అబ్బో.. రెండు రోజులకే నా మీద అంత ప్రేమ వచ్చేసిందా..? 306

నేను బయటకు వచ్చి చూసేటప్పటికి ఇంట్లో అందరూ లేచి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. నేను సూటిగా నాకు విడిగా కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాను. ఆ గది కాళీగా ఉంది. అర్ధం ముందు నన్ను నేను సరి చేసుకుంటుoడగా అమ్మ లోపలి వచ్చింది. “హా.. చిన్ని వచేసవా..?!, టిఫిన్ కిచెన్ లో రెడీ గా ఉంది. ఆ అలంకారం పూర్తీ అయ్యాక నువ్వు తిని అల్లుడు గారికి కుడా తీసుకెళ్ళు”, అని చెపింది అమ్మ. నేను ఏదో చెప్పే లోపే నాకు పని ఉంది మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయింది. “అబ్బ..! ఏదో ఈవిడ సొంత ఇల్లు లాగా తెగ తిరిగేస్తుంది.. కాస్త నా పక్కన కుర్చోవచ్చుగా”, అని కాస్త అలకతో నా పని పూర్తీ చేశాను. నేను వెళ్లి టిఫిన్ తినేసాను. ఆయన కోసం అని టిఫిన్ ప్లేట్ లో పెట్టుకొని వాటర్ కోసం కిచెన్ లో వెతుకుతుండగా పని మనిషి రంగీ లోపలకి వచ్చింది. నాకు కావాల్సిన ‘నీళ్ళు’ చేతికి ఇస్తూ “రాత్రి నిద్ర పోయారా అమ్మ..?!”, అని అడిగింది. నేను ఒక్కసారిగా ఆమె వైపు చూసాను. ఆమె చిన్నగా నవ్వుతుంది, “అదే కొత్త చోటు కదా నిద్ర పాటిందా, లేదాని అడిగానమ్మా”, అని కవర్ చేసింది. నేను “హా.. బానే నిద్ర పటిందిలే..”, అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేసాను. ఆయన బయట బాల్కనిలో కూర్చున్నారు. నేను అయన దగ్గిరకి వెళ్ళాను, అయన ఏదో అలొచిస్తూ నవ్వుకుంటున్నారు. నేను చిన్నిగా నసిగాను. “మీకోసం టిఫిన్ తెచ్చాను”, అని ఆయనకు అందించాను. అక్కడనుండి వెళ్లిపోతుంటే చట్టుకున్న నా చెయ్యి పట్టుకున్నారు. “టిఫిన్ తినే వరుకు నాకు కంపెనీ ఇవ్వచుగా”, అన్నారు. నన్ను ఎగాదిగా చూసి “నువ్వు ఈ సారీలో చాలా అందంగా ఉన్నావ్.. ఇది లేకపోతే ఇంకా అందంగా ఉంటావ్ తెలుసా”, అన్నారు. చ్చి!, ఏంటి ఆ మాటలు సిగ్గు లేకుండా.. ఎవరైనా చూస్తారు”, అని బలవంతంగా చెయ్యి విడిపించుకొని అక్కడ నుండి వచ్చేసాను. నేను నా గదిలోకి వెళ్లి, బయటకి రాలేక సిగ్గుతో అక్కడే ఉండిపోయాను. కాసేపటికి మా అయన చెల్లెలు వచ్చి “ఏం చేస్తున్నారు వదినా?, అంటూ వచ్చి నన్ను పలకరించింది.. మాటల్లోకి దింపింది. బాగా కలివిడిగా ఉండటం వళ్ళ చాలా త్వరగా నేను ఆమెతో కలిసిపోయాను. చాలా సేపు మాట్లాడుకున్నాము. మా అత్త పిలవడంతో తను వెళ్ళిపోయింది. మొత్తానికి లంచ్ టైం దగ్గిర పడింది. మా అమ్మ నా దగ్గిరకి వచ్చి, “చిన్ని ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్?, అక్కడ మీ అత్త గారు వంట గదిలో చాలా కష్టపడుతున్నారు.. వెళ్లి సహాయం చెయ్యి. ఏంటో ఎంత చెప్పినా నీకు మళ్ళీ కొత్తే”, అని సనగడం మొదలుపెట్టింది. నేను వంట గదిలోకి రావడం గమనించి, ‘ఎంటమ్మా సింధూ, ఏం కావాలి?”, అని అడిగింది మా అత్త. మీకు హెల్ప్ చేద్దాం అని వచ్చాను అత్తయ్య”, అన్నాను. “అయ్యో.. నీకెందుకమ్మా ఇవన్నీ”, అన్నారు. “పర్లేదు అతయ్య గారు”, అని అక్కడ కూరగాయలు సద్దటం మొదలు పెట్టాను. “అవన్నీ నేను చూసుకుంటాను, ఈ రైస్ అలాగే కూరలు అన్నీ ఆ డైనింగ్ టేబుల్ సద్ది అందరినీ కాస్త పిలువమ్మ”, అని చెప్పారు. మొత్తానికి మా ఆయనతో సహా అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గిర గేదర్ చేయించాను. నేను వడ్డిదాం అనుకుంటే నన్ను చేయనివ్వలేదు మా అత్త .. ఎంతైనా కొత్త కోడల్ని కదా. నా పక్కనే కాళ్ళీగా ఉన్న కుర్చీలోకి వచ్చి కూర్చున్నారు నా శ్రీవారు. అయన నా పక్కన కూర్చోగానే చాలా కొత్తగా అనిపించింది. తినడానికి ఇబ్బందిగా అనిపించింది. తినడం ఆరoబించిన కాసేపటికి నాకు షాక్ కొట్టినట్లు అయింది.. అయన చేతితో నా చేతిని తాకి మెత్తగా నొక్కుతున్నారు. చాలా హాయిగా అనిపించింది. రాత్రి ఎలాంటి అనుబూతిని పొందానో అదే అనుబూతి మళ్ళీ కలుగుతుంది. తినకుండా ఆగిపోయిన నన్ను చూసి ‘తిను’, అనట్లుగా కళ్ళతో సైగ చేసింది మా అమ్మ. నేను తినటం మళ్ళీ మొదలుపెట్టాను. కానీ అయన చేతిని మాత్రం విడిపించుకోబుద్ది కాలేదు. ఆయనా ఇంకా రెచ్చిపోయారు. చేతి మీద ఆయన వేళ్ళను కదిలిస్తున్నారు, చేతి కండను మెత్తగా నొక్కుతున్నారు. నాకు సమ్మగా ఉంది.. వళ్ళంతా మత్తు పాకడం మొదలైంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వాళ్ళ మాటలే కాదు, మా అత్తా గారి వంట రుచి కుడా నా బుర్రకి ఎక్కట్లేదు, ఆయన చిలిపి అల్లరికి. చివరికి కష్టపడి భోజనం పూర్తిచేసాను. నేను ఎవరితోనూ మాట్లాడకుండా నా గదికి వెళ్ళిపోయాను. ఆ మత్తులో మెల్లిగా మంచం మీద పడి పొందిని అనుబూతిని నెమరు వేసుకుoటూ కళ్ళు మూసుకున్నాను. ఈలోపు ఎవరో వచ్చినట్లు అనిపించి కళ్ళు తెరిచాను. ఏదో కొత్త మొఖం నవ్వుతూ పలకరించి నా పక్కన కూర్చుంది. ఎంటమ్మా, అలా చూస్తున్నావ్..?, నేను పక్క ఇంట్లో ఉంటాను. మొన్న మీ పెళ్ళికి రాలేకపోయాను. ఒక్కసారి పలకరిదామని వచ్చాను”, అని చెప్పింది. నేను “బాగున్నారా అంటి?”, అని అడిగాను. “అంటి ఏంటి..!, ఇంగ్లీష్ పిల్ల లాగా.. పంకజం అత్తా అని పిలువు”, అని గట్టిగా అంది.

1 Comment

  1. Hi sendhu Sri me Katha bagundhi

Comments are closed.