ఆట ప్రారంభమవుతుంది 3 84

అమ్మతో మాట్లాడక, సోఫా లో వెనక్కు వొరిగి అలాగే కళ్ళు మూసుకున్నాను. సిరి, హేమలత గుర్తుకు వొచ్చారు. మనసంతా బాధగా అనిపించింది. సిరి ఉండి ఉంటె నా జీవితం ఇంకోలా ఉండేదేమో…..లేని వాటి మీదే మనకు మమకారం ఎక్కువగా ఉంటుందా…ఏమో…. అన్ని గజిబిజి ఆలోచనలు…డబ్బు వుంది….సోషల్ స్టేటస్ వుంది..నా చిన్నప్పటి జీవితం గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న స్థాయికి బంధువుల్లో కూడా మంచి పేరు వుంది…అన్ని ఉన్న ఎదో అసంతృప్తి…..ఎందుకు ….ఎందుకు….అలా ఆలోచిస్తుంటే నా మనసు పెళ్లి వైపు ఆలోచించింది…..పెళ్లి లేకుండా ఇవన్నిటికి విలువ ఉండదా……ఏమో…అంత గజిబిజి….సరే పెళ్లి ఇంపార్టెంట్ అయినప్పుడు…..పెళ్లి ఐన వారు కూడా చాల సంతోషంగా ఉన్నట్టుగా పెద్దగా నాకు కనిపించలేదు…ఎదో కొద్దీ మంది తప్ప….మరి సంతోషం ఎక్కడ వుంది…..డబ్బులో లేదా….relationships లో లేదా…..మరి ఎక్కడ వుంది….ఏంటో అంత గందరగోళం…..బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా…..ఏమో …ఏమో….ఇలా ఆలోచనల ఝరి లో ఉక్కిరిబిక్కిరి అయిపోయి అలాగే కలత నిద్ర పోయాను.
మరుసటి రోజు ఉదయమే దేవదానం ఫోన్ చేసాడు ఆఫీస్ కి రమ్మని. నేను 11 కి వెళ్ళాను, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు వెళ్ళగానే “రెండు కోట్లు అడ్వాన్స్ చాలా ? “అన్నాడు దేవదానం. సరే అన్నట్టుగా చూసాను. “కాష్ or డి డి ఏది కావాలి? “అన్నాడు. నేను కొంచెం అలోచించి “కాష్…..”అన్నాను. “నేను విన్ను కి చెప్తాను….కలెక్ట్ చేస్కో….నేను ఢిల్లీ వెళ్తున్నాను…..వొచ్చాక రిమైనింగ్ ప్రాసెస్ ఫినిష్ చేద్దాము….అన్నట్టు….ఆ ట్రేడింగ్ ఎలా చెయ్యాలో నాకు నేర్పించవయ్యా….”అన్నాడు నవ్వుతు. నేను నవ్వుతు “అలాగే సర్…చూద్దాము….మీకు నాకు ఇద్దరకు టైం దొరికినప్పుడు తప్పకుండ నాకు తెలిసింది చెప్తాను….”అన్నాను. “వెల్ ….బాయ్….సి యు ఆన్ నెక్స్ట్ మండే…..”అంటూ తాను వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక వినూత్న వొచ్చింది బాగ్ తీస్కొని. “సర్ మీకు ఇవ్వమన్నాడు…రెండు కోట్లు….లెక్క చూస్కోండి….”అంది నా వైపు చూసి. “నేను మనుస్యుల్ని నమ్ముతాను…..”అంటూ తన వైపు చూసాను. తాను తల దించుకుంది. “అవును…వినూత్న…ఈ డీల్ మీరు అనుకున్నట్టుగా ఫినిష్ అయితే నీకు ఆ జావేద్ కి ఎంత వొచ్చేది…..”అన్నాను స్ట్రయిట్ గా తన వైపు చూస్తూ. తాను నా కళ్ళలోకి చూసి ఒక్క క్షణం ఆగి “టు బి హానెస్ట్….వన్ క్రోర్… అది చాల పెద్ద అమౌంట్ నాకు….”అంది ఎలాంటి సంకోచం లేకుండా. నేను ఏమి మాట్లాడకుండా బాగ్ లోనుంచి డబ్బు తీసి లెక్కపెట్టి “మీ బాస్ అంత నేను ఇవ్వలేను కానీ ….50 లక్షలు తీస్కో….జావేద్ కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు….అతని సంగతి నేను చూసుకుంటాను…..”అన్నాను డబ్బు టేబుల్ మీద పెట్టి లేస్తూ. తాను నోరెళ్లబెట్టింది. “వెల్……వినూత్న….నైస్ ఫర్ యువర్ కంపెనీ…..ఈ రెండు మూడు రోజులు చాల కష్టపడ్డావు….”అంటూ నేను అక్కడ నుండి బయలు దేరి వొస్తుంటే, తానూ పిలిచింది కానీ నేను వెనక్కు కూడా చూడ కుండ వొచ్చేసాను.
