పరిణామం 215

……. ముందు మాట ……

15 ఏళ్ల క్రితం ఒక రోజు””

ఒక ఊరి శ్మశాన వాటికలో గ్రామ ప్రజలు అందరు గుమిగూడారు….
దీనికి కారణం ఆ ఊరిలో 8 మందిని దారుణంగా హత్య చేయడమే…

ఆ 8 మంది ఒకే కుటుంబం…. ఆ చనిపోయిన వారి లో ఇద్దరు ఆడవాళ్ళు. మగాళ్ళు ఇద్దరు. మరియు 3 అమ్మాయిలు…

“”అంతే కాకుండా ఒక చిన్న పిల్లోడు కూడా…. వాడి వయస్సు అప్పుడు ** సంవత్సరాలు ఉంటుంది””.

ఆ మృత దేహాలకు నిప్పంటించిన వాడు మరో పిల్లోడు అతని వయసు ** ఏళ్లు…

పాపం ఆ అబ్బాయికి అర్ధం కాలేదు ఒక్కసారిగా తన కుటుంబానికి ఏమైందో. తన మొత్తం కుటుంబం ఎప్పుడు సంతోషం గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా …

ఆ రోజు ఉదయం ఆ పిల్లోడు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉంది… కానీ మధ్యాహ్నం తిరిగొచ్చేసరికి…
అతని ఇల్లు శవాలతో నిండిపోయింది…

అతని తండ్రి ,బాబాయ్.. అమ్మ,చిన్నమ్మ.. ముగ్గురు అక్కలు అందరూ చచ్చి పడి ఉన్నారు..

అతని తమ్ముడు…””అతని మృతదేహం కనిపించలేదు””…కొన్ని మాంసపు ముక్కలు మాత్రమే లభ్యమయ్యాయి…

ఎవరిని విడిచిపెట్టలేదు చివరికి చిన్న పిల్లాడిని కూడా అతను ఏమి అపకారం చేశాడని వాళ్ళకి
అయిన ఇంత కిరాతకంగా ఎవరు చంపి ఉంటారు ..??
నా తండ్రి ఎంతో గొప్ప మనిషి.గ్రామస్థులకు, పేదలకు ముక్తహృదయంతో సహాయం చేసేవాడు….ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోలేదు… గౌరవప్రదమైన, సంపన్న కుటుంబం కావడంతో ఊరిలో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన ప్రభావం ఎంతో ఉంది… అలాంటప్పుడు ఇదంతా ఎందుకు… ఎలా జరిగింది… ఎవరు చేశారు… ఎందుకు చేశారు…??? ఈ ప్రశ్నలన్నీ కన్నీళ్లతో కళ్లలో వేసుకుని… దాని వెనుక కారణం ఏంటో కనుక్కుంటానని… తన మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు.. కాలుతున్న చితి లో తన బాల్యపు జీవితాన్ని కూడా తగలబెడుతు ఆ పిల్లాడు..

కానీ అతనికి తెలియదు.
“”ఒక చిన్న కుర్రాడు… ఇంత పెద్ద పని ఎలా చేస్తాడు( హంతకుడిని కనిపెట్టడం)””… సరే… అంతా బూడిద అయిపోయింది అందరూ వెళ్లిపోయిన తర్వాత తన కుటుంబం తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు… రాత్రి అయింది…

ఆ తర్వాత ఒంటరిగా ఉండటానికి భయపడుతున్న ఆ పిల్లాడిని ఊరిలోని ఒక పెద్దాయన ఎలాగోలా నిద్రపుచ్చాడు… సరే… ఆ తర్వాత కాలం గడిచిపోయింది…

రోజులు వారాలకు… వారాలు నెలలకు.. నెలల నుంచి సంవత్సరాలకు… 14 ఏళ్లు గడిచిపోయాయి.. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు… ఆ 8 మంది మృతికి కారణం ఇదే(తర్వాత చెప్పుకుందాం)…

ఇప్పుడు ఆ పిల్లాడు 25 ఏళ్ల వయసులో, యువకుడిగా మారాడు, అతను తన తండ్రిలా మారాడు( అచ్చు గుద్దినట్టు) “”

అయినప్పటికీ అతను ఒంటరిగా ఉన్నాడు …

అది ఒక రాత్రి విషయం ….

ఆ అబ్బాయి. తన ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్నాడు…

ఎవరో రహస్యంగా అతని ఇంట్లోకి ప్రవేశించారు..

… “”ఆ శబ్దం వినగానే ఆ కుర్రాడికి మెలకువ వచ్చింది.మంచం మీద కూర్చొని… అలికిడి అయిన వైపు అడుగులు కదిపాడు..””

