పైడితల్లి రాహుల్ తో మాట్లాడుతూ రేయ్ ఈ కొజ్జా నా కొడుకు నీ ఒక చూపు చూస్తూ ఉండు సరే నా అలాగే వీడు ఆ వాసుకి కూతురు తో తిరుగుతున్నాడు.అటు వైపు వెళ్లకుండా చూసుకో అని చెప్పి రాఘవ నీ చూస్తూ నువ్వు ఇంకో సారి ఆ అమ్మాయి తో కనిపించావు అనుకో కొడకా చంపేస్తా నిన్ను వొళ్ళు దగ్గర పెట్టుకో ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని అన్నాడు..
నేను కీర్తి ప్రేమించుకుంటున్నాం . తననే పెళ్లి చేసుకుంటా నేను అంటూ రాఘవ పైడితల్లి కి ఎదురు తిరిగాడు. పైడితల్లి లాగి పెట్టీ రాఘవ చెంప మీద కొట్టాడు..
పైడితల్లి…ఆ అమ్మాయి తో తిరగొద్దు అని నేను చెప్తుంటే , ప్రేమ ,పెళ్లి అని మాట్లాడుతున్నావ్ , గుద్ద బలిసినదా ఎంటి కొడకా చంపుత ఆ అమ్మాయి తో తిరగొడ్డు అని చెప్పా కదా అది మాత్రం గుర్తు పెట్టుకో అని అరిచాడు.. వీళ్ళ గొడవ అక్కడ ఉన్న జనం అంతా చూస్తున్నారు.
రాఘవ కోపం తో అక్కడ నుండి వచ్చేశాడు..
పైడితల్లి రాహుల్ నీ పిలిచి రేయ్ వాడి తో పో పక్కనే ఉండు అని అన్నాడు…రాహుల్ సరే అంటూ రాఘవ వెనకే వెళ్ళాడు .
…. పైడితల్లి అలాగే వాసుకి ల గతం….
వాసుకి…వద్దు నువ్వు ఇంకేమి మాట్లాడకు దయచేసి నాకు దూరంగా వెళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు నాకు కనిపించకు అంటూ పైడితల్లి మీద అరుస్తుంది..
అది కాదు వాసుకి నేను చెప్పేది ఒక సారి విను అంటూ పైడితల్లి తన చేతిని వాసుకి భుజం మీద వేసాడు..వాసుకి వెంటనే దూరం జరిగి నన్ను ముట్టుకోకు నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు…నాకు వొళ్ళంతా తేళ్లు పాకినట్టు ఉంది..దూరంగా ఉండు అంటూ పైడితల్లి నీ తోసేసింది..పైడితల్లి చుట్టూ చూస్తూ వాసుకి నా మాట విను మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అందరూ మనల్నే చూస్తున్నారు ..అంటూ వాసుకి కి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చూసాడు..
వాసుకి కోపంగా పైడితల్లి నీ చూస్తూ హేయ్ ముట్టుకోవద్దు అని చెప్పా కదా అని వేలు చూపిస్తూ నువ్వు ఇంకో సారి నన్ను ముట్టుకుంటే నేను చచినంత ఒట్టు అని అంది..పైడితల్లి తన కోపాన్ని అణుచుకుంటూ ఇప్పుడు వెళ్తున్న కానీ ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తాను.అప్పుడు మాత్రం ఇలా వెళ్ళిపోను అంటూ వెళ్లిపోయాడు .
వాసుకి కోపం ఇంకా బాధ తో చూస్తోంది..అక్కడ వాళ్ళని చూస్తున్న జనం కూడా ఎవరి దారి వాళ్ళు వెళ్తున్నారు..
…ప్రస్తుతం….
సంధ్య ఇంకా సూరజ్ ( ఫర్జానా ఇంకా సులేమాన్) వాళ్ళ షాప్ తెరిచి పని చేసుకుంటున్నారు..
సూరజ్…సంధ్య గారు చూడండి ఇక్కడి పరిస్తితి ఎలా అయిందో ఊర్లో ఎటు చూసినా గొడవలే ఇక్కడ మనం ఉండటం ఎందుకు ఇంకా మన ఊరు వెళ్లిపోవడం మంచిది . ఏమంటారు అని అన్నాడు..
సంధ్య…ఎవరో ఏదో తలకు మాలిన పని చేస్తే మనం ఎందుకు సూరజ్ గారు ఊరు వదిలి వెళ్ళడం చెప్పండి అని కడాయి లో నూనె పోస్తోంది..
సంధ్య చెప్పిన మాటలు వింటున్న ఒక పెద్దాయన నిజం సరిగ్గా చెప్పావ్ అమ్మాయి.. మీ లాంటి వాళ్ళు కూడా ఇలా మాకు ఎందుకు అని వెళ్లిపోతే ఊర్లో ఎవరు ఉంటారు చెప్పు సూరజ్ అని అడిగాడు.
