పైడితల్లి…రేయ్ సైదులు ఈ రాఘవ గాడు నా మాట వినడం లేదు నువ్వు ఒక పని చెయ్ రేపు తెల్లవారు జామునే వాడిని తీసుకొని మన ఊరు వెళ్ళిపో కొడుకు నీ ఇంట్లో నుండి బయటకు వస్తే రెండు కాళ్ళు విరగొట్టు సరే నా అని అన్నాడు..
పైడితల్లి చెప్పిన దానికి సైదులు సరే అని తల ఆడించాడు..తర్వాత ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు..
వాసుదేవ్ కూడా ఇంట్లోకి సరుకులు కోసం సంత కి వచ్చాడు.అతను అల నడుచుకుంటూ ఖాసిం మటన్ కొట్టు నీ చూస్తూ బాధపడుతూ వెళ్ళాడు.కొట్టు కి తాళం వేసి ఉంది బహుశా ఖాసిం చనిపోయాడు అనే బాధ లో ఉన్నట్టున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని అనుకుంటూ ముందుకు నడిచాడు..
పైడితల్లి కార్ లో ఎక్కుతూ వస్తున్న వాసుదేవ్ నీ చూసి అరే వీడు ఎప్పుడు వచ్చాడు ఊర్లోకి అంటూ తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి వెనక నుండి నమస్కారం కోచ్ గారు అని అన్నాడు..
వాసుదేవ్ హా నమస్తే అంటు వెనక్కి తిరిగి పైడితల్లి నీ చూసి నవ్వుతూ హేయ్ నువ్వెంట్రా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయాడు.
పైడితల్లి…ఆ విషయం నేను అడగాలి రా ఎప్పుడు వచ్చావు ఊరు నుండి హ్మ్మ్ పట్నం నీళ్ళు బాగా వంటబట్టయి కుర్రాడిలా తయారయ్యావు అంటూ సరదాగా వాసుదేవ్ డొక్కా లో కొట్టాడు.
వాసుదేవ్ ఆహ్ నువ్వు కూడా అలాగే ఉన్నావు రా సరే నా విషయం వదిలేయ్ నీ గురించి చెప్పు ఎంటి సంగతులు అని అడిగాడు..
పైడితల్లి…నేను ఇక్కడ సర్పంచ్ రా నెల అవుతుంది అని అన్నాడు..
వాసుదేవ్…నియబ్బ నెల రోజులు నుండి ఇక్కడే అని అంటున్నావు నేను వచ్చి పది రోజులు అయింది ఆ విషయం నీకు తెలీదా అంటూ పైడితల్లి మెడ చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు.సరే మా ఇంటికి అయిన వెల్లివచావా లేదా అని అడిగాడు..
ఆ మాట కి పైడితల్లి మొఖం లో నవ్వు మాయం అయింది..
పైడితల్లి…హా లేదు రా కానీ కాలేజ్ వాసుకి నీ కలిశాను అసలు గుర్తుపట్టలేదు సరే ఇంకా ఎంటి విషయాలు అని టాపిక్ మార్చాడు..
వాసుదేవ్…హ్మ్మ్ చెప్పాలి రా ఇదిగో ఇంటికి సరుకుల కోసం వచ్చాను , ఒక పని చెయ్ రాత్రి సిట్టింగ్ వేద్దాం చెరువు దగ్గర కి వచ్చేయ్ అని చెప్పి పిల్లలు బాగున్నారా అని అడిగాడు..
పైడితల్లి ఏదో చెప్పేలోపు సైదులు పిలిచాడు .. అది విని పైడితల్లి సరే సాయంత్రం కలుద్దాం రా అంటూ వెళ్లిపోయాడు..
వాసుదేవ్ నవ్వుతూ వీడు ఎప్పుడు ఇంతే అనుకుంటూ సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు..
సంత లో మరో పక్క అక్షర అక్కడ ఉన్న అంగల్లు అన్ని పంచాయితీ లో రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా అని చెక్ చేస్తుంది.తనకు రాహుల్ ఇంకా రాఘవ హెల్ప్ చేస్తున్నారు..
