దేవత : చెల్లెళ్లు ఎప్పుడూ వాళ్ళ అన్నయ్యకే సపోర్ట్ చెల్లీ ……అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అక్కయ్య : మురిసిపోయింది చాలు బామ్మా ……. , అక్కయ్యను అభినందించకుండా మీ బుజ్జిహీరోకి ముద్దులు పెడుతున్నారేంటి , అక్కయ్య చెప్పిన దేవుడు ….. బుజ్జిహీరో అన్నట్లు ……
బామ్మ : అవును దేవుడే ……. , నీ ప్రియమైన అక్కయ్యే చెప్పింది కదా …… సంవత్సరాలపాటు ఎంత ట్రై చేసినా బుక్ పూర్తిచేయ్యలేకపోయింది అని , కళ్లారా చూసింది నేనే కదా ……
అక్కయ్య : మీరే …..
బామ్మ : మన బుజ్జిహీరోని కలిసిన వేళా విశేషం – అన్ని సంవత్సరాలు …….
చెల్లెళ్లు : బామ్మా బామ్మా ……. మీమనసులో లాజిక్ మాకు అర్థం అయిపోయింది – మేము మేము చెబుతాము , దేవతా ……. అన్ని సంవత్సరాలు ఎంత ట్రై చేసినా పూర్తి కానిది అన్నయ్యను కలిసిన కొన్నిరోజులకే పూర్తిచేసేసి ఏకంగా స్టేట్ – నేషనల్ – ఇంటర్నేషనల్ మోస్ట్ ప్రెస్టీజియోస్ అవార్డ్స్ సాధించారు సో క్రెడిట్ ఎవరికి చెందాలి ……..
దేవత : బుజ్జిదేవుడికి ……..
చెల్లెళ్లు : దేవతా దేవతా …..దేవతలు అపద్ధం చెప్పనేరాదు .
దేవత : అవునవును , బుజ్జిదేవుడు ……. దేవతను చెయ్యకముందే బుక్ సబ్మిట్ చేసేసింది బామ్మ అంటే క్రెడిట్ మొత్తం ……. ప్చ్ ప్చ్ చెల్లీ అంటూ నావైపు కోపంతో చూస్తూనే అక్కయ్య గుండెలపైకి చేరారు .
అక్కయ్య : అక్కయ్యా …… అయితే క్రెడిట్ మొత్తం ……
దేవత : ఈ అల్లరి పిల్లాడికి ఇవ్వాల్సిందే లేకపోతే బామ్మ – బుజ్జిచెల్లెళ్ళ కోపాగ్నికి లోనవ్వాల్సి వస్తుందేమో ……. , నిజమే చెల్లీ …… నేనైతే సగమే పూర్తిచేసినది .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు దేవతా ….. , యాహూ యాహూ …… మా అన్నయ్యనే దేవత ఇన్స్పిరేషన్ అన్నమాట ……. అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా …… ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
దేవత : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయాము కదా చెల్లీ …… , ఈ అల్లరి హీరో కంటే ఒక్కరోజు ముందు బుజ్జిదేవుడు ….. మన జీవితంలోకి వచ్చి ఉంటే వీళ్ళందరి నోళ్లు మూయించేసేదానిని …….
బామ్మ : చెల్లెళ్లతోపాటు నవ్వుకుని , మా బంగారుకొండ లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిహీరో అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ఆనందిస్తున్నారు .
మైక్ టెస్టింగ్ 1 2 3 , టీచర్స్ & స్టూడెంట్స్ ……. బిగ్ అనౌన్స్మెంట్ , మీకు ఇష్టమైనదే …… అంటూ మేనేజ్మెంట్ మేడం మాటలు స్పీకర్లో వినిపిస్తున్నాయి . స్టేజి మీదనే చెప్పడం మరిచిపోయినందుకు sorry …… గత కొన్నిరోజులుగా మన కాలేజ్ హెడ్ మాస్టర్ చైర్ ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే – ఈరోజుతో ఆ స్థానాన్ని భర్తీ చేసే పర్ఫెక్ట్ పర్సన్ ఎవరో తెలిసిపోయింది – నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే కరెక్ట్ ఎవరో గెస్ చెయ్యండి …….
