చిన్నా : చెప్తా.. కోప్పడకూడదు మరి
లావణ్య : చెప్పు.. ఏం నడుస్తుంది ఈ బుర్రలో
చిన్నా : ఇక్కడంతా బలిసినోళ్లే కదా
లావణ్య : హా అయితే?
చిన్నా : ఎవ్వరు తప్పించుకోకుండా మొత్తం లాక్ చేసి
లావణ్య : చేసి
చిన్నా : అక్షిత చేతికి ఒక మెషిన్ గన్ ఇచ్చి మధ్యలో నిలబెడితే ఎలా ఉంటుందో ఆలోచించు
లావణ్య : అహ.. ఆమ్మో ఫస్ట్ హెడ్ షాట్ నాకే పడుద్ది
చిన్నా : హహ
లావణ్య : అవును మొన్న లాక్కేళ్ళింది.. ఏంటంట దాని గొడవ
చిన్నా : పాపం నేను మాట్లాడక పోయేసరికి బెంగ పెట్టుకుంది.. కొంచెం ఓదార్పు కోసం వెళ్ళా
లావణ్య : ఎలా పడేసావ్ రా దాన్ని
చిన్నా : ఇప్పుడు కాదు, అది మొదటి సారి నన్ను చూసినప్పుడే పడిపోయింది.. నా దెగ్గర బెట్టు చేసింది అంతే
లావణ్య : నిజంగా.. అవసరమా వాళ్ళతో
చిన్నా : వాళ్ళతో అంటే
లావణ్య : లో క్లాస్ మనుషులు.. ఆ మెంటాలిటీకి ఈ మెంటాలిటీకి సెట్ అవుద్దా అని
చిన్నా : తప్పు.. చెంపలేసుకో..
లావణ్య : అది కాదు
చిన్నా : ముందు సారీ చెప్పు
లావణ్య : సారీ
చిన్నా : ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు
లావణ్య : హ్మ్..
చిన్నా : అక్షిత పేరుకే అలా ఉంటుంది కాని చాలా మంచిది, తనకేం చేదు జ్ఞాపకాలు ఉన్నాయో మనకి తెలీదు కదా.. ఏ మనిషైనా కారణం లేకుండా అంత ద్వేషించలేరు కదా
లావణ్య : అవుననుకో.. ఏమో లే నువ్వైతే ఫిక్స్ అయ్యావ్ గా
చిన్నా : తనని ఫోటోలో చుసిన మొదటి క్షణమే
కవిత : హారికా.. చిన్నా మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరు
హారిక : ఏమో ఉండు వెళ్లి కనుక్కుని వస్తా అని చిన్నా వాళ్ళ వైపు నడిచింది
చిన్నా : లావణ్య.. అక్క హారిక.. అక్కా లావణ్య మేమిద్దరం ఒకటే కాలేజీ
లావణ్య : హాయ్ అండి
హారిక : హాయ్ లావణ్య అని మాట్లాడుతుంటే