంటూ దేవత బుగ్గపై – నా నుదుటిపై ముద్దుపెట్టారు .
దేవత : లవ్ యు సో మచ్ చెల్లీ ఉమ్మా …… , కానీ ఈ అల్లరి పిల్లాడికి ఎందుకు ముద్దుపెట్టినట్లు ……
బామ్మ : ఇప్పటికీ అర్థం చేసుకోలేదు – నిజంగా చదివే మేడం వు అయ్యావా లేక కాపీ కొట్టి అయ్యావా బుజ్జితల్లీ ….. నాకు డౌట్ వస్తోంది .
దేవత : బామ్మా ……..
అందరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు .
దేవత : బుజ్జిహీరో నవ్వావో దెబ్బలుపడతాయి .
లవ్ టు మేడం అంతకంటే అదృష్టమా అంటూ చేతులుకట్టుకుని దేవత ముందుకువెళ్ళాను .
దేవత : నో నో నో డిస్టన్స్ డిస్టన్స్ అంటూ వెనక్కువెళ్లారు .
మిస్సెస్ కమిషనర్ : ఏమైంది చెల్లీ …… బుజ్జిహీరోని నీ ఫేవరేట్ అల్లరిపిల్లాడిని దూరంగా పెడుతున్నావు .
దేవత : ముందు మొక్కు మొక్కు కమాన్ కమాన్ చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ అంటూ అమ్మవారికి మొక్కుకుని అక్కయ్యతోపాటు కొట్టారు .

తమ్ముడూ – చెల్లెళ్ళూ ….. లెట్స్ బిగిన్ అంటూ అమ్మవారికి మొక్కుకుని ఉత్సాహంగా కొడుతున్నాము .
తమ్ముడూ – చెల్లెళ్ళూ …… మేముకూడా అంటూ అక్కయ్య , దేవతతోపాటువచ్చి చిరునవ్వులు చిందిస్తూ కొడుతున్నారు , మేమేమైనా తక్కువనా అంటూ బామ్మలు – మిస్సెస్ కమిషనర్ ….. రాజేశ్వరి – మల్లీశ్వరీలతోపాటు జాయిన్ అవ్వడంతో నిమిషంలో ఖాళీ అయిపోయాయి .
చివరి రెండు టెంకాయలను అక్కయ్య – దేవతకు అందించి కొట్టడంతో మొక్కు పూర్తయ్యింది .
దేవత : చెల్లీ …… ఇప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉందో తెలుసా – బుజ్జిదేవుడిని త్వరలోనే కలువబోతున్నాము అని నమ్మకం కుదిరింది – ఈ సంతోషం నీవల్లనే లవ్ యు లవ్ యు అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .

మాతోపాటు చుట్టూ వాళ్ళ వాళ్ళ మొక్కు తీర్చుకుంటున్న భక్తులు …… ఈరోజు ఇలా గుడికివచ్చి మొక్కు తీర్చుకుంటున్నాము అంటే కేవలం కేవలం ఆ పిల్లాడు మహేష్ వల్లనే లేకపోతే మొక్కుతీర్చుకోవడానికి ఇంకెన్ని రోజులు వారాలు నెలలు పట్టేదో – మా ఆయన అయితే భయంతో బయటకు అడుగేపెట్టనివ్వలేదు తెలుసా అంటూ మాట్లాడుకుంటున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ ప్చ్ ……..
నవ్వులే నవ్వులు …….
దేవత : మొక్కు పూర్తయ్యిందికదా పదండి అంటూ నావైపు రుసరుసలాడుతూ చూస్తూ అమ్మవారి దర్శనం క్యూ లోకి లాక్కెళ్లారు .

