ఆడిటోరియం వైపుకు టర్న్ అవ్వగానే , మేనేజ్మెంట్ మేడమ్స్ స్వయంగా ఆడిటోరియం వరకూ పిలుచుకునివెళ్లారు – వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతులేకుండా ఉంది – ఆడిటోరియం వరకూ వారి మొబైల్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి .
మేనేజ్మెంట్ : అవంతికా …… నిన్న సాయంత్రం నుండీ ప్రశంసలు ఆగడమే లేదంటే నమ్ము – ఇలా నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలని చెప్పలేదు sorry ……
అక్కయ్య : నో నో నో మేడమ్స్ …… , అక్కయ్య likes it ……
మేనేజ్మెంట్ : Sorry sorry you are ……
దేవత : మై లవ్లీ సిస్టర్ కావ్య మేడమ్స్ ……
మా అక్కయ్య కూడా మేడమ్స్ ……
మేనేజ్మెంట్ : Ok ok స్టూడెంట్స్ – లవ్లీ & బ్యూటిఫుల్ – నైస్ టు మీట్ యు కావ్యా ….. , సన్మానం తరువాత మనమంతా కలిసి మాట్లాడుకుందాము .
అక్కయ్య : నైస్ టు మీట్ యు మేడమ్స్ – you క్యారి ఆన్ ……
మేనేజ్మెంట్ : థాంక్యూ కావ్యా , ఆడిటోరియం లోపలికి పిలుచుకునివెళ్లారు .
టీచర్స్ – స్టూడెంట్స్ అందరూ లేచి చప్పట్లతో స్వాగతం పలికారు . అవంతికా – కావ్యా …… Please have a seat అంటూ ఆడిటోరియం ముందు వరుసలో ఉన్న VIP సోఫాలలో కూర్చోబెట్టారు .
దేవత – అక్కయ్య : చెల్లెళ్ళూ ….. అంటూ ఇద్దరి మధ్యలో మరియు ఒడిలో కూర్చోబెట్టుకున్నారు .
చెల్లెళ్లు – అక్కయ్య : అన్నయ్యా – తమ్ముళ్లూ …… , అన్నయ్యా ….. సోఫాలన్నీ ఉల్ మాపై కూర్చోండి .
దేవత : మహేష్ – విక్రమ్ …… కూర్చోండి .
చెల్లెళ్ళూ – అక్కయ్యా – దేవతా …… వెనుకకువెళ్లి ఫ్రెండ్స్ తోపాటు కేకలువేస్తూ ఎంజాయ్ చెయ్యాలికదా …….
మేనేజ్మెంట్ మేడం : నో నో నో ఈ ఫంక్షన్ లో అయితే కాదు – మీ మేడం ఎంత స్పెషల్ నో మీరూ అంతే స్పెషల్ అంటూ డోర్ వైపు సైగలుచేశారు .
అంతే కాలేజ్ స్టాఫ్ మరొక సోఫా తీసుకొచ్చి దేవత సోఫా ముందు వేశారు .
మేనేజ్మెంట్ మేడం : సిటీ హీరో కూర్చో …….
మేడమ్స్ ……. మేడం ముందు – మేడం ….. మీరు ముందుకు రండి మేము వెనుక కూర్చుంటాము .
చెల్లెళ్లు : నో నో నో మా అన్నయ్యే మా హీరో మా ధైర్యం – మీరే ముందు ……
దేవత : బుజ్జిచెల్లెళ్ళు చెప్పారుకదా కూర్చోండి .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ అంటూ హాసినిని ప్రాణాంలా హత్తుకుని ముద్దులుపెట్టారు – తమ్ముడూ …… దేవతనే చెప్పారుకదా కూర్చో ……
అలాగే అక్కయ్యా అంటూ తమ్ముడితోపాటు కూర్చున్నాను .
