కవిత : చెప్పవే
హారిక : ఏదో ఒకటి చేసి దాన్ని వదిలిద్దాం, వీలైతే చంపేద్దాం
ఏంటి చంపేస్తారా, అస్సలు మీరు మనుషులేనా నా అక్షితని చంపుతారా అంటే మీరే చంపేశారా అని అక్కని కొట్టబోయాను కానీ కనీసం వాళ్ళని ముట్టుకోలేకపోయాను. ముగ్గురు కలిసి మా ఇంటికి వెళ్లారు. అమ్మ నాతో ప్రేమగా మాట్లాడి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ నేను ఒప్పుకోలేదని నాకు తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయాను.
చిన్నా : అమ్మా మీరు మమ్మల్ని ఒప్పుకుంటారని నాకు తెలుసు, నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలీదా.. కానీ కొన్ని రోజులు నాకు ఇలానే ఉండాలనుంది అప్పటివరకు నన్ను ఇలానే ఉండనివ్వండి.
ముగ్గురు ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోయారు, అక్షిత అస్సలు మధ్యలో జోక్యం చేసుకోలేదు. సంవత్సర కాలంపు ప్రేమానురాగాలలో అక్షిత బంగారపు బొమ్మ లాంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అక్షిత మరియు చిన్నా చంటిదాని ప్రేమలో ఆ సంతోషంలో పడిపోయి మేము ఇంటి గురించి మా వాళ్ళ గురించి పట్టించుకోలేదు, చెప్పాలంటే మర్చిపోయాను అంతలా నా లోకంలో నేను మునిగిపోయాను. పాపకి అక్షిత అమ్మ పేరు లలిత అని పెడదాం అని అడిగింది.. తల మీద మొట్టాను మళ్ళీ అడగాలా అని.. ఇద్దరం దాన్ని చిన్నూ అని పిలుచుకుంటున్నాం. కొత్త జీవితం మా ఇద్దరికీ కొన్ని పాఠాలు నేర్పుతూనే జీవితానికి కావాల్సినన్ని సంతోషాలని ఇస్తుంది. పాప మొదట పాలు తాగిన రోజే నేను కూడా పోటీగా తాగాను, అక్షిత నన్ను తిడుతూనే నా కోరిక నెరవేర్చింది. మా పాపకి మేమిద్దరమే స్నానం చేపించుకున్నాం పాపని నేను చూసుకుంటానంటే నేను చూసుకుంటానని పొట్లాడుకునేవాళ్ళం అక్షిత ఫ్రెండ్స్ లో ఎవరికి కాళీ దొరికితే వాళ్ళు వచ్చి ఆడించేవాళ్ళు ప్రతీ ఆదివారం నేను అక్షిత తన ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనాలు చేస్తే సాయంత్రం లావణ్య వచ్చి రాత్రి వరకు ఉండి వెళ్ళేది. అక్షిత లావణ్యలిద్దరు మంచి స్నేహితులు అయ్యారు.
మొదటి నడక నా చేతుల మీద నుంచి అక్షిత వరకు వేసిన మొదటి అడుగు చూసి ఎంతో ఆనందించాం.. మొదట అమ్మా అని కాకుండా అక్కి అని చిన్నూ పలకడం చూసి ఎంత నవ్వుకున్నామో మాకే తెలుసు. చిన్నూకి జ్వరం వచ్చిన రోజు నేను అక్షిత ఎంత దిగులు పడ్డామో నాకింకా గుర్తే, మేము అన్నం తింటుంటే మా ఇద్దరి వెనకాల చేరి అక్షిత మెడ నా మెడ పట్టుకుని తన దెగ్గరికి లాక్కుని బుగ్గలకి ఆనించుకుంటే తెగ సంబర పడ్డాము.. ఎన్నో ఎన్నెన్నో సంతోషాలు అక్షిత మోహంలో నవ్వు లేని రోజు లేదు అంత బాగా ఒకరినొకరం ప్రేమించుకున్నాం.. ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం అంతలా ఒకరినొకరం గౌరవించుకున్నాం.. అక్షిత అయితే ఇంకొకళ్ళు వద్దులే మనకి చిన్నూ సరిపోదు అని అక్షిత అంది కానీ నేను ఒప్పుకోలేదు ఈ ప్రిన్సెస్ ని చూసుకోవడానికి ఒక బానిస కావాలి కదా అని నేను నా అక్క హారికకి చేసిన సేవలు త్యాగాలు మా కధలు వివరిస్తుంటే చిన్నూ అవి కథలలా తన అమ్మకి పోటీగా ఊ కొడుతూ వింటూ నిద్రపోయేది, చిన్నూ కాలేజ్ మొదలయ్యాక ఇంకొకడిని దించుదాం అని చెప్పాను. చూస్తుండగానే పాపకి నాలుగున్నర ఏళ్ళు పట్టాయి అయినా అక్షిత పాలు మానలేదు. తన అందం కంటే పాపకి ఐదేళ్ళ వరకు పాలు పడితే ఏ రోగాలు ఇమ్మ్యూనిటి డెఫిషియన్సి రాకుండా ఉంటాయని ఎంత మంది చెప్పినా వినలేదు. ఈ విషయం తన అమ్మ గారు చిన్నప్పుడే చెప్పిందట. వాళ్ళ అమ్మ మాటలని వేద వాక్కులా ఇన్ని సంవత్సరాలు గుర్తు పెట్టుకుందంటే వాళ్ళ అమ్మని ఎంత ప్రేమించి ఉంటుంది తనంటే ఎంత గౌరవం.. నేను కూడా అమ్మని దూరంగా పెట్టి చేసేది ఏముంది వాళ్ళ దెగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను దానికి అక్షిత సంతోషించింది.
