ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 12 242

ఈరోజు ఏ వారం రా అన్నాను గురువారం అన్నాడు . ఇప్పుడు చెప్పు ఎన్ని రోజులు అన్నాను . నిజమే నాలుగు రోజులు మనకి అడ్డేమి ఉండదు హరిణి ని ఇంటి దగ్గర దింపి మన బార్ కి వచ్చేసెయ్యి వైట్ చేస్తూ ఉంటాను అన్నాడు కిషోర్ . సరే రా అని పక్కకి చూస్తే అందరూ వెళ్లిపోయారు రమ్య హరిణి తప్ప . హరిణి ఇక్కడే ఉండు మాధవి మేడం ఎందుకు పిలిచిందో కనుక్కుని వస్తాను అని వెళ్ళిపోయాను . రమ్య హరిణి మాటలలో పడ్డారు . మె ఐ కం ఇన్ మేడం అనగానే తల ఎత్తి చూసి నువ్వా రా లోపలికి ఎన్ని రోజులుకు కనపడ్డావ్ రా మా ఇంటికి లంచ్ కి రమ్మని చెప్పకదా ఏమి ఆలోచించావ్ అంది మాధవి . వస్తాం మేడం రేపు ఆదివారం తప్పకుండా వస్తాము అన్నాను . ఎలాగూ ఈ మూడు రోజులు సెలవలు కదా రావొచ్చు కదా అంది . నిజమే మేడం కానీ నేను ఇంట్లో ఉండక చాలా రోజులు అవుతుంది నాకు ఎప్పుడు కుదిరితే ముందు రోజే మీకు కాల్ చేస్తాను అన్నాను . సరే వెళ్లు ఇంకా అంది.
సరే అని హరిణి ని తీసుకొని వెళ్తుంటే నన్ను కూడా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి నేను స్కూటీ తెచ్చుకోలేదు అంది రమ్య . సరే రా డ్రాప్ చేస్తా అన్నాను . ఇప్పుడు ముందు ఎవరు కూర్చోవాలి అన్న దగ్గర కొట్టుకుంటారు అనిపించి ఇద్దర్ని వెనుక కూర్చోమన్నాను . కార్ లో ముగ్గురు కూర్చోగానే ముందుకు కదిలి రమ్య వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళసాగింది . మెయిన్ రోడ్డు మీదకు వెళ్ళాక బావ అప్పుడే ఇంటికి వెళ్లాలా అలా ఐస్ క్రీమ్ తిని వెల్దామ అంది రమ్య .హరిణి నోరు తెరిచి రమ్య వైపు అలా చూస్తుంటే ఏంటి హరిణి అలా చూస్తున్నావ్ బావ అన్నాననా ఈ మధ్య ఈ మహానుభావుడు అందరికి బావ అవుతున్నాడులే అంటూ సరే నీకు ఇష్టం లేకుంటే అన్నయ్య అని పిలుస్తాను అంటూ ఏం అన్నయ్య ఐస్ క్రీమ్ తిందామ అంది రమ్య . అలాంటిదేమి లేదు రమ్య నీ ఇష్టం వచ్చినట్టు పిలువు నాకేం ప్రాబ్లమ్ లేదు అంది హరిణి . కార్ ఐస్క్రీమ్ షాప్ ఎదురు ఆపాను . లోపలికి వెళ్ళి కూర్చున్నాం బేరర్ రాగానే రమ్య బటర్ స్కాచ్ చెప్పి హరిణి నీకు ఏం కావాలో చెప్పు అంది రమ్య . కిరణ్ నువ్వు చెప్పు అంది హరిణి . కిరణ్ ది కూడా నేను చెప్పాను నీకు ఎం కావాలో చెప్పు అంది రమ్య . అయితే నాకు కూడా అదే చెప్పు అంది రమ్య . 3 బటర్ స్కాచ్ ఆర్డర్ చేసింది . ఐస్ క్రీమ్ రాగానే తింటుంటే కిరణ్ గురించిబాగానే స్టడీ చేసినట్టు ఉన్నావ్ అంది హరిణి . ఏం అలా అన్నావ్ ఐస్ క్రీమ్ గురించా అలా ఐతే నువ్వు ఏం చెప్పిన తింటాడు అంది రమ్య . ముగ్గురు తినేసి బిల్ కట్టి బయటకు వచ్చి రమ్య వాళ్ళ ఇంటి వైపు పోనించి రమ్య ని ఇంటి దగ్గర దింపి పక్క రోడ్లోకి తిప్పగానే సంయుక్త ఇల్లు కనిపించింది . అమ్మో ఇప్పుడు సంయుక్త చూస్తే తన కోసమే వచ్చాను అనుకుంటుందని త్వరగా ఆ రోడ్డు లో నుండి పోనించి ఇంటికి చేరుకున్నాం .హరిణి ఇంటి లోకి వెళ్ళిపోయింది . ఇంట్లోకి వెళ్లి బుక్స్ పక్కన పడేసి డ్రెస్ మార్చుకొని పిన్ని మళ్ళీ వస్తాను అని చెప్పి బార్ కి వెళ్ళాను.

3 Comments

  1. Next episode please

  2. Story is good where is the counituniti
    Story

  3. next episode release chei

Comments are closed.