ఒక మేనేజ్మెంట్ మేడం స్టేజి మీదకువెళ్లి మైకు అందుకున్నారు . గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ – టీచర్స్ …… Ok ok మీ అవంతిక మేడం అంటే మీకు ఎంత ఇష్టమో మీ సంతోషం – కేకలే చెబుతున్నాయి , Few మినిట్స్ few మినిట్స్ …… మీ అవంతిక మేడం మరియు తను రాసిన బుక్ గురించి మాట్లాడబోతున్నాను మీరు సైలెంట్గా ఉంటే , అలా అని స్పీచ్ ఇవ్వనులే బ్రీఫ్ గా explain చేస్తాను అంతే ……
నవ్వులు వెల్లువిరిసాయి ……
మేనేజ్మెంట్ మేడం : థాంక్యూ – టీచర్స్ …… మన స్టూడెంట్స్ well disciplined – ప్రౌడ్ ఆఫ్ యు స్టూడెంట్స్ ……
స్టూడెంట్స్ : థాంక్యూ థాంక్యూ …… మేడం …..
మేనేజ్మెంట్ : సంతోషంతో నవ్వుకుని , మన మేడం అవంతిక ….. అవంతిక అని నా పెదాలపై పలికిన ప్రతీసారీ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను .
సంతోషంతో చప్పట్లు ……
మేనేజ్మెంట్ : ఏదో మన మేడం అని పొగడటం లేదు – అవార్డ్స్ వచ్చిన విషయం తెలియగానే అర్ధరాత్రివరకూ నిద్రపోకుండా చదివాను , చదువుతుంటే కుతూహలం అంతకంతకూ పెరుగుతూనే ఉంది నిద్ర హుష్ కాకి అయిపోయింది .
మళ్లీ నవ్వులు ……
మేనేజ్మెంట్ : Yes yes నాకూ అంతే ఆనందం కలిగింది . ప్రస్తుత బిజీ & పొల్యూటెడ్ లైఫ్ లో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన బుక్ మన అవంతిక మేడం ” LIFE & TIME ” అని ప్రౌడ్ గా చెబుతున్నాను . ఇక బుక్ గురించి ” మన జీవనం గురించి మన జీవన సమయం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు , కంటికి కనిపించని కణం నుండి సూర్యుడు – గ్రహాలు ఉంద్భవించడం ,వేరే గ్రహాలలో జీవం ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి మన భూమిని example గా తీసుకున్నారు , భూమిపై వాతావరణం ….. వాతావరణం వలన నీరు ….. నీరు వలన జీవం – మొక్కలు ఉద్భవించి మానవులు – జంతువులుగా పరిణామం చెందడం వివరించిన విధానం అద్భుతం మహాద్భుతం ……. , ఇక ఇక్కడే మన పతనం మనమే సృష్టించుకుంటున్నాము , నాగరికత – అభివృద్ధి పేరుతో అందమైన అద్భుతమైన భూమిని పొల్యూషన్ తో ఎలా మళ్లీ మొదటి పరిణామం దగ్గరకే ఎలా చేరుకోవడానికి ఎలా నాశనం చేసుకుంటున్నామో మీరే స్వయంగా తెలుసుకోవాలి ” .
స్టూడెంట్స్ : మేడం మేడం …… చెప్పొచ్చుకదా ……
మేనేజ్మెంట్ : నేను చెబుతుంటేనే ఎంత ఆసక్తితో విన్నారో ఇక మీరే స్వయంగా చదివి తెలుసుకుంటే ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేను – ప్రస్తుత విద్యార్థులే రేపటి పౌరులు , మీ మేడం ఏదైతే జరగకూడదని ఆనుకుంటున్నారో దానిని ముందుకు తీసుకెల్లే బాధ్యత మీ పైననే ఉంది .
