ఆనందం 434

ఏరా శివ నెక్స్ట్ క్లాస్ కి టైం అవుతోంది, వెళ్దాం పదరా.
MBA లో కూడా మధ్యాహ్నం క్లాసెస్ కి అటెండ్ అవ్వడం ఏంట్రా, పద అలా కైలాసగిరి దాకా వెళ్ళొద్దాం.
నేను రానురా బాబు. నీకేంటి నువ్వు ఎలాగో అలా చదివి పాస్ అవుతావ్, నేను క్లాస్ కి వెళ్తా నన్నొదిలెయ్.
Ok బాయ్ రా.
బాయ్…..
నేను బైక్ స్టార్ట్ చేసి కైలాసగిరి వైపు రయ్ మని పోనిస్తున్నా. దారిలొ ఫోన్ కాల్ రావడంతో బైక్ ఒక చెట్టు నీడన ఆపి కాల్ అటెండ్ చేశా.
హాయ్ మమ్మీ, ఎలా ఉన్నావ్.
నేను బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావ్ రా కన్నా.
నేను బాగున్నా మమ్మీ, డాడీ ఆఫీస్ కి వెళ్ళారా?
అవునురా. నీకు మీ ఫ్రెండ్స్ గోల, మీ నాన్నకు ఆఫీస్ గోల తప్ప నా గురించి ఎవరికీ పట్టదుగా..!
సారీ మమ్మీ, నిన్న ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండి నీకు కాల్ చెయ్యలేదు.
అదిసరే కానీ నేను పంపిన సున్నుండలు, అరిసెలు మీ పిన్నికి ఇవ్వమన్నాను ఇచ్చావా.
(అప్పుడు గుర్తొచ్చింది పిన్నికి ఇవ్వమని మమ్మీ పంపిన పార్సిల్, నైట్ ఫ్రెండ్ రూం లోనే పెట్తి మర్చిపోయా.)
సారీ మమ్మీ, నైట్ ఫ్రెండ్ ని విష్ చేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్శిల్ ఇద్దామనుకుని ఫ్రెండ్ రూం లో పెట్టి మర్చిపోయా. ఇప్పుడే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి ఇస్తా.
ఇప్పుడు క్లాసులు లేవా?
మధ్యాహ్నం క్లాస్ కాన్సిల్ అయ్యింది మమ్మీ.
Ok రా కన్నా, పిన్ని వాళ్ళని అడిగానని చెప్పు.
Ok మమ్మీ బాయ్..
కాల్ కట్ చేసి ఫ్రెండ్ రుం కి వెళ్ళి పార్సిల్ తీసుకుని పిన్ని వాళ్ళ ఇంటికి సీతమ్మధార వైపు బైకు పరిగెత్తించా.

1 Comment

  1. Woow! Super. Padma story kuda post cheyandi bro

Comments are closed.