అంతలో ఒక ఆఫీసర్ వచ్చి , వెల్కమ్ వెల్కమ్ మహేష్ & మహేష్ సిస్టర్స్ …… heartfully వెల్కమ్ , మహేష్ & మహేష్ క్యూట్ సిస్టర్స్ …… సర్ప్రైజ్ ఎంజాయ్ ఎంజాయ్ చేసినట్లే కదా …… ఇంతకూ నేనెవరో చెప్పలేదు కదూ – షాపింగ్ మాల్ ఓనర్ ను ……. , మీరు రావడమే బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ …… – చుట్టూ ఈ జనాల అప్లాజ్ చాలు మీరు ….. మా మాల్ లో అడుగుపెట్టడం మా అదృష్టం అని చెప్పడానికి అంటూ అమ్మాయిలతో అందరికీ బొకేస్ ఇప్పించారు .
చెల్లెళ్లు : అక్కయ్య – దేవత ఆనందాలు చూసి fully enjoyed , అంకుల్ …… మేము వచ్చినది ఇప్పుడే అంతలోనే ఈ ఆర్రేంజిమెంట్స్ – సర్ప్రైజ్ …….
ఓనర్ : ఓహ్ ఆదా …… , వారం ముందే పూర్తయినా టెర్రరిస్ట్స్ అటాక్స్ వలన గత నాలుగు రోజులుగా మా ఫోర్త్ ఫ్లోర్ ఓపెనింగ్ పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది – జనాలు లేకపోతే మాల్ లో ఒక్క ఫ్లోర్ ఉంటేనేమి ఫోర్ ఫ్లోర్స్ ఉంటేనేమి – బ్యాంకుల నుండి తీసుకొచ్చిన లక్షలుపెట్టి ఖర్చు చేసినదంతా వృధా ప్రయాస అయ్యింది అనుకున్నాము – ఒక్క ఫ్లోర్ వలన మాల్ మొత్తం బ్యాంకుల పరం కాబోతోంది అని బాధపడేంతలో టీవీలలో నీ స్పీచ్ …… దానికి నిదర్శనమే ఈ జనాలంతా …… , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ …… మీకు కూడా గర్ల్స్ ……
థాంక్యూ అంకుల్ అంటూ నన్ను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఓనర్ : ఇలా మీ స్వచ్ఛమైన ప్రేమను చూసే సిటీ మొత్తం ఫిదా అయిపోయింది అని నేను నమ్ముతున్నాను – ఇక ఈ సర్ప్రైజ్ సంగతి ఏమిటంటే …… ఫోర్త్ ఫ్లోర్ ఓపెనింగ్ కోసం కాసేపట్లో actresses ” తమన్నా & కృతి శెట్టి ” చీఫ్ గెస్ట్స్ గా రాబోతున్నారు , వారికోసం ఏర్పాటుచేసిన ఆర్రేంజిమెంట్స్ ….. మా అదృష్టం మీరు రావడం మరింత సంబరంలా ఉంది .
బయట నుండి సడెన్ గా ఎందుకో కేకలు – విజిల్స్ అంతా హడావిడి హడావిడిలా మారిపోయింది .
చెల్లెళ్లు : హీరోయిన్స్ ” తమన్నా & కృతి శెట్టి ” చీఫ్ గెస్ట్స్ wow wow బామ్మలూ – అక్కయ్యలూ – మమ్మీ …… సరైన సమయానికే వచ్చాము అన్నయ్య వలన అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు . అంకుల్ …… మరి వాళ్ళు వస్తే ఈ సర్ప్రైజ్ ……
ఓనర్ : అదిగో మావాళ్ళు రెడీ చేసేస్తారు అంటూ పైకి చూయించారు .
కేకలు – విజిల్స్ మధ్యన ” అవసరం లేదు – నో నీడ్ ” అంటూ ఇద్దరి బ్యూటిఫుల్ వాయిసస్ వినిపించాయి .