ఇంటికి వొచ్చి అమ్మకు ఫోన్ చేశాను. బోర్ గా ఉంది నెక్స్ట్ వీక్ వొస్తాను రా అంది. సరే అమ్మ నీ ఇష్టం అని అమ్మకు చెప్పి. జావేద్ దెగ్గరకు బయలు దేరాను.
నేను వొస్తాను అని ఉహించనట్టున్నాడు నేను వెళ్ళగానే కారు దెగ్గరకు పరుగున వొచ్చాడు. “అన్నా ఫోన్ చేయలేదు….”అన్నాడు. నేను నవ్వుతు కారు దిగి “అదే ఫెన్సింగ్ పని ఎంత వరకు వొచ్చిందో చూద్దాము అని వొచ్చాను….”అన్నాను కారు లో నుండి బాగ్ తీసి భుజానికి వేసుకుంటూ. “అన్నా…అది….వర్కర్స్ ఎవరు దొరకలేదు ఇంకా…..”అన్నాడు నసుగుతూ జావేద్. “అవునా….సరే పద…కాఫీ తాగాలి అని ఉంది …”అన్నాను తన వైపు చూసి.
ఇంట్లోకి వెళ్ళాము, నన్ను చూసి వాళ్ళ నాన్న అమ్మ పలకరించారు. నేను చైర్ లో కూర్చుంటే కాఫీ తీస్కొని అలియా వొచ్చింది. నా వైపు వోరగా చూసి మెల్లిగా నవ్వి కాఫీ ఇచ్చింది. నేను బాగ్ లో నుండి 20 లక్షలు తీసి టేబుల్ మీద పెట్టి “జావేద్…..ఇది తీస్కో…..”అన్నాను. అర్ధం కానట్టుగా నా వైపు చూసాడు. “ల్యాండ్ అమ్మాను…..ఇది నీ షేర్…..వినూత్న నీకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేది కాదు….”అన్నాను సూటిగా తన వైపు చూసి. చప్పున తల దించుకున్నాడు జావేద్. నేను కాఫీ తాగి లేచి “ఫెన్సింగ్ ఎం అవసరం లేదు ….జావేద్…..కావాలంటే నీ ల్యాండ్ కి వేయించుకో….”అంటూ బయటకు రాబోతుంటే “గల్తీ హోగయి అన్నా…..ముజే మాఫ్ కరో…..”అన్నాడు వొచ్చి నా చేతులు పట్టుకుంటూ “పర్లేదు….జావేద్….నీ తప్పమి లేదు….ఆ డబ్బు ఉంచుకో….చెల్లి పెళ్ళికి పనికొస్తుంది…..”అన్నాను. జావేద్ నాన్న కల్పించుకుంటూ “బేటా…ఉనే మాఫ్ కరో హమ్ సబ్ లోగోమ్ కో దేఖ్ కర్…”అన్నాడు. “అదేం లేదు..ఛీచా …..ముఝే కుచ్ బి గుస్సా నహి జావేద్ పర్….”అన్నాను జావేద్ నాన్న వైపు చూసి. జావేద్ వైపు చూసి “ఇవన్నీ వొదిలేయి….హోటల్ బిజినెస్ ఎలా ఉంది…..”అన్నాను. “బానే ఉంది అన్నా….అన్నా అలియా కి ఏదైనా జాబ్ చూడన్న… “అన్నాడు జావేద్.