స్టూడెంట్స్ : మేడం మేడం ….. బుక్స్ బుక్స్ ……
మేనేజ్మెంట్ : అక్కడికే వస్తున్నాను స్టూడెంట్స్ …… , అవంతికా మేడం …… మీ అనుమతి లేకుండా సిటీలోని అన్నీ ప్రింటింగ్స్ లో దాదాపు టెన్ థౌజండ్ కాపీస్ ప్రింట్ చేయించాము – ప్రింట్ చేయించాము కానీ మీ అనుమతి లేకుండా సెల్ చెయ్యము .
టీచర్స్ : టెన్ థౌజండ్ ? – టెన్ థౌజండ్ ? అంటూ ఆశ్చర్యం షాక్ చెందుతున్నారు .
మేనేజ్మెంట్ : ఏమి చేయమంటారు మరి అవార్డ్స్ వచ్చిన విషయం ప్రపంచానికి తెలియగానే రాత్రికి రాత్రి అన్ని ఆర్డర్స్ వచ్చాయి – ఈరోజుకు పాతిక వేలకు చేరినా ఆశ్చర్యం లేదు – ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్క్స్ లలో ట్రేండింగ్ లో ఉంది అంటూ స్క్రీన్ పై చూయించారు .
Wow wow …….
మేనేజ్మెంట్ : స్టూడెంట్స్ – టీచర్స్ …… కాలేజ్ తరుపున మీ అందరికీ బుక్స్ చేరేలా ఏర్పాట్లుచేసాము , ఖర్చునంతా కాలేజ్ హ్యాపీగా భరిస్తుంది .
దేవత : మేడం …….
మేనేజ్మెంట్ : Wait wait అవంతికా …… , నీ మాటలకోసం స్టూడెంట్స్ తోపాటు మేమూ ఆశతో ఎదురుచూస్తున్నాము , స్టూడెంట్స్ ప్రియాతిప్రియమైన మరియు జ్ఞానపీఠ అవార్డ్ & బుకర్ ప్రైజ్ గ్రహీత మిస్ అవంతికను స్టేజి మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను . టీచర్స్ అందరూ స్టేజి మీదకు పిలుచుకునిరావాలి – నా ఫ్రెండ్స్ మిగతా కాలేజ్ మేనేజ్మెంట్ ….. మిస్ అవంతికను కాలేజ్ తరుపున ఘనంగా సన్మానించుకోవాలని కోరుతున్నాను .
టీచర్స్ రావడంతో చెల్లెళ్లు – అక్కయ్య లేచి కంగారుపడుతున్న దేవతకు ముద్దులతో ధైర్యం పంచి సంతోషంతో పంపించారు .
మేనేజ్మెంట్ మేడం అనౌన్స్ చేసినప్పటికీ నుండీ స్టూడెంట్స్ తోపాటు నేను – తమ్ముడు లేచి చప్పట్లు కొడుతూనే ఉన్నాము .
టీచర్స్ ….. స్టేజి మీదకు తీసుకెళ్లడం – మేనేజ్మెంట్ సాలువాలతో సత్కరించి కాలేజ్ తరుపున జ్ఞాపికను బహూకరించారు .
మేనేజ్మెంట్ : తొలి బుక్ ను స్వయంగా స్టూడెంట్స్ ముందు ప్రదర్శించి , కొన్నిరోజులుపాటు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమన్న సిటీని మళ్లీ సాధారణ స్థితికి చేర్చిన సిటీ రియల్ హీరో మహేష్ కు బహుకరించాల్సినదిగా కోరుకుంటున్నాము .
ఇక చెల్లెళ్లు – అక్కయ్య ఊరుకుంటారా లేచిమరీ చప్పట్లు కొట్టడం కేకలువేస్తున్నారు , మా ఫ్రెండ్స్ …… మహేష్ మహేష్ అంటూ – స్టూడెంట్స్ అందరూ …… అన్నయ్యా అన్నయ్యా …… అంటూ ఆడిటోరియం టాప్ లేచిపోయేలా కేకలువేస్తున్నారు .