చూస్తే చాలామంది బౌన్సర్స్ మధ్యన పింక్ కలర్ పట్టుచీరలో తమన్నా & రెడ్ కలర్ లెహంగాలో కృతి శెట్టి …… మాదగ్గరికి చేరుకున్నారు .
మేమైతే స్వీటెస్ట్ షాక్ లో అలా కదలకుండా నిలబడిపోయాము .
ఓనర్ ఆర్డర్ వేయడంతో మరికొంతమంది బౌన్సర్స్ వచ్చి మా చుట్టూ నిలబడ్డారు . బౌన్సర్స్ తోపాటు సెక్యూరిటీ ఇస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లు ….. మిస్సెస్ కమిషనర్ ను చూసి సెల్యూట్ చేసి మరికొంతమంది అవసరం అని వాకీ లో చెప్పాడు , మహేష్ – హాసినీ …… మీరుకూడా , కమ్ ఫాస్ట్ అంటూ మళ్లీ చెప్పాడు .
తమన్నా – కృతి …… కేకలతోపాటు మహేష్ మహేష్ అంటూ కేకలు వినిపిస్తున్నాయి.
తమన్నా – కృతి శెట్టి : Hi హలో మహేష్ & …… your క్యూట్ సిస్టర్స్ are …..
వర్షిణీ – హాసిని – వైష్ణవి మేడమ్స్ ……
తమన్నా : మేము మేడమ్స్ లా కనిపిస్తున్నామా ? .
పెద్ద పెద్ద కేకల మధ్యనే నో నో నో మేడమ్స్ ……
కృతి : అదిగో మళ్లీ మేడమ్స్ …… , ఏంజెల్స్ అని పిలవచ్చుకదా …….
Sorry sorry extremely sorry మేడమ్స్ ……. అంటూ తలదించుకున్నాను .
చెల్లెళ్లు : sorry మేడమ్స్ ……. , మా అన్నయ్య హృదయంలో ఏంజెల్స్ ఇద్దరే ఇద్దరు అదిగో అక్కడ ఉన్న ఆక్కయ్యలు అంటూ చూయించారు .
తమన్నా : Wow బ్యూటిఫుల్ రియల్ ఏంజెల్స్ లా ఉన్నారు అంటూ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నారు .
అక్కయ్య – దేవత ఆనందాలకు అవధులులేవు , నమ్మలేనట్లు సంతోషంతో తడబడుతున్నారు .
తమన్నా : హాసినీ – వర్షిణీ …… వైజాగ్ లో మా క్రేజ్ ఎలా ఉందోనని లోకల్ ఛానెల్స్ బ్లాగ్స్ లో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము , కొంతసేపటి ముందువరకూ అంటే మీరు మాల్ లో ఎంటర్ అయ్యేంతవరకూ మా గురించే ఫీడ్ చేస్తున్నవాళ్ళు మొత్తం మీపై ఫోకస్ పెట్టేసారు , మొదట కోపం వచ్చేసింది కానీ విషయం తెలుసుకున్నాక నిజమేకదా అనుకున్నాను , మహేష్ …… you are real హీరో – మీతోపాటు సెల్ఫీ తీసుకోవచ్చా ? – అప్పుడే సెల్ఫీతో గుడ్ బై చెప్పేస్తున్నారేంటి అనుకోకండి బిజీ షెడ్యూల్ రెండు గంటల్లో అరకులో మూవీ షూటింగ్ , డైరెక్టర్ టూ స్ట్రిక్ట్ ……. , షాపింగ్ మాల్ ఓనర్ గారూ …… చీఫ్ గెస్ట్ మేము కాదు మీ సిటీ రియల్ హీరో మహేష్ & his సిస్టర్స్ …….
ఓనర్ : We are హ్యాపీ విత్ that మేడమ్స్ …… , కానీ ……
తమన్నా – కృతి శెట్టి : పర్లేదు పర్లేదు మీడియా – గాసిప్స్ ఏమైనా టెలికాస్ట్ చెయ్యనీ మేము పట్టించుకోము , ఫ్యాన్స్ …… what do you say ? .
మహేష్ మహేష్ మహేష్ …….
