గోపీ – Part 4 193

గోపీ హతాశుడై పోయాడు ఆమె మాటలకు.చిన్నప్పటి నుండి ఖనిజే తన లోకం . . .మంచైనా చెడ్డైనా అన్నీ తన తోనే . . అమ్మా నాన్నల కన్నా ఖనిజనే తాను ఎక్కువుగా నమ్మాడు.అటువంటిది ఇప్పుడు కష్టపడి ఇంత చేస్తే చీప్ గా తీసిపారేస్తోంది. డబ్బు రాంగానే తనకు ఇంత పెద్దరికమా లేక తన దృష్టిలో తన విలువ ఇంతేనా. . . చెప్పేదేదో చెప్పే రీతిలో కాకుండా బురిడీ బాబాలకు మల్లే దక్షిణో వెయ్యిన్నూటపదహార్లో ఇచ్చి చేతులు దులుపుకొనే వాడిలా కనిపిస్తున్నానా . . .ఛీ మాటకూ మంత్రాలకు చింతకాయలు రాలుతాయమో కాని మనుషుల మనస్తత్వాలు మారవు కదా అని లోలోపలే కుమిలి పోసాగాడు. వాడు ఏమీ మాటాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలుచుండిపోవడంతో . .ఖనిజ కాస్త స్థిమిత పడింది. తను మాటాడిన తీరు మననం చేసుకొని నొచ్చుకొంది. ఛ తాను అలా మాటాడకుండా వుండాల్సింది. వాడు ఎంత భాధపడ్దాడో ? అనుకొని అది కాదురా గోపీ అంటూ సర్ది చెప్పబోయింది.

అప్పటికే గోపీ కళ్ళు ఉగ్రంగా తయారయ్యి ఉన్నాయి.వాడు చూసిన చూపుకు ఒక్క క్షణం ఖనిజ వొళ్ళు ఝల్లుమంది.క్రింది పెదాలను పళ్లతో పట్టి కొరుకుతూ హుంకరిస్తూ విసురుగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.
మనిషి మారిపోవడానికి డబ్బు ప్రధాన కారణమైతే విచక్షణకోల్పోవడానికి కూడా డబ్బే కారణం కావడం విచిత్రం.
గోపీ కూడా సామాన్యమైన వ్యక్తి కాదు . . అంత వరకూ ఖనిజ వాడిని అదుపు చేస్తూ వచ్చింది కనుక తన శక్తి తనకు తెలియరాలేదు. ప్రయోగం ఉప సంహారం అన్నీ ఖనిజ సమక్షంలోనే చేసే వాడు కాబట్టి తన ఆలోచన కూడా అంత వరకే ఉండిపోయింది.
ఇప్పుడు తిరస్కార భావంతో ఉడికిపోతున్నాడు.ఉదయాన్నే టిఫిన్ల దగ్గరా మద్యానం భోజనాల దగ్గరా ముభావంగా ఉండిపోయాడు. ఖనిజ మాట్లాడినా ఏమీ మాటాడలేదు.
ఇవేమీ తెలియని శారద భీం సేన్ రావులు మామూలుగానే మాట్లాడారు.కాని వీరిద్దరి సంగతిని పసిగట్టలేక పోయారు.
గోపీ తింటున్న అన్నం కూడా ఖనిజ దయా బిక్షలాగ కనిపించింది.తినలేకపోయాడు. చేతులుకడుక్కొని వెళ్ళిపోయాడు. రాత్రి కూడా భోజనం చేయలేకపోయాడు.ఏదో బందువుల ఇంట్లో గెస్ట్ లాగా అంటీ ముట్టినట్టు వుండిపోయాడు.
ఖనిజ చూసీ చూడనట్టు ఉండిపోయింది.
అలా గోపీ తనింట్లోనే తాను పరాయి వాడిలాగా మసలుకోసాగాడు.
భీం సేన్ రావుకు ఎక్కడో ఏదో తేడాగా అనిపించింది.కాని కనుక్కోలేక పోయాడు.
ఒంటరిగా రెండు రోజులు కూడా ఇంటిలో ఉండలేక పోయాడు.కారేసుకొని దూరంగా వెళ్ళిపోయాడు.
రాత్రైనా వాడు ఇంటికి రాక పోయేసరికి శారద ఫోన్ చేసింది.నాట్ రీచబల్లో ఉంది.
వస్తాడులే అనుకొని మిన్నకుండి పోయింది.భోజనాల దగ్గర వాడి ప్రస్తావన వచ్చినా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఖనిజ కూడా తేలిగ్గా తీసుకొంది.
కారేసుకొని వెళ్ళిపోయిన గోపీ దారీ తెన్నూ లేకుండా దూరంగా వెళ్ళి ఒకచోట ఆగాడు.కనుచూపుమేరలో ఒక్క ఊరుకూడా కనిపించడం లేదు. తాను పరధ్యానంగా ఎంత దూరం వచ్చేసాడో తనకే తెలియడం లేదు. ఆకలి దంచేస్తోంది.చుట్టూ చూసాడు.
దూరంగా పాడుబడ్ద ఓ దేవాలయం కనిపించింది.కారేసుకొని ముందుకెళ్ళడమా లేక కాసేపు రెస్ట్ తీసుకొని బయలదేరడమా అని తర్జన బర్జన పడి కాసేపాగిపోదాం లే అనుకొని ఆ దేవాలయం దగ్గరికెళ్ళాడు.
అదో గ్రామ దేవతాలయం . . .పూజలు లేక భిన్నమయి శిథిలావస్తలో ఉంది. హుస్సూరుమంటూ దేవాలయ ప్రాంగణంలో కూచొన్నాడు.చేతులూకళ్ళూ తిమ్మిరెక్కిఉంటంతో మెల్లగా నిదురలోనికి జరుకొన్నాడు.ఇంతలో పక్కలో ఎవరో కూచొన్నట్టుగా అనిపించి దిగ్గున లేచి కూర్చొన్నాడు. ఎదురుగ ఏదో ఆకారం లాంటిది కనిపించింది.ఎవరూ అని అడిగాడు.ఎటువంటీ సమాధానం రాలేదు. గద్దించి అడిగాడు. కీచుగా అరుస్తూ లేచి వెళ్లిపోయిందా ఆ ఆకారం. గోపీకి అర్థమయ్యింది ఏదో వామాచార శక్తి ఆ ప్రాంతంలో తిరుగుతోందని. . . వేరే ఎవరైనా అయి ఉంటే భయంతో ప్రాణాలు పోగొట్టుకోవడమో లేదా చేతులూ కాళ్ళూ చచ్చుబడేలా మైండ్ బ్లాంక్ చేసుకొనేవారు.గోపీకి అంతో ఇంతో మంత్ర శాస్త్రంలో ప్రవేశం ఉంది కాబట్టి భయపడలేదు.అది మళ్ళీ వస్తుందని ఊహించి అక్కడే బాసింపట్టేసుకొని కూచొన్నాడు. అతడు ఊహించినట్లుగానే దూరంగా ఓ కుంటి వాడు వచ్చినట్లుగా కుంటుతూ వచ్చిందాకారం.

5 Comments

  1. Story sankanakinchesav chi

  2. Your story is so nice Very happy ending bro okka character lenkuda chesi bandalanu gelipinchav super

  3. Climax very poor. Unnecessarily story became tragedy.

  4. మోడ్డ లాక ఉంది రా ending

Comments are closed.