టీచర్ కోసం 5 Updated 1163

నేను వాడి వైపు చూసి, నువ్వు పెద్ద పులిహోర రాజవి కదా నీకు కొంచెం సన్మానం చేద్దాం అని తీసుకువచ్చారా అని అంటూ ఒక్క దెబ్బ పిడికిలి బిగించి వాడి దవడ మీద కొట్టాను. వాడి కళ్ళు బైర్లు కమ్మినట్లు ఉన్నయ్. కొద్దిసేపు నన్ను పోల్చుకోలేక పోయాడు. తరువాత తేరుకుని ఏంటి అన్న ఎందుకు కొడుతున్నావ్ అని అన్నాడు. నేను వినయ్ గాడిని పిలిచా వాడు నా దగ్గరకు వచ్చి ఆ జూనియర్ గాడి వైపు చూసి, నా చెల్లి వెంట పడింది వీడేరా అని అన్నాడు. వాడు వినయ్ వంక చూసి ఏంటి అన్నా నేను మీ చెల్లి వెంట పడడం ఏంటి అన్నాడు నేను అంతలోనే నా చేతిని పిడికిలి చేసి, వాడి మూతి మీద ఒక్కటిచ్చా. వేరే వాడైతే నేను కొట్టిన వెంటనే తిరగబడేవాడు. వీడు ఇంకా మంచోడు కాబట్టి నన్ను ఏమనకుండా వాడి దవడ మీద చెయ్ పెట్టుకుని, అన్నా నేను మీ చెల్లి వెంట పడలేదు అని అంటున్నాడు. నేను వాడి వైపు చూసి, రేయ్ అది పక్కన పెట్టు ఈ మధ్య టీచర్స్ ని కూడా వదలడం లేదంట కదరా అని అంటూ మళ్ళీ వాడి దవడ మీద ఇంకోటి ఇచ్చాను. అంతే వాడి నోట్లో నుండి ఒక్కసారిగా రక్తం చిమ్మింది. నాకు రక్తం చూడగానే భయం వేసింది కానీ వాడిని అలాగే పట్టుకుని ఉన్నా. మేడం పిరుదుల మీద వీడు నొక్కడం, మేడం నడుముని చూడడం గుర్తొచ్చి నా చేతితో వాడి చెంపలు ఏడ పెడ వాయించాను, వాడు కదలకుండా వినయ్ గాడు గట్టిగా పట్టుకున్నాడు. అంతలో ఎవరో నన్ను పక్కకు లాగేసారు ఎవరో అని చూసే లోపలే నా గువ్వ గుయి మని సౌండ్ వచ్చింది, నేను తేరుకుని చూసేసరికి అక్కడ మేడం నా వైపు నిప్పులు కక్కుతూ చూస్తుంది. నేను మేడం వంక చూసి భయపడ్డ. మేడం తన చేత్తో ఇంకో సారి నా చెంప మీద గట్టిగా కొట్టింది. నేను మేడం వంక సీరియస్ గా చూసా. మేడం నా వైపు చూసి అప్పుడే అనుకున్న నువ్వు ఇలాంటిది ఎదో ఒకటి చేస్తావ్ అని, నేను రావడం మంచిది అయ్యింది అని అంటూ కింద పడిపోయి ఉన్న ఆ జూనియర్ గాడిని పట్టుకుని పైకి లేపింది. వాడి నోట్లో నుండి రక్తం వస్తుంటే తన కొంగు తీసుకుని తుడుస్తుంది. నేను మేడం ని కోపంగా అలాగే చూస్తున్నా. మేడం వాడిని పైకి లేపాక, వాడు నిలబడలేక పోతుంటే మేడం వాడి చేతిని తన మెడ చుట్టూ వేసుకుని వాడిని నిలబెట్టింది. వాడి నోట్లో నుండి వస్తున్న రక్తం ని తన కొంగుతో తుడుస్తూ ఉంది. నా వైపు చూసి, రేయ్ బండి తీయ్ హాస్పిటల్ కు వెళ్దాం అని అంది కోపంగా. నేను మేడం కు ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం నా వంక చూసి నిన్నెరా వినిపించడం లేదా, త్వరగా పోయి బండి తీయ్ అని అంది. నేను పలకాకుండా అలాగే నిలబడి చూస్తున్న. వినయ్ గాడు కూడా సేమ్ నాలాగే సైలెంట్ గా నిలబడి చూస్తున్నాడు. మేడం నా వంక కోపంగా చూస్తు నువ్వు వస్తావా లేక నన్నే