తమన్నా : see ….. ఫ్యాన్స్ also హ్యాపీ …… , వైజాగ్ లో మాకంటే నీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది మహేష్ …….
చెల్లెళ్లు : సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఓనర్ : This way మేడం …….
తమన్నా – కృతి శెట్టి : ఫ్యూ మినిట్స్ , రియల్ హీరో & రియల్ ఏంజెల్స్ తో మెమొరబుల్ సెల్ఫీలు తీసుకోనివ్వండి – హలో రియల్ హీరో …… మీ వాళ్లే రియల్ ఏంజెల్స్ అన్నాముకదా హ్యాపీగా తలెత్తితే సెల్ఫీలు తీసుకుందాము .
థాంక్యూ థాంక్యూ మేడమ్స్ అంటూ అక్కయ్య – దేవతవైపు చూసి నవ్వుకున్నాను.
సింగిల్ సింగిల్ గా ఒక్కొక్కరము – చెల్లెళ్లతో కలిసి – అక్కయ్య దేవతతో మరియు గ్రూప్ గా అందరమూ మా మరియు హీరోయిన్స్ మొబైల్స్ లో సెల్ఫీలు తీసుకున్నాము .
తమన్నా – కృతి శెట్టి : హలో రియల్ హీరో …… చెయ్యి అయినా టచ్ చేస్తావా లేక …….
చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యవైపు చూసి చెల్లెళ్లతోపాటు హీరోయిన్స్ ఇద్దరి చేతులను అందుకుని , అక్కయ్య – దేవతలు – బామ్మావాళ్ళు ప్రక్కనే ఉండేలా మా చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేలా SI సర్ తో టచ్ లో ఉంటూ ఫోర్త్ ఫ్లోర్ చేరుకున్నాము .
రిబ్బన్ కట్ చెయ్యడానికి నన్ను పిలిచారు , మీతోపాటు చెల్లెళ్లు – అక్కయ్య – దేవత ఓపెనింగ్ చేస్తే హ్యాపీ అనడంతో అలానే చేశారు .
కొన్ని క్షణాలపాటు షాపింగ్ మాల్ దద్దరిల్లిపోయింది .
తమన్నా – కృతి శెట్టి …… మావాళ్ళను పిలుచుకుని లోపలికివెళ్లి పట్టుచీరలు – డ్రెస్సెస్ డిస్ప్లేస్ ముందు స్టిల్స్ ఇచ్చి మీడియాతో మాట్లాడి , మహేష్ & ఫ్యామిలీ వెళ్ళొస్తాము అంటూ అందరినీ సంతోషంతో కౌగిలించుకుని , ఇద్దరూ కొంటెగా సైగలుచేసుకుని ఒకేసారి నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి బై బై చెప్పి బౌన్సర్స్ ప్రొటెక్షన్ లో సేఫ్ గా వెళ్లిపోయారు .
అన్నయ్యా అన్నయ్యా …… అంటూ చెల్లెళ్లు హత్తుకుని ముద్దులు కురిపించారు .
దేవత షాక్ & చిరుకోపంతో చూస్తుండటం చూసి , చెల్లెళ్లు నవ్వుకుని దేవతా ….. ఈ క్రేజ్ తోనైనా అన్నయ్య …… బుజ్జిదేవుడిని రీచ్ అయినట్లేనా ? .
దేవత : ఆ సంగతి ఇంటికివెళ్లాక చూసుకుందాము – ఒకవిషయంలో మాత్రం మీ అన్నయ్య తెగ నచ్చేసాడు – బ్యూటిఫుల్ హీరోయిన్స్ …… ప్లీజ్ ఏంజెల్స్ అని పిలవచ్చు కదా అని రిక్వెస్ట్ చేసినా …….
చెల్లెళ్లు : నిజమే దేవతా …… , అన్నయ్య ఏంజెల్స్ మీరుమాత్రమే ……
దేవత : ఆ సమయంలో పులకరించిపోయాము అంటే నమ్మండి చెల్లెళ్ళూ – చెల్లీ …… నిజమే చెప్పానుకదా – తమన్నా కృతి శెట్టి జలస్ ఫీల్ అయ్యేలా చేసాడు మీ అన్నయ్య – అందుకేనేమో రియల్ బుజ్జిహీరో అని ఎప్పుడో ఒప్పుకున్నాను .
