సూర్య : నాకు ఇంట్రెస్ట్ పోయింది అని పైకి వెళ్ళిపోయాడు
కవిత : ఏంట్రా ఇదంతా
చిన్నా : విన్నావుగా మీ ఆయనకీ ఇంట్రెస్ట్ పోయిందట..
హారిక : తగలబెట్టారుగా నిరంజన్ గారు.
చిన్నా : దేనికండి వీళ్ళు.. అంటేనేమో హార్ట్ అయిపోతారు మా మనోభావాలు ఎవ్వరికి అవసరం లేదు.. డబ్బు మనదెగ్గర కావాల్సినంత ఉంది కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు.
హారిక : నా మీద పెట్టిందంతా నీ మీద రాబట్టాలని చూస్తున్నాడు
చిన్నా : ఎంత కావాలో చెప్పమని అప్పు చేసైనా పైసా తేడా రాకుండా చేతిలో పెడతాను.. అక్షితని మాత్రం వదిలే సమస్యే లేదు.
హారిక : సరే సరే ముందు నీ కోడళ్ళని చూడు భయపడుతున్నారు అనగానే వెళ్లి ఎత్తుకుని లోపలికి వెళ్లాను వల్ల కోసం కొన్న బొమ్మలని ఇవ్వడానికి.
నేను పిల్లలని తీసుకుని లోపలికి వెళ్ళగానే నాకు ఏదో తేడా కొట్టింది ఇక్కడే ఏదో తప్పు జరిగింది అని వెళ్లి అమ్మ పక్కన నిలుచున్నాను.
కవిత : వాడు..
హారిక : లోపల పిల్లలతో ఉన్నాడులే.. అయినా వీడెంటి ఇలా చేసాడు యవ్వారం మొదటికి వచ్చేలా ఉందే
కవిత : మీ నాన్న వచ్చే సంవత్సరం లోగా డబ్బు కట్టకపోతే నడి రోడ్డు మీదకి లాగుతారు.
హారిక : అస్సలు ఏం చేసాడని అన్ని అప్పులు అయ్యాయి