మేడం మేడం …… మీరు క్యూ లో నిలబడటం ఏమిటి ? – నేను ఈ గుడి ధర్మకర్తను – రండి నేరుగా దర్శనానికి తీసుకెళతాను అంటూ మిస్సెస్ కమిషనర్ ను ఆహ్వానించారు .
మిస్సెస్ కమిషనర్ పట్టరాని ఆనందంతో లవ్ యు శ్రీవారూ అంటూ తలుచుకుని , పర్లేదు పర్లేదు గుడిలో అందరూ భక్తులమే – అందరితోపాటే మేమూ …….
ధర్మకర్త : చాలా చాలా సంతోషం మేడం – మహేష్ ……. బాబూ నువ్వే కదా మహేష్ …….
చెల్లెళ్లు : అవును మహేష్ అన్నయ్యే …… , మీరు ఎవరు ఆనుకుంటున్నారో ఆ మహేషే ……. , ఇంతమంది భక్తులతోపాటు సిటీ మొత్తం హడావిడిగా మారిందంటే కారణం మా అన్నయ్యే అంటూ సంతోషంతో బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ధర్మకర్త : బాబూ మహేష్ అవునవును నీవల్లనే సిటీతోపాటు గుళ్లు ఇలా భక్తులతో కళకళలాడుతున్నాయి – ఎంత ధైర్యాన్ని ఇచ్చావు మా అందరికీ …… రేయ్ రేయ్ ఎవరొచ్చారో చూడండి – బాబూ మహేష్ …… నువ్వు క్యూలో రావడం ఏమిటి ……
మహేష్ మహేష్ పిల్లాడు మహేష్ పిల్లాడు మహేష్ అంటూ భక్తులంతా చుట్టూ చేరి అవునవును టీవీలో కనిపించిన మహేష్ పిల్లాడు మహేష్ అంటూ ఆనందిస్తున్నారు – మహేష్ …… మేము wait చేస్తాము క్యూ లో ముందుకు వెళ్లు ……
మిస్సెస్ కమిషనర్ గారు చెప్పినట్లు అమ్మవారి సమక్షంలో భక్తులందరూ ఒక్కటే – నావలన ఎవ్వరూ ఇబ్బందిపడటం నాకిష్టం లేదు – క్యూ లో నిలబడండి .
మహేష్ మహేష్ నినాదాలతో క్యూలో నిలబడి మావైపుకు చూస్తూనే ముందుకువెళుతున్నారు – కొంతమంది అయితే మహేష్ మహేష్ సెల్ఫీ అంటూ తీసుకుంటున్నారు – మా ప్రక్కనే ధర్మకర్త గర్భగుడివరకూ వచ్చి పూజారిగారికి విషయం చెప్పి ఘనంగా పూజ జరిపించమన్నారు .
పూజారిగారు : ఇంతమందికి ధైర్యాన్ని ఇచ్చావంటే నువ్వు ఆ అమ్మవారి అనుగ్రహమే బాబూ ……. , అమ్మవారి కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది .
నాపైకాదు పూజారిగారూ ……. మేడం – అక్కయ్య – చెల్లెళ్లపై ఉండేలా పూజ జరిపించండి , వారి సంతోషమే నా సంతోషం ……
లవ్ యు అన్నయ్యా – లవ్ యు తమ్ముడూ …… అంటూ చెల్లెళ్లు – అక్కయ్య ఆనందిస్తున్నారు .
దేవత : బుజ్జిహీరో …… నీ మాటలతో కోపాన్నంతా మాయం చేసేసావు , అల్లరి చేస్తావు – ఇలా ఆనందాన్నీ పంచుతావు , కొంపదీసి ఇక్కడే డాన్స్ చెయ్యకు ……
చెల్లెళ్లు : పూజారిగారు చెప్పారుకదా అక్కయ్యా …… , అన్నయ్య …… అమ్మవారి అనుగ్రహం అని ……
దేవత : మీ అన్నయ్య కాదు మన బుజ్జిదేవుడు …….
చెల్లెళ్లు : లవ్ యు దేవతా ……
అమ్మవారిని భక్తితో మొక్కుకుని హారతి తీర్థ అందుకుని గుడి ఆవరణలో కాసేపు కూర్చుని ప్రసాదం స్వీకరించి మనసు ఉల్లాసంగా ఇంటికి చేరుకున్నాము .