మేనేజ్మెంట్ : హీరో మహేష్ …… ఏమో అనుకున్నాను – మీ మేడం కంటే పాపులర్ నువ్వు welldone welldone కమాన్ కమాన్ స్టేజి మీదకు రా ……
దేవత …… మైకులో మాట్లాడుతున్న మేడం దగ్గరికివెళ్లి చెవిలో గుసగుసలాడారు .
మేనేజ్మెంట్ : స్మాల్ కరెక్షన్ – మన అవంతిక మేడం ఒక కోరిక కోరారు – ఏమిటంటే తొలి బుక్ ను వారి ప్రాణమైన సిస్టర్స్ కావ్య మరియు వైష్ణవి హాసిని వర్షిణీ విక్రమ్ ద్వారా ఆవిష్కరించి వారి చేతులమీదుగానే సిటీ రియల్ హీరోకు అందించాలని ……
చప్పట్లు మారుమ్రోగాయి .
మేనేజ్మెంట్ : మిస్ కావ్యా & స్టూడెంట్స్ …… కమాన్ కమాన్ .
ఆనందంతో అక్కయ్య – చెల్లెళ్ళవైపు చూసాను .
నలుగురూ సంతోషంతో నవ్వుకుని దేవతకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నా చేతులను అందుకుని స్టేజి మీదకు తీసుకెళ్లారు . దేవతను కౌగిలించుకుని , దేవత కోరిక ప్రకారం పెద్ద పెద్ద బాక్సస్ నుండి బుక్ అందుకుని నాకు అందించి స్టేజి పైననే ముద్దులు కురిపించారు .
ఆడిటోరియం అరుపులతో దద్దరిల్లిపోయింది .
మేనేజ్మెంట్ : మీ అన్నాచెల్లెళ్ల ప్రేమను సిటీ మొత్తం ఎప్పుడో వీక్షించి ఆనందించారు – ప్రేమ ఆప్యాయతలు అంతులేనివి అంటూ ప్రపంచానికి చాటుతున్నందుకు అభినందనలు స్టూడెంట్స్ …… , అవంతికా …… ఇవి వేరు వేరు సిటీస్ నుండి బుక్స్ ఆర్డర్ కోసం పంపిన చెక్స్ , more than 10 lakhs & మన కాలేజ్ స్టూడెంట్స్ కోసం కాలేజ్ తరుపున ఆర్డర్ బుక్స్ ప్రైస్ అంటూ మరొక చెక్ అందించారు – ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మీ మేడం మాట్లాడుతారు అంటూ మైకు అందించి , కావ్యా – స్టూడెంట్స్ ….. మీరే చీఫ్ గెస్ట్స్ కూర్చోండి అంటూ స్టేజీపై సీట్స్ చూయించారు .
చప్పట్లు – కేకలు …….
అక్కయ్యను కూర్చోబెట్టి , చెల్లెళ్లతోపాటు పరుగునవచ్చి కింద సోఫాలో కూర్చున్నాము – మాతోపాటు స్టూడెంట్స్ అంతా నవ్వుకుంటున్నారు – అక్కయ్య తియ్యనైనకోపంతో మావైపు చూస్తున్నారు – నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము.
దేవత ….. అక్కయ్యవైపు – చెల్లెళ్ళవైపు చూసి , మేనేజ్మెంట్ – టీచర్స్ – స్టూడెంట్స్ కు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు . నిజం చెబుతున్నాను ఈ బుక్ కంప్లీట్ చెయ్యడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టింది – సగమే పూర్తి చెయ్యగలిగాను , ఏ దేవుడి అనుగ్రహం వల్లనో కానీ ఒక్కరాత్రిలో పూర్తిచెయ్యగలిగాను .
