చంటి గాడి కథలు 3 252

పొద్దున్నే సుమతి వచ్చి లేపుతూ”లే బావ, నిన్ను పెద్దమ్మ వాళ్ళు పిలుస్తున్నారు .నీతో ఎదో పని ఉందంట.త్వరగా లేచి ఈ కాఫీ తాగు.టైం చూడు 9 కావొస్తోంది.”అంటూ లేపుతోంది.నేను లేచి బద్ధకంగా తనను చూసి కాస్త ఆశ్చర్యంగా “నువ్వా సుమతి?ఇది కలా?నిజమా?నువ్వు ఇంట్లో పనులు కూడా చేస్తావా?”అని తన పొగరుని గుర్తుచేసేలా అడిగాను.దానికి తను”ఏమి చేయకూడదా?”అంది కోపంగా
నేను”అలా కాదు సుమతి నువ్వు నా కోసం కాఫీ తెస్తే కాస్త కొత్తగా,ఇంకా కలలా అనిపించింది”అన్నాను నవ్వుతూ .తను మెల్లగా నా దగ్గరికి వచ్చి “ఇష్టమైన వాళ్ళ కోసం ఆమాత్రం చేయకూడదా”అంటూ కాఫీ కప్ నా చేతిలో పెట్టింది. నేను కాఫీ సిప్ చేస్తూ “ఎవరో ఆ ఇష్టమైన దరిద్ర జాతకుడు “అని అన్నాను.దానికి తను నవ్వి”బావ …నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావ్ కదా బావ”అంది నవ్వుతూ.నేను”అంటే నేనా?ఐన నా మీద తమరికి కొత్తగా ఈ ఇష్టం ఏంటో?”అని అడిగాను కొత్తగా.దానికి తను”అదీ నిన్న…”అంటూ ఉండగా “సుమతి, బావ లేచాడా?లేస్తే త్వరగా రమ్మను కాస్త అర్జెంటు అమ్మ “అంటూ అత్తయ్య పిలిచింది.సుమతి అది విని”హా లేచాడు మమ్మీ. ఇదిగో వస్తున్నాడు “అని “బావ ఎదో అర్జెంటు అంట త్వరగా వెళ్లి స్నానం చేసిరా వేడినీళ్లు కూడా పెట్టాను .ఇదిగో టవల్ “అని టవల్ నా చేతికి ఇచ్చి తను నేను తగిన కాఫీ కప్ తీస్కొని వెళ్ళిపోయింది.నేను లేచి ఫ్రెషప్ అయ్యి 15 నిమిషాల్లో కింద హాల్లోకి వెళ్ళాను.అక్కడ అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు.నేను వెళ్లగానే అంకుల్”రా చంటి .లేచావ వచ్చి ఇలా కూర్చో”అన్నారు.నేను వెళ్లి కూర్చొని “ఏంటో అర్జెంటు పని అన్నారు ఏంటి అంకుల్?”అని అడిగాను.అంకుల్”చంటి ఒక చిన్న సహాయం చెయ్యగలవా?”అని అడిగారు .నేను”తప్పకుండ నేను చేయగలిగితే చేస్తాను అంకుల్ .
ఇంతకూ ఏమి చేయాలి ?”అని అడిగాను.

3 Comments

  1. Waiting for next post….. Please post them fast….

  2. కథలు బాగున్నాయి

Comments are closed.