అమ్మో 8:30 అవుతోంది – పిల్లలకు ఆకలివేస్తోందేమో అంటూ బామ్మలు – మిస్సెస్ కమిషనర్ హడావిడిగా లోపలికివెళ్లారు .
బామ్మలూ …… మేమూ హెల్ప్ చేస్తాము ఉండండి .
మిస్సెస్ కమిషనర్ : అవసరం లేదు లోపలికివచ్చి హ్యాపీగా టీవీ ఎంజాయ్ చెయ్యండి – నువ్వు వస్తే నీ చెల్లి కూడా వస్తుంది .
అక్కయ్య : అక్కయ్యా …… నువ్వు , నీ బుజ్జిచెల్లెళ్ళు – బుజ్జిహీరోతో టీవీ ఎంజాయ్ చెయ్యి …….
మిస్సెస్ కమిషనర్ : నువ్వు …… వంటలో సహాయం చేస్తావా ? ( అవునవును అక్కయ్యా ) దెబ్బలుపడతాయి వంట గదివైపు వచ్చారంటేనూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లారు .

దేవత – అక్కయ్య …… ప్చ్ ప్చ్ అనుకుని నవ్వుకున్నారు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… మీ అన్నయ్య బుజ్జిహీరోని పొగిడినప్పుడూ నాకు ముద్దులిస్తారు – బుజ్జిహీరోపై కోప్పడి బుజ్జిదేవుడిని పొగిడినప్పుడూ ముద్దులిస్తారు ……. ఎందుకలా నాకు అర్థం కావడం లేదు .
చెల్లెళ్లు : మాకు ఇద్దరు అన్నయ్యలూ ఒక్కటే అదే అదే సమానం కాబట్టి దేవతా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . అవును దేవతా ….. గుడిలో అందరూ అన్నయ్యను పొగుడుతుంటే మీకెలా అనిపించింది .
దేవత : తెలిసే అడుగుతున్నారు కదూ …… మిమ్మల్నీ అంటూ పరిగెత్తిస్తూ లోపలికివెళ్లారు .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని అందుకుని , అక్కయ్యలూ …… థాంక్స్ ఇప్పటివరకూ ఉన్నందుకు – ఇక మీరు ఇంటికివెళ్లి రేపు కాలేజ్ సమయానికి వచ్చెయ్యండి అని పంపించారు – నా ముద్దుల తమ్ముడు రియల్ హీరో అంటూ ముద్దులుపెట్టి లోపలిపిలుచుకునివెళ్లారు .

