ఊహించనిది Part 5 85

పక్క ఊరి వాళ్ళు వెళ్ళిపోయారు అని నిర్ధారించుకొని రాము కాలేజ్ గోడ దూకి బయటకు వచ్చాడు .రాము అల గోడ దూకి రావడం అదే కాలేజ్ లో చదివే రాజు చూసాడు..

రాజు…అరేయ్ ఈ రాము అన్న ఎంటి ఈ టైం లో కాలేజ్ గోడ దూకి వస్తున్నాడు అనుకుంటూ సరే లే నాకు ఎందుకు లే అడిగితే కొడతాడు అనుకుంటూ పక్కన ఉన్న కాలువ కట్ట కి వెళ్ళాడు..

ఇటు రాహుల్ సైదులు తో కలిసి మందు కొడుతూ అవును సైదులు మా మామ దగ్గర సుబ్బి గాడు అని ఒకడు ఉండేవాడు కదా ఏమైపోయాడు రా..

సైదులు …ఓహ్ ఆ లంజ కొడుకా పైకి పోయాడు గా మీ నాన్న గారు ఊరికి వచ్చే ముందు రోజు రాత్రి నేను ఇంకా కొంత మంది వచ్చి మీ మామయ్య బలగం లో గట్టి వాళ్ళనీ మట్టు పెట్టేసాం ఈ విషయం ఎవరికీ తెలీదు..

రాహుల్…అయిన నాయన కూడా ఈ మధ్య అన్నీ మాకు చెప్పటం లేదు లే..

సైదులు…మీరు అల ఏమి అనుకోకండి ఇదిగో ఈ గ్లాస్ ఎత్తండి అంటూ పెగ్ కలిపి ఇచ్చాడు..

రాహుల్…రేయ్ మీరంతా మా నాన్న పెద్ద పుడింగి అనుకుంటున్నారు .కానీ ఆయన బిట్ అయిపోయింది . ఇంతకు ముందు ఉన్న స్పీడ్ ఇప్పుడు లేదు ఆయనకి అదే నేను అయితే దినవ్వ హేయ్ ఒక్కొకడికి నా.. అంటూ తూలుతూ కింద పడి పోయాడు..

సైదులు …హ్మ్మ్ నువ్వు చెప్పింది కూడా నిజమే నీ నాయన గుద్ద లో దమ్ము తగ్గింది అంటూ రాహుల్ నీ ఎత్తి భుజం మీద వేసుకొని తీసుకొని ఇంటికి వచ్చాడు.కార్ లో….

… వాసు దేవ్ ఇంకా పైడితల్లి ఇద్దరు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు…

వాసుకి వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఏమి కావాలో అని చూస్తూ ఉంది…

పైడితల్లి ఒక వైపు వాసుదేవ్ తో మాట్లాడుతూ ఇటు చూపులు వాసుకి తో కలపడానికి చూస్తూ ఉన్నాడు…వాసుకి కళ్ళలో అదే కోపం కనిపిస్తూ ఉంది..

పైడితల్లి…ఈ మొఖం లో నవ్వు ఎప్పుడు చూస్తాం రా బాబు అని తింటూ ఉన్నాడు..

వాసుదేవ్…ఏంట్రా నవ్వు అంటున్నావ్..

పైడితల్లి. .. నవ్వు కాదు రా నువ్వు…నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్ళేది అని అడుగుతున్న లే..

వాసుదేవ్…నేనా అది అంటూ ఏదో చెప్పబోతున్నాడు . ఇంతలో ఏదో పేలిన శబ్దం వినిపించి బయటకు వచ్చి చూసాడు..బయట జనం కూడా ఇళ్లలో నుండి బయటకు వచ్చి ఎంటి అని చూస్తూ ఉన్నారు..ఇంతలో కొంత మంది రేయ్ కాలేజ్ కూలిపోయింది రా అని అరుస్తూ ఉన్నారు ..

వాసుదేవ్ అది విని లోపలికి వచ్చి రేయ్ కాలేజ్ కూలి పోయింది అంట పద చూద్దాం అంటూ పైడితల్లి కి చెప్పడం. పైడితల్లి విస్తరి దగ్గర నుంచి లేచి ఏంట్రా నువ్వు చెప్పేది .ఏమైంది అంటూ వాసుదేవ్ దగ్గరకి వచ్చాడు..తన వెనక వాసుకి కూడా వచ్చింది.

వాసుకి మాట్లాడే లోపు ఇద్దరు బండి మీద కాలేజ్ వైపు వెళ్లారు..

కీర్తి తన గది లో నుండి బయటకు వచ్చి అమ్మ ఎంటి ఆ సౌండ్ ఏమైంది అని అడిగింది ..

వాసుకి…కీర్తి నీ చూస్తూ కాలేజ్ కూలిపోయింది అంట అని కంగారు పడుతూ కానీ ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉంది…

ఊర్లో జనం అందరూ కాలేజ్ దగ్గరకు వచ్చి చూశారు.. అక్కడ కాలేజ్ గోడలు కూలిపోయి ఉన్నాయి అందరూ ఎంటి ఇదంతా అని ఒకరి నీ ఒకరు అడుగుతూ ఉన్నారు..అయితే మళ్లీ ఈ సారి ఇంకా పెద్ద సౌండ్ తో మంటలు వస్తూ కాలేజ్ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది…

వాసుదేవ్ ఇదంతా చూస్తూ పైడితల్లి తో ఎంట్రా ఇదంతా అసలు నాకు ఏమి అర్ధం కావటం లేదు అని అన్నాడు..

పైడితల్లి…ఇది ఎవరో కావాలి అని చేశారు అని నాకు అనిపిస్తుంది రా..

వీళ్ళ మాటలు వింటున్న రాజు వాసుదేవ్ దగ్గరకి వచ్చి సార్ ఇందాక రాము ఉన్న కాలేజ్ గోడ దూకి బయటకు రావడం నేను చూసాను అని అన్నాడు..

వాసుదేవ్…ఏ రాము రా చిన్న..

రాజు…పైడితల్లి నీ చూస్తూ అది సార్ మరి.. పాత సర్పంచ్ గారి అబ్బాయి రాము అని అన్నాడు…