లావణ్య : హహ… ఏమడుగుతున్నావో అర్ధమవుతుందా, ఒక వేళ మీరు లవర్స్ అయినా దెగ్గర ఉండి విడగొట్టే భాద్యత నేనే తీసుకుంటా.. దాని వెనక తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోకు
చిన్నా : ఆల్రెడీ అక్షిత కోసం అమెరికా వదిలేసి వచ్చా, ఇక్కడ ఫీజు కూడా తగలేసా… నేను తగ్గేదేలే అనుకుంటుంటే… నువ్వేమో ఇప్పుడే ఫ్రెండ్ అన్నావ్ అప్పుడే విడగొడతా అంటున్నవ్.
లావణ్య : హహ.. ఫ్రెండ్ అన్నాను కాబట్టే నీతో ఇంతసేపు మాట్లాడాను, నేనసలు ఎవ్వరినీ దెగ్గరికి కూడా రానివ్వను.. బాయ్.. అని వెళ్ళిపోయింది.
నేనూ క్లాస్ కి వెళ్లి కూర్చున్నా.. అక్షిత తన ఫ్రెండ్స్ నన్నే కోపంగా చూస్తున్నారు అలాగే వెళ్లి నా బెంచ్ లో కూర్చున్నా.
సుధీర్ : హాయ్ రా.. ఇవ్వాళ టాపిక్ నువ్వే కాలేజీ మొత్తం.. పోయి పోయి అక్షితకి ప్రొపోజ్ చేసావట
చిన్నా : ఏంట్రా దానికేమైనా కొమ్ములున్నాయా, మీరంతా చేతగాని చవటలా మరీ దాన్ని ఇంత లేపుతున్నారు.
సుధీర్ : నువ్వు వచ్చింది నిన్నే కదా…
చిన్నా : సరే దాన్ని పడేస్తే..?
సుధీర్ : అదే మాట మీద ఉండు.. మన కాంటీన్ లో నీకు ఫుడ్ లైఫ్ టైం సెటిల్మెంట్ రా.. మొత్తం బిల్లు నాదే.
చిన్నా : (అది నేను ఫస్ట్ టైం దాని వెనకాల పడ్డప్పుడే దాని మొహంలో సిగ్గు చూసాను, ఏదో బెట్టు చేస్తుంది.. త్వరగా పడిపోతే లోకువ అయిపోతుందని.. ఎంత మంది అమ్మాయిలని చూడలేదు.. ఎంత మందిని పక్కలోకి లాగలేదు..)
సుధీర్ : ఏంట్రా ఆలోచిస్తున్నావు.. ఓడిపోతావనా..
చిన్నా : హా.. ఏంటి.. సరే బెట్.. ఇవ్వాల్టి నుంచి పది రోజుల్లోగా పడేస్తా..
సుధీర్ : నువ్వెంత పోటుగాడివో నేనూ చూస్తా… డీల్.
చిన్నా : డీల్..
సాయంత్రం కాలేజీ అయిపోయాక క్లాస్ బైటికి వచ్చి చూసాను అక్షత కనిపించలేదు, సరేలే అనుకుని కార్ దెగ్గరికి వెళ్లి చూస్తే కార్ బానేట్ మీద అక్షిత కూర్చుని ఉంది. నన్ను చూడగానే కార్ దిగి నా ముందుకు వచ్చింది వెకిలి నవ్వు నవ్వుతూ..
అక్షిత : హాఆఆ….యి.. అని తన చేతిలో ఉన్న దబ్బణం నా చేతిలో పెడుతూ.. “ఇది నీ కార్ దెగ్గర దొరికింది నీదేనేమో అని తెచ్చిచ్చా” అని నా చేతిలో పెట్టింది.
కింద టైర్లని చూసాను గాలి తీసేసింది, నాకు నవ్వు ఆగలేదు పెదాలని బిగబట్టి ఆపుకుంటున్నాను ఎందుకంటే అది నా కార్ కాదు కాబట్టి, కానీ రెండు ఒకే కలర్.. పాప అక్కడ కన్ఫ్యూస్ అయ్యింది.. పాపం ఆ కార్ ఎవ్వరిదో అని చుట్టూ చూసాను.. లావణ్య నా వైపే నడుచుకుంటూ వస్తుంది.. కొంపదీసి ఆ కార్ దీనిది కాదు కదా అని అనుకుంటుండగానే లావణ్య రావడం అక్షితని చూడటం తన కార్ ని చూసుకోవడం కోపంతో తన మొహం ఎర్రబడటం అన్నీ జరిగిపోయాయి, అర్ధంకానీ అక్షితకి ఏదో తేడాకొట్టి నా వైపు చూసింది.. చిన్నగా తన ముందుకు వెళ్లి “అక్షిత అది నా కార్ కాదు” అని లావణ్యకి కనిపించకుండా నవ్వాను.
అక్షిత మొహం చిన్నబోయింది, వెంటనే లావణ్యని చూసి “సారీ వాడి కార్ అనుకున్నా” అని ఇంకేదో చెప్పబోతుంటే లావణ్య అక్షిత మీద అరిచింది గట్టిగా, నేను లావణ్యని పిలిచి సర్ది చెప్పి నేను డ్రాప్ చేస్తానని మాటిచ్చి తనని నా కార్ లో కూర్చోబెట్టాను.. అక్షిత వైపు చూసి.. ఒక వెకిలి నవ్వు నవ్వి కార్ తీసి విండో కిందకి దించి బాయి అని వెక్కిరిస్తూ ఇంటికి బైలుదేరాను.. కార్ రోడ్ మీదకి రాగానే ఫోన్ తీసి డ్రైవర్ కి కాల్ చేసాను.
చిన్నా : హలో అన్నా.. కాలేజీ లో పార్కింగ్ లో అచ్చం మన లాంటి కార్ ఒకటి నాలుగు టైర్లు పంచర్ అయ్యి ఉంది, దాన్ని బాగు చేపించండి ఆ తరువాత ఎక్కడ డెలివరీ ఇవ్వాలో నేను చెప్తాను.. అని కాల్ కట్ చేసాను.