ఊహించనిది Part 5 82

…రఘు రామయ్య నీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు అక్కడ డాక్టర్ రఘు రామయ్య వొంటి మీద గాయాలు చూసి ప్రమాదం తప్పింది . ఈయన నడుము కి పెట్టిన పట్టి వల్ల కత్తి పోట్లు లోపలికి దిగలేదు కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి కట్లు కట్టించి రేపు ఉదయం పంపిస్తాను అని అన్నాడు…

సూరజ్ ఇంకా రఘు రామయ్య మనుషులు కాస్త గాలి పీల్చుకొని దేవుడి దయ అనుకుంటూ ఉన్నారు..

సూరజ్…సరే ఇంకా నేను వెళ్తాను . మీరు చూసుకోండి అని అన్నాడు..

సరే సూరజ్ బాబు మీరు వెళ్ళండి అని అన్నారు..సూరజ్ ఆటో స్టార్ట్ చేసుకొని షాప్ దగ్గరకి వచ్చాడు.. అక్కడ షాప్ దగ్గర pc కిరణ్ ఉన్నాడు..

సూరజ్ కిరణ్ నీ చూస్తూ హేయ్ కిరణ్ ఎంటి ఇక్కడ సంధ్య కోసం వచ్చావా తను ఎక్కడ అని అడిగాడు..

కిరణ్…సూరజ్ గారు అది మరి మేడం నీ అరెస్ట్ చేశారు..మేడం ఇప్పుడు స్టేషన్ లో ఉన్నారు.

సూరజ్…కిరణ్ ఏమి మాట్లాడుతున్నావ్ సంధ్య నీ అరెస్ట్ చేయడం ఎంటి అసలు ఏమి జరిగింది..

కిరణ్ జరిగింది మొత్తం చెప్పుకొని వచ్చాడు.సూరజ్ ఆవేశం తో స్టేషన్ కి వెళ్ళడానికి రెఢీ అయ్యాడు..కిరణ్ ఆపుతూ సూరజ్ గారు వద్దు వెళ్ళకండి అతను ఇదంతా కావాలి అని చేస్తున్నాడు.ఇప్పుడు మీరు వెళ్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాడు అంటు సూరజ్ నీ ఆపుతున్నాడు..

సూరజ్…ఈరోజు వాడి చావు నా చేతుల్లో రాసి పెట్టీ ఉంది. నేను ఏదో ఇక్కడ స్వీట్స్ అమ్ముకుంటూ ఉంటాను అని తక్కువ అంచనా వేస్తే నా నిజస్వరూపం చూస్తారు అంటూ కిరణ్ ను తోసేసి స్టేషన్ కి బయలు దేరాడు…

….అనసూయ కి ఈ విషయం తెలిసి కంగారు పడి తన అన్న కి ఫోన్ చేసింది…

పైడితల్లి… చెల్లె నువ్వు ఏమి భయపడకు బావ కి ఏమి కాదు రేపు ఉదయం నీ కళ్ల ముందు ఉంటాడు. నేను ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్తున్న సరే నా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు..చెత్త లంజ కొడుకులు సరిగ్గా పొడవడం కూడా రాదా రా మీకు మళ్లీ పెద్ద రౌడీలు మీరు అంటూ కార్ లో కూర్చొని ఉన్న తన అనుచరులను తిడుతున్నాడు…

కార్ హాస్పిటల్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి రఘు రామయ్య నీ చూస్తూ అయ్యో బావ ఎంత పని జరిగింది అంటూ ఏడుపు నటిస్తూ హేయ్ డాక్టర్ మా బావ కి ఏమైనా అయిందో నిన్ను నీ హాస్పిటల్ నీ బాంబ్ వేసి లేపెస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు..

డాక్టర్…అయ్యో పైడితల్లి గారు సర్పంచ్ గారికి ఏమి అవ్వలేదు ఆయన బాగానే ఉన్నారు రేపు ఉదయం తీసుకొని వెళ్లొచ్చు అని అన్నాడు..

పైడితల్లి…హా ఇంకా జనం విడినే సర్పంచ్ అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ sorry డాక్టర్ మా బావ నీ అల చూసి ఆవేశం లో ఏదో నోటికి వచ్చింది అనేశాను తప్పుగా అనుకోకండి అని కళ్ళు తుడుచుకుంటూ రేపు తీసుకొని వెల్లోచ అయితే అని అడిగాడు…

Doctor… హా అవును అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు..

పైడితల్లి రఘు రామయ్య నీ చూస్తూ కాసేపు అక్కడే ఉండి తన చెల్లి కి ఫోన్ చేసి చెల్లె బావ కి ఏమి కాలేదు చిన్న గాటు పడింది అంట ఉదయాన్నే ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పాడు..

అనసూయ…హా సరే అన్న అయితే నేను రానా అక్కడికి.

పైడితల్లి…రాకపోతే బాగుండదు లే వచ్చి పో సరే ఉంట అని ఫోన్ పెట్టేసాడు…

ఈలోపు రాహుల్ ఇంకా రాఘవ హాస్పిటల్ కి వచ్చారు..నాయన మామ కి ఎలా ఉంది అని అడిగారు..పైడితల్లి హా బ్రతికే ఉన్నాడు రా వాడికి ఇంకా నూకలు ఉన్నాయి రా భూమి మీద సరే మీ అత్తయ్య వస్తుంది తనకి మనం చేయించినట్లు తెలియకూడదు.ప్లాన్ మొత్తం నాశనం అయింది నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వచ్చాడు..

రాఘవ ఏంట్రా ఇది నాయన పన అని అడిగాడు..

రాహుల్…హా అవును సరే నువ్వు దీని గురించి ఏమి మాట్లాడకు అత్త దగ్గర సరేనా..

రాఘవ…హా సరే అంటూ తల ఆడించాడు..

…సూరజ్ స్టేషన్ కి వచ్చాడు. అక్కడ ఇన్స్పెక్టర్ లేడు లోపలికి వెళ్ళి సెల్ లో ఉన్న సంధ్య నీ చూస్తున్నాడు..

సూరజ్…సంధ్య గారు ఎంటి ఇదంతా ..

సంధ్య…అసలు జరిగిన విషయం చెప్పి మీరు ఇంటికి వెళ్ళండి నా గురించి ఏమి కంగారు పడకండి సర్పంచ్ గారు ఎలా ఉన్నారు అని అడిగింది..

సూరజ్ …ప్రాణాలకు ఏమి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పారు.రేపు ఉదయం పంపించేస్తారు అంట.

సంధ్య…సరే మీరు కూడా ఇంటికి వెళ్ళండి ..