సూరజ్…అది కాదు బాబాయ్ నువ్వు కూడా చూస్తున్నావ్ కదా ఇక్కడ మాకు ఎటువంటి గౌరవం లేదు.మొన్నటికి మొన్న సంధ్య నీ అరెస్ట్ చేశారు . ఇలాంటి గొడవల్లో మేము ఎందుకు ఇక్కడ ఉండటం అని నా అభిప్రాయం..
పెద్దాయన… కష్టాలు మనకి పాఠాలు నేర్పిస్తాయి.వాటి నుంచి మనం నేర్చుకోవాలి అంతే కానీ ఇలా భయపడి పారిపోకుడడు..అయిన ఆడపిల్ల తను ధైర్యం గా ఉంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు …
సూరజ్ ఏదో చెప్పేలోపు సంధ్య కలుగజేసుకొని ఆయన భయం ఈ గొడవల్లో నాకు ఏమైనా అవుతుంది ఏమో అని సరే మీకు ఏమి కావాలి చెప్పండి అని అడిగింది..
పెద్దాయన…నాకు ఒక కేజి లడ్డు ఇవ్వు అమ్మాయి అని అన్నాడు.
సూరజ్ డబ్బులు తీసుకొని లడ్డు ప్యాక్ చేసి ఇచ్చాడు..పెద్దాయన వెళ్ళిపోయాక సులేమాన్ ( సూరజ్) ఒక సారి బయటకు చూసి ఫర్జానా ( సంధ్య) దగ్గరకు వచ్చి చూసావా నీ ప్లాన్ ఫెయిల్ అయింది .ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పు అని అడిగాడు..
ఫర్జానా…ప్లాన్ ఫెయిల్ అయిన దాదాపు సగానికి పైగా ఊరు నాశనం అయిపోయింది కదా.ఇప్పుడే ఏమి వద్దు కొన్ని రోజులు ఓపిక పట్టు తర్వాత ఏమీ చేయాలో ఆలోచిద్దాం అని నూనె మరగపెడుతుంది…
సులేమాన్ కూడా తన పని తను చేసుకుంటూన్నాడు..
…. ఒక ఏడాది కి క్రితం…
చూడండి మేము మీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాము.ఇలా ఎప్పటికీ అప్పుడు వాయిదా వేస్తే కుదరదు మీరు తీసుకున్న అసలు 25 లక్షలు కానీ ఇప్పుడు అది వడ్డీ తో కలిపి 60 లక్షలు అయింది నేను మీకు మూడు నెలలు టైం ఇస్తున్న కనీసం అందులో సగం అయిన కట్టాలి అని ఒక మర్వాడీ సేట్ ఫర్జానా వాళ్ళ అమ్మ తో చెప్తున్నాడు.
జుబెదా ( ఫర్జానా వాళ్ళ అమ్మ)…అదేంటి సేట్ మా అమ్మాయి కొద్ది కొద్దిగా జమ వేస్తుంది కదా మీకు ..2 నెలలు కట్టలేదు అని చెప్పింది..ఇప్పుడు మీరు 60 లక్షలు అంటున్నారు.మా లాంటి పేదవాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చి కడతాము చెప్పండి అని అడిగింది..
సేట్… చూడు..అమ్మ మీ ఆయన అప్పు తీసుకొని ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టలేదు . నీ కూతురు ఇస్తున్న డబ్బులు వాటికే సరిపోతున్నాయి. లేదు మీరు కట్టలేము అంటే చెప్పండి నా దగ్గర ఒక ఐడియా ఉంది.అల చేస్తే మీకే ఇంకా డబ్బులు వస్తాయి చేస్తారా అని అన్నాడు..
జుబేదా.. ఏంటది సేటు చెప్పు అని అడిగింది..
సేట్…ఒక కోటీశ్వరుడు ఉన్నాడు.కోట్ల లో ఆస్తి ఉంది , తనకి వయసు 70 దాకా ఉంటుంది. మూడవ పెళ్లి చేసుకుంటా అని ఒక సారి చెప్పాడు.వాడికి నీ కూతురు నీ ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పాడు..