తమ్ముడూ అంటూ పెదాలపై తియ్యదనంతో అక్కయ్య చేతులుచాపి కౌగిలిలోకి ఆహ్వానించారు .
చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్య కౌగిలిలోకి చేరాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ తమ్ముడూ , వొళ్ళంతా తియ్యనైన పులకింత కలిగించావు – ప్రౌడ్ టు బి your సిస్టర్ ……. , చెల్లెళ్ళూ ….. అంటూ ఆహ్వానించారు .
మేముకూడా మేముకూడా అన్నయ్యా అంటూ పరుగునవచ్చి ఇద్దరినీ చుట్టేశారు .
అధిచూసి బామ్మావాళ్ళ ఆనందాలకు అంతే లేకుండా పోయింది .
డాడీ – అంకుల్ …….
విశ్వ సర్ : ఫుల్ క్రౌడ్ …… కమిషనర్ అయిన నేనే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉండిపోయాను .
హాసిని : అంటే డాడీ …… చూడలేదన్నమాట .
విశ్వ సర్ : మీ అన్నయ్య క్రేజ్ అలాంటిది మరి – కోప్పడకండి మొబైల్లో చూసానులే ……. , హీరోయిన్స్ మొదట షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తరువాత కౌగిలించుకోగానే మీ మమ్మీ ఆనందం చూసి సంతోషించానులే ……
చెల్లెళ్లు : మేమూ చూసాము డాడీ – అంకుల్ ……
మిస్సెస్ కమిషనర్ : నేనేమీ అంత ఎక్సైట్ అవ్వలేదులే ……
విశ్వ సర్ : హలో హలో డార్లింగ్ శ్రీమతిగారూ …… వీడియోస్ ఉన్నాయండీ రాత్రి చూస్తూ ఎంజాయ్ చూద్దాములే …….
మిస్సెస్ కమిషనర్ : పోండి మీకు సిగ్గేలేదు , రండి ఎలాగో వచ్చారుకదా షాపింగ్ చేద్దాము .
విశ్వ సర్ : హలో హలో is it అర్జెంట్ కమింగ్ కమింగ్ ఆన్ ద వే గాట్ టు గో డియర్ , ఎంతసేపైనా పర్లేదు షాపింగ్ చేసి రండి , నాకు తెలిసి ఈరోజు నైట్ ఇంటికి రావాల్సిన అవసరం లేదనుకుంటాను , ఇంటికి వచ్చాక ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అనిచెప్పి హడావిడి యాక్టింగ్ చేస్తున్నారు .
విక్రమ్ : డాడీ డాడీ ….. మా ఫ్రెండ్ బర్త్డే నన్ను అక్కడ వదిలి వెళ్ళండి – బై బై మీరు షాపింగ్ ఎంజాయ్ చెయ్యండి .
చెల్లెళ్లు – అక్కయ్య – దేవత నవ్వులు ఆగడం లేదు , మిస్సెస్ కమిషనర్ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి , బాయ్స్ డ్రెస్సెస్ సెక్షన్ కు చేరుకున్నారు – అప్పటికే చీకటిపడటంతో షాపింగ్ మాల్ లైట్స్ వెలిగాయి .
Sorry sorry మహేష్ ……. , చీఫ్ గెస్ట్స్ కు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది , ఈ ఇద్దరు సేల్స్ గర్ల్స్ మీతోపాటే ఉంటారు – గర్ల్స్ …… ఏ లోటు రాకూడదు , ఎంజాయ్ ద షాపింగ్ మహేష్ & మహేష్ సిస్టర్స్ ……. అనిచెప్పి వెళ్లారు .
దేవత : ఫస్ట్ బుజ్జిదేవుడికి ……. , సిస్టర్స్ ఇదిగో ఈ అల్లరి హీరో సైజ్ లేటెస్ట్ డ్రెస్సెస్ చూయించండి .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడికి మాత్రమేనా అక్కయ్యా …… ? – అన్నయ్యకు తీసుకోరా ….