ఇంకో పక్క సూర్యకి పంతం పట్టుకుంది, తన మాట కాదన్నందుకు తనని లెక్కచేయ్యనందుకు కొడుకు మీద కోపం పెంచుకున్నాడు. ఈ ఐదేళ్లలో కూతురు హారికతో కలిసి అక్షితని చంపే ప్లాన్ కూడా వేసాడు కానీ చిన్నా ఎప్పుడు పక్కనే ఉండటంతో రెండు సార్లు అక్షిత తప్పించుకుంది. కానీ ఇన్ని సంవత్సరాలు సూర్య సంపాదించక పోగా చిన్నా సంపాదించిన వాటితో పాటు ఉన్న ఆస్తులు కూడా హరించుకుపోతుంటే ఏం చెయ్యాలో అర్ధంకాలేదు ఇటు హారిక వాళ్ళ ఆయన ఆస్తి కూడా కరిగిపోతుంది. అందరూ మాట్లాడుకుని ఇంట్లో సమావేశం అయ్యారు.
కవిత : ఇప్పుడేం చేద్దాం
హారిక వాళ్ళ ఆయన : చేసేదేం లేదు అన్ని మూసేసి కూర్చోడమే ఇంక
హారిక : ఇప్పుడు గనక చిన్నా గాడు రాకపోతే మనం అడుక్కుతినాలి
సూర్య : అంటే వాడు లేకపోతే మేమేం పీకలేమా
కవిత : ఇన్నేళ్లు ఏం పీకావ్.. నువ్వు నోరు ముయ్యి.. హారిక నువ్వు చెప్పు
హారిక : వాడిని బతిమిలాడో బుజ్జగించో ఏదో ఒకటి చేసి ఇప్పుడున్న మన ఆస్తులు మొత్తం కలిపి వాడి చేతులో పెట్టండి.. వాడు అయితేనే మనల్ని గట్టెక్కించగలడు.. ఆ తరువాత వాడి పెళ్ళాన్ని చంపేసి ఇంకో పెళ్లి చేద్దాం.. అప్పుడు మళ్ళీ కట్నం వస్తుందిగా అప్పుడు చూద్దాం ఈలోగా మన ఫైనాన్స్ మానేజ్ చేసుకుంటే చాలు, ముందు పదండి వాడిని తీసుకొద్దాం.
సూర్య : వాడికి మాత్రమే ఎలా సాధ్యం అవుతుంది సంపాదించడం, మా వల్ల ఎందుకు కావట్లేదు.
హారిక : ఎందుకు అవ్వట్లేదంటే వాడు కష్టపడతాడు, వాడు సమర్ధుడు అంతే..
తెల్లారే అంతా కట్ట కట్టుకుని చిన్నా ఇంటికి పొయ్యారు వాడిని ఒప్పించి అక్షితని గట్టిగా అడిగేసరికి అక్షిత చిన్నా ఎలా అంటే అలా అని చెప్పింది.. చిన్నా కూడా ఒప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. లోపల ఎంత విషం దాచుకున్నా దాన్ని ప్రేమ రూపంలో చూపిస్తూ అందరూ కలిసి టూర్ కి వెళ్లారు, చాలా ఆనందంగా గడిపారు తిరిగి వచ్చాక చిన్నాకి పని అప్పగించి ఇక ప్లాన్ చెయ్యడం మొదలు పెట్టారు.