ఇంకెవరు ఆ దేవుడు మా అన్నయ్యే అంటూ ముద్దులుపెట్టారు చెల్లెళ్లు – అక్కయ్య నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
నేను కాదు చెల్లెళ్ళూ …… పెద్దమ్మ పెద్దమ్మ .
చెల్లెళ్లు : ష్ ష్ పెద్దమ్మకు ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారు అవసరమే లేదు – క్రెడిట్ మొత్తం మా అన్నయ్యకే అంటూ ముద్దులుపెట్టారు .
స్స్స్ స్స్స్ స్స్స్ …… అంటూ చెల్లెళ్లు బుగ్గలను రుద్దుకుంటున్నారు – పెద్దమ్మా ….. కొరికినా సరే క్రెడిట్ మొత్తం మా అన్నయ్యకే – మనం మనం మళ్లీ మాట్లాడుకుందాము అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవత : ఆ దేవుడికి నాజీవితాంతం రుణపడి ఉంటాను – ఇక ఆ దేవుడి వలన నన్ను చేరిన ఈ డబ్బును అంటూ అక్కయ్య – చెల్లెళ్ళవైపు చూసి అనాధ శరణాలయాలకు అందించబోతున్నాను – ఈ అమౌంట్ నే కాదు బుక్ ఆర్డర్స్ ద్వారా వచ్చే అమౌంట్ మొత్తాన్ని శరణాలయాలకే చేరుస్తాము .
అంతే ఆడిటోరియం లో ఉన్నవాళ్ళంతా కొన్ని నిమిషాలపాటు చప్పట్లు ఆపకుండా అభినందిస్తున్నారు .
మొదట అక్కయ్య ఆ వెంటనే మేనేజ్మెంట్ మేడమ్స్ – లేడీ టీచర్స్ వెళ్లి దేవతను కౌగిలించుకుని అభినందించారు .
మేనేజ్మెంట్ : బుక్ తో చైతన్యం పంచి హీరో అయ్యావు ఇప్పుడు ఏకంగా దేవతవు అయ్యావు అవంతికా …… ప్రౌడ్ ఆఫ్ యు .
అక్కయ్య : నా తమ్ముడు ఎప్పుడో చెప్పాడు దేవత అని ……
దేవత : అన్నాడు అంతే , మొదట దేవతను చేసింది మన బుజ్జిదేవుడు గుర్తుపెట్టుకో చెల్లీ ……
అక్కయ్య : Ok అంటూ నావైపు చూసి ఆనందిస్తున్నారు . అక్కయ్యా ….. బామ్మలు కూడా చూస్తున్నారు చూడండి .
దేవత : ఎలా – ఎప్పుడొచ్చారు చెల్లీ ……
అక్కయ్య : మేనేజ్మెంట్ సర్ప్రైజ్ అనగానే , మన హీరో ….. బామ్మలకు కాల్ చేసేసాడు రమ్మని ……. , ఆనందబాస్పాలతో ఎంత మురిసిపోతున్నారో చూడండి .
దేవత : చూసి ఆనందిస్తున్నారు . అందరూ ప్రపంచం గురించి ఆలోచించేలా అద్భుతమైన మాటలు చెప్పారు దేవత ……
చప్పట్లతో మారుమ్రోగిపోయింది .
మేనేజ్మెంట్ : అవంతికా ….. కాలేజ్ మాత్రమే కాదు ప్రపంచం నీ మాటలు వింటోంది అంటూ మీడియా కెమెరాలవైపు చూయించారు . మీడియాకు ధన్యవాదాలు …… మీకోసం బుక్స్ పంపిస్తున్నాము – స్టూడెంట్స్ ….. మీ అందరికీ మీ క్లాస్సెస్ లో డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి – డిసిప్లిన్ గా క్లాసులకు వెళ్ళండి ok …..
OK ok మేడమ్స్ అంటూ లైన్స్ లో క్లాస్సెస్ వైపుకు వెళ్లారు .
టీచర్స్ అందరూ మరొకసారి అభినందించి క్లాస్సెస్ కు వెళ్లారు .
