ఊహించనిది Part 5 82

పైడితల్లి కి క్షణం ఏమి అర్ధం కాలేదు ఒక నిమిషం అల ఆగి హేయ్ ఏమి వాగుతున్నవ్ రా అని రాజు నీ అరిచాడు..

రాజు భయపడుతూ నేను చెప్పింది నిజం సర్పంచ్ అంకుల్ అంటూ వాసుదేవ్ వెనక నిలబడి వణుకుతూ చెప్పాడు..

సంధ్య ఇంకా సూరజ్, వాసుకి అలాగే కీర్తి అక్కడికి వచ్చారు. అసలు ఏమైంది అన్నట్టు.. పైడితల్లి ఒక రెండు జతల కళ్ళు కోపంగా చూస్తూ ఉన్నాయి.. పైడితల్లి అది గమనించి నిజంగా ఇది నా మేనల్లుడు పని అయితే వాడికి శిక్ష పడేలా చేస్తాను అని అందరికీ వినపడేలా చెప్పాడు..

రఘు రామయ్య కూడా రంగ తో కలిసి అక్కడికి వచ్చాడు ఏమైంది అని.అతని వెనుక అనసూయ కూడా వచ్చింది. రాఘవ పరిగెత్తుకుంటూ వచ్చి పైడితల్లి దగ్గరకి వచ్చి నాయన ఏమైంది అని రొప్పుతూ అడిగాడు.కీర్తి నీ చూస్తూ సైగ చేసాడు..

పైడితల్లి…ఏమైంది అనేది తెలీదు .కానీ ఇది జరగటానికి ముందు మన రాము గాడు కాలేజ్ గోడ దూకి రావడం ఈ పిల్లోడు చూసాడు అని రఘు రామయ్య ఇంకా తన చెల్లి అనసూయ నీ చూస్తూ అన్నాడు..

రఘు రామయ్య…ఎంటి నా కొడుకు కాలేజ్ గోడ దూకి వస్తె వాడిని అనుమనిస్తారా అది కూడా ఈ పిల్లోడి మాటలు విని అంటూ కోపంగా అసలు మీరు ఎవరు నా కొడుకు మీద నింద వేయడానికి అంటూ పైడితల్లి మీదకు వచ్చాడు..

అనసూయ…అన్న ఎంటి నువ్వు చెప్పేది. రాము ఏమి చేశాడు నీ పైడితల్లి నీ చూస్తుంది..

పైడితల్లి…బావ ఆగు రాము గాడు చేశాడు అని నేను చెప్పటం లేదు.కానీ వాడు కాలేజ్ లో ఇంకా ఎవరిని అయిన చూసి ఉండొచ్చు కదా ఎందుకంటే ఇది పాత బిల్డింగ్ కూడా కాదు మంటలు చూస్తుంటే ఎవరో మందు గుండు పెట్టీ పేల్చారు అనిపిస్తుంది. రాము ఎక్కడ ఉన్నాడో పిలిపించండి నేను అడుగుతాను అని అన్నాడు..

రఘు రామయ్య…హేయ్ నువ్వెంట్ర నా కొడుకు నీ అడిగేది వాడు రాడు అయిన వాడికి జవాబు చెప్పాల్సిన పనిలేదు ఎవరికి అంటూ మీసం తిప్పుతూ పైడితల్లి నీ ఉరిమి చూసాడు..

వాసుదేవ్…చూడండి మీరు అంత కాస్త ప్రశాంతంగా ఉండండి . ఇన్స్పెక్టర్ వస్తున్నాడు అంట అసలు ఏమి జరిగింది అనేది తెలియకుండా పరువు తీసుకోకండి అని ఇద్దరికీ సర్ది చెప్పాడు..

సైదులు రావడం చూసి పైడితల్లి వాడిని చూస్తూ నువ్వా అన్నట్టు సైగ చేసాడు..సైదులు నాకు ఏమి తెలీదు అన్నట్టు చేతులు ఎత్తి సైగ చేసాడు..

ఈలోపు ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చాడు ..

