టీచర్ కోసం 9 198

వొద్దురా మీ అమ్మ నాకు వొద్దు ఇక ఈ విషయం వదిలేయ్ మేడం ని నేను ఇక మరిచిపోతా అని అంటూ ఉంటే సిద్దు గాడు రేయ్ నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయ్ తుడుచుకో రా అని అన్నాడు నేను నా కంటి మీద చెయ్ పెట్టి చూస్తే నిజమే నాకె తెలీకుండా వచ్చాయి. నేను తుడుచుకుని వాడిని చూసా వాడు రేయ్ ఇప్పుడొద్దు మనం పొద్దున ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అంటూ పద ఇప్పటికే తొమ్మిది నర అవుతుంది తిందాం అని నన్ను పైకిలేపాడు నాకు తినాలని లేదు అని చెప్పా. వాడు పదర అని నన్ను కిందకు లాగాడు అంతలో మాఅమ్మ వచ్చి రండి బొంచేద్దాం ఇంకెంత సేపు మాటలు పెడతారు అని అంది. నేను ఏదో ఆలోచిస్తూ ముందుకు కదిలా. నేను వాడు మా అమ్మ ముగ్గురం కూర్చొని తింటున్నాం. నాకు బాధతో ఎమ్ తినాలని అనిపించలేదు అందుకే నాలుగు ముద్దలు తిని లేచి కిచెన్ లోకి వెళ్లి సింక్ లో చెయ్ కడుగుతున్నా అంతలో వెనుక నుండి భరత్ అని మేడం పిలిచింది. నేను తన వంక చూడకుండా చెయ్ కడుక్కుని బయటకు వెళ్లబోయా మేడం అంతలో నా చేతిని పట్టుకుని భరత్ చెప్పేది విను అని అంది. నేను తన్ని కోపంగా చూస్తూ తన చెయ్ విడిపించుకుంటు నీకు నేను ఇష్టం లేనప్పుడు నీతో నాకు ఏ అనుభవాలు కూడా అవసరంలేదు నిన్ను వొదిలేస్తున్న ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు కులుక్కో అని అంటూ అయినా నీ కూతురుతో నాకు సెట్ చేస్తా సెట్ చేస్తా అని పడి పడి కొట్టుకుంటున్నావ్ నువ్వేమన్నా బ్రోకర్ దానివా అని కోపంగా అన్నా. అంతే ఆ మాట కంప్లీట్ అయ్యేలోపే నా చెవి దద్దరిల్లేలా నన్ను చేత్తో గట్టిగా కొట్టింది. నేను కోపం తో నా చేతిని పైకి ఎత్తి కొట్టబోతుండగా మా అమ్మ ఏంటి ఏమైంది అని అంటూ లోపలికి రాబోతుంటే నేను తనని వదిలేసి సింక్ దగ్గరకు వెళ్లిపోయా. మా అమ్మ లోపలికి వచ్చి ఏంటే ఏమైంది అంత సౌండ్ వచ్చింది అని అంది. మేడం ఎమ్ లేదు అని అంటూ బయటకు వెళ్ళిపోయింది. మా అమ్మ నా దగ్గరకు వస్తూ ఎరా ఏమైంది అని అడిగింది నేను ఎమ్ లేదులే మా అని అంటూ బయటకు వచ్చి నా రూమ్ లోకి వెళ్లిపోయా.. నాకు చెవి ఇంకా గుయ్యి మని అంటూనే ఉంది. నేను కోపంగా నా రూమ్ లోకి వెళ్లి కూర్చున్నా. మేడం చేసిన పనికి నాకు తన మొహం కూడా చూడాలని అనిపించడం లేదు. కొద్దిసేపు ఆలోచనల తరువాత టైం ఎంతయ్యిందో తెలీదు కానీ మెల్లగా డోర్ తెరుచుకుంది చూస్తే సిద్దు గాడు నన్ను చూస్తూ ఎరా ఇంకా అలాగే ఉన్నావా సరే ఎమ్ పర్లేదు లే మామా నీ బాధ తగ్గే మందు నేను తెచ్చాగా అని అంటూ మందు సీసా చూపించాడు. నేను వాడిని చూసి రేయ్ ఇంట్లోనా ? అని అన్నా. వాడు నన్ను చూసి ఇప్పటికి ఎన్నో సార్లు తాగా రా ఎమ్ కాదులే నేను మేనేజ్ చేస్తాలే అని అంటూ నా దగ్గరకు వచ్చాడు నేను వాడిని చూసి మరి మీ అమ్మ మా అమ్మ ఇద్దరు ఉన్నారు కదరా ఎలా అని అన్నా. వాడు నన్ను చూసి రేయ్ నువ్వు ఆలోచనలు చేస్తూ టైం కూడా