“జాబ్ నా…నీ హోటల్ బిజినెస్ బానే ఉంది కదా..జాబ్ ఎందుకు ….”అన్నాను జావేద్ వైపు చూసి. “ఎం లేదన్న….తనకు బోర్ గా ఉందంట…డిగ్రీ కూడా చేసిందికదా….”అన్నాడు నసుగుతూ జావేద్. “సరే…ట్రై చేస్తాను…..”అని చెప్పి అక్కడినుండి బయలు దేరాను.
కార్ డ్రైవ్ చేస్తుంటే చందన ఫోన్ చేసింది. “హౌ అర్ యు సర్…”అంది. “ఐ అం ఫైన్…వాట్ అబౌట్ యు….”అన్నాను. “సర్ పక్క గా వస్తారా సాటర్డే మా ఉరికి …..ఎందుకంటే నేను పర్మిషన్ తీసుకోవాలి…..”అంది చందన. “హ….నేనే ఫోన్ చేద్దాము అనుకున్నాను ఈ రోజు…sure గా వెల్దాము. సాటర్డే మార్నింగ్ నేను మీ హాస్టల్ కి వొస్తాను…
ప్లేస్ చెప్పు…” అన్నాను. తాను ఎలా రావాలో చెప్పింది. తనతో కాసేపు మాట్లాడి, ఇంటికి వొచ్చాను.
ఎందుకో కాసేపు ప్రశాంతంగా పడుకోవాలి అనిపించింది. స్నానం చేసి, హాయిగా పడుకున్నాను సాయంత్రం వరకు.
నాకున్న ఫ్లాట్స్ లో ఒక ఫ్లాట్ tenant కాళీ చేసి వెళ్లారు, దానికి పెయింటింగ్ వేయించడానికి పెయింటర్ ని పిలిచాను, వాడికి వర్క్ చెప్పి నైట్ బోర్ గా ఉందని క్లబ్ కి వెళ్ళాను, పాత ఫ్రెండ్స్ కి కల్సి చాల రోజులు అయ్యింది అని.
సాటర్డే చందన హాస్టల్ కి వెళ్ళాను. ఫ్రెండ్స్ అందర్నీ పరిచయం చేసింది. అందరం కలిసి పక్కన ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి కాసేపు అక్కడ ఉండి, చందన నేను వాళ్ళ ఉరికి బయలు దేరాము.
దారిలో చందన తన గురించి అంత చెప్పింది. ఎలా ప్రోబ్లెంస్ పేస్ చేసింది. వాళ్ళ ఉరికి చేరుకునేసరికి సాయంత్రం ఆరు అయ్యింది. అది చిన్న పల్లెటూరు, ఊర్లోకి కారు వొచ్చేసరికి జనాలు చాలా మంది చందన ఇంటికి వొచ్చారు. చందన వాళ్ళది చిన్న ఇల్లు. చందన వాళ్ళ తాతను, చెల్లిని పరిచయం చేసింది. జనాల హడావిడి తగ్గాక. ఇంటి ముందు మంచంలో కూర్చున్నాను. చందన వాళ్ళ తాత ఆ ఊర్లో ఉన్న బాధల గురించి చెప్తుంటే విన్నాను.