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… నిన్ననే సాలరీ డబ్బులు పడ్డాయి – రెంట్ కు పోనూ 12వేలు అకౌంట్ లో ఉన్నాయి – మీ అన్నయ్యకు మీరే సెలెక్ట్ చెయ్యండి .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్యకేమో మీరు – రియల్ హీరో అన్నయ్యకు ….. మేమునా , లేదు లేదు మీరే సెలెక్ట్ చెయ్యాలి .
దేవత : నా ప్రాణమైన బుజ్జిదేవుడికి ….. నేను – మీ ప్రాణమైన హీరోకు ….. మీరు , ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేను పే చేస్తాను చెప్పానుకదా 12వేలు ఉన్నాయి.
చెల్లెళ్లు : నవ్వుకుంటున్నారు – 12వేలకు ఒక్కొక్క డ్రెస్ మాత్రమే వస్తుంది దేవతా …….
దేవత : మరి నాదగ్గర ఉన్నది 12వేలు మాత్రమే బుజ్జిచెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : దేవతా …… అకౌంట్ బ్యాలన్స్ ఎప్పుడు చెక్ చేసుకున్నారు ? .
దేవత : చెక్ చెయ్యడం ఎందుకు ? , మొన్నటివరకూ మినిమం బ్యాలన్స్ ఉండేది నిన్న సాలరీ పడటంతో అది add అయ్యింది అంతే , బ్యాలన్స్ చూసుకోవాల్సిన అవసరమే లేదుకదా ……
చెల్లెళ్లు : ఒకసారి చెక్ చేసుకోండి దేవతా …….
దేవత : ఎంత చెక్ చేసుకున్నా 12వేలు + మినిమం బ్యాలన్స్ కు మించి ఉండదు కావాలంటే చూడండి అంటూ మొబైల్లో చెక్ చేసుకుని , What అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయారు .
చెల్లెళ్లు : చిరునవ్వులు చిందిస్తూ దేవతా దేవతా అంటూ కదిలించారు .
దేవత : 5 క్రోర్స్ & 12 థౌజండ్ 5 హండ్రెడ్ …… అంటూ మళ్లీ షాక్ లోకి ……
చెల్లెళ్లు : మళ్ళీనా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : కంగారుపడుతూ బు…జ్జిచెల్లె…ళ్ళూ బుజ్జి ….. చెల్లెళ్ళూ …… , చెల్లీ అంటూ అక్కయ్యకు చూయించారు .
అక్కయ్యకూడా వారి మొబైల్లోని 5 క్రోర్స్ చూయించి నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
చెల్లెళ్లు : కూల్ కూల్ దేవతా …… , మీ ప్రాణమైన బుజ్జిదేవుడు …… మీ మరియు అక్కయ్య అకౌంట్ లోకి 5 – 5 క్రోర్స్ వేశారని డాడీ చెప్పారు అంటూ నావైపు ఫ్లైయింగ్ కిస్ …….
దేవత : బుజ్జిదేవుడు – 5 క్రోర్స్ …….
చెల్లెళ్లు : మళ్లీ కూల్ కూల్ …… , టెర్రరిస్టులను పట్టుకోవడం వలన govt నుండి వచ్చిన డబ్బును మీ చేతులమీదుగా శరణాలయాలకు సహాయం చేయగా మిగిలిన 10 క్రోర్స్ ను వారి ప్రాణమైన మీకే ఇచ్చేసారట …….
దేవత : మరి బుజ్జిదేవుడు …….
చెల్లెళ్లు : మీ ఆనందమే అన్నయ్య ఆనందమట – ఎలాగో అన్నయ్య మీ కౌగిలిలోకి చేరబోతున్నారు కదా అప్పుడు మీరూ ట్రాన్స్ఫర్ చెయ్యండి .
దేవత : మొత్తం మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తాను .
అక్కయ్య : అక్కయ్యా ….. మీరెలా అంటే అలా …….