దేవత …… చెల్లెళ్లను పట్టుకుని ముద్దులతో పనిష్మెంట్ ఇచ్చి సోఫాలోకి చేరడం చూసి ఆనందించాము .
అక్కయ్య : తమ్ముడూ – చెల్లెళ్ళూ …… ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అంటూ కూర్చోబెట్టి , లోపల ఫ్రిడ్జ్ లోనుండి 1 లీటర్ ఐస్ క్రీమ్ బాక్స్ – స్పూన్స్ తీసుకొచ్చి టీపాయ్ పై ఉంచారు .
లవ్ యు అక్కయ్యా అంటూ టీవీ ఆన్ చేయడంతో మూవీ చూస్తూ ఐస్ క్రీమ్ తిన్నాము .
అక్కయ్య స్పూన్ తో తినిపించి , నా పెదాలపై అంటుకున్న ఐస్ క్రీమ్ యూ వేలితో అందుకుని టేస్ట్ చేసి మ్మ్మ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు . తమ్ముడూ తమ్ముడూ …… రెండవ చిలిపి సరసం – దేవత పెదాలపై అంటుకున్న ఐస్ క్రీమ్ or anything నాలా టేస్ట్ చెయ్యాలి , ఇది నా – పెద్దమ్మ రెండవ కోరిక …….
మొదటి కోరిక తీర్చడానికే బెదిరిపోతున్నాను ఇంకనూ తీర్చనేలేదు అంతలోనే రెండవ కోరికనా అక్కయ్యా …….
అక్కయ్య : అవన్నీ నాకు తెలియదు రేపు రెండు కోరికలనూ తీర్చాల్సిందే తీర్చాల్సిందే …… అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ఏమైంది ? .
అక్కయ్య : చూడండి చెల్లెళ్ళూ ….. మీ అన్నయ్య , నా చిన్న చిన్నకోరికలు తీర్చమంటే ఆలస్యం చేస్తున్నాడు .
దేవత : చెల్లీ నువ్వు కోరడమూ – నీ తమ్ముడు ఆలస్యం చేసి నిన్ను బాధపెట్టడమూనా ? , నెవర్ నెవర్ అలా జరగనే జరగదు కదా …… , బహుశా ఆ కోరికల వలన మరొకరు ఇబ్బందిపడతారేమోనని ఆలోచిస్తున్నాడేమో చెల్లీ …….
అవునవును అన్నట్లు తలఊపాను ……
దేవత : అక్కయ్యకోసం ఏమైనా చేస్తావనుకున్నానే – అంటే అవన్నీ అపద్ధాలే అన్నమాట – నేనైతే …… నా ప్రాణమైన చెల్లికోసం ఏమైనా చేస్తాను – మరొకరు ఇబ్బందిపడినా పర్లేదు , కావాలంటే దాని పర్యవసానాలు పనిష్మెంట్స్ నేను అనుభవిస్తాను thats it ……
అంతేనా దేవతా …….
దేవత : అంతే బుజ్జిహీరో …… తప్పేలేదు .
అక్కయ్యా …… డన్ డన్ ……
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ – అక్కయ్యా …… క్రెడిట్ మొత్తం మీకే చెందాలి లవ్ యు లవ్ యు ……
దేవత : వెల్కమ్ చెల్లీ …….
అక్కయ్య : Ok నా తమ్ముడూ …….
డబల్ ok అక్కయ్యా అంటూ ఏమనిపించిందో ఏమో అక్కయ్య పెదాలపై అంటుకున్న ఐస్ క్రీమ్ ను ఏకంగా నా నాలుకతో జుర్రుకుని మ్మ్మ్ మ్మ్మ్ …… సో సో టేస్టీ అంటూ లొట్టలేస్తున్నాను .
అక్కయ్యకు మళ్లీ స్వీట్ ఫీవర్ వచ్చేసినట్లు స్వీట్ షాక్ లో జలదరిస్తున్నారు .

అక్కయ్యా …… మొత్తం మేమే తినేస్తున్నాము అన్నయ్యకు తినిపించండి – అన్నయ్యా ….. ఆ ఆ అంటూ తినిపించారు చెల్లెళ్లు .
అక్కయ్య తేరుకుని అందమైన నవ్వులతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రేమతో కొరికేసి పరుగున వంట గదిలోకి వెళ్లిపోయారు .
స్స్స్ …….
అక్కయ్య కొరికేసిందా …… నొప్పి వేస్తోందా అన్నయ్యా ….. ఉండండి మందు రాస్తాము అని ముద్దులుపెట్టి తినిపించారు .

