ఆట ప్రారంభమవుతుంది 3 84

పొద్దునే ఫోన్ రింగ్ అవుతుంటే బద్దకంగా కళ్ళు తెరిచాను. ఫుల్ గా వెలుతురూ దిగ్గున లేచి కూర్చున్నాను. చందన ఫోన్ చేసింది రెడీ అయి నా కోసం వెయిట్ చేస్తున్నాము అని. నేను గబా గబా రెడీ అయి వెళ్ళాను.
హాస్పిటల్ కి వెళ్లి, వందనను పూర్తిగా చెక్ అప్ చేయించాక, డాక్టర్ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు….నెక్స్ట్ వీక్ ఆపరేషన్ పెట్టుకుందాము అని చెప్పేసరికి అందరం ఊపిరి పీల్చుకున్నాము. ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళతోనే ఉన్నాను. నిన్నటికి, ఈ రోజు కి వాళ్ళ ముఖాల్లో ఆనందం లో స్పష్టమైన తేడా కనిపించేసరికి ఒక మంచి పని చేస్తున్నానన్న భావన కలిగి ఏమో నా మనసుకు కి కూడా ఎదో తెలియని ఆనందం వేసింది.
నైట్ ఇంటికి వొచ్చాక అమ్మకి ఫోన్ చేశాను. హాస్పిటల్ విషయం చెప్తే అమ్మ కూడా సంతోషించింది. ల్యాండ్ అమ్మిన విషయం కూడా చెప్పాను. రేపు మిగిలిన డబ్బులు కూడా వొస్తాయి అన్న విషయం కూడా. అమ్మ నీ ఇష్టం అని మాత్రమే చెప్పింది.
ఉదయమే అదే పనిగా ఫోన్ రింగ్ అవుతుంటే నిద్రలోనే ఎత్తాను ఫోన్. అవతల సైడ్ నుండి వినూత్న గొంతు, వినూత్న చెప్తున్న విషయం విని “వాట్………….”అంటూ దిగ్గున లేచి కూర్చున్నాను, నిద్ర మత్తు మొత్తం పోతుంటే.
#@#@#@#@
వినూత్న చెప్పేది అర్ధం కాక “ఎం మాట్లాడుతున్నావు ..వినూత్న….నీ కేమైనా మతి పోయిందా….”అన్నాను. “నిజం……దేవదానం గారు passed away…నేను కూడా నమ్మలేకపోయాను…..ఢిల్లీ లో హోటల్ రూమ్ లో నిద్రలోనే చనిపోయారు, కార్డియాటిక్ అరెస్ట్ అయ్యి…”అంది వినూత్న. “ఎప్పుడు తీసుకొస్తున్నారు….” అన్నాను. ” మామ్ ..వెళ్లారు…మధ్యాహ్నం వరకు రావొచ్చు….”అంది. ఫోన్ పెట్టేసి అలాగే వెళ్లి సోఫాలో కూర్చున్నాను. టీవీ ఆన్ చేశాను. “ప్రముఖ పారిశ్రామికవేత్త అనుమానాస్పద మృతి….”అంటూ న్యూస్ లో చెప్తుంటే అర్ధం కాలేదు. చావు ని కూడా అందంగా రక్తి కట్టేట్టుగా, సస్పెన్సు నవల లా చెప్తుంటే ఎందుకో ఏదోలా అనిపించింది.
వాడు చెప్పేది, నేను చూసింది ఎనలైజ్ చేసుకుంటే ఎందుకో నాకు కూడా కొంచెం అనుమానం వొచ్చింది. అంతలో లారీసా గుర్తొచ్చి బాధగా అనిపించింది. తన వాళ్ళందరిని వొదిలి దేశం కానీ దేశం వొచ్చి, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి….జీవితానికి ఏది గారంటీ…..ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు….తల విదిల్చుకొని బాత్రూం లోకి దూరాను.
మధ్యాన్నం తర్వాత దేవదానం ఇంటికి వెళ్ళాను. చాల రష్ గా ఉంది. కనీసం లారీసా ని కలవడానికి కుదరలేదు. మెసేజ్ పెట్టాను deepest condolences అని. Cremation అయ్యేసరికి సాయంత్రం అయ్యింది, రేపు ఒకసారి లారిసాని పర్సనల్ గా కలవాలి అనుకున్నాను, స్మశానం నుండి సరాసరి ఇంటికి వొచ్చి స్నానం చేసి, ఎందుకో పబ్ కి వెళ్ళాలి అనిపించింది. ఇంటికి తాళం పెట్టి బయటకు వొస్తుంటే చందన ఫోన్ చేసింది. “సర్ …బిజీ నా….అమ్మ గారు కూడా లేరు కదా….లంచ్ కి కూడా రాలేదు….డిన్నర్ కి ఏమైనా వొస్తారా…..”అంది. “లేదు చందన…రేపు కలుస్తాను…ఈ రోజు కొంచెం..బిజీ…”అని తనతో చెప్పి పబ్ కి వెళ్లేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది.
