టీచర్ కోసం 12 164

లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా ? మనని ప్రాణానికి ప్రాణం గా ప్రేమిస్తున్న తల్లి తండ్రుల సంగతేంటి ? వాళ్ళు ఇంత కష్టపడి పెంచింది ఇలా చావమనేనా ? అయినా నెక్స్ట్ సెకండ్ ఎమ్ జరుగుతుందో అనేదే చెప్పలేక పోతున్నామే మరి రేపు నెలా డిసైడ్ చేస్తాం ? రేపే మనకు అనుకూలంగా ఉంటుందేమో ? కాబట్టి ఒకసారి ఆలోచించండి. చనిపోయాక సాధించేది ఎమ్ లేదు. ఏమున్నా బతికే సాధించాలి. ఇలాంటి ఆలోచనలను రానివ్వకండి వచ్చినా సరైన కౌన్సిలింగ్ తీసుకోండి. 91529***** ఈ నంబర్ ద్వారా మీకు కౌన్సిలింగ్ అందుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ పదైదూ నిమిషాలు కాలేజ్ స్టేజ్ మీద ఏకదాటిగా సూసైడ్ చేసుకోకూడదనే అంశం మీద స్పీచ్ ఇవ్వగానే ఒక్కసారిగా చప్పట్లు మోగాయ్.