రాహుల్ సక్కగా అక్షర చెప్పిన పని చేస్తుంటే రాఘవ మాత్రం ఏదో పరాధ్యానం లో ఉన్నాడు.అది అక్షర గమనించింది వయసు లో ఉన్న కుర్రాడు కదా ప్రేమ విషయం అయ్యి ఉంటుంది అని నవ్వుకుంటూ తన పని లో తాను ఉంది..
అక్కడ పని అయిపొయింది అని అక్షర వెళ్లిపోవడం కోసం కార్ వైపు వెళ్తూ తనతో వచ్చిన సిబ్బంది ని అలాగే రాహుల్ ఇంకా రాఘవ నీ పిలిచింది..
రాహుల్ వస్తూ రాఘవ నీ పిలిచాడు , హా వస్తున్న అని రాఘవ చూసుకోకుండా వెనక్కి తిరిగేసరికి ఒక ఆటో తన మీదగా వచ్చింది. దాంతో రాఘవ వెనక్కి పడ్డాడు..
రాహుల్ అది చూసి వెంటనే రాఘవ దగ్గరకి పరిగెత్తాడు.అక్షర కూడా వెళ్ళి తనకి ఏమైంది చూడమని సిబ్బంది కి చెప్పింది.. అందరూ రాఘవ నీ లేపి అక్షర కార్ లో కూర్చోబెట్టారు..
రాఘవ…మేడం నాకు దెబ్బలు ఏమి తగలలేదు నేను బాగానే ఉన్నాను అని అన్నాడు..
రాహుల్…రేయ్ గమ్మున కూర్చో డ్రైవర్ అన్న నువ్వు కార్ స్టార్ట్ చెయ్యి అని అన్నాడు..
అక్షర కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది కార్ లో..
…వాసుదేవ్ ఇంటికి వచ్చి సరుకుల సంచి అక్కడ టేబుల్ మీద పెడుతూ తన భార్య నీ పిలిచాడు..
వాసుకి గది లో నుండి బయటకు వస్తూ ఎంటి అని అడిగింది..
వాసుదేవ్…వాసుకి నా స్నేహితుడు పైడితల్లి ఈ ఊరు సర్పంచ్ అంట కదా నిన్ను కుడా కలిశాడు అంట కదా నాకు మాట వరసకు కూడా చెప్పలేదు నువ్వు సరే లే ఈరోజు రాత్రి వాడు భోజనానికి ఇక్కడికి వస్తున్నాడు వాడికి ఇష్టం అయిన పులస చేప తీసుకొని వచ్చాను వండు అంటూ సంతోషం తో గది లోకి వెళ్ళాడు..
వాసుకి ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది…
19 సం”ల క్రితం….
వాసుకి నీకు ఈ విషయం తెలుసా వీడికి నీ చేతి పులస కూరా అంటే చాలా ఇష్టం ఇప్పుడు కూడా వండమని అడుగుతున్నాడు పైడితల్లి అంటూ వాసుదేవ్ పైడితల్లి నీ చూస్తూ సిగ్గు పడతావ్ ఎందుకు రా ఎవరు ఉన్నారు అని ఇక్కడ హ్మ్మ్ అడుగు తనని అని అన్నాడు వాసుదేవ్..
పైడితల్లి తల ఎత్తి వాసుకి నీ చూస్తూ ఉన్నాడు అలాగే…
వాసుకి హ్మ్మ్ సరే సరే వండి పెడతాను మరి చేప తీసుకొని వచ్చారా అని అడిగింది..
పైడితల్లి తన పక్కన నేల మీద పెట్టి ఉన్న కవర్ తీసి ఇదిగో అన్నట్టు చెయ్యి ముందుకు చాచాడు..
వాసుకి కవర్ తీసుకొని వంట గది లోకి వెళ్ళింది.. బయట హాల్ లో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు..
పైడితల్లి మధ్య మధ్యలో వంట గది వైపు చూస్తూ వాసుదేవ్ తో మాట్లాడుతున్నాడు..
పైడితల్లి అల చూడటం చూసి వాసుదేవ్ ఏంట్రా పైడి అల చూస్తున్నావ్ ఏం కావాలి అని అడిగాడు..
అది మంచినీళ్ళు కావాలి రా కాస్త దాహం గా ఉంది అని జవాబిచ్చాడు..
Next part bro