లోపలి వెళ్లేసరికి వినూత్న ఫ్రెండ్స్ తో కూర్చొని ఉంది. నన్ను చూసి నా దెగ్గరకు వొచ్చి విష్ చేసింది. ఆల్రెడీ తాను తాగి ఉంది. నేను వెళ్లి ఒక టేబుల్ దెగ్గర కూర్చున్నాను. తాను నాతో పాటే వొచ్చి నా పక్కన కూర్చొని “మామ్ ని కలిసావా…..”అంది. “లేదు…..చాల రష్ గా ఉండే కదా…రేపు ట్రై చేస్తాను….”అన్నాను.
“అవసరం లేదు లే…”అంది కొంచెం నిర్లక్ష్యంగా. నాకు అర్ధం కానట్టుగా చూసాను తన వైపు. “ఎంతో కొంత డబ్బు వచ్చింది కదా….నువ్వేమి documents ఇవ్వలేదు కదా ల్యాండ్ వి…సర్ నే లేరు ..ఇంకా ఆ డీలింగ్ ఏంటి….నేను కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నాను…నెక్స్ట్ వీక్….”అంది వినూత్న. నేను నవ్వుతు తన వైపు చూసాను. నేను ఏమి మాట్లాడకుండా బేరర్ తెచ్చిన మందు ఒక సిప్ చేసి, “ఢిల్లీ కి వెళ్లి ఎం చేస్తావు…”అన్నాను. “ఏముంది….నువ్వో యాభై ఇచ్చావు….సర్ దెగ్గర ఇంచుమించు ఒకటి వరకు గుంజాను. చనిపోతాడని తెలియదు కదా ….లేకపోతె ఇంకా గుంజేదాన్ని….ఇప్పుడు డబ్బంతా దాని సొంతమే….” అని నా మందు గ్లాస్ తీస్కొని మొత్తం నోట్లో పోసుకుంది. “దేని సొంతం….”అన్నాను, “అదే….ఆ బిచ్ …..లారీసా సొంతం…..హాయిగా అది రష్యా కి చెక్కేస్తుంది…డబ్బంతా తీస్కొని ……రేపో మాపో….” అంది వినూత్న ఫ్రస్ట్రట్ అవుతూ. ఎదో అర్ధం అయి కానట్టుగా అనిపిస్తుంది. అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను. మల్లి తానే “డీల్ అవ్వకపోయిన యాభై లక్షలు ఇచ్చావు…thank యు వెరీ మచ్….”అంది వినూత్న. అంతలో తన ఫ్రెండ్ పిలుస్తుంటే, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి వినూత్న వెళ్ళిపోయింది.
ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవదానం నార్మల్ గా చనిపోలేదనిపించింది. మినిమం curtosy సేక్ లారీసా ని కలవాలని డిసైడ్ చేసుకున్నాను.
మరుసటి రోజు ఉదయమే రెడీ అయ్యి చందన ఇంటికి వెళ్ళాను. “నిన్న రాలేదు మీరు…..చాల వెయిట్ చేసాము తెలుసా…”అంది వందన. నేను నవ్వుతు “కుదరలేదు నిన్న…అవును….నువ్వు టాబ్లెట్స్ వేస్కుంటున్నావా….డాక్టర్ ఇచ్చినవి….”అన్నాను సోఫాలో కూర్చుంటూ. చందన కిచెన్ లో నుండి వొస్తూ “లేదు సర్….చాల బలవంతం చేయాల్సి వొస్తుంది …..”అంది నవ్వుతు. “చాల చేదుగా ఉన్నాయి టాబ్లెట్స్…..”అంది వికారంగా ముఖం పెట్టి వందన, వొచ్చి నా పక్కన కూర్చుంది. “తాతయ్య…ఎక్కడ..”అన్నాను. “బోర్ గా ఉంది అని అలా బయటకు వెళ్లారు…..”అంది చందన.