ఒక్క క్షణం కూడా ఆలస్యం కాలేదు అవంతిక మేడం అవంతిక మేడం ….. మేడం మేడం ….. అంటూ క్లాస్సెస్ మొత్తం – స్టాఫ్రూం దద్దరిల్లిపోయేలా కేకలువేస్తుంటే ఆడిటోరియం వరకూ వినిపించింది .
మేనేజ్మెంట్ : అవంతిక – అవంతిక …… సెకండ్ ఆప్షన్ లేదిక ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే అవంతికను హెడ్ మిస్ట్రెస్ ప్రమోట్ చేస్తున్నాను , అవంతిక గారూ …… ఎక్కడ ఉన్నా ఆఫీస్ రూమ్ కు వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి , మీరు లేదు కాదు అన్నా వదిలేది లేదు – మన కాలేజ్ కు మీకంటే గొప్ప హెడ్ మాస్టర్ మరొకరు ఎవరు కాబట్టి ఫిక్స్ ……. , ఇంతకుముందు ఉన్న హెడ్ మాస్టర్ ను ఈ స్థానం నుండే కాకుండా మేనేజ్మెంట్ పర్ట్నర్షిప్ నుండి కూడా పూర్తిగా తొలగిస్తున్నాము – ఇంతకాలం వాడి వలన ఇబ్బందిపడిన వారికి కాలేజ్ తరుపున క్షమాపణలు – మా మేనేజ్మెంట్ యునానిమస్ గా సంతకాలు కూడా చేసేసాము అవంతిక గారూ – హెడ్ మాస్టర్ చైర్ మీకోసం ఎదురుచూస్తోంది , హ్యాపీలి సైన్ ఔట్ …….
యాహూ యాహూ దేవతా – అక్కయ్యా …… అంటూ అక్కయ్య – చెల్లెళ్లు , దేవతను అమాంతం ఎత్తబోయి వీలుకాక లవ్ యు అంటూ నవ్వుకుంటూ దేవతను చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
అమ్మో ఇక నుండీ హెడ్ మిస్ట్రెస్ ….. కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నయ్యలూ గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ అంటూ సెల్యూట్ చేశారు చెల్లెళ్లు …….
గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ అంటూ చెల్లెళ్లతోపాటు విష్ చేసాను .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… అంటూ ప్రాణంలా హత్తుకున్నారు , చెల్లీ …… నీకు ఇష్టమేనా ? .
అక్కయ్య : ఇష్టమేనా అంటారు ఏమిటి అక్కయ్యా …… లవ్ టు లవ్ టు అంటూ ముద్దులు కురిపించి గట్టిగా కౌగిలించుకుని తెగ ఆనందిస్తున్నారు . దేవత ….. హెడ్ మిస్ట్రెస్ గా ఉండటం కంటే స్టూడెంట్స్ కు మరింత సంతోషం ఏముంటుంది .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ – బుజ్జిహీరో …….
చెల్లెళ్లు : అన్నయ్య ఎంత ఆనందిస్తున్నారో మాటల్లో చెప్పలేము దేవతా …… , ముందు మనం వెళ్లి ఆఫీస్ రూమ్ ను ఆక్రమించెయ్యాలి రండి అంటూ దేవత చేతులను పట్టుకిని లాక్కుని వెళ్లారు . అన్నయ్యా – అక్కయ్యా – బామ్మలూ ….. రండి , ఇకనుండీ కాలేజ్ మనదే …….
దేవత సంతోషంతో నవ్వుకుంటూ చెల్లెళ్లతోపాటే ఆఫీస్ రూమ్ కు చేరుకున్నారు .
