పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల – Part 1 150

పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వెళ్ళి, శవాన్ని దింపి భుజానవేసుకొని, ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు “రాజా! సత్తెకాలపునాటి వ్యధలూ,గతించిన గాథలూ, సన్మార్గపు కథలూ నీకు చెప్పటం నాకు అలవాటే! విశదంగా విప్పిచెప్పటం నీకు పరిపాటే కదూ! అవ్వన్నీ విన్నవారు ఊకొట్టారూ, చదివినవారు చప్పట్లుకొట్టారూ, మెదడుకి మేతాపెట్టారు,విజ్ఙ్నులై తరించారు! ఇంతచేసినమనం ఎందుకు సరసమైన కథలను సంధించి రసఙ్గ్నులను రమింపచెయ్యకూడదనే తలంపుతో మొదటిగా ‘నెరజాణ ‘ కథని చెబుతున్నాను. సమ్మగా విను! ” అంటూ మొదలుపెట్టాడు….!

పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల! ఋషులనైనా రసికులుగా మార్చే రమ్యమైన రాత్రి!
…..ఆ రెండవజాము వెన్నెల వెలుగులో వడివడిగా వసారాలవైపు అడుగులేస్తున్న వరలక్ష్మికి గుండెంతా గుబులుతోపాటు కాస్తంత కవ్వింపుగాకూడా ఉన్నట్టుంది. బెరుగ్గా తలని కలియతిప్పి చూస్తూ ఆ వీధిని దాటింది. సాధారణంగా పెందలాడే పడకేసే పల్లెటూరైనా, పెద్దింటి పెళ్ళితంతువల్ల కాస్తంత హడావిడిగానే ఉంది.

అసలామనిషికీ బుద్ది పుట్టటమేంటీ? అసలే సిగ్గుకు మారుపేరైన తను ఇలా గడపదాటడమంటే చిత్రమే. ఏవిధంగానైనా….వయసు పైబడుతున్నందుకు కొన్నేళ్లనుండి చప్పబడుతున్నాడనుకున్నవాడు ఇలా సరసుడవుతుండడం తనను సంతోషపెట్టేఅంశమే. చిన్నగా ఆనందం లోలోపల విరుస్తుంటే సంకేత స్థలానికి వచ్చిచేరింది వరలక్ష్మి.
ధాన్యంగది కొద్దిగా తెరిచే కనబడింది. దానిపక్క నీడలో నక్కి చుట్టూ కలయ చూస్తుంటే ఆలోచనలు ముసురుకున్నాయ్…

1 Comment

  1. చాలా బాగుంది కథ ఇలా ఆలోచింప చేసే కధలు దానిలో కొంచం మసాల ఎక్కువ పెట్టండి

Comments are closed.