అందరూ అటు వైపు చూసారు ఎవరో ఒక అమ్మాయి, చుడిధార్ లో జుట్టు విరబూసుకుని నా అంత హైట్ తో ఆల్మోస్ట్ హీరోయిన్ రేంజ్ లో ఉంది, ఎవరిని పిలుస్తుందా అని చూసాను.. “నిన్నే.. ఇలా రా..” అని పిలిచింది ఏదో నేను పరిచయం ఉన్న వాడిలా.. వెనకాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి అక్షిత ఫ్రెండ్స్ నుంచి… తరవాత చూసుకుందాం పదా అంటూ.. నన్ను పిలిచిన ఆ అమ్మాయి వైపు నడిచాను.
చిన్నా : ఏంటండీ..
నీకు ప్రపోజ్ చెయ్యడానికి ఇంకో అమ్మాయే దొరకలేదా దాని వెనకాల పడ్డావు.
చిన్నా : వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇన్ని ఎలేవేషన్లు హీరోకి కూడా ఇవ్వరు, అంత పవర్ ఫుల్లా..?
నీ పేరేంటి?
చిన్నా : చిరంజీవి.. మీరు?
లావణ్య
చిన్నా : అలా కూర్చుని మాట్లాడుకుందాం, అని కాంటీన్ వైపు నడిచాను.. నా వెనకాలే వచ్చింది. ఇద్దరం ఎదురెదురు కూర్చున్నాం.
చిన్నా : ఇప్పుడు చెప్పండి.. అలాగే ఇందాక నన్ను సేవ్ చేసినందుకు థాంక్స్.
లావణ్య : అప్పుడే అయిపోలేదు వాళ్లు నిన్ను వదలరు.
చిన్నా : ఏం చేస్తారు..
లావణ్య : ఏదో ఒకటి చేస్తారు.. తిక్క పనులు దాని వల్ల నీకు కాలుద్ది.. అయినా నువ్వెంటి సడన్ గా ఇలా మధ్యలో జాయిన్ అయ్యావు టైం కానీ టైంలో
చిన్నా : రెండు లక్షలు ఫీజు ఎక్కువ కట్టానులే.l
లావణ్య : డబ్బులు బాగా ఉన్నాయా మీకు..
చిన్నా : పర్లేదు మీలా లూయి విట్టన్ బ్యాగ్ వాడే అన్నీ కాకపోయినా బానే ఉన్నాయి
లావణ్య : (నవ్వుతూ) ఆ అక్షిత వెంట పడకు.. అనవసరంగా తలనెప్పి.
చిన్నా : తను నీ ఫ్రెండా.. అలా లేదే… వాళ్లేమో నిన్ను చూసి భయపడుతున్నారు..
లావణ్య : ఛీ దానికి నాకు అస్సలు పడదు.
చిన్నా : ఎందుకు ?
లావణ్య : డబ్బులున్నోళ్లు అంటే దానికి అస్సలు పడదు, చీప్ గా చూస్తుంది.. డబ్బులున్నోళ్ళందరు మోసాలు చేసే పైకి వచ్చారని దాని నమ్మకం, అది కాక కాలేజీలో జాయిన్ అయిన రోజే దానికి నాకు గొడవ అయ్యింది.. అందులోను మళ్ళీ అది ఆర్ట్స్ నేను సైన్స్ గ్రూప్.
చిన్నా : మొత్తానికి మంచి ఎనిమీస్ అనమాట మీరు, అవును తను కాన్వెంట్ నుంచి వస్తుంది ఈ కాలేజీలో సీట్ ఎలా వచ్చింది.
లావణ్య : ఆదా ఈ దిక్కుమాలినోళ్లు, ప్రతీ సంవత్సరం ఫ్రీ సీట్స్ వదులుతారు ఈ సారి కాన్వెంట్స్ నుంచి టాపర్స్ ని తీసుకున్నారు అలా వచ్చిన వాళ్లే ఈ అక్షిత దాని ఫ్రెండ్స్.. కష్టపడి చదివి సీట్ సంపాదించామని మిగిలిన వాళ్లంతా పెయిడ్ బ్యాచ్ అన్న పొగరులో ఉంటారు.
చిన్నా : హ్మ్.. అయితే అక్షితని పడేయ్యడం కష్టమే అంటావ్.
లావణ్య : నువ్వు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా, అది అనాధ పిల్ల ఏ భయం లేకుండా, గైడెన్స్ లేకుండా పెరిగింది అందుకే అంత రఫ్ గా ఉంటుంది. ఫ్రెండ్ లాగ అనుకోని చెప్తున్నా తరవాత నీ ఇష్టం. అని లేచింది క్లాస్ కి వెళ్ళడానికి..
చిన్నా : ఫ్రెండ్ అన్నావ్, కొంచెం హెల్ప్ చెయ్యొచ్చుగా