అప్పటికే చేరిన కాలేజ్ స్టాఫ్ అంతా మీకంటే మంచి హెడ్ మిస్ట్రెస్ ఎవరుంటారు – అందరి గురించి ఆలోచిస్తారు – ఒక సైకోను కాలేజ్ నుండి తరిమేశారు అంటూ మనఃస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లారు .
మేనేజ్మెంట్ : వెల్కమ్ టు న్యూ రోల్ అవంతిక గారూ ……
దేవత : మేడమ్స్ …… మీ అవంతిక .
మేనేజ్మెంట్ : కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ ను గౌరవించుకోవడం మా బాధ్యత – జస్ట్ Sign here అండ్ టేక్ your సీట్ అవంతిక గారూ అంటూ అభినందనలు తెలిపారు .
దేవత : కంగారుపడుతూనే అక్కయ్య – చెల్లెళ్ళవైపు చూసారు .
మేనేజ్మెంట్ : వాళ్ళ అనుమతి లేకుండా ఒక్క అడుగుకూడా వెయ్యవు అన్నమాట గుడ్ గుడ్ ఫ్యామిలీ ఫస్ట్ – ఇలాంటి హెడ్ మిస్ట్రెస్ దొరకడం కాలేజ్ అదృష్టం – సజేషన్స్ ఏమీ ఇవ్వము ఎందుకంటే you are పర్ఫెక్ట్ – ప్రౌడ్ ఆఫ్ యు అవంతికా ……. , త్వరగా సంతకం చేసి కూర్చుంటే క్లాస్ లీడర్స్ అందరూ విష్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు అంటూ లోపలికి పిలిపించారు .
లీడర్స్ : గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ ……
మేనేజ్మెంట్ : ఇంకా మీ మేడం సంతకం చెయ్యలేదు స్టూడెంట్స్ …….
లీడర్స్ : మీరే ఆలస్యం చేశారు మేడమ్స్ – మేమైతే ఎప్పుడో ఆ గౌరవాన్ని ఇచ్చాము – మేడం …… హెడ్ మిస్ట్రెస్ అవ్వడం ప్రతీ స్టూడెంట్ కు ఇష్టం ……
దేవత ఆనందాలకు అవధులే లేవు .
మేనేజ్మెంట్ : ఆలస్యం అయ్యినందుకు తప్పు మనదే అన్నమాట ……
స్టాఫ్ : Yes yes మేడమ్స్ ……
మేనేజ్మెంట్ : మీరుకూడా ఫిక్స్ అయిపోయారన్నమాట – ముందే చెప్పొచ్చుకదా …… , అవంతికా ….. మరొక్క క్షణం ఆలస్యం చేస్తే కొడతారేమో సంతకం చేసేసి కూర్చో ……
దేవత : నవ్వుకుని , Its an హానర్ మేడమ్స్ అంటూ అక్కయ్య – చెల్లెళ్ళవైపు చూస్తూనే సంతకం చేసి , నా బాధ్యతలను ……
మేనేజ్మెంట్ : అంతమంది నమ్ముతుంటే ఇక ప్రమాణం ఏమిటి అవంతికా …… , నువ్వు ఒక్కసారి ఆ సీట్లో కూర్చుంటే చూసి హ్యాపీగా వెళ్లిపోతాము , ఇక మళ్లీ కాలేజ్ వైపుకు రాము , నువ్వు ఉండగా ఆ అవసరమే లేదు .
దేవత సిగ్గుపడుతుంటే …… , చెల్లెళ్లు వెళ్లి బలవంతంగా కూర్చోబెట్టారు .
మేనేజ్మెంట్ – టీచర్స్ – లీడర్స్ తోపాటు అందరమూ చప్పట్లతో సంతోషాలను పంచుకున్నాము .
