బాబు ఏమైంది అంటూ రంగ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు..
రాహుల్ రంగ నీ చూస్తూ లోపల తొంగి చూసాడు . అనసూయ తన మొగుడితో మాట్లాడుతూ ఉంది..
రాహుల్…హా రంగ ఏమి లేదు లే నిద్ర పట్టేసింది సరే నువ్వేంటి మందు తెచావ..
రంగ…మందు ఎంటి బాబు మీరు నాకు చెప్పలేదు కదా. కల ఏమైనా వచ్చిందా..
రాహుల్…కల…హా అవును సరే నాకు నిద్ర వస్తుంది కార్ తాళం ఇవ్వు ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి . కార్ లో పడుకుంటాను అని తాళం తీసుకొని కార్ లో పడుకోడానికి వెళ్ళాడు…
….మరుసటి రోజు ఉదయం ఊర్లో అంత హడావుడి గా ఉంది. కొత్త కలెక్టర్ వాళ్ళ ఊరు చూడటానికి వస్తున్నారు అని రోడ్లన్నీ శుభ్రం చేసి కాలువల లో బ్లీచింగ్ చల్లి పంచాయితీ ఆఫీస్ దగ్గర పూలు పరిచి దండలతో ఎదురు చూస్తున్నారు అక్కడ వాళ్ళు..
పైడితల్లి హాస్పిటల్ కి వచ్చి తన బావ నీ చూసి అనసూయ తో చెల్లె కొత్త కలెక్టర్ వస్తుంది అంట నేను ఆడా ఉండాలి . నువ్వు ఇంటికి పోయి రెఢీ అయ్యి రా పంచాయితీ ఆఫీస్ కి నా చెల్లి అని పరిచయం చేయాలి అని అన్నాడు..
అనసూయ…నేను ఎందుకు లే అన్న నువ్వు పో .
పైడితల్లి…వస్తె బాగుంటది తప్పకుండా రా ఇంకేమీ మాట్లాడకు అంటూ రాహుల్ ఎక్కడ అని అడిగాడు..
అనసూయ…వాడు ఉదయాన్నే వచ్చేశాడు కదా.
పైడితల్లి…ఓహ్ అవునా సరే నేను వెళ్తున్న నువ్వు మర్చిపోకు అంటూ వెళ్ళిపోయాడు…
అందరూ పంచాయితీ ఆఫీస్ దగ్గర ఉన్నారు…పైడితల్లి కూడా అక్కడికి వచ్చాడు..
5 నిమిషాల తర్వాత సెక్యూరిటీ అధికారి సైరెన్ తో కార్ వచ్చి ఆగింది..ఒక pc వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసాడు…
Pc కార్ లో ఉన్న ఆవిడ ను చూస్తూ మేడం మీరు అంటూ పక్కకి జరిగాడు..అక్షర కార్ లో నుండి కిందకు దిగి pc నీ చూస్తూ పంచాయితీ ఆఫీస్ వైపు నడిచింది..
అక్కడి జనాలు అక్షర నీ చూస్తూ ఈవిడ ఒకసారి మన ఊరు వచ్చింది కదా అని మాట్లాడుకుంటూ ఉన్నారు..పంచాయితీ ఆఫీస్ లో work చేసే ఉద్యోగులు కొంత మంది బోకే ఇచ్చారు .. కొంత మంది దండలు వేసి స్వాగతం చెప్తున్నారు..
అక్షర తన మెడ లో వేసిన దండలు తీసి తన తో ఉన్న PA కి ఇచ్చి తల మీద పడిన పూల రెమ్మల ను దులుపుకుంటు లోపలికి వచ్చింది..ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర పైడితల్లి నిలబడి అక్షర కి దండం పెడుతూ నమస్కారం కలెక్టర్ గారు అంటు సాళువ ఒకటి అక్షర కి కప్పుతున్నాడు..
అక్షర… అయ్యో ఎందుకు ఇవన్నీ అయిన ఇక్కడి ప్రజలకు ప్రతిదీ అతిశయోక్తి గా ఉంటుంది అంటూ పైడితల్లి నీ చూస్తూ మీరు ఎవరు అని అడిగింది..
పైడితల్లి…నా పేరు పైడితల్లి ఈ ఊరికి 10 రోజుల క్రితం సర్పంచ్ గా వచ్చాను.నాకు ప్రజాసేవ చేయాలి అంటే చాలా ఇష్టం..
అక్షర హ్మ్మ్ అంటూ తల ఊపుతూ లోపలికి వెళ్ళింది .అక్కడ ఆఫీస్ వాతావరణం చూస్తూ పర్వాలేదు అనుకొని ఒక టేబుల్ దగ్గర చైర్ లో కూర్చుంది ..
అక్కడ పని చేసే ఆఫీసర్స్ నీ పిలిచి ఊర్లో ఉన్న సమస్యల గురించి అడగటం మొదలు పెట్టింది…
ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు అని కొత్త సర్పంచ్ గారు ఎటువంటి తప్పులకు ఇక్కడ ప్రోత్సహించడం చేయరు అని చెప్పుకొని వచ్చారు..అక్షర ఆఫీసర్స్ చెప్పింది విని సరే ఒకసారి మీ సర్పంచ్ నీ పిలవండి అని చెప్పింది..
పైడితల్లి లోపలికి వచ్చిన తర్వాత కూర్చోమని చెప్తే అయ్యో వద్దు మేడం మీరు మా కంటే పెద్ద హోదా లో ఉన్నారు మీ ముందు కూర్చుంటే మీ వృత్తి నీ తక్కువ చేసిన వాడిని అవుతాను అని అన్నాడు..
అక్షర అతని మాటలకు ఇంప్రెస్స్ అయ్యి తను కూడా లేచి సరే చెప్పండి.ఊర్లో గత వారం రోజులుగా జనాలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి వెళ్తున్నారు కారణం ఎంటి అని అడిగింది..
పైడితల్లి…నాకు కూడా అదే అర్ధం కాలేదు మేడం బహుశా నేను నష్ట జాటకుడిని అయ్యి ఉంటాను నేను వచ్చిన తర్వాత ఇలా జరిగింది.
అక్షర…అల ఏమి అయ్యి ఉండదు .నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా విషయాలు తెలుసుకున్న మీరు అలాగే పాత సర్పంచ్ బావ బావమరిది అంట కదా..మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఊర్లో అభివ్రుది పనులు చేస్తున్నారు అంట.