ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 2 88

అక్క నా దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని పద అంటూ తీసుకెళ్లింది…
వెళ్లెప్పుడు ” చూడు అక్షరా… నీకు నేను డిన్నర్ కి ముందు అంతా చెప్పాను… ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను… గదిలోకెళ్లాక కూడా మూడీగా ఉండకు… కొంచెం ఫ్రీ గా ఉండు.. రవి చెప్పినట్టు విను… ” అని నాకు మాత్రమే వినబడేలా చిన్నగా చెప్పింది…
నేనేం మాట్లాడలేదు…
పైన ఉన్న గది డోర్ వద్దకు మేం వెళ్ళేసరికి అమ్మ పాల గ్లాస్ తెచ్చి నా చేతికి ఇచ్చింది…
అమ్మ వెంట అత్తయ్య కూడా వచ్చింది….
నేను ఇంకా డల్ గానే కనిపించానేమో… “మరేం ఫరవాలేదమ్మా… అబ్బాయికి అన్ని జాగ్రత్తలు చెప్పాను… నువేం భయపడకు” అందావిడ…
“ఇంకా భయపడడానికి ఏముంది” అనిపించింది నాకు… కానీ ఏమీ మాట్లాడకుండా సరే అన్నట్టు తలూపాను..
అక్క నన్ను లోపలికి వెళ్ళమని చెప్పి… నేను గదిలోకి అడుగు పెట్టగానే వెనకనుండి తలుపులు మూసింది….

తల దించుకొని గదిలోకి వెళ్లిన నేను కాసేపటికి తలెత్తి చూసాను.. ఎదురుగా మంచం కనిపించింది…
అక్కడ రవి ఉంటాడనుకున్నా నేను..
కానీ మంచం ఖాళీ గా ఉంది…
రకరకాల పూలతో అందంగా అలంకరించారు మంచాన్ని…
బెడ్ మీద నిండా తెల్లటి మల్లెపూలు చల్లి ఉన్నాయి…
మధ్యలో గులాబీ రేకులతో హార్ట్ సింబల్ వేశారు…
నీలం రంగు పూల రేకులతో హార్ట్ లోకి బాణం గుచ్చినట్టు పేర్చారు…
చుట్టూ రకరకాల పూల దండల్ని వేలాడ దీశారు…
బెడ్ పక్కన స్టూల్ మీద ఒక ప్లేట్ లో పండ్లు స్వీట్లు ఉన్నాయి…
దాని పక్కన మరో స్టూల్ మీద అగరొత్తుల స్టాండ్ ఉంచి సువాసన వెదజల్లే అగరొత్తులు ముట్టించి ఉన్నాయి.. అప్పటికే ఆ గది నిండా అగరొత్తులు వాసన నిండిపోయింది…వాటికి పూల వాసన కూడా కలిసి కొత్త రకమైన వాసనలా అనిపించింది…
నేను చుట్టు చూస్తూ వెళ్లి చేతిలోని పాల గ్లాస్ అక్కడున్న స్టూల్ మీద పళ్ళ ప్లేట్ పక్కన పెట్టాను…
బాత్ రూమ్ డోర్ తీర్చుకున్న చప్పుడు విని అటు తిరిగి చూసాను…
లోపల్నుండి రవి బయటకు వస్తూ కనిపించాడు…
తెల్లటి లాల్చీ, పైజామా వేసుకున్నాడు…
బాత్రూం డోర్ మూసి మేమున్న గది తలుపువైపు వెళ్లి దాన్ని లోపల్నుండి లాక్ చేసి నా దగ్గరకు వచ్చాడు…
నేను తల దించుకొని నిలబడ్డాను…
బయట అక్క చెప్పిన మాటలు నా చెవుల్లో తిరుగుతుంటే…
అతడేమి చేసినా వద్దనొద్దని నిర్ణయించుకున్నాను…
ఆల్రెడీ ఒకసారి నా శరీరాన్ని నా ఇష్టం లేకుండానే అనుభవించాడు… ఇప్పుడు ఇంకొకసారి నా ఇష్టంతో సంబంధం లేకుండా అనుభవిస్తాడు… బహుశా జీవితాంతం అంతేనేమో…
కాకపోతే ఆ రోజు నేను అతన్ని వద్దని చాలా సేపు ప్రతిఘటించాను.. ఇకనుండి అతనికి ఆ కష్టం కూడా ఉండదు…
ఇలా మనసంతా ఒక రకమైన వైరాగ్యం నిండి…మంచం పక్కన తల దించుకొని… ఉదాసీనంగా నిలబడి ఉన్న నా దగ్గరికి వచ్చాడు రవి…
నా ముందు నిలబడి పైనుంచి కింది దాకా నన్ను పరీక్షగా చూసాడు…

