విక్రేత Part 3 96

కార్ బ్రేకులు కట్ చేసాం

అక్షిత : ఏం కాదు.. వాళ్ళు తప్పుగా అనుకోరు.. అర్ధం చేసుకుంటారు.. మీరు వెళ్లి ముందు చెప్పండి వాళ్ళని కార్ ఎక్కనివ్వకండి..

ఆల్రెడీ వాళ్ళు వెళ్లిపోయారే..

అక్షిత వెంటనే కాల్ కట్ చేసి చిన్నాకి చేసింది, స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే లావణ్యకి ఫోన్ చేసింది.

లారీని ఓవర్ టేక్ చేస్తున్న లావణ్య డాష్ బోర్డు మీద అక్షిత పేరు చూడగానే నవ్వుకుంది.

లావణ్య : నీ కాబోయే భార్య, నా శత్రువు ఫోన్ చేస్తున్నారండి

చిన్నా : ( నవ్వుతూ) ఆ లారీని ఓవర్ టేక్ అయినా చెయ్యి లేదా వాడినన్నా పోనివ్వు.. టు వే రోడ్డులో ఎదురుగా ఎవరైనా వస్తే ప్రాబ్లెమ్ అవుద్ది.. అంటూ డాష్ బోర్డు మీద నొక్కాడు.. హలో అక్షిత.. చెప్పు

అక్షిత : చిన్నా మీరు వెళుతున్న కార్ బ్రేక్స్ పనిచెయ్యట్లేదు వెంటనే కార్ సైడ్ తీసుకోండి

ఆ మాట వినగానే ఇద్దరు షాక్ అయిపోయారు, ఎదురుగా ఇంకో లారీ రావడంతో బ్రేక్ నొక్కినా పడకపోయేసరికి లావణ్యకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. ఇంకో సెకండ్ లో ఆక్సిడెంట్ అవుతుందనగా చిన్నా స్టీరింగ్ పట్టుకుని వెంటనే తన వైపు లాగాడు.. కారు రెండు లారీల మధ్యలో ఇరుక్కుని ఆగిపోయింది. లావణ్య వైపు మాత్రం లారీ గట్టిగా గుద్దడంతో ఎలా వచ్చిందో చిన్న ముక్క ఒకటి లావణ్య గొంతులో గుచ్చుకుపోయింది.

అక్షితకి ఫోన్లో ఇద్దరి అరుపులు వెంటనే పెద్ద సౌండుతో పాటు కాల్ కట్ అవ్వడంతో విషయం అర్ధమయ్యి ఏడుస్తూనే బైటికి పరిగెత్తింది.

అక్షిత కనుక్కుని హాస్పిటల్ కి వెళ్లేసరికి అక్కడ చిన్నా బైట నిలుచొని ఉన్నాడు, తను సేఫ్ గా ఉండేసరికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాటేసుకుని ఏడ్చేసింది. అస్సలు ఏం జరిగిందీ చెప్పింది. చిన్నా బాధపడ్డా ఎవ్వరిని ఏమి అనలేకపోయాడు.

అక్షిత : లావణ్య ఎలా ఉంది

ఇంతలోనే అక్షిత ఫ్రెండ్స్ అంతా వచ్చారు.

చిన్నా : (అందరినీ చూస్తూ) స్పృహ లేదు, గొంతులో ఏదో ఇరుక్కుపోయింది. డాక్టర్స్ కంఫర్మ్ గా కూడా చెప్పలేదు అని కళ్ళు తుడుచుకున్నాడు.

చిరంజీవి తప్పైపోయింది, వాళ్ళ అమ్మ నాన్నకి క్షమాపణలు చెపుతాం ఏదో ఆలోచన లేకుండా చేసేసాం.

చిన్నా : మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, నేను చూసుకుంటాను. అక్షిత నువ్వు కూడా వెళ్ళు

అక్షిత : లేదు నేను నీతోనే ఉంటాను అని తన ఫ్రెండ్స్ ని అక్కడ నుంచి బలవంతంగా పంపించేసింది.

లావణ్య వాళ్ళ పేరెంట్స్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు, తెల్లతెల్లారి ఎప్పుడో మూడు గంటలకి అలా లావణ్యకి స్పృహ వచ్చిందని చెపితే డాక్టర్ చెక్ చేసి బైటికి వచ్చి వెళ్లి చూడమన్నాడు. నేను డాక్టర్ దెగ్గరికి వెళ్లాను.