జుబెదా కి సేట్ మీద కోపం వచ్చి అరిచింది ..ఈడు లో ఉన్న అమ్మాయి నీ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్తున్నావు . వెళ్ళు ఇక్కడ నుండి అని తిట్టింది…
సేట్ వెళ్తూ డబ్బులు కట్టడానికి గతి లేదు కానీ వీటికి ఏమి తక్కువ లేదు..నేను రేపు ఉదయం వస్తాను .నాకు వడ్డీ మొత్తం కట్టాలి అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఫర్జానా నీ చూస్తూ వెళ్ళాడు.. ఫర్జానా ఇంట్లో ఏడుస్తున్న తన అమ్మ నీ చూస్తూ బాధపడింది.. ఎలాగైనా డబ్బులు తీసుకొని రావాలి . ఎంత పెద్ద దొంగతనం చేసిన చిల్లర మాత్రమే ఇస్తున్నారు చేతికి పెద్ద మొత్తం లో రావాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంది..ముందు రేపు సేట్ కి కట్టడానికి డబ్బులు చూద్దాం అని తన ఫ్రండ్ ఇంకా పార్టనర్ అయిన సులేమాన్ దగ్గరకు వచ్చింది…
( సులేమాన్ అలియాస్ సూరజ్ .. ఇతను దొంగతనం చేయడం లో jr. భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ లాంటి వాడు అలాగే చిన్న చిన్న బాంబ్ బ్లాస్ట్ కూడా చేస్తాడు.ఇతనికి ఫర్జానా అంటే ప్రాణం ఇద్దరు చిన్నతనం నుండి మంచి స్నేహితులు..
ఫర్జానా అలియాస్ సంధ్య… ఈమె ఎంత అందగత్తెనో అంతే తెలివి అయినది ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళ లాగా కలిసిపోతుంది..తన తండ్రి ద్వారా అలవాటు అయిన ఈ దొంగతనాలు ఇప్పుడు అవసరం కోసం చేస్తుంది.)
ఫర్జాన తన ఫ్రండ్ నీ కలవడానికి వచ్చింది..ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.దారి లో సులేమాన్ కొన్ని జేబులు కొట్టేశాడు..
సులేమాన్…హా చెప్పు ఫర్జానా ఎంటి సంగతి అని అడిగాడు..
ఫర్జానా ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది..అలాగే తనకి రేపు ఉదయం లోపు 2 లక్షలు కావాలి అని చెప్పింది.. సులేమాన్ మొత్తం విని సరే నాతో రా నేను ఒకళ్ళని పరిచయం చేస్తాను అని తీసుకొని వెళ్ళాడు..
ఇద్దరు ఒక చోటు కి వెళ్ళారు . అది ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గూండాలను చూసి ఫర్జానా కాస్త భయపడింది.. వాళ్ళు సూట్ బుట్ వేసుకొని చేతుల్లో గన్స్ పట్టుకోని ఉన్నారు..
సులేమాన్ అక్కడ ఒక మనీషి నీ కలిసి ఏదో మాట్లాడి ఫర్జానా నీ రమ్మని సైగ చేసాడు..ఫర్జానా వాళ్ళని చూస్తూ మెల్లిగా సులేమాన్ దగ్గరకి వెళ్ళింది..సులేమాన్ తో ఉన్న వ్యక్తి ఫర్జానా నీ చూస్తూ మీరు ఇది చేయగలరా నాకు అనుమానం గా ఉంది అని అన్నాడు.
ఫర్జానా ఎటువంటి దొంగతనం అయిన చిటిక లో చేస్తాను . మ్యూజియం లో నుండి అయిన సరే కొట్టుకువస్తాను కెమెరా కి చిక్కకుండా అని చెప్పింది.
ఆ వ్యక్తి ఫర్జానా చెప్పింది విని నవ్వుతూ చూడు బుల్ బుల్ మీరు కొట్టేయలసింది.ఏ బంగారమో, వజ్రమో కాదు ఒక చెరువు అని అన్నాడు. ఫర్జానా ఎంటి అన్నట్టు చూస్తోంది.
ఆ వ్యక్తి ఫర్జానా నీ చూస్తూ ఇక్కడి నుండి దాదాపు 3600 km ల దూరం లో తెలుగు రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు అందులో ఉన్న చెరువు నాకు కావాలి . మీరు ఎంత టైం అయిన తీసుకోండి ఇద్దరికీ కలిపి 20 కోట్లు ఇస్తాను.అలాగే అక్కడ మీరు ఉండటానికి అన్ని ఏర్పట్లూ చేస్తాను అని అన్నాడు.
ఫర్జానా మేమే ఎందుకు అసలు ఎంటి విషయం అని అడిగింది.
మీరే ఎందుకు అంటే మీరు పోయిన అడిగే వాడు ఉండడు.అలాగే డబ్బులు కూడా మీకు పని పూర్తి అయ్యాక ఇస్తాను .నీకు ఏదో అవసరం ఉంది అంట కదా సులేమాన్ చెప్పాడు.అందుకే ఈ 5 లక్షలు ఉంచండి . మిగిలినది పని పూర్తి అయ్యాక మాత్రమే అని అన్నాడు ఆ వ్యక్తి.. సులేమాన్ ఒప్పుకున్నాడు. ఫర్జానా కూడా తన ఇంటి పరిస్థితుల వల్ల ఒప్పుకుంది.
Next part bro