మేనేజ్మెంట్ : ఇక హ్యాపీగా వెళతాము అంటూ మరొకసారి అభినందనలు తెలిపి వెళ్లిపోయారు .
టీచర్స్ – లీడర్స్ కూడా సంతోషాలను షేర్ చేసుకుని క్లాస్సెస్ కు వెళ్లిపోయారు .
అందరూ వెళ్లిపోగానే దేవత లేచివచ్చి అక్కయ్యను పిలుచుకునివెళ్లి హెడ్ మిస్ట్రెస్ సీట్లో కూర్చోబెట్టి బుగ్గలపై సంతోషంతో ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
చెల్లెళ్లు : చూసారా అన్నయ్యలూ – బామ్మలూ …… ఎంతైనా దేవతకు , అక్కయ్య అంటేనే ప్రాణం – టేబుల్ చుట్టూ ముగ్గురం ఉన్నా దూరంగా నిలబడిన అక్కయ్యను కూర్చోబెట్టారు .
బామ్మలు : అవును మహాదారుణం తల్లులూ …… , కాలేజ్ కాబట్టి బ్రతికిపోయింది ఇంటికివెళ్లాక మీ దేవత సంగతి చూద్దాము .
చెల్లెళ్లు : అంటే ఇకనుండీ కాలేజ్లో దేవతకు భయపడాల్సిందేనా బామ్మలూ …….
బామ్మలు : హెడ్ మిస్ట్రెస్ గా చూశాక మాకే భయమేస్తోంది తల్లులూ …… అవును .
దేవత – అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అమ్మో అంటూ నెమ్మదిగా బయటకు అడుగులు వేస్తున్నాను .
అక్కయ్య : ఏంటి తమ్ముడూ జారుకుంటున్నావు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
నా దైర్యమైన చెల్లెళ్లు – బామ్మలే భయపడిపోతున్నారు , ఇక అక్కయ్య మీరు అయితే ఎప్పుడూ దేవతవైపే …… ఇప్పుడుకానీ అల్లరిచేస్తే గోడ కుర్చీ – గుంజీలు – రౌండ్స్ …… లాంటి పనిష్మెంట్స్ నుండి సేవ్ చేసేవారెవరు , అందుకే జారుకుంటున్నాను అక్కయ్యా …….
అక్కయ్యతోపాటు దేవత నవ్వేశారు . లేదులే బుజ్జిహీరో …… నీ అల్లరి ఈ హెడ్ మిస్టర్స్ కు కూడా ఇష్టమే కదా …… , ఒక్కటే తీవ్రమైన నిరాశ – బుజ్జిదేవుడు ఉండి ఉంటే బాగుండేది .
చెల్లెళ్లు : ఉన్నారు కదా ….. , అదే అదే చూస్తున్నారు కదా ….. , దేవత సన్మానం చూసి ఆనందిస్తూనే ఉంటారులే ……. , ( నా మొబైల్ మ్రోగడం ) ఇదిగో సత్యం దేవతా …….
హాసినీ …… మమ్మీ నుండి అంటూ అందించాను .
హాసిని : మనకోసం కాదులే అన్నయ్యా …… , దేవత విషయం తెలిసి కాల్ చేసి ఉంటారు కావాలంటే వినండి అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది .
మిస్సెస్ కమిషనర్ : యాహూ యాహూ …… బుజ్జిహీరో బుజ్జిహీరో ….. న్యూస్ చూస్తున్నాను , నీ దేవతకు ఇవ్వు తొందరగా తొందరగా ……
హాసిని : విన్నారా అన్నయ్యా ……. , మమ్మీ ….. మీ చెల్లికి ప్రెస్టీజియోస్ అవార్డ్స్ తోపాటు కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ గా కూడా ప్రమోషన్ లభించింది .