చిన్నా : అంతా ఓకే కదండి

డాక్టర్ : యా అల్ ఇస్ ఫైన్ తన ప్రాణానికే ప్రమాదం లేదు కానీ తను ఇక మాట్లాడలేదు.

చిన్నా : ఇలా ఎన్ని రోజులు సర్

డాక్టర్ : జీవితాంతం.. ఫరెవర్.. షి లాస్ట్ హర్ వొకల్స్.. ఇంకో టు డేస్ అబ్సర్వేషన్ లో ఉంచాక అప్పుడు మిగతా ఫంక్షనింగ్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్షిత మా మాటలు విని ఏడ్చేసింది.

చిన్నా : అక్షితా.. ఊరుకో

అక్షిత : తనని చూద్దాం

చిన్నా : వాళ్ళని బైటికి రాని.. చూద్దాం

లావణ్య పేరెంట్స్ బైటికి వచ్చాక అక్షితని లోపలికి పంపించి లావణ్య వాళ్ళ నాన్నతో మాట్లాడాను, లావణ్య వాళ్ళ అమ్మ ఆయనని ఇంటికి పంపించేసి తను ఉండిపోయింది. నేను లోపలికి వెళ్లేసరికి అక్షిత లావణ్య చేతులు పట్టుకొని ఏడుస్తూ జరిగింది మొత్తం చెపుతుంది.. లావణ్య ఏమి అనలేదు తల తిప్పకుండా అక్షిత చెయ్యి పట్టుకుని ఒకసారి తట్టి ఎదురుగా ఉన్న నన్ను చూసింది.

రెండు నెలలు లావణ్య ఇంటి నుంచి బైటికి రాలేదు, లావణ్య అథారిటీతో వాళ్ళ నాన్న సాయంతో తన కంపెనీ మొత్తం నేనే చూసుకున్నాను. అక్షిత కూడా జాబ్ లో జాయిన్ అయ్యింది.. ఒక రోజు తెల్లారే ఆఫీస్ లో ఉండగా లావణ్య నుంచి మెసేజ్ వచ్చింది. ఐయామ్ కమింగ్ అని.. సంతోషించాను.. అక్షితకి చెప్పి స్టాఫ్ అందరితో కలిసి ప్లాన్ చేసి తనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాము.

లావణ్య పూర్తిగా కోలుకున్న కొన్ని రోజులకి తనే దెగ్గరుండి మా పెళ్లి జరిపించింది, పెళ్ళిలో కలిసిన అక్షిత ఫ్రెండ్స్ లావణ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పారు. లావణ్య ఏం మాట్లాడలేదు అలా అని వాళ్ళని క్షమించనూలేదు.. లావణ్య తలుచుకునుంటే వాళ్ళ ఫ్యూచర్ ని నాశనం చేసి ఉండేది కానీ తను వదిలేసింది. మా పెళ్ళికి అమ్మా నాన్నా అక్కా ఎవ్వరు రాలేదు. కొంచెం బాధగా అనిపించింది..అయినా ఇంత పట్టుదల ఎందుకు అనిపించింది.. ఇద్దరం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాం, చిన్న ఇంట్లో చిన్న చిన్న సౌకర్యాలతో అంతులేనంత సుఖ సంతోషాలతో బాగానే సాగుతుంది మా సంసారం.

చిన్నా అక్షితల పెళ్లి జరిగిన ఇరవై రోజుల తరవాత వరల్డ్ టూర్ నుంచి తిరిగొచ్చిన హారిక జరిగింది తెలిసి తన అమ్మా నాన్నలని ఇద్దరిని తిట్టింది.

హారిక : ఏం చేసారొ మీకు అర్ధమవుతుందా.. వాడిని ఇంట్లో నుంచి పంపించేస్తే వాడు మీ మాట వింటాడునుకున్నారా.. ఆస్తి కావాలా అమ్మాయి కావాలా అంటే ఈ వయసులో అమ్మాయే కావాలంటాడు, డబ్బులు సంపాదించడం వాడికి చేతకాదా.. ప్లాన్ మొత్తం నాశనం చేసారు మీరు పోండి పొయ్యి వాళ్ళని ఇంటికి పిలుచుకురండి.

సూర్య : పిలుచుకొస్తే

హారిక : ముందు పిలుచుకు రండి