చెల్లెళ్లు : నేను దీనంగా ముఖం పెట్టడం చూసి , అప్పుడుకానీ అన్నయ్య బాధపడడు ……
దేవత : చెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : మీరు ఎంజాయ్ చెయ్యాలని – ఆ సంతోషాలను చూసి తరించాలని మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీరేమో మళ్లీ అన్నయ్యకే ఇచ్చేసి కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా ఉన్నారే – అదే మీకు ఇష్టం అయితే మీ ఇష్టం ……..
దేవత : నో నో నో …… బుజ్జిదేవుడు బాధపడితే నేను – మేము తట్టుకోలేము .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
చెల్లెళ్లు : Then లెట్స్ షాప్ దేవతా …… , మొదట బుజ్జిదేవుడు అన్నయ్యతోపాటు మీ అల్లరి హీరోకు కూడా మీరే సెలెక్ట్ చెయ్యాలి .
దేవత : నో నో నో బుజ్జిదేవుడికి మాత్రమే – మీరు కావాలంటే ఎన్నైనా సెలెక్ట్ చెయ్యండి – మనతో ఇప్పుడు బోలెడంత డబ్బు ఉంది .
చెల్లెళ్లు : అదంతా మాకు తెలియదు అన్నయ్యలిద్దరికీ మీరే ( దేవత – అక్కయ్య ) సెలెక్ట్ చెయ్యాలి కావాలంటే మమ్మీ ల సహాయం తీసుకోండి , మేము – బామ్మలు …… మాకు – మీకు సెలెక్ట్ చేస్తాము , దేవతా ….. మీ బిజిదేవుడిపై ఎంత ప్రేమ ఉందో కౌంటింగ్ ద్వారా తెలుస్తుంది , మీ బుజ్జిదేవుడి షాపింగ్ పూర్తవగానే మాదగ్గరికి వచ్చెయ్యండి అంటూ దేవత – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి నావైపు ఎంజాయ్ అన్నయ్యా అంటూ చిరునవ్వులతో సైగలుచేస్తూ సారీస్ సెక్షన్ దగ్గరికి వెళ్లారు .
మల్లీశ్వరి గారు ….. ఇక్కడ – రాజేశ్వరి గారు …… చెల్లెళ్లతోపాటు వెళ్లారు .
దేవత : హలో రియల్ హీరో …… ఎక్కడికి వెళుతున్నావు – సైజ్ కోసం ఇక్కడే ఉండాలి .
లవ్ టు లవ్ టు దేవతా ……
దేవత : గుడ్ …… , చెల్లీ …… బుజ్జిదేవుడిపై ప్రేమ అంతులేనిది అని బుజ్జిచెల్లెళ్లకు తెలిసేలా చేద్దాము , నేను …… మన బుజ్జిదేవుడికి – నువ్వు అక్కయ్య …… మీ రియల్ హీరోకు …… ok .
Ok అక్కయ్యా ….. అంటూ అక్కయ్య – డబల్ ok చెల్లీ ….. హీరోకు షాపింగ్ చేసే అదృష్టం కలిగించినందుకు అంటూ చెల్లెళ్ళ మమ్మీ లు సంతోషంతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , లేటెస్ట్ డ్రెస్సెస్ ….. సెలెక్ట్ చేసి విక్రమ్ తో కలిపి మూడు కొండలను పేర్చి నవ్వుకున్నారు.
అక్కయ్య : అక్కయ్యా …… ప్రస్తుతానికి చాలు ఇంట్లో ప్లేస్ లేదుకదా అంటూ నవ్వుకున్నారు .
దేవత : మరి బుజ్జిదేవుడిపై నా ప్రేమనే సంకోచిస్తారా బుజ్జి చెల్లెళ్లు , ముందు వాళ్లకు చూయించాలి ఏదీ ఎక్కడ రమ్మను రమ్మను …….
అక్కయ్య : దేవత మాట శాశనం ఇలా కోరుకున్నారో లేదో అలా వచ్చేస్తున్నారు అంటూ చూయించారు .