కొద్దిసేపు అలాగే చూసి… ” నిలబడే ఉన్నావేం కూర్చో అక్షరా”
అన్నాడు…
నేను తల దించుకుని అలాగే నుంచున్నాను…
భుజాల మీద చేతులు వేసి కూచోమన్నట్టుగా కిందికి వత్తాడు…
నేనిక తప్పదన్నట్టుగా మంచం మీద కూర్చున్నా…
కాసేపు నన్ను అలాగే చూస్తూ నిలబడ్డ రవి… సడన్ గా కింద నేలకు ఆనించి ఉన్న నా పాదాలను పట్టుకున్నాడు…
నేను వెంటనే నా కాళ్ళు పైకి లాక్కునే ప్రయత్నం చేశాను… కానీ రవి గట్టిగా వాటిని కౌగిలించుకున్నట్టుగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు…
నేను విడిపించుకునేందుకు పెనుగులాడుతుంటే…
” ఐ యాం సారీ అక్షరా… నన్ను మన్నించు.. ”
అన్నాడు కాళ్ళు వదలకుండానే…
“ఎంత సింపుల్ గా చెప్పేసావ్ .. సారీ .. అని.. నేను ఇన్ని రోజులు పడిన బాధ అంతా ఒక్క మాటతో పోతుందా…” అందామనుకున్నాను కానీ అనవసరం అనిపించింది…
ఇంతలో రవి మళ్లీ అన్నాడు

” ఐ యాం రియల్లీ సారి అక్షరా.. నాకు తెలుసు నేను చేసింది క్షమించరాని నేరం అని… క్షమాపణలు అడిగే అర్హత కూడా నాకు లేదు… కానీ నేను కావాలని చేయలేదు…. ముందు నేను చెప్పేది పూర్తిగా విను అక్షరా.. తర్వాత నువ్ నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను ”
అంటూ నా మొహం వైపు చూసాడు…
నేను కదలకుండా అలాగే కూర్చుని తల తిప్పుకున్నా…
అతని మాటలు వింటుంటే ఇన్నాళ్లు నేను అనుభవించిన నరకం లాంటి క్షోభ గుర్తొచ్చింది…
నా కళ్లలోంచి అప్రయత్నంగా కన్నీళ్ళు కారుతున్నాయి…
రవి నా కాళ్ళు వదిలేసి నా రెండు చేతుల్ని కలిపి పట్టుకుని ” ప్లీజ్ అక్షరా నువ్ అలా ఏడవకు … నేను చెప్పేది విను.. ఆ తర్వాత నీ కోపం తగ్గే వరకు ..అవసరమైతే ఈ జీవితాంతం నన్ను శిక్షించు… అంతే కానీ నువ్ ఏడవకు… నేను చూడలేను”
అన్నాడు…
‘తట్టుకోలేను’ అనే మాట వినే సరికి కోపం వచ్చింది నాకు..
తర్వాత అదొరకమైన నవ్వు కూడా వచ్చింది… ఏడిస్తే తట్టుకోలేని వాడు… అలా చేస్తాడా ఎక్కడైనా అనిపించింది… కానీ ఏమీమాట్లాడలేదు నేను… ఇంకా ఏం చెప్తావ్ అన్నట్టు చూసాను..

” ఆరోజు జరిగింది నేను కావాలని చేసింది కాదు అక్షరా… అదంతా అనుకోకుండా జరిగింది…”

“ఎలా నమ్ముతాను “మనసులో అనుకున్నాను నేను..
“నువు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం అక్షరా” అన్నాడు నా మనసు చదివినట్టు..
నేను తలెత్తి అతన్ని చూసాను…
తను నన్ను చూడకుండా తన చేతుల్లో ఉన్న నా చేతుల్ని చూస్తూ చెప్పడం కంటిన్యూ చేసాడు..

“అక్షరా…మీ అక్క పెళ్లిలో నువు కనిపించిన మరుక్షణమే నీ మీద ఇష్టం ఏర్పడింది నాకు… లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో నాకు ఆ క్షణమే తెలిసింది …
నువ్ కనిపించగానే నా మనసులో అనిపించిన దాన్నే నేను నీకు చీటీ మీద రాసి పంపాను..
ఆ రోజ్ నువ్ కనపడిన తర్వాత చాలా సేపటి వరకు మరేదీ కనిపించలేదు నాకు…
నువ్వేటు వెళ్తే నా కళ్ళు అటే తిరిగాయి…
మధ్యాహ్నం ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను తీసుకెళ్తేనే వెళ్ళాను…
అంత నచ్చావు నువ్ నాకు…”

“…..”

2 Comments

  1. Continue story waiting for next part and who is that another person in storie

  2. Intha beautiful ga unna storie lo vere evado ravadam baledu. First lo vachhina “athan” evaru. Is raju

Comments are closed.