అప్పుడు ఓ నీడ …”” ఒంటరిగా ఉన్న నా ఇంట్లో… ఇంత అర్థరాత్రి… రహస్యంగా లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి కేకలు వేయబోయాను”””… నేను ఎక్కడ అరుస్తానో అని ఆ వ్యక్తి నాపైకి దూసుకొచాడు”””.

ఆ కుర్రాడి నోరు మూతబడింది

…’’‘‘షటప్…అబ్సొల్యూట్లీ సైలెంట్..’’‘‘

హేయ్ ఏమైంది స్టోరీ ఇంత ఇంట్రెస్ట్ గా ఉంది చదువుతుంటే అరుస్తావ్ ఎంటి..?

విమల్:-బేబీ నువ్వు చదువుతున్నదానికి కాదు మనసులో చదువుకో నేను వర్క్ లో ఉన్న డిస్టర్బ్ అవుతున్న.

పద్మ( తమన్నా):- బేబీ ఈ బుక్ మార్నింగ్ ఆడిటోరియం లో కనిపించింది.” Based on real incidents” అని టైటిల్ చూడగానే కొనేసాను , సరే లోపల లోపల చదువుకుంటలే అంటూ చదవడం కొనసాగించింది..

“””ఆ వ్యక్తి తన గొంతు నొక్కడం తో , ఆ అబ్బాయి కన్నీటి కళ్లను మాత్రమే చూశాడు…

అతని చెంపలు ఇప్పుడు కన్నీల లో మునిగిపోయి ఉన్నాయి… తర్వాత ఏం జరుగుతుందో అని ఆ యువకుడు ఎదురుచూస్తూ ఉన్నాడు ( క్షణాల్లో అతనికి తన విగత కుటుంబం గుర్తుకు వచ్చింది , ఈ క్షణం తను కూడా చనిపోతే పై లోకం లో వాళ్ళని కలుసుకోవచ్చు అని సంతోషించాడు)…..

కాసేపటి తర్వాత….. ఇద్దరి మధ్య భయంకరం అయిన రాక్షస మౌనం రాజ్యం ఎలింది.

అబ్బాయి:- అప్పుడు ఇదంతా ఎవరు చేశారో చెప్పు నీకూ తెలుసా….

**ఓహ్ గాడ్ ఇక్కడ దాదాపు మొత్తం చేరిగిపోయంది విమల్..*** అంటూ పద్మ తన వైపు చూసింది..

విమల్ :- honey ఎంటి ఏమైంది చెప్పు.

“”” పద్మ :- ఉఫ్ఫ్ ఇక్కడ కొన్ని లైన్లు పూర్తిగా చెరిగిపోయయి బేబీ చూడు అంటూ బుక్ విమల్ కి చూపించింది.

విమల్ పద్మ నీ చురుగ్గా చూసి తన లాప్టాప్ తీసుకొని అక్కడ నుండి లేచి హాల్ లోకి వెళ్ళిపోయాడు””..

పద్మ మళ్ళీ చదవడం మొదలు పెట్టింది..

వ్యక్తి :- హా అవును ( నవ్వుతూ)… ఇప్పటి వరకు నేను ఈ పనిలో నిమగ్నమై ఉన్నాను…

అబ్బాయి:- అయితే రాత్రి ఎందుకు ఇక్కడికి వచ్చావు… పగలంతా కూడా రావొచ్చు కదా. …

వ్యక్తి:- లేదు.. పగటిపూట రావడం సరికాదు… నా వెనుక ఎప్పుడు జనాలు బిజీగా ఉంటారు కాబట్టి…. నన్ను మీతో పాటు చూసి ఉంటే..,,, అప్పుడు నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది ( నీ జీవితం అని చాలా నెమ్మదిగా చెప్పాడు)..

అబ్బాయి:- హ్మ్మ్…అయితే చెప్పు….ఎవరో..మరి ఎందుకు ఇలా చేసాడో…

వ్యక్తి ( ఒక వెకిలి నవ్వు తో):- సరదా కోసం…..

అబ్బాయి (ఆశ్చర్యపోతాడు):- ఏంటి…??? క్లుప్తంగా… అంటే… నువ్వు నాకు మొత్తం చెప్పు…

వ్యక్తి:- దానికి ఇప్పుడు సమయం లేదు…. ఇప్పుడు నువ్వు నా మాట జాగ్రత్తగా విను… ఏం చేస్తావు. నువ్వు చేయాల్సింది… ( Missing some words)

అబ్బాయి:- నువ్వు ఏం చెప్పినా… నేను సిద్ధంగా ఉన్నాను…

వ్యక్తి:- మ్మ్… ఐతే వినండి..

ఆ వ్యక్తి నాతో ప్రతిదీ చెప్పడం మొదలుపెట్టాడు. ,, అతను చెప్పేది వింటుంటే నా రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. ఇంతలో నేను మాట్లాడుతు.