అలా ఆరోజు స్పీచ్ ఇచ్చింది. సూసైడ్ చేసుకోకూడదు అని చెప్పింది. చేసుకునే ముందు పెంచిన తల్లితండ్రుల గురించి ఆలోచించండి అని చెప్పింది ఇలా నేను చెప్పినవి నాకే ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ వుండగా ఒక్కసారిగా స్పృహ వచ్చింది.
అంతే వెంటనే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు..
వాళ్ళ ప్రేమ ఆప్యాయత గుర్తొచ్చాయి. వెంటనే అనిపించింది
నేను చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఎంటి ? నన్నే తలుచుకుంటూ జీవితాంతం బాధ పడరా అని. అంతలో మేడమ్ గుర్తొచ్చింది.
కాసేపటి క్రితం బిందు నన్ను కోపంగా కత్తి తో పొడవడానికి వస్తుంటే మేడం తన నుండి కాపాడింది గుర్తొచ్చింది. అలా గుర్తు రాగానే మేడమ్ నేనంత వెధవ పని చేసినా బిందు నుండి కాపాడింది ఎందుకు ఇలా చావామనేనా ? అని అనిపించింది.
అయినా మేడమ్ కావాలనుకుంటే బిందు ను ఆపి ఉండేది కాదు కానీ ఎందుకు ఆపింది ? ఎందుకు తన నుండి కాపాడింది ? నా మీద అంతో కుంతో ప్రేమ ఉండబట్టే కదా అనిపించింది అంతే చిన్నగా నాలో ఎదో ఆశ చిగురించింది.
నేను ఇలా చచ్చిపోతే తను ఆనంద పడుతుందా ? అని అనిపించగానే లేదు లేదు అందరికన్నా తనే ఎక్కువ బాధపడుతుంది అని అనిపించింది. అంతే వెంటనే నాలో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన శాతం తగ్గిపోతూ వచ్చింది. చిన్నగా పెదాలను కదుపుతూ నేను చావకూడదు చావకూడదు అని అనుకుంటూ ఉన్నా..
అలా అనుకుంటూ కళ్ళు తెరవాలని చూసా. కానీ తెరవలేకపోయా. వొళ్ళంతా పట్టేసినట్లు ఉంది. చేయ్ కాలు తల ఎదీ కదపలేకపోతున్నా. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మనసులో నేను చావకూడదు చావకూడదు అని గట్టిగా అనుకుంటూ ఉన్నా. ఎవరైనా సహాయం కోస్తే బాగుంటుందని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా భరత్ అని మేడమ్ గొంతు వినిపించింది. అంతే అంత పరిస్థితి లో కూడా ఒక్కసరిగా కళ్ళు తెరిచా.. చూస్తే ఎవ్వరూ లేరు అది నా భ్రమ అని అర్దం అయ్యింది. మెల్లగా తల కొద్దిగా తిప్పుతూ చుట్టూ చూసా..
అసలు ఎక్కడున్నానో అర్దం కాలేదు సిటీ దాటి చాలా దూరం వచ్చేసా అని అర్దం అయ్యింది. కాస్త దూరం లో ఉన్న రోడ్డు మీద ఎదో బైక్ వెళ్తుండడం కనిపించింది అంతే వెంటనే హే హెల్ప్ అని అరవబోయా.. కానీ నోరు పెగల్లేదు. అరవడానికి కూడా శక్తి రాలేదు చూస్తుండగానే ఆ బైక్ స్పీడ్ గా వెళ్లిపోయింది. వెంటనే నాలో నిరాశ కమ్ముకుంది. చిన్నగా స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించింది.
కళ్ళు మూతలు పడడం మొదలైంది.
మైండ్ లో ఇలాగే ఉంటే ఇంకా ప్రమాదం అని అనిపించింది. అంతే వెంటనే కష్టంగా బలం అంతా కూడదీసుకుని లేవడానికి ప్రయత్నించా కానీ లాభం లేకపోయింది. అంతలో చేతి మీద కొసుకుంది గుర్తొచ్చింది వెంటనే చేతిని చుసుకోగా రక్తం మెల్లగా కారడం కనిపించింది అంతే వెంటనే అలెర్ట్ అయిపోయి చేతి మీద నేల పై ఉన్న మట్టిని వేసి అదుముకున్నా రక్తం రాకుండా..
అలా అదుముకుని ఇంకా లేట్ చేస్తే స్పృహ కోల్పోతానని వెంటనే రోడ్డు వైపు చూసా. సిటీకి దూరం గా ఉండడం వల్ల అనుకుంటా ఏ వెహికల్స్ పెద్దగా రావట్లేదు. నేను కానీ ఇంకా ఇక్కడే ఉంటే వచ్చే వెహికల్స్ కూడా నన్ను చూడకుండా వెళ్లిపోతాయి అని అనిపించింది. వెంటనే ఎదురుగా రోడ్ మీదకు వెళ్ళడం మంచిది ఒకవేళ స్పృహ కోల్పోయినా ఎవరో ఒకరు చూసి హెల్ప్ చేసే అవకాశం ఉంది అని అనిపించింది. అంతే వెంటనే రోడ్డు మీదకు వెళదామని లేవడానికి చూసా..
కానీ శరీరం సహకరించలేదు. కష్టంగా చేతులను రెండు ముందుకు జరిపి అక్కడే పాతుకుపోయిన ఒక రాయిని పట్టుకుని నా శరీరాన్ని ముందుకు జరపడానికి చూసా కానీ బైక్ పడ్డప్పుడు తగిలిన దెబ్బల వల్ల అస్సలు కదలలేక పోయా.. మళ్ళీ ప్రయత్నించినా అదే పరిస్థితి ఒక పక్క ఎండ ఇంకో పక్క వొంటి మీది దెబ్బలు అస్సలు కదలలేని స్థితి ఇవ్వన్నీ గుర్తొచ్చి నాలో నిరాశ ఇంకా ఎక్కువైంది. అలా నిరాశ రాగానే ఇక కదలలేను ఇక్కడే చచ్చిపోతానేమో అని అనిపించింది అలా అనిపించగానే నిరాశ పడుతూ నెల మీద అలాగే పడుకుంటూ రోడ్డు వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నా..

6 Comments

  1. It’s very nice story ,plz update everyday

  2. Roju ok update evandi ela rasthu vundandi thondaraga end evakandi inka rayandi

  3. Roju oka update evandi ela rasthu vundandi thondaraga end evakandi

  4. Continue the story don’t end the story…

    1. Update the story

Comments are closed.