ఇన్స్పెక్టర్ పైడితల్లి దగ్గరకి వచ్చి సార్ ఏమి జరిగింది అని అడిగాడు..

పైడితల్లి…అది తెలిస్తే ఇంకా నువ్వు ఎందుకు పల్లీలు అమ్ముకో పోయి కనపడటం లేదా కాలేజ్ నీ ఎవరో మందు గుండు పెట్టీ కూల్చారు అని అనిపిస్తుంది. ఇది ఎవరు చేశారో తెలియదు రేపు ఉదయం లోపు ఎవరు చేశారో కనిపెట్టు అర్ధం అయ్యింది కదా..

సంధ్య నీ చూస్తూ లంజ అనుకుంటూ సార్ నేను తెలుసుకుంటాను మీకు ఎవరి మీద అయిన అనుమానం ఉందా అని పైడితల్లి నీ అడిగాడు ఇన్స్పెక్టర్…

పైడితల్లి…అనుమానం ఏంట్రా మమ్మల్ని అడుగుతావు. నా మేనల్లుడు రాము నీ కనిపెట్టు వాడికి ఏదైనా తెలిసే ఛాన్స్ ఉంది అని అన్నాడు..

అనసూయ అన్న వాడు నా కొడుకు అంటూ పైడితల్లి చెయ్యి పట్టుకుని అడిగింది..

పైడితల్లి ..అనసూయ నీ ఓదారుస్తూ వాడికి ఏమి కాదు వాడు ఏమైనా చూస్తే చెప్తాడు అని మాత్రమే ఇదంతా నువ్వు కంగారు పడకు అంటూ ఇన్స్పెక్టర్ నీ చూస్తూ ఎంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్ బొట్టు పెట్టి చెప్పాలా వెళ్ళి రాము నీ వెతికే పనిలో ఉండు అని అన్నాడు..

రఘు రామయ్య…రేయ్ రంగ కార్ స్టార్ట్ చేయి రా ఈ నా కొడుకుల మీద నాకు నమ్మకం లేదు. రాము నీ కావాలి అని ఇరికిస్తున్నారు. నా బిడ్డ ను నేనే కాపుడుకుంట వీళ్ళకి దొరకకుండా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు..

పైడితల్లి. . బావ నువ్వు పిచ్చి .. పిచ్చి పనులు చేయకు ఇది ఏమి ఇంటి సమస్య కాదు అని అన్నాడు..రఘు రామయ్య ను ఆపుతూ.

రఘు రామయ్య ….హేయ్ పోరా పక్కకి అంటూ పైడితల్లి నీ తోసేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు..

పైడితల్లి కింద పడకుండా వాసుదేవ్ ఆపి రాఘవ నీ పిలిచి రేయ్ మీరు కూడా మీ మామ నీ ఫాలో అవ్వండి రాము నీ పట్టుకోండి అని అన్నాడు..

రాఘవ…కానీ అంకుల్ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు నాకు అని అన్నాడు..

అనసూయ… ఊరు అవతల కల్లు పాక వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు అని ఏడుస్తూ చెప్పింది..

రాఘవ సరే అత్త అని అక్కడి నుండి వెళ్తున్నాడు..కీర్తి కూడా వాసుకి పక్క నుండి వచ్చేసి రాఘవ దగ్గరకు వచ్చి హేయ్ నువ్వు జాగ్రత నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అంది..

రాఘవ…కీర్తి చెయ్యి పట్టుకొని భయపడకు నాకు ఏమి కాదు నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకో ఇదేమి ఆలోచించకు అని దైర్యం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.. తనతో పాటు సైదులు కూడా వెళ్ళాడు.. ఇదంతా వాసుకి చూస్తూ ఉంది….

కీర్తి వెనక్కి తిరిగి వస్తూ అక్కడ తన తల్లి నిలబడి ఉండటం చూసి కంగారు పడుతూ హా అమ్మా.. నువ్వు ఇక్కడ అంటూ తడబడుతూ మాట్లాడుతూ ఉంది….