చందన చెల్లి వొచ్చి నా పక్కన కూర్చుంది, నేను తల మీద చేయి వేసి నిమిరి ” వొస్తావా….మీ అక్క దెగ్గరకు…”అన్నాను చిరునవ్వుతో. “ఓ…..కానీ అక్క అక్కడ ఉంచుకోవడం కుదరదని చెప్పింది….”అంది నా వైపు చూస్తూ. నేను నవ్వుతు “నీ పేరేంటి…..”అన్నాను. “వందన….”అంది తను. “రేపు వెల్దాము…. వొస్తావా….మాతో పాటు….”అన్నాను. నిజమా అన్నట్టుచూసింది అపనమ్మకంగా. నేను నవ్వుతు వాళ్ళ తాతయ్యతో “వందన …కి ట్రీట్మెంట్ ఇప్పిద్దాము అనుకుంటున్నాను….మీరు కూడా రండి….వాళ్ళతో పాటు మీరు ఉంటె వాళ్ళకి దైర్యంగా ఉంటుంది…..”అన్నాను. “మీకెందుకు బాబు అంత శ్రమ….అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం…..గవర్నమెంట్ ఆఫీస్ లో దరఖాస్తు చేసాము…. …MLA గారిని కూడా కలిసాము… ఏమవుతుందో చూద్దాము… వాళ్ళు రేపు మాపు అంటూ తిప్పుతున్నారు……”అన్నాడు నిట్టూర్చుతూ వాళ్ళ తాత. “అవును సర్…మీ కెందుకు అంత శ్రమ…..మీరు సరదాకి ఊరుకి చూడడానికి వొస్తారనుకున్నాను…”అంది మధ్యలో కల్పించుకుంటూ చందన. నేను అంతా విని వందన వైపు తిరిగి “ఏంటి …వొస్తావా…”అంటూ తన వైపు చిరునవ్వుతో చూసాను. “హా…కానీ…..”అంటూ అక్క వైపు, తాత వైపు చూసింది. నేను చందన వైపు చూసి “చూడు చందన….సెంటిమెంట్స్ అన్ని పక్కన పెట్టి నాతో రండి….తనకు ట్రీట్మెంట్ చాల అవసరం….మీకు కావాల్సిన ఆరెంజిమెంట్స్ అన్ని చేసే వొచ్చాను…..తాతను కూడా తీస్కొని రా…మీకు మోరల్ సపోర్ట్ గా ఉంటుంది….అమ్మతో కూడా చేప్పాను మీ విషయం…ఏమైనా హెల్ప్ కావాలంటే అమ్మ కూడా మీకు సహాయంగా ఉంటుంది…ఇంకేమి ఆలోచించకండి…”అన్నాను ఫిర్మ్ గా చందనతో. “కానీ …సర్…..ఇది చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం…..మేము మీకు అనవసరంగా బర్డెన్ అవుతామేమో….”అంది చందన. “అవును…బాబు…అమ్మాయి చెప్పింది కూడా కరెక్ట్ నే….”అన్నాడు చందన తాత.
“మీరు అవన్నీ ఎం ఆలోచించకండి….డబ్బుకి ఎం ఇబ్బంది లేదు నాకు…..”అన్నాను వాళ్ళతో. వాళ్లకు ఇంకా ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. వందన కళ్ళలో ఒక ఫ్లాష్ లాంటి వెలుగు చూసి ఎందుకో కొంచెం సంతోషంగా అనిపించింది నాకు. రాత్రి భోజనాలు అయ్యాక ఆ ఊరి సర్పంచ్ వొచ్చాడు. స్కూల్ శిధిలావస్థలో వుంది సాధ్యమైతే ఏమైనా హెల్ప్ చేయమని అడిగాడు. ట్రై చేస్తాను అని చెప్పాను తనతో.

ఉదయమే వాళ్ళను తీస్కొని సిటీ కి బయలుదేరుతుంటే ఊరి వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం వొచ్చారు. సిటీ లో ఎంటర్ యేపుడు పెయింటర్ కి ఫోన్ చేశాను. ఫ్లాట్ రెడీ అని చెప్పాడు తాను. సరాసరి ఫ్లాట్ దెగ్గరకు తీసుకెళ్ళాను.

2 bhk ఫ్లాట్ చూసి ” ఇంత పెద్దది ఎందుకు సర్….”అంది చందన. “ఈ ఫ్లాట్ అయితే హాస్పిటల్ కూడా దేగ్గర్లో ఉంటుంది…ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడాను…..రేపు ఒకసారి వందనను తీసుకెళ్లాల్సి ఉంటుంది….”అన్నాను. నాకు తెలిసిన ఫర్నిచర్ షాప్ కి ముందే ఫోన్ చేసి పెట్టాను, ఫర్నిచర్ ఏమేమి కావాలో. అతను కూడా ఫర్నిచర్ పంపించాడు.
“చందన ఫర్నిచర్ ఎక్కడెక్కడ కావాలో పెట్టించు…నేను వందన మాల్ కి వెళ్లి వొస్తాము..”అని వందనను తీస్కొని బయటకు వొచ్చాను.
