కామదేవత – Part 36 98

ఇక శుక్రవారం రాత్రి ఆడపిల్లలంతా సుదర్శనం ఇంటికి రావడం ఖాయం ఐపోవడంతో అప్పటికే రమణి అందించిన టిఫెను తిని కాఫీ తాగడం ఐపోవడంతో.. ఆఫీసుకు ఆలస్యం ఐపోతున్నాదని సుదర్శనం హడావిడిగా ఆఫీసుకు బయలుదేరుతుంటే.. స్కూటరెక్కి వెళ్ళిపోబోతున్న సుదర్శనాన్ని రమణి ఆపుతూ.. అంకుల్.. నిన్న సాయంత్రం నేను మీకు చెప్పిన విషయం ఏంచేసేరు..? అడిగింది.

నువ్వు చెప్పడం నేను చెయ్యకపోవడమూనా..? నిన్నరాత్రే ఆపని ఐపోయింది.. అని సుదర్శనం ఇంకేదో చెప్పబోతుంటే.. రమణి రహస్యం గట్టిగా బయటకి అనవొద్దు అని చిన్నగా సుదర్శనానికి మాత్రమె వినపడేలా గొణిగేప్పటికి.. సుదర్శనం కూడా గొంతు తగ్గించి.. నువ్వు చెప్పిన పని ఐపోయింది రమణి.. రేపు తెల్లారేప్పటికి నువ్వు కోరినది ఇక్కడుంటుంది నన్ను నమ్ము అన్నాడు సుదర్శనం.

రమణి ముఖం నిండా నవ్వు పులుముకుని సుందర్శనం అంకుల్ చేతిమీద చెయ్యవేసి.. సుందర్శనం అంకుల్ చెయ్య మెత్తగా నొక్కుతూ.. థంక్సు అంకుల్ అన్నాది రమణి.. అయ్యో మన మధ్య మనకి థంక్సు లు ఎందుకమ్మా.. అని రమణి చేతిని తన చేతిలోకి తీసుకుని మెత్తగా నొక్కి వొదిలిపెడుతూ నాకు ఆఫీసుకు ఆలస్యం ఐపొతున్నాది మళ్ళీ సాయంకాలం వొస్తాను అన్నాడు..

రమణి మళ్ళీ సుదర్శనాన్ని ఆపుతూ.. ఇంక ఈరోజు నించీ మీరు ఇటుపక్క రాకూడదు.. నేనే సాయంకాలం మీరు ఆఫీసునించీ వొచ్చేసరికల్లా మీకోసం కాఫీలు అవీ సిద్దం చేసి మీ ఇంటికి పట్టుకొస్తాను.. రాత్రి భోజనం కూడా మేమే మీ ఇంటికి తీసుకొస్తాము అని చెప్పింది రమణి సుదర్శనానికి.. సాయంకాలం, రాత్రి కూడా రమణే తన ఇంటికి వొస్తాననడంతో సుందర్శనం సంతోషంతో వుబ్బి తబ్బిబ్బౌతూ హుషారుగా ఆఫీసుకు వెళ్ళిపోయేడు..

సుదర్శనం వెళ్ళిపోయేక ఇంట్లోకి వొచ్చిన రమణిని ఆపుతూ రమణ, బ్రహ్మాలు ఏంటే సుదర్శనం అంకుల్ తో ఆ రహస్యాలు..? అడిగేరు..

మీ రహస్యాలు మీకున్నట్లే మా రహస్యాలు మాకుంటాయి.. ప్రతీదీ మీకు చెప్పే చెయ్యాలా..? ఎదురుప్రశ్నించింది రమణి..

రమణి ఏపనిచేసినా బాగా ముందువెనకలు ఆలొచించి చేసే పిల్ల అవ్వడం ఒక కారణమైతే, కామదేవత అనుగ్రహం పొందిన పిల్ల అవ్వడం మరో కారణం అవ్వడం వలన రమణ, బ్రహ్మాలు ఇంక మారు మాట్లాడకుండా మౌనంగా వుండిపోయేరు.

మరో అరగంటకి సుబద్ర, భవానీ, బ్రహ్మాలు తయారయ్యి రేపటిరోజున ఇంట్లో జరగవలసిన కార్యక్రమానికి కావలసిన సరంజామా కొనడానికని పట్నానికి బయలుదేరేరు.. తన తండ్రి బయలుదేరేముందు రమణి తన తండ్రిని పక్కకి తీసుకువెళ్లి చాలాసేపు వాళ్ళ నాన్నతో గుసగుసలాడింది. రమణి వాళ్ళ నాన్నకి చెప్పవలసిన విషయం చెప్పడం ఐపోయేప్పటికీ.. మూడోకంటికి తెలియనివ్వకుండా రమణి చేస్తున్న రహస్య కార్యకలాపాల సంగతి తెలుసుకున్న బ్రహ్మం కళ్ళు ఆశ్చర్యంతో విప్పారేయి..

బ్రహ్మం ఎదో మాట్లాడబోతుంటే.. రమణి తన తండ్రికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. మీరు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ్డానికి వీలులేదు.. నేను చెప్పినట్లు చెయ్యండి అంతే .. అన్నది రమణి.. ఇంక బ్రహ్మం కూడా మారుమాట్లాడకుండా కూతురుచెప్పినది చెయ్యడానికి వొప్పుకుంటున్నట్లుగా తలూపేడు.. రమణి నవ్వుతూ.. మా మంచి నాన్న అంటూ బ్రహ్మం బుగ్గమీద ముద్దుపెట్టింది..

రమణి తన తండ్రిని అలా పక్కకి తీసుకువెళ్లి మాట్లాడ్డం చూసిన శారద, సుభద్ర, భవానీలు ఏమిటే మీ నాన్నతో ఆ గుసగుసలు అని అడిగేప్పటికీ..

మీ రహస్యాలు మీకున్నట్లే మా రహస్యాలు మాకుంటాయి.. ప్రతీదీ మీకు చెప్పే చెయ్యాలా..? ముక్త ఖంఠంతో రమణ, రమణిలు వాళ్ళని ప్రశ్నించేప్పటికీ.. రమణ అంకుల్ తన గొంతుతో గొంతుకలిపి తన మాటని తిరిగి చెప్పడంతో.. రమణ.. రమణి.. కలిసి పకపకా నవ్వుకున్నారు..

రమణ బ్రహ్మం రమణిలు ఒక్కటైపోవడంతో ఇంక ఏంచేసినా రమణి దగ్గరనించీ సమాధానం రాబెట్టలేమని ఇంట్లోవాళ్లకి తెలియడంతో ఇంట్లోవాళ్లంతా ఆ విషయాన్ని అక్కడకి వొదిలేసేరు..