బ్రేక్ ఫాస్ట్ అక్కడే చేసి, వాళ్ళతో మాట్లాడుతుంటే లారీసా ఫోన్ చేసి “ఒకసారి రాగలవా ఇంటికి….”అంది. “సరే..”అని అంటుండగానే, “సరే ….ఇంటికి వొచ్చాక మాట్లాడుతాను….”అంటూ ఫోన్ పెట్టేసింది.
నేను బయటకు వొస్తుంటే “లంచ్ కి వొస్తారా..”అంది చందన. “ట్రై చేస్తాను…”అని చెప్పి లారీసా ఇంటికి బయలుదేరాను.
ఎంత ఆలోచించిన లారీసా ఎందుకు పిలిచిందో అర్థంకాలేదు. లారీసా ఇంటికి వెళ్ళాను, ఇంట్లో నలుగురైదుగురు బంధువులు ఉన్నారు. నన్ను చూసి తన పర్సనల్ రూమ్ లోకి తీసుకెళ్లింది. “thank యు ఫర్ యువర్ మెసేజ్….”అంది లారీసా. “ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు…”అన్నాను ఏమనాలో అర్ధం కాక, తనను పరిశీలనగా చూస్తూ. తనలో దేవదానం పోయిన బాధ పెద్దగా కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వేసింది. తాను నా వైపు చూసి “నీకంత అయోమయంగా ఉంది కదా….”అని గట్టిగా నవ్వింది. నేను వింతగా తన వైపు చూసాను. తాను నవ్వు ఆపి ” దేవదానం చనిపోలేదు…..”అంటూ నా వైపు చూసింది. “వాట్…..”అన్నాను అర్ధం కాక. తనను చూస్తుంటే ఎదో కొత్తగా అనిపించింది. “చనిపోలేదు…..చంపేసాము….its a pre planned murder…..”అంది సీరియస్ గా. నాకు దిమ్మ తిరిగిపోయినంత పని అయ్యింది. Something అని ఊహించాను కానీ, లారీసా సైడ్ నుండి ఉహించలేకపోయాను.
కానీ భర్తని చంపుకుంటే తనకు ఏంటి లాభమో అర్ధం కాలేదు నాకు. “నీ మైండ్ లో చాల ఆలోచనలు తిరుగుతున్నాయి కదా…..ఈ మర్డర్ వెనకాల చాల పెద్ద తలకాయలు ఉన్నాయి లే…నీకు చెప్పిన అర్ధం కాదు….నేను next month రష్యా వెళ్ళిపోతున్నాను…..ఇక్కడ పెట్టబోయే ఫ్యాక్టరీ cancel చేసుకొని నార్త్ సైడ్ పెడుతున్నాము….అప్పుడప్పుడు ఇండియా వొస్తాను కానీ, ఇక్కడకు రావడం కుదరదు. ఇవన్నీ నీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే..ఎందుకో తెలియదు కానీ నువ్వు నాకు నచ్చావు …”అంటూ ఆపి నా వైపు చూసింది. అంత అర్ధం అయిపొయింది, ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు అనిపించింది. “దేవదానం గారు నాకు రెండు కోట్లు ఇచ్చారు ల్యాండ్ గురించి….సో, వారే లేరు ఇప్పుడు….మీకు ఎప్పుడు ఇవ్వమంటారు..”అన్నాను. తాను నవ్వి “అవసరం లేదు..నువ్వే ఉంచుకో…..అది ఇచ్చిన సంగతి కూడా నాకు తెలియదు..వినూత్న కూడా చెప్పలేదు….”అంది. ఇప్పుడు అర్ధం అయింది వినూత్న ఎందుకు చెప్పలేదో, తనకు నేను యాభై లక్షలు ఇచ్చాను కదా అది ఎక్కడ బయటపడిపోతుందేమో అని బయపడినట్టుగా ఉంది, ఒకరిని మించి ఒకరు తెలివితేటలూ చూపిస్తుంటే నవ్వు వొచ్చింది నాకు. నేను నవ్వడం గమనించి “నాకు తెలుసు ఇదంతా నీకు గమ్మత్తుగా ఉంది అని….నిన్ను ఎందుకు పిలిచాను అంటే….ఇక్కడ ఆఫీస్ మాకు చాల అవసరం…సౌత్ సైడ్ హబ్ ఇది….ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఒక నమ్మకమైన మనిషి కావాలి ….నీ కంటే నమ్మదగిన వ్యక్తి ఎవరు కనిపించలేదు నాకు….”అంటూ నా వైపు చూసింది.