టీచర్ కోసం 10 148

నేను తన కు సమాధానం ఇవ్వకుండా, అమ్మా అత్త ఎక్కడుంది ? కనిపించలేదు అన్నా..
దానికి మా అమ్మ ఏమోరా తెలీదు ఏదైనా పని మీద వెళ్ళిందేమో ఒకసారి సిద్దు నీ అడిగి చూడు అని అంటూ
సరే కానీ కాఫీ ఇవ్వానా అంది నన్ను చూసి..
నేను మనసులో ఎక్కడికి వెళ్ళి వుంటుంది అని ఆలోచిస్తూ మా అమ్మకు సమాధానం ఇవ్వకుండానే హాల్ లోకి వచ్చా..
అక్కడ హారిక నిలబడి నన్నే కోపంగా చూస్తూ ఉండడం కనిపించింది. నేను తనని చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉండగా తను చీ అని నన్ను చీదరించుకుంటు నా చెంప చెళ్లుమనిపించింది..
అంతే నేను ఒక్కసారిగా షాక్ అయ్యా….

today morning……………..
తను నన్ను కొట్టగానే ఒక్కసారిగా బుర్ర తిరిగినట్లైంది..
నన్నే కోపంగా చూస్తూ ఇంత నీచంగా దిగాజారతావ్ అని అనుకోలేదు అంది..
తనలా అనగానే రాత్రి నేను మేడమ్ ను అనుమానించి తనని క్రూరంగా అనుభవించడం.. తను ఏడుస్తున్నా కనికరం లేకుండా ప్రవర్తించడం, తనకిష్టం లేదు అని తెలిసినా మందు తాగి తనని లోబరుచుకోడం ఇలా అన్నీ గుర్తు రావడం మొదలయ్యాయి..
అంతలో హారిక ఇంకో సారి చెంప చెల్లు మనిపించింది….
నేను షాక్ గా తననే చూస్తూ ఉన్నా…

present…………….
ఒకపక్క మేడమ్ పట్ల నేను చేసిన దానికి బాధ తో కళ్ళలో కన్నీళ్లు వస్తూ ఉంటే ఇంకో పక్క బిందు కొట్టిన దానికి తల మీద నుండి రక్తం కారుతూ ఉంది. కానీ ఇవి ఏవి పట్టించుకునే స్థితి లో నేను లేను. ఎదో అన్యమశ్కంగా బైక్ ను నడుపుతూ ఉన్నా..
ఎటు వెళ్తున్నానో కూడా తెలీదు మనసంతా బాధ తో నిండి కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అంతా నా వల్లే జరిగింది నేను ఇలా చేయకపోయుంటే బాగుండేది అని మనసు ఒకటే నన్ను నిందిస్తూ ఉంది. పైన సూర్యుడి ఎండ ఇంకోపక్క తల మీద రక్తం ఈ రెండు నాకు స్పృహ కోల్పోయేలా చేస్తున్నాయి. కాదు కాదు ఆల్రెడీ స్పృహ కోల్పోతున్నా..
ఎదురుగా వస్తున్న వాటిల్లో ఎదో ఒక బండి నన్ను కొట్టేస్తే బాగుణ్ణు అని అనిపిస్తూ ఉంది. చిన్నగా మనసు వశం తప్పుతూ ఉంది. నేను హ్యాండిల్ చేయలేను అని తెలిసినా కూడా బైక్ వేగం అంతకంతకూ పెంచుతూ పోతున్నా.. అంతలో ఎదురుగా ఎవరో స్కూటీ లో వెళ్తున్న అమ్మాయిలు హేయ్ రక్తం వస్తుంది చూసుకో అని గట్టిగా అరిచారు..
కానీ వాళ్ళ మాటలు పట్టించుకునె స్థితిలో నేను లేను.. మనసు ఏమో ప్రతి విషయాన్ని గుర్తు చేస్తూ దీనికి కారణం నువ్వే దీనికి కారణం నువ్వే అంటూ నన్ను నిందిస్తూ ఉండగా వస్తున్న ఏడుపు బాధ రెట్టింపు అయ్యాయి.. ఆ బాధ తగ్గడానికి మేడమ్ నామీద చూపించిన ప్రేమ ను గుర్తు తెచ్చుకుందాం అనుకుంటే అంతలోనే అంత ప్రేమ చూపించిన మేడమ్ కు నేను చేసింది గుర్తొచ్చి ఇంకా ఇంకా బాధ ఎక్కువయ్యింది..
అలా బాధ పడుతూనే మేడమ్ ప్రేమ గుర్తులు తప్ప ఇంక ఏదీ నాకు ఉపశమనం ఇవ్వదు అని అనుకుని చిన్నగా మేడమ్ ప్రేమ గుర్తులను తలుచుకోవడం మొదలుపెట్టా….

1 Comment

  1. Please continue very good bt good ending evvu please

Comments are closed.