ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 2 88

“ఫోటో చూడకుండా తప్పు చేశానా?..చూసి ఉండాల్సిందా? .. అనిపిస్తుంది…
చూసినా ఏం చేసేదానివి అని మనసు ప్రశ్నించింది…
అవును చూసినా ఏం చేసేదాన్ని? జరిగింది చెప్పగలిగే దాన్నా…
జరిగింది చెప్పకుండా ఫోటో చూసి వద్దనే దాన్నా…
వద్దంటే నాన్న వాళ్ళు ఊరుకునే వాళ్ళా..
కారణం లేకుండా… అబ్బాయిని చూడకుండా.. వద్దని ఎలా చెప్పేదాన్ని…
ఫోటోచూసినా, పెళ్ళిచూపుల్లో రవి వచ్చి.. ముందు కూర్చుని వెళ్లినా… కారణం చెప్పకుండా నేను ఈ పెళ్లి వద్దు అంటే ఎవరూ వినే వాళ్ళు కారు…
కొంతలో కొంత చూడందే నయమయింది … లేదంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ టెన్షన్ అంతా పడాల్సి వచ్చేది అనిపించింది…”
ఇంతలో అక్క పని పూర్తయినట్టుంది…
“ఒక సారి అద్దం లో చూసుకోవే ఎంత అందంగా ఉన్నవో” అంది…

నేను అద్దం లోకి చూసాను…
నాకు అక్క చేసిన అలంకరణ ఏదీ కనబడడం లేదు..
నా కళ్ళు అద్దంలో కనబడుతున్న కళ్ళని కలుసుకున్నాయి…
ఆ కళ్ళు ఈ కళ్ళని “ఏం చేస్తావ్ ఇప్పుడు” అని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది…
నిజమే ఇప్పుడు ఏం చేయాలి??
నాకు జవాబు ఏమీ తోచలేదు…

ఇంతలో అమ్మ వచ్చింది… “అయ్యిందా.. టైం అవుతుంది ” అంటూ…

“అయిపోయిందమ్మా” అంది అక్క…

“సరే ఇంకో పావుగంట టైముంది కదా.. ఈ లోపు నువ్వెళ్ళి గదిలో ఇంకేమన్నా కావాలేమో .. చూసిరా” అంది అమ్మ…

అక్క వెళ్లిపోవడంతో అమ్మ నా దగ్గరే కూచుంది..
కానీ ఏమీ మాట్లాడలేదు…

నేనూ ఏమీ మాట్లాడలేదు.. నా ఆలోచనలన్నీ ఇప్పుడు ఏం చెయ్యాలా అనే ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి… ఎంతకీ జవాబు దొరకలేదు…
అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసాను..

“ఏమిటి” అని దాని కళ్ళు అడిగాయి..

“ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు” అని నా కళ్ళు దాని కళ్ళని ప్రశ్నించాయి…

” ఇప్పుడు నీ సమస్య ఏమిటి?”

“నీకు తెలుసు కదా”

“శోభనమా? ”

“అవును”

“పెళ్లికి ఒప్పుకున్నపుడు తెలియదా”

“తెలుసు… కానీ…”

“రవితో… అని తెలియదంటావ్”

“అవును”

“అంటే రవి కాకుండా వేరే వ్యక్తి అయితే సంతోషంగా ఉండేదానివా”

“లేదు ”

“కదా.. మరి ఇప్పుడు ఇంతగా మధనపడడం ఎందుకు… జరగవలసిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది… అది వెనక్కి తిరిగి వచ్చేది కాదు… పెళ్లికి ఒప్పుకున్నదే అమ్మా నాన్నలకు బాధ కలగొద్దని అని అనుకున్నప్పుడు.. ఇప్పుడు ఇంతగా ఆలోచించవలసిన పని లేదు…
ఎవరైనా .. ఎలా ఉన్నా అంగీకరించాలి అని ముందే అనుకున్నావు కదా… మరి ఇప్పుడు ఇంత ఆలోచన ఎందుకు… అక్కడ రవి ఉంటే ఏమి ..ఇంకొకరు ఉంటే ఏమి.. ఎవరితో అయినా ఒకటే కదా… ”

“అవును”

“అందుకే ఇంకేమీ ఆలోచించకు… నీవిప్పుడు తెగిన గాలి పటం లాంటిదానివి… గాలి ఎటు వీస్తే అటు వెళ్ళాలి… ఎంత ఆలోచించినా పరిస్థితులు నీ చేతుల్లకి రావు.. ఏది ఎలాగైనా జరగని స్వీకరించడానికి సిద్ధపడు … అదొక్కటే నువ్విపుడు చేయగలిగేది “…

ఈ విధంగా నాలో నేను తర్కించుకున్నాక కాస్త రిలీఫ్ అనిపించింది…
అది రవిని స్వీకరించడం వల్ల వచ్చింది కాదు … .ఏమైనా జరగని అనుకోవడం వల్ల వచ్చింది…
ఒక రకమైన వైరాగ్యం కలగడం వల్ల వచ్చిన రిలీఫ్ అది….
అంతలో అక్క తిరిగి వచ్చి ” అక్షరా పద ” అంది..
నేను లేచి నిలుచున్నాను…

2 Comments

  1. Continue story waiting for next part and who is that another person in storie

  2. Intha beautiful ga unna storie lo vere evado ravadam baledu. First lo vachhina “athan” evaru. Is raju

Comments are closed.