కవిత : ఏదో చేద్దామనుకున్నాడు ఇంకేదో అయ్యింది
హారిక : నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పుడున్న ఆస్తులేవి రేపు వాళ్ళు పెద్దయితే ఆనవు.. నాకు కొంత డబ్బు కావాలి.. వీడికి కట్నం వస్తే 25% అడిగినా ఎలాగో కాదనకుండా ఇస్తాడు అనుకున్నాను కాని ఇలా చేస్తాడు అనుకోలేదు.
కవిత : ఇప్పుడేం చేద్దాం
హారిక : ఏమైనా చెయ్యండి వాడు మాత్రం ఆ పిల్లని చేసుకోడానికి వీల్లేదు, అయితే లావణ్య లేకపోతే ఇంకో అమ్మాయి.. అయినా లావణ్య అయితే ఇంకా చాలా బెటర్. ఒక్కటే వారసురాలు. ఆస్తి మొత్తం మనకే
కవిత : అది మనకెందుకు ఇస్తుంది?
హారిక : ముందో వెనకో.. ఇంటి దాకా వచ్చిన ఆస్థి చేతికి రాకుండా పోతుందా.. ఏదో ఒకటి చెయ్యమూ.. ముందు వాడికి ఆ పిల్లని ఎలా దూరం చెయ్యాలో ఆలోచించు..
ఇదంతా వినగానే ముందుకు లోపలున్న నా దెగ్గరికి వెళ్ళాను, అరేయి సోంబేరి మోహమోడా అక్కడ అక్షితని నీకు దూరం చెయ్యడానికి ప్లాన్స్ వేస్తుంటే ఇక్కడ పిల్లలతో ఆడుతున్నావా అని చెడామడా తిట్టేసాను కాని కొంత సేపటికే అర్ధమయ్యింది.. నేను జరిగినవి చూడటం తప్ప ఏమి చెయ్యలేనని.
తెల్లారి పొద్దున్నే హాల్లో నాన్న ముందు కూర్చున్నాను.
సూర్య : ఏంట్రా
చిన్నా : అదే నా సంగతి ఏంటో తెలిస్తే మరి..
సూర్య : తెల్చడానికి ఏమి లేదు, ఆ అమ్మాయిని మర్చిపో.. తాపిగా చెప్పాడు పేపర్ చదువుకుంటూ
చిన్నా : కుదరని పని
సూర్య : అయితే నన్ను ఎదిరిస్తానంటావ్
చిన్నా : ఇందులో ఎదిరించడానికేం లేదు, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని.. నేను తనకి మాటిచ్చాను.
అప్పుడే అమ్మ మా దెగ్గరికి వచ్చింది.
కవిత : మరి మా మాట
చిన్నా : నేను మీకు నా పెళ్లి విషయంలో ఏ మాట ఇచ్చినట్టు గుర్తులేదే.. నాన్నకి బిజినెస్ లోకి దిగుతానని మాటిచ్చాను.. ఇష్టం లేకపోయినా దిగాను కాబట్టి నా తిప్పలేవో నేను పడి లాభాలు తెస్తున్నాను.. కాని ఈ ఒక్క విషయంలో నా మాట వినండి.. నేను చాలా సంతోషంగా ఉంటాను. ప్లీజ్..
సూర్య : కుదరదు
చిన్నా : ఓకే అయితే నాకు కుదరదు
సూర్య : ఆలోచించుకో.. జీరో నుంచి కష్టపడాలి.. సైకిల్ కూడా ఉండదు నీ చేతిలో నన్ను కాదంటే
సోఫా లోనుంచి లేస్తునే చేతికున్న ఉంగరం తీసి ముందున్న టీ పాయి మీద పెడుతూ.. పిచ్చి నాన్నా డబ్బుకి ఆశ పడేవాడిని అయితే ఈ పాటికి నీ కాళ్ళ మీద పడి ఉండేవాడిని.. నాలో ఒక బిజినెస్ మాన్ ని చూసిన నువ్వు.. నా ప్రేమని నా ఇష్టాలని చూడలేక పోయావు అంటూ మెడలో ఉన్న చైను.. బ్యాక్ పాకెట్ లో ఉన్న పర్సు అన్ని అక్కడే విసిరేసి అమ్మ దెగ్గరికి వెళ్లి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను.
చిన్నా : అమ్మా.. మళ్ళీ కలుద్దాం.. నా పెళ్ళికి మాత్రం కచ్చితంగా నువ్వు రావాలి.. ఇష్టం లేకపోయినా. అమ్మ కోపంగా ఉన్నా నాకు వాళ్ళ మీద కోపం లేదు. కాని ఈ బెదిరింపులకి లొంగే వాడిని కాదని వాళ్ళకి తెలియాలిగా.. నేను లేకుండా వాళ్ళు మాత్రం ఉండగలరా అన్న ధైర్యంతోనే అన్ని వదిలేసి నడుచుకుంటూ అక్షిత వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను.
అక్షిత ఇంటి తలుపు కొట్టాను
అక్షిత : ఎవరు
చిన్నా : ఆ నీ మొగుడ్ని
వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.
అక్షిత : నువ్వెంట్రా ఇక్కడా
చిన్నా : అడ్డు తప్పుకో.. అని పక్కకి నెట్టేసి వెళ్లి హాల్లో కింద గోడకి ఆనుకుని కూర్చున్నాను
అక్షితతో పాటు తన ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వచ్చి నా చుట్టూ కూర్చున్నారు.
అక్షిత : ఏమైందిరా
చిన్నా : మనం పెళ్లి చేసుకుందామే.. ఆగలేకపోతున్నాను
అక్షిత ఫ్రెండ్స్ నవ్వులు
అక్షిత : ఉండండే.. మీరంతా పోండి ఇక్కడ నుంచి.. అని అందరినీ తరిమేసి చిన్నా పక్కన కూర్చుంది.
అక్షిత ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాను.
అక్షిత : ఏమైంది
చిన్నా : మన విషయం చెప్పాను
అక్షిత : ఏమన్నారు
చిన్నా : వద్దన్నారు
అక్షిత : ఊహించిందే.. ఇప్పుడేం చేస్తావ్