వెళ్లమంటావా అని అంది. నేను మేడం వంక చూడకుండా తల దించుకుని ఉండడం చూసి, నువ్వెంట్రా ఇలా సైకో గాడిలా తయారు అయ్యావు, వీడితో మాట్లాడితే అంత ఇదై పోవాలా అంది. నేను సైలెంట్ గా ఉన్నా. నా వంక చూసి, రేయ్ ముందు నీ భావన మార్చుకో, ఇలాగే ఉంటే బయట నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు అని అంటూ వాడిని నడిపించుకుంటు ముందుకు నడిచింది. వెంటనే నేను మేడం వైపు చూస్తూ అందుకేనా ఇప్పుడు నీ ఇష్టం నా మీద నుండి వాడి మీదకు షిఫ్ట్ అయ్యింది అని అన్నా. మేడం ఏంటి అని అంది. నటించకు నాకు మొత్తం అర్థం అయ్యింది, నీ వెంట కుక్కల తిరిగాననే కదే ఇలా చేశావ్ పో వాడితోనే పోయి బాగా మోజు తీర్చుకో, నీ లాంటి వాళ్లకు నిజంగా ప్రేమించే వాళ్ళు నచ్చరు, ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కరితో పులిహోర కలిపే ఇలాంటి వెస్ట్ గాళ్లే నచ్చుతారు, పోయే నీలాంటి దాన్ని లవ్ చేయడం నాదే తప్పు, అని కోపంగా మేడం ని చూస్తూ బజారుదాన అని అన్నా. అంతలోనే మేడం నా గువ్వ గుయ్ అనిపించింది నాకు అర్థం అయ్యేలోగా మళ్ళీ కొట్టింది. మెడమ్ కోపంగా మాటలు జాగ్రత్తగా రానివ్వు అని అంటూ వాడిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వినయ్ గాడునా దగ్గరకు వచ్చి కాసేపు ఓదార్చాడు. నేను కొద్దిసేపు అలాగే సైలెంట్ గా కూర్చుని, ఇక అక్కడ ఉండలేక వినయ్ గాడికి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసా. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను బాధ పడుకుంటు అలాగే నిద్ర లోకి జారిపోయాను. ఎవరో లేపుతుంటే మెలుకువ వచ్చి చూసా, హారిక నన్ను లేపుతుంది. నేను లేచి కూర్చున్న. హారిక పక్కన శ్రీ ప్రియ కూడా ఉంది.

14 Comments

  1. Bro ekkada enti story miss ayinattu vundi…. continuation lekunda vere dantloki vellav.

    1. Page 8 ఆ ఆలోచనలతో from there story continued missed

  2. Page 8 ఆ ఆలోచనలతో from there story continued missed

  3. Superb story very interesting plaese upload next part as soon as possible

  4. Boss story bavundhi epudu part 6 pettavachuga

  5. bro fast ga rayi bro very interesting your super

    1. Dinni kuda night shift laga madyalo vadilestara bro tondrga upload ceyandi bro

  6. Dinni kuda night shift laga madyalo vadilestara bro tondrga upload ceyandi bro

  7. Bro fast ga upload chey bro part 6 eagerly waiting bro superb ga vundhi story

  8. Bro part 9 tharaga upload che bro

  9. orey, chadive vallu veripuku lara, evani bandi meeda , adi speed lo ,,,,

Comments are closed.