చూసుకోలేదేమో ఇప్పటికే టైం పదకొండు అవుతుంది మీ అమ్మ మా అమ్మ ఆల్రెడీ పడుకున్నారు ఇక డౌబ్ట్ లు ఆపి మొదలుపెడదాం రా రా అని అన్నాడు. నేను మేడం మీద కోపం తో ఎలాగో నిద్ర పట్టదు కనీసం తాగితే అయిన కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లే అని అనిపించి సరే తీయ్ అని అన్నా. వాడు మందు బాటిల్ రెండు ప్లాస్టిక్ గ్లాస్ లు sprite బాటిల్ నా ముందు పెట్టాడు. నేను మేడం గురించే ఆలోచిస్తూ ఉన్నా. అంతలో వాడు మందు మిక్స్ చేసి నా చేతికి గ్లాస్ ఇచ్చాడు నేను దాన్ని అందుకుని ఒక్కసారిగా పూర్తిగా తాగేసా. వాడు నన్ను చూసి రేయ్ మెల్లగా తాగురా అని అన్నాడు. నేను వాన్ని చూసి ఎమ్ పర్లేదు లే అని అన్నా. వాడు కూడా మందు సిప్ చేస్తూ రేయ్ మామా నువ్వు కొంచెం తొందరపడినట్లు అనిపిస్తుంది రా అని అన్నాడు. నేను వాన్ని చూసి ఇంకో గ్లాస్ తాగి రేయ్ మేడం వేసిన ప్లాన్స్ అన్ని చెప్పి తను నన్ను ఎలా ట్రాప్ చేసిందో కూడా చెప్పాక అయినా నన్నే అంటున్నావు ఏంట్రా అని అన్నా. దానికి వాడు మామా మేడం కు నీ మీద ప్రేమ ఉండబట్టే కదరా మేఘ ను పెళ్లి చేసుకో అని అన్నది అంటూ నన్ను చూసాడు. నేను ఇంకో రెండు గ్లాస్ పోసుకుని మొత్తం తాగేసి తలను వెనుక గోడకు ఆనించి కళ్ళు ముసుకున్నా మెల్లగా నాకు మందు ఎక్కుతూ ఉంది. అలా కొద్దిసేపు ఉన్నాక సిద్దు గాడు నన్ను పిలిచాడు నేను కళ్ళు తెరిచి చూసా వాడు ఆలోచించు మామా అన్నాడు. నేను వాన్ని చూసి రేయ్ నువ్వు నా పక్క చెప్తున్నావా లేదా మీ అమ్మ పక్క చెప్తున్నావా అని అన్నా. వాడు మామా ఇక్కడ మాటర్ అది కాదు, అయినా నువ్వు కోపం లో ఉన్నావ్ ఇప్పుడొద్దు లే మనం మళ్ళీ దీని గురించి మాట్లాడదాం అని అన్నాడు. నేను వాని చెయ్ పట్టుకుని ఏంట్రా బయపడుతున్నవా నేను నిన్ను ఎమ్ అనను లేరా అని అన్నా కళ్ళు కొంచెం మూతలు పడుతుంటే.. వాడు నన్ను చూసి రేయ్ నువ్వు నన్ను ఏమంటావ్ రా, నీకు బాగా ఎక్కేసిందేమో ఏదేదో మాట్లాడుతున్నావ్ ఇక చాలు లే పడుకో అని అంటూ లెవబోయాడు. నేను వాన్ని పట్టుకుని మూడు గ్లాస్ లకే ఎక్కేస్తుందా రా నాకు.. ఇది ఫుల్ బాటిల్ ని అయినా మేనేజ్ చేయగల బాడీ రా అని అంటూ వాడిని చూసా. వాడు రేయ్ మామా కంఫర్మ్ రా నీకు ఎక్కేసింది ఇక నిద్రపోవడమే కరెక్ట్ నువ్వు అని అన్నాడు. నేను వెంటనే రేయ్ ఏంట్రా అసలైన టాపిక్ పక్కన పెట్టి వేరే టాపిక్ మాట్లాడుతున్నావ్ మీ అమ్మ గురించి చెప్పరా అని అన్నా. వాడు నన్ను చూసి ఎమ్ చెప్పాలి రా అని అంటూ ఇంకో గ్లాస్ తాగాడు వాడితో పాటు నేను కూడా వేసుకున్నా. ఎందుకో నాకు బాగా ఎక్కేసింది అని అనిపించింది.

6 Comments

  1. Waiting for next update

  2. It’s very very good ending needs some more

  3. Next part please.

    It’s very nice
    నాకూ చాలా బాగ నచ్చింది నేను ఆతర్వాత పార్ట్ కోసం ఎదురు చూస్తున్న Please send me

  4. Wt happen ramya story

Comments are closed.