ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 12 242

సంయుక్త ముందు నడవగా తన వెనుక నడుస్తూ షాప్ లోకి వెళ్ళాను . మేము లోపలికి వెళ్ళగానే అప్పుడే వేరే కస్టమర్స్ ని పంపేసి మా దగ్గరకు వచ్చి ఏమి కావాలి అంది . ఫంక్షన్ కి వెళ్ళాలి ఏదయినా చుడిదార్స్ చూపించండి అంది సంయుక్త . ఫంక్షన్ కి అంటున్నారు చుడిదార్ కంటే శారీస్ నే బావుంటాయి అంది నందిని . అవుననుకో కానీ శారీ కొంటె మ్యాచింగ్ లంగా జాకెట్ కావాలి మళ్ళీ స్టిక్చింగ్ కి లేట్ అవుతుంది అంది సంయుక్త . హో అదా మీ భయం మీ మీరు శారీ సెలెక్ట్ చేసి పది అంటే పది నిముషాలు టైం ఇవ్వండి అని చెప్తూ బాయ్ ని పిలిచి కూల్ డ్రింక్స్ తెమ్మని పంపింది నందిని . సంయుక్త శారీ ఒకటి చూపించి కూల్ డ్రింక్ అందుకుంది . సంయుక్త నేను కూల్ డ్రింక్ చిన్నగా సిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం . పది నిముషాలు కాకముందే నందిని శారీ దానికి మ్యాచింగ్ బ్లౌస్ లంగాతో అక్కడికి వచ్చి సంయుక్త కి ఇచ్చి ట్రయిల్ చూడమంది . శారీ లంగా జాకెట్ తో ట్రయల్ రూమ్ లోకి వెళ్లి తన ఒంటి మీదవి విప్పి తెచ్చినవి వేసుకొని అద్దం లో చూసింది తన ఒంటి రంగు కి ఆ చీర మరి ఎక్కువ వన్నె తెచ్చింది . లంగా బ్లౌస్ చాలా కరెక్ట్ గా ఫిట్ అయ్యాయి . విడిచిన బట్టలు తీసుకొని బయటకు వచ్చి హాండ్ బాగ్ లో పెడుతుంటే కిరణ్ చాలా బావున్నారు అంటీ అంటుంటే సంయుక్త బుగ్గల్లో ఎర్ర గులాబీ లా తోట వెల్లివిరిసినట్టు అనిపించింది . తనకి ఆ శారీ విపరితంగా నచ్చిందని నందిని ని పొగడ్తల సంద్రంలో ముంచెత్తింది . నువ్వు కూడా బట్టలు తీసుకో కిరణ్ ఈ రోజు ఫంక్షన్ కి నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావ్ అంది సంయుక్త . అలా కాదు అంటి తెలీని ఫంక్షన్ కి ఎలా అన్నాను . నేను ఉన్న కదా కిరణ్ అంది సంయుక్త (అప్పటికి తానేంటో కిరణ్ కి తెలిసినట్టు ) . నందిని ఒక జత బట్టలు తీసి ఇవి వేసుకో నీకు చాలా బావుంటాయి అని ఇచ్చింది . వద్దు అవి మరి ఖరీదు ఐనవి లా ఉన్నాయి అన్నాను . ఎంత ఖరీదు అయితే నీకెందుకు రా ఇచ్చేది నేనె కదా అంది సంయుక్త . ఆవిడ నన్ను రా అనడం ఏదోలా అనిపించింది తక్కువ పరిచయంలో అలా అనడం ముందు ముందు ఏ పరిస్థితులకు దారి తీస్తుందో కాలమే తెలపాలి . బిల్ ఇచ్చింది నందిని ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది సంయుక్త . మరి 40%డిస్కౌంట్ ఏంటి అని . నందిని గారు ఇది చాలా అన్యాయం అండి వచ్చినప్పుడల్లా ఇలా డిస్కౌంట్ ఇస్తూపోతే ఎలా అండి అన్నాను . మేము బిజినెస్ చేసే వాళ్ళమే కిరణ్ గారు మాకు నష్టం వచ్చే విధంగా అయితే మాత్రం చేయము మిమ్మల్ని చూస్తుంటే దగ్గర వారిలా అనిపించారు అందుకే ఇలా అంది నందిని . సరే మేడం మీ ఇష్టం మీరు ఏమి చేసినా మాకు లాభమే కదా అంటూ వెళ్లబోతుంటే ట్రయల్ చూసుకో అంది నందిని . ట్రయల్ రూమ్ కి వెళ్లి నందిని ఇచ్చిన బట్టలు వేసుకొని బయటకువచ్చాను . చాలా చక్కగా ఫిట్ అయ్యింది నీకు అంది నందిని . నేను సంయుక్త కలిసి బయటకు వెళ్లి కార్ ఎక్కము . కార్ లో నుండి వాటర్ బాటిల్ తీసి ఫేస్ వాష్ చేసుకొని మేకప్ టచ్చింగ్ ఇచ్చింది . ఇద్దరం ఫంక్షన్ కి వెళ్ళాము . సందడి సందడిగా ఉంది లోపలికి వెళ్తుండగానే ఎదురు వచ్చి మరి రిసీవ్ చేసుకున్నారు . లోపలికి తీసుకెళ్లి గ్లాస్ లు చేతిలో పెట్టారు . హై క్లాస్ వాతావరణం అంత అక్కడే కనపడుతుంది మగాళ్లు సూట్ లో ఉంటే ఆడవాళ్లు రకరకాల మోడ్రన్ డ్రెస్ ల్లో సీతాకోకచిలుకళ్ల రంగురంగులుగా మెరిసిపోతున్నారు . సంయుక్త కి ఇలాంటి పార్టీస్ అలవాటు లానే ఉంది గ్లాస్ మీద గ్లాస్ 6 వెంట వెంటనే తాగింది . సంయుక్త నే కాదు అక్కడ ఉన్న ఆడవాళ్లు నూటికి అరవై మంది అలానే తాగుతూ ఉన్నారు . లోపలికి వెళ్లిన చుక్క తన పని ప్రారంభించి నట్టుంది చిన్నగా డాన్స్ చేస్తూ నా దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని డాన్స్ అంటూ లాగింది . తనతో పాటు కదిలి రెండు చిన్న మూమెంట్స్ చేసి ఇంకా వెళదామా అన్నాను .

3 Comments

  1. Next episode please

  2. Story is good where is the counituniti
    Story

  3. next episode release chei

Comments are closed.