మిస్సెస్ కమిషనర్ : డబల్ యాహూ యాహూ …… , ఒసేయ్ తల్లీ ….. నువ్వు మాట్లాడుతున్నావేంటి మీ దేవతకు ఇవ్వు ఇవ్వు ……
హాసిని : ఇస్తానులే మమ్మీ అంటూ తియ్యనైనకోపంతో వెళ్లి దేవతకు అందించింది .
దేవత మొబైల్ అందుకుని , చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్య ఒడిలోకి చేర్చింది . అక్కయ్యా ……
మిస్సెస్ కమిషనర్ : చెల్లీ చెల్లీ సో సో హ్యాపీ – కంగ్రాట్స్ కంగ్రాట్స్ డబల్ కంగ్రాట్స్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. ప్చ్ అక్కడ ఉండి ఉంటే బాగుండేది .
దేవత : లవ్ యు సో మచ్ అక్కయ్యా …… , మీరు లేకపోయినా మీ విషెస్ మరియు ముద్దులను …… బుజ్జిచెల్లెళ్ళు – చెల్లి తగినన్ని ఇచ్చారులే ……
మిస్సెస్ కమిషనర్ : అయితే చిట్టి చెల్లికి – తల్లులకు బోలెడన్ని ముద్దులు ……. , విశ్వ సర్ కూడా దేవతకు కంగ్రాట్స్ చెప్పి సంతోషాలను పంచుకున్నారు .
దేవత : కమిషనర్ సర్ …… , మన ఫ్యామిలీ విషెస్ అన్నీ వచ్చేసాయి బుజ్జిదేవుడివి తప్ప …… అంటూ బాధపడుతూ చెప్పారు .
అక్కయ్యా – దేవతా …… అంటూ అక్కయ్య – చెల్లెళ్లు ప్రాణంలా చుట్టేశారు .
విశ్వ సర్ : Sorry అవంతికా ….. , కావ్యా – తల్లులూ …… మీకు వరాలిచ్చే పెద్దమ్మను అడిగి , ఆ సంబరం ఎప్పుడో చెప్పొచ్చుకదా …… , మీ దేవత బాధను చూసి కూడా మీకు చలనం కలగడం లేదా ? .
చెల్లెళ్లు : డాడీ …… దేవత , మిమ్మల్ని అడిగితే – మీరు …… మాపై భారం వేస్తున్నారా ? .
విశ్వ సర్ : అలాకాదు తల్లులూ …… , నా చేతుల్లో ఏముంది చెప్పండి – ఆడించేది మీరే కదా …..
చెల్లెళ్లు : డాడీ …… మీకు డ్యూటీకి టైం అవ్వలేదా ? .
విశ్వ సర్ : ఈరోజు నో డ్యూటీ ……
హాసిని : ఈ సమయంలో కూడా మమ్మీ ప్రక్కనే ఉన్నారంటే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట – మాకొక డౌట్ డ్యూటీ పనిమీద వెళ్ళారా లేక హనీమూన్ కోసం అపద్ధం చెప్పి వెళ్ళారా అని ……
దేవత నవ్వేశారు .
హాసిని : డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ డాడీ ……. , దేవత నవ్వేశారులే …… లవ్ యు లవ్ యు ఎంజాయ్ హనీమూన్ ఎంజాయ్ …….
దేవత – అక్కయ్య నవ్వుతూనే ఉన్నారు . బుజ్జిచెల్లెళ్ళూ …… డిస్టర్బ్ చేయకూడదు అంటూ బై చెప్పి కట్ చేయించారు . బుజ్జిచెల్లెళ్ళూ – బుజ్జిహీరో …… క్లాస్ కు వెళదామా ? .
చెల్లెళ్లు : ఎక్కడికి వెళ్లినా మీతోపాటే కాబట్టి ok ok ……
అయితే మేము వెళ్లి లంచ్ ఏర్పాట్లు చేస్తాము అనిచెప్పి బామ్మావాళ్ళు సంతోషంతో వెళ్లిపోయారు .