కారు లో కూర్చుంటూ ” మీకు……. నాకు ఎందుకు హెల్ప్ చేయాలి అనిపించింది….అందరు నేను ఎక్కువ రోజులు బ్రతకను అన్నారు ఊర్లో….ట్రీట్మెంట్ తీసుకోకపోతే .”అంది నా వైపు చూసి వందన. నేను తన తల మీద చేయి పెట్టి వెంట్రుకలను రాస్తూ “నీకు ఏమి కాదు……కాకపోతే నువ్వో ప్రామిస్ చేయాలి….”అన్నాను నవ్వుతూ. తాను నా చేతిలో చేయి వేసి ప్రామిస్ అంది. “నేను ఇంకా ఏమి చెప్పలేదు కదా….”అన్నాను నవ్వుతు. “నా కోసం ఇంత చేస్తున్నారు….నేను జస్ట్ ప్రామిస్ కూడా చేయలేనా…..”అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను ఒక్క క్షణం స్టన్ అయ్యాను తన మెటురిటి అఫ్ మైండ్ ని చూసి. “చిన్న ప్రామిస్ నేలే…నువ్వు బాగా చదువుకోవాలి…..సరే నా….”అన్నాను, తాను నవ్వుతు సరే అన్నట్టుగా చూసింది.
దారిలో తన స్కూల్ విషయాలు చెప్తుంటే విన్నాను. కొంచెం టైం లోనే తాను చాల క్లోజ్ అయ్యింది నాకు, infact చందన కంటే కూడా. మాల్ లో కి వెళ్ళాక ఇంటికి కావాల్సిన సామాను తననే సెలెక్ట్ చేస్కో మన్నాను. ఆ అమ్మాయి చాల ప్లాన్డ్ గా ఏది అవసరమో అది కొంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. చిన్నప్పుడు నాన్నతో కలిసి కిరానా షాప్ కి వెళ్లిన రోజులు గుర్తొచ్చాయి.

మేము ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా నీట్ గా సర్దిపెట్టింది చందన. తెచ్చిన సామాను ఇద్దరు కలిసి కిచెన్ లో సర్దడానికి వెళ్లారు. నేను తాత ఎదురుగ వెళ్లి కూర్చున్నాను. “దైవం మానుష రూపేణా…..”అన్నాడు నా వైపు చూసి నవ్వుతు, చేతులెత్తి నమస్కరిస్తూ. నేను సోఫా లో నుండి లేచి వెళ్లి తన చేతులు పట్టుకొని “అయ్యో…మీరు పెద్దవారు….అలా నమస్కరించకూడదు చిన్నవాళ్లకు….”అన్నాను నవ్వుతు. “పెద్దరికం వయసు తో రాదు బాబు….ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటివాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే అందరి కంటే పెద్దవాళ్ళు…..”అన్నాడు నా చేతులు పట్టుకొని. నాకేమనాలో అర్ధం కాలేదు కాసెపు. అంతలో చందన వొచ్చి “సర్ కిచెన్ లో స్టవ్ ఆరెంజ్ చేశాను పాలు పొంగించండి…”అంది నాతో. “నువ్వే చేయి…చందన ఇది ఇప్పుడు నీ ఇల్లు…..”అన్నాను తన వైపు నవ్వుతు చూస్తూ. తన కళ్ళు చెమరించడం నేను గమనించాను. తాను వెళ్లి పాలు పొంగించి, కాఫీ తీస్కొని వచ్చింది.
నైట్ అక్కడే భోజనం చేసి, ఇంటికి వొచ్చాను, మార్నింగ్ రెడీ గా ఉండమని చెప్పి. ఇంటికి వొచ్చి ఇలా పడుకున్నానో లేదో అలసట వల్ల నిద్ర పట్టేసింది. ఏ మధ్యరాత్రో అనుకుంట కలలోకి సిరి వొచ్చి మెచ్చుకున్నట్టుగా చూసినట్లనిపించి దిగ్గున లేచి కూర్చున్నాను. ఎదో తెలియని ఆనందం తో కూడిన ఆశ్చర్యం వేస్తుంటే పిల్లో తల కిందకు లాక్కొని, కాళ్లు ముడుచుకొని పడుకుంటే, సిరి వొడిలో పడుకునట్టుగా అనిపించి కళ్ళు మూసుకున్నాను, ఎలాంటి భావాలు లేకుండా.