అంతే ఒక్కసారిగా దేవత – అక్కయ్య – చెల్లెళ్లను ……. మీడియా చుట్టుముట్టి ముందుగా కంగ్రాట్స్ చెప్పి , నేషనల్ & ఇంటర్నేషనల్ బెస్ట్ అవార్డ్స్ అందుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు – మీకు ఇన్స్పిరేషన్ ఎవరు – ఇకపై ఏమైనా బుక్స్ రాయబోతున్నారా ? ……. అని ప్రశ్నల వర్షం కురిపించారు .
దేవత …… అక్కయ్య చెల్లి చేతులను అందుకుని నవ్వుకున్నారు – వెయిట్ వెయిట్ ……. ముందుగా థాంక్స్ టు మీడియా – This is కాలేజ్ టైం , ఇప్పటికే నా వలన 2 క్లాస్సెస్ వేస్ట్ అయిపోయాయి .
మేనేజ్మెంట్ మేడం : మేడం అవంతికా …….
దేవత : Ok ok మేడమ్స్ …… , మరొక క్లాస్ వృధా అవ్వడం నాకు ఇష్టం లేదు – ప్లీజ్ అర్థం చేసుకోండి కాలేజ్ టైం తరువాత మీరెక్కడ ఉన్నా నేనే స్వయంగా మీ ముందుకువచ్చి మీ ప్రశ్నలన్నింటికీ సావధానంగా బదులిస్తాను .
మీడియా : మనవలన స్టూడెంట్స్ కు ఇబ్బంది కలుగకూడదు అంటూ గుసగుసలాడుకుని , మేము వెయిట్ చేస్తాము మేడం , ఇంత ప్రెస్టీజియోస్ అవార్డ్స్ వచ్చినా మీలో ఏకొద్దిగా కూడా అహం లేదు , స్టేజి మీద మేడం చెప్పినట్లు బుక్స్ సెల్లింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ ను అనాధ శరణాలయాలకే ఇచ్చేసి దేవత అయ్యారు – దేవత కోసం సాయంత్రం వరకూ వేచిచూస్తాము అంటూ మళ్లీ విషెస్ చెప్పి బయటకు వెళ్లిపోయారు .
మేనేజ్మెంట్ మేడమ్స్ : ప్రౌడ్ ఆఫ్ యు అవంతికా …… , కాలేజ్ టైం వేస్ట్ కానివ్వని నీ సిన్సియారిటీ కి హ్యాట్సాఫ్ …… నీకంటే మంచి నాయకురాలు మాకు ఎవరు దొరుకుతారు చెప్పు వన్ మినిట్ వన్ మినిట్ అంటూ సంతోషంతో కౌగిలించుకుని హడావిడిగా బయటకువెళ్లారు .
దూరంగా చూసి ఎంజాయ్ చేస్తున్న చెల్లెళ్ళ మమ్మీ – మల్లీశ్వరి వాళ్ళు – బామ్మలు …… ఆనందబాస్పాలతో కంగ్రాట్స్ కంగ్రాట్స్ హృదయపూర్వక అభినందనలు అంటూ వచ్చి నన్ను ప్రాణంలా హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్య : ఆనందిస్తూనే , బామ్మలూ …… అవార్డ్స్ వచ్చినది దేవతకు , మీ బుజ్జిహీరోకు కాదు . ముద్దులు కురిపించాల్సినది అక్కయ్యకు …..
చెల్లెళ్లు : బామ్మ ఏమిచేసినా కరెక్ట్ – అన్నయ్యకే ముద్దులుపెట్టండి బామ్మా అంటూ వచ్చి మా ఇద్దరినీ చుట్టేశారు .
బామ్మ : లవ్ యు తల్లులూ …… అందరినీ ప్రాణంలా కౌగిలించుకుని మురిసిపోతున్నారు .