అక్కయ్య పరుగున వంట గదిలోకివెళ్లి , అటువైపుకు తిరిగి వంటచేస్తున్న బామ్మను వెనుక నుండి గట్టిగా కౌగిలించుకున్నారు , బామ్మ బుగ్గపై ముద్దులుపెడుతున్నారు .
బామ్మ : అమ్మో ….. స్టవ్ నుండి కాకుండా వెనకనుండి వేడిసెగలు ఎక్కువ తాకుతున్నాయి అంటే నీ తమ్ముడు మళ్లీ జ్వరం తెప్పించాడన్నమాట ……
మిస్సెస్ కమిషనర్ : అన్నమాట కాదు బామ్మలూ ఉన్నమాటే ఈ చెమటలు చూస్తే తెలియడం లేదూ ……. , ఎలా ఎలా ఎక్కడ ముద్దుపెట్టాడు చెల్లీ చెప్పవా చెప్పవా …… ? .
అక్కయ్య : పో అ…..క్క….య్యా సిగ్గే….స్తోంది .
మిస్సెస్ కమిషనర్ : నువ్వు ఈ సిగ్గు పడాలన్నదే కదా చెల్లీ మా తాపత్రయం – సరే సరే డిస్టర్బ్ చెయ్యనులే నీ తమ్ముడు అందించిన తియ్యనైన జ్వరాన్ని తనివితీరా ఎంజాయ్ చెయ్యి – కానీ నెక్స్ట్ టైం మాత్రం బామ్మను కాకుండా నన్ను హత్తుకోవాలి సరేనా …….
వంటగదిలో సంతోషమైన నవ్వులు …….
బామ్మ : చిట్టితల్లీ …… కొద్దిసేపట్లో వంట పూర్తవుతుంది – అంతవరకూ ఇలా నీ తమ్ముడిని హత్తుకో వెళ్లు తల్లీ వెళ్లు …… , నీ తమ్ముడు నీ సొంతం ముందూ వెనుకా ఏమీ ఆలోచించకు – నీ మనసు ఏమి కోరుకుంటుందో అది చెయ్యి సరేనా …….
అక్కయ్య : లవ్ యు బామ్మలూ – అక్కయ్యా అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవచ్చి కూర్చుని నన్ను చుట్టేశారు .

అక్కయ్యా …… ఎక్కడికి వెళ్లారు అంటూ ఐస్ క్రీమ్ తినిపించాను .
అక్కయ్య : తమ్ముడూ …… నా చేతులు ఖాళీగా లేవు నువ్వే తినిపించాలి – ముందు నువ్వు …..
లవ్ టు లవ్ టు అక్కయ్యా …… , ముందు మా అక్కయ్యకు – అక్కయ్యా ….. నాకు , చెల్లెళ్లు తినిపిస్తున్నారులే ……. దేవతకు తినిపించిన స్పూన్ తోనే ….. అంటూ కన్ను కొట్టాను .
అక్కయ్య : ప్చ్ ప్చ్ ప్చ్ ……
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… నిజమా ? .
చెల్లెళ్లు : అంతేకదా దేవతా …….
దేవత : నో నో నో ……. , ప్చ్ ప్చ్ …… నేను , నా బుజ్జిదేవుడితో తీర్చుకోవాలనుకున్న కోరికలన్నింటినీ ఈ బుజ్జిహీరో దోచేస్తున్నాడు అంటూ కోపంతో కొట్టబోయి నో నో నో పడుకునేంతవరకూ డిస్టన్స్ డిస్టన్స్ ……..
అందుకే కోపం తెప్పించాను మేడం – పడుకునేంతవరకూ నేనేమిచేసినా మీరేమీ చెయ్యలేరుకదా …….
దేవత : ఈ అల్లరి పిల్లాడికి అన్నీ అనుకూలంగా మారిపోతాయి అదేంటో అర్థం కాదు – బామ్మలూ …… వంట అయ్యిందా ? .
మేమంతా నవ్వుకుంటున్నాము .
15 మినిట్స్ తల్లులూ …….. , హాసినీ …… మీ డాడీ కి కాల్ చెయ్యి .

హాసిని …… నా జేబులోని మొబైల్ అందుకుని , విశ్